Gunde Ninda Gudi Gantalu September 16th: శృతిని పెళ్లి చూపులు ఒప్పించిన సురేంద్ర.. నీలకంఠ మాస్ ఎంట్రీ!
నా స్నేహితుడు నీలకంఠం కోట్లకు పడగలెత్తిన బిజినెస్ మ్యాన్. వాళ్ల అబ్బాయి కూడా అతడి వ్యాపారాలు చూసుకొంటున్నాడు. వారితో సంబంధం కలుపుకొంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. శృతిని ఒప్పించి నీలకంఠం అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. అందుకోసం శృతిని వారి ఇంటికి తీసుకెళ్లాలి. నీవు చెబితే శృతి వస్తుంది అంటూ శోభనతో సురేంద్ర అంటాడు. అయితే నీలకంఠం ఇంటికి తీసుకొచ్చేందుకు శృతిని ఒప్పిద్దాం అని అనుకొంటారు. అంతలోనే శృతి అక్కడికి వస్తే.. ఈ విషయం చెప్పారు. అయితే తనకు డబ్బింగ్ ఉంది.. నేను రాలేనని చెబుతుంది. కానీ తప్పకుండా నీవు రావాలి అని తల్లి శోభన అంటే.. నా డబ్బింగ్ నీవు చెబుతావా? అంటూ ప్రశ్నిస్తుంది.
అయితే కూతురు మొండిగా ఉండటంతో.. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అతడు కోటీశ్వరుడు. వాళ్ల ఇంటికి లంచ్‌కు వస్తానని మాటిచ్చాను అని సురేంద్ర అంటే.. వాళ్లకు పేర్లు లేవా? కోట్లు ఉండే సరిపోతుందా? అంటే.. నా ఫ్రెండ్.. కడప నుంచి వచ్చి రాజమండ్రిలో స్థిరపడ్డారు. చిన్నప్పుడు నిన్ను చూశారు. ఇప్పుడు నీవు ఎలా ఉంటావో చూడాలని అనుకొంటున్నారు. నేను నిన్ను తప్పక తీసుకొస్తానని మాటిచ్చాను. కాదనకు అంటే.. సరే అంటూ చివరకు శృతి ఒప్పుకొంటుంది. ఎంతైనా నీ కూతురు. మీ ఇద్దరి ఒకటే అంటూ శోభన అంటుంది.

అయితే వాళ్లింటికి వెళ్లడానికి చీర కట్టుకో. ఇంట్లో పూజ ఉంది. పూజకు వెస్ట్రన్ డ్రస్‌లో వెళితే బాగుండదు అని తల్లిదండ్రులు అంటారు. అయితే చుడీదార్ వేసుకొంటాను అంటే.. అలా వద్దు చీరనే కట్టుకో. సంప్రదాయంగా వెళ్లితే బాగుంటుంది అంటుంది. దాంతో సరే అంటూ శృతి చివరకు ఒప్పుకొంటుంది. ఎంతైనా మీ ఇద్దరు ఒకటే అంటూ మళ్లీ శోభన అంటుంది.
అయితే మన ఇంటికి కోటీశ్వరులు పెళ్లి చూపులకు వస్తున్నారు. నువ్వు వారికి కావాల్సిన వంటలు తయారు చేయి అంటూ కోడలికి ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. బాలును ఇంట్లో ఉండకుండా చూడు అంటే.. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు నేను తప్పకుండా ఉంటాను. ట్రిప్ కాన్సిల్ చేసి ఉంటాను. అప్పులు దాచి మీరు చెప్పే అబద్దాలను బయటపెడతాను అంటూ తల్లికి బాలు వార్నింగ్ ఇస్తాడు. దాంతో భార్య మౌనిక నవ్వుల్లో మునిగిపోతుంది.

నీలకంఠం ఇంటికి వెళ్లేందుకు రెడీ అయిన శోభన, సురేంద్ర మాట్లాడుకొంటూ.. రవి గాడిని తప్పా ఎవరిని పెళ్లి చేసుకోనని అంటుంది. కోటీశ్వరులును చూసినా వాడిని వదులుకోనంటుంది అని శోభన అంటే.. రవి గాడి సంగతి నేను చూసుకొంటాను అని అంటాడు. అయితే శృతి రాగానే పద పద లేటు చేయకు వర్జ్యం వస్తుంది అని అంటే.. వెంటనే శృతికి అనుమానం వచ్చింది. వేరే ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తే.. తల్లిదండ్రులు ఇద్దరు సర్ది చెప్పారు.
ఇదిలా ఉండగా, రవి పెళ్లి చూపుల విషయంలో ఇంట్లో గొడవ జరిగింది. నాన్నకు మలేషియాలో బిజినెస్ హెల్ప్ చేసిన కోటీశ్వరులతో సంబంధం అని ప్రభావతి చెబితే.. చెఫ్‌కు ఈ పెళ్లి చూపులు అవసరమా? అంటూ ప్రశ్నించాడు. అంతలోనే బాలు జోక్యం చేసుకొంటూ.. నీలాగా ఇంట్లో డబ్బులు మింగే వాడా? అమ్మలాగా ఆస్తులు మింగే వాళ్లా? వాళ్లతో మనకు సంబంధం ఏమిటి? అంటూ కామెంట్ చేశాడు. నాన్నను అవమానించే వారైతే వాళ్లను ఎగిరి తన్ని పంపించాలని అన్నాడు.

తన ఇంట్లో ఓ పోలీస్ ఆఫీసర్‌ను తన మనుషుల చేత చితక బాదిస్తూ నీలకంఠం ఎంట్రీ ఇచ్చాడు. నా వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే.. వారి ప్రాణాలు తీస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు. అంతోనే శోభన, సురేంద్ర కారు గేట్ వద్దకు వచ్చి ఆగుతుంది. దాంతో వాడిని వాళ్లు చూడకుండా బయటకు పంపించు అని అక్కడి నుంచి పంపిస్తాడు. సురేంద్ర, శోభన, శృతిని సాదరంగా ఆహ్వనించి కుశల ప్రశ్నలు వేశారు. అమ్మాయి పెద్దదైంది.. మీకు గుర్తు ఉన్నానా? అని నీలకంఠం అంటే.. లేదు అని చెప్పడంతో అలా అనడం తప్పు అంటూ చెబుతాడు.
ఇంతకు అల్లుడు ఏడీ అని సురేంద్ర అంటే.. మెట్లపై నుంచి ఓ వ్యక్తి దొర్లుకొంటూ వస్తాడు. అతడిని చూసి శృతి, సురేంద్ర, శోభన షాక్ అవుతారు. ఆ తర్వాత మెట్ల మీద నుంచి ఓ యువకుడు స్టైల్‌గా వస్తే..అతడిని చూసి హ్యాపీగా ఫీలవుతారు. అతడు వచ్చి హాయ్ అంటూ అందరికి విష్ చేస్తారు. శృతి గుర్తుందా? చిన్నప్పుడు మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. నీకు గుర్తుందా? అంటే లేదు అని శృతి అనగానే.. అందరూ షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











