Gunde Ninda Gudi Gantalu September 17th: విలన్ రాకతో మరో ట్విస్ట్.. నిజం చెప్పిన శృతి.. గన్ పెట్టిన సంజూ

గతంలో కంటే ఇప్పుడు చాలా కొత్త కంటెంట్ వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
రవితో ప్రేమలో ఉన్న శృతిని ఎలాగైనా తన ఫ్రెండ్ నీలకంఠం కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని సురేంద్ర అనుకుంటాడు. ఆ విషయం గురించి భార్యతో మాట్లాడుతుండగానే అక్కడకు శృతి వస్తుంది. అప్పుడు ఆమెకు అబద్దాలు చెప్పి పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఒప్పిస్తారు. మరోవైపు, రవికి కూడా పెళ్లి చూపులు ప్లాన్ చేయడంతో అతడు కోప్పడతాడు. ఆ సమయంలో కాస్త గొడవ జరుగుతుంది. ఇక, శృతిని తీసుకుని వెళ్లే సమయంలోనే రవి సంగతి ఎలాగైనా చూసుకుంటాను అని సురేంద్ర చెప్తాడు. ఆ తర్వాత నీలకంఠం కొడుకు సంజూ స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 17th

మంగళవారం ఎపిసోడ్‌లో... నీలకంఠం ఇంటికి వెళ్లిన తర్వాత సంజూ వచ్చి సురేంద్ర వాళ్లను పరిచయం చేసుకుంటాడు. అప్పుడు శృతిని డౌట్‌గా చూస్తాడు. దీంతో ఆమె పేరెంట్స్ పరిచయం చేస్తూ 'చిన్నప్పుడు మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్. శృతిని ఎవరైనా ఏడిపిస్తే ఊరుకునేవాడివి కాదు' అంటారు. దీంతో సంజూ 'ఇప్పుడు కూడా ఎవరైనా వెంట పడితే షూట్ చేసి పడేస్తాను' అంటాడు. దీంతో అందరూ షాక్ అవగా.. అతడు 'జోక్ చేశాను. అయినా శృతి నా మనిషి అని తెలిస్తే ఇక ఎవరూ వెంటపడరు' అంటాడు. తర్వాత శృతి పూజ గురించి అడుగుతుంది.

శృతి మాటలకు శోభన కవర్ చేసుకుని సంజూతో మాట్లాడమని బలవంతంగా పంపిస్తుంది. మరోవైపు, ప్రభావతి ఇంటికి కామాక్షి వస్తుంది. వచ్చీ రావడమే ఆమె కామెడీ చేస్తుంది. దీంతో ప్రభావతి పంచులు వేస్తుంది.అంటేకాదు, 'పెళ్లి చూపులు అంటే ఎంతో హడావిడు ఉంటుంది. నువ్వు ఇప్పుడా రావడం' అని అడుగుతుంది. దీనికి కామాక్షి 'అవన్ని చూసేందుకు మీనా ఉంది కదా' అనడంతో మీనాను పిలిచి ఇల్లు తుడిచావా అని అడుగుతుంది. దీనికామె అద్దంలా తుడిచాను. చూడకుండా అంటారేంటీ అని అంటుంది.

మీనా గట్టిగా సమాధానం చెప్పడంతో ప్రభావతి 'పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ల ముందు నోరు తెరవద్దు. బాలుగాడిని ఇంట్లో ఉండకూడని చెప్పాగా. వాడు ఏదోటి అని పెళ్లి చూపులు చెడగొడతాడు' అని అంటుంది. దీంతో మీనా 'ఆయన తమ్ముడు పెళ్లి చూపులు ఆయనెందుకు చెడగొడతారు. ఏదైనా ఉంటే మీ కొడుకుతో మాట్లాడండి' అని వెళ్లిపోతుంది. అప్పుడు కామాక్షి 'మీనా చెల్లెలు సుమతితో రవి తిరుగుతున్నాడన్నది బాలుకు చెప్పావా' అని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి వెంటనే ఆమె నోరును మూసేస్తుంది.

తర్వాత కామాక్షితో ప్రభావతి 'అది తెలిస్తే నా పీక మీది కత్తి పెట్టి బాలు గాడు పెళ్లి చేయిస్తాడు. అందుకేగా సైలెంట్‌గా ఇలా పెళ్లి చూపులు అరెంజ్ చేశాను' అంటుంది. ఇంతలో మనోజ్, రోహిణి వస్తారు. 'నీకు అంత ఆస్తి ఉన్న ఫ్రెండ్ ఉందని నాకెందుకు చెప్పలేదు' అని అడగడంతో కామాక్షి ఎందుకు నువ్ పెళ్లి చేసుకునేవాడివా అని అంటుంది. దీనికతడు 'కాదు.. రవిగాడు రెస్టారెంట్‌లో వంట చేసుకుంటాడు. అంత గొప్ప సంబంధం వాడికి సూట్ అవుతుందా' అంటాడు. దీంతో కామాక్షి 'వాడు అదైనా చేస్తున్నాడు మరి నువ్వు' అని నోరు జారుతుంది.

రోహిణి ముందు కామాక్షి నోరు జారడంతో ప్రభావతి కవర్ చేస్తుంది. తర్వాత సంబంధం గురించి మనోజ్‌ చీప్‌గా మాట్లాడుతుండడంతో బాలు వచ్చి సెటైర్లు వేస్తాడు. దీంతో ప్రభావతి సీరియస్ అవుతుంది. ఆ వెంటనే అతడు మీనా దగ్గరకు వెళ్లిపోతాడు. అప్పుడామె 'మీకు పుణ్యం ఉంటుందండి. వచ్చిన వాళ్ల ముందు నోరుజారకండి' అని అడుగుతుంది. దీంతో ట్రై చేస్తాను అని బాలు వెళ్లిపోతాడు. మరోవైపు, సంజూకు శృతి వెనుక నుంచి తగులుతుంది. దాంతో షాక్ అయి చూస్తుంది. అప్పుడతను భయపడింది అని వెక్కిరిస్తాడు. దీంతో శృతికి కోపం వస్తుంది.

అనంతరం శృతితో మాట్లాడుతూ.. 'నీకు నాతో పెళ్లి ఓకేనా? అయినా ఇంత రిచ్ ఫ్యామిలీలోకి వస్తావని నువ్వు అనుకోలేదు అనుకుంటా. నువ్వు ఏదో ఏవరేజ్‌గా ఉంటావని అనుకున్నా. కానీ, నాకు సెట్ అయ్యేలానే ఉన్నావు' అంటాడు. దీంతో శృతి 'పెళ్లా.. నాకు పూజ ఉందని మాత్రమే చెప్పి తీసుకు వచ్చారు' అని నిజం చెప్తుంది. అప్పుడు సంజూ 'మా నాన్న బిజినెస్ నేనే చూసుకుంటాను. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్. గోల్డ్, వెపన్, బ్లాక్ మార్కెట్‌లో దొరికే ఏదైనా మేము ఎక్స్‌పోర్ట్ చేస్తాం' అని గొప్పలు చెప్పగా శృతి దీన్ని స్మగ్లింగ్ అంటారు కదా అని పంచ్ వేస్తుంది.

శృతిని చేసుకోడానికి సిద్దం అయిపోయిన సంజూ.. ఆమెకు గిఫ్టుగా ఓ గన్‌ను తీసుకు వచ్చి ఇవ్వబోతాడు. కానీ, ఆమె తనకు వద్దని అంటుంది. తర్వాత అతడిని నెట్టివేయడంతో కోపంతో గన్‌ను తలకు గురి పెడతాడు. దీంతో శృతి భయపడుతుంది. తర్వాత తనకు ఫోన్ వచ్చిందని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క, రవిని చూసుకోడానికి ప్రభావతి ఫ్రెండ్ వాళ్లు వస్తారు. అప్పుడు వాళ్లు గొప్పలు మాట్లాడుకుంటారు. కానీ, పక్కనే ఉన్న బాలు సెటైర్లు వేస్తుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X