Gunde Ninda Gudi Gantalu September 18th: శృతి పెళ్లికి నీలకంఠ ముహుర్తం.. ప్రభావతి అబద్దాల జోరు!

ప్రభావతి తన కూతురుకు పెళ్లి చూపులు జరుగుతుంటే తమ ఫ్యామిలీ గురించి గొప్పలు చెప్పుకొంటూ అబద్దాలు ఆడుతుండటంతో కొడుకు బాలూ సెటైర్లు వేస్తూ అందర్నీ కంగారు పెట్టారు. అమ్మా కారులో పెట్రోల్ కొట్టించలేదంటే అని బాలు అంటే.. డ్రైవర్ వస్తాడుగా..అతడు కొట్టించుకొంటాడంటూ ప్రభావతి సర్ది చెప్పబోతే.. బస్సు డ్రైవర్ రిటైర్డ్ అయ్యాడుగా అంటూ .. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అయోమయంతో ఏమంటున్నారు అని అడిగితే.. మా వాడు కాస్త జోకులు ఎక్కువ వేస్తాడంటూ కవరింగ్ ఇచ్చింది.

పెళ్లి కూతురు తండ్రి ఎక్కడంటే.. బ్యాంకులో 50 లక్షలు వేయడానికి వెళ్లాడని చెబితే... తల్లి మాటలకు కౌంటర్ ఇస్తూ.. 40 లక్షలు ప్లస్, 17 లక్షలు మొత్తం 57 లక్షలు అంటూ కామెంట్ చేశాడు. ఇక పెళ్లి చూపుల్లో ప్రభావతి, బాలూ మధ్య కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు, సెటైర్లు సాగిపోతుంటే.. అవి చూసి పక్కన ఉన్న వాళ్లు ప్రభావతి చెప్పే అబద్దాలు చూస్తే గుండె ఆగిపోతుందని అనుకొన్నారు. ఇదంతా ఇలా సాగుతుంటే.. కాబోయే పెళ్లి కొడుకు, కూతురును పర్సనల్‌గా మాట్లాడుకొనేందుకు పక్క గదిలోకి పంపించారు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 18th Here is detail story

ఇదిలా ఉండగా, నీలకంఠ ఇంట్లో శోభన, సురేంద్ర కూతురు శృతి పెళ్లి చూపులు సరదాగా సాగిపోయాయి. అమ్మాయి నచ్చింది. త్వరలోనే పెళ్లి పెట్టుకొందాం. సురేంద్రకు అప్పుడే మాట ఇచ్చేశాను అని నీలకంఠ అంటే.. కొడుకు మూహుర్తాలు కూడా పెట్టేస్తారంట అని అంటే.. శృతి కంగారు పడిపోయింది. నాన్న నేను వెళ్లాలి అంటే.. ఇప్పడు ఎక్కడికి అంటే.. మా డబ్బింగ్ ఇంచార్జి కాల్ చేశాడు. వెళ్లి డబ్బింగ్ చెప్పాలి అని శృతి చెప్పింది. దాంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్లేది లేదు అని తల్లి వారించింది.

శృతి మాటలకు నీలకంఠం అడ్డు పడుతూ.. ఎవరు వాళ్లు.. ఏ డబ్బింగ్ స్టూడియో.. మనవాళ్లకు చెబుతాను. వాళ్లు అతడికి వార్నింగ్ ఇస్తారు అని అన్నాడు. లేదు అంకుల్.. నేను మాటిచ్చాను. మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు అంటే.. నాకు బాగా నచ్చావు. మాట ఇస్తే తప్పకూడదు అని శృతితో నీలకంఠ అన్నాడు. దాంతో అక్కడి నుంచి వెళ్తుంటే శృతికి గుండాలు దండాలు అని అన్నాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 18th Here is detail story

ఇక ప్రభావతి ఇంట్లో పెళ్లి కోడుకు తల్లి ధనలక్ష్మీ మాట్లాడుతూ.. మా అన్నయ్య కమల్ హాసన్‌లా ఉన్నాడు. ఆయన ఎక్కడ అంటే.. బ్యాంకుకు వెళ్లాడు. వస్తాడు అంటుంటే.. వెంటనే అక్కడికి భర్త రాగానే పెళ్లి చూపులకు వచ్చిన వారిని పరిచయం చేస్తుంది. ఇక భర్త గురించి గొప్పలు చెబుతుంటే అందరూ షాక్ గురయ్యారు. అలా ప్రభావతి ఇంట్లో పెళ్లి చూపులు వ్యవహారం అలా సాగింది.

అయితే ప్రభావతి రెండో కోడలిని చూస్తూ ఈ అమ్మాయి చిన్న పూల కొట్టు పెట్టుకొనేందని విన్నాను అంటే.. అబ్బేబ్బే అదేం లేదు. మీకు ఎవరో అబద్దాలు చెప్పి ఉంటారు. వాళ్లకు పెద్ద పూల బొకే షాప్ ఉంది అని అబద్దం చెబుతుంటే.. బాలూ తమ కుటుంబ బండారాన్ని బయట పెట్టాడు. మా నాన్న బస్ డ్రైవర్.. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. నా తమ్ముడు డబ్బు ఎత్తుకొని పారిపోతాడు అంటూ మొత్తం బాలు కక్కేయడంతో ధనలక్ష్మీ కంగారు పడిపోయింది.

బాలు చెబుతుంటే.. ధనలక్ష్మీ భర్త కడిగిపడేశాడు. మీరు చెప్పేందంతా బోగసేనా? నీ భర్త పనికి రాని వాడా? పిల్లల్ని పెంచే పద్దతి తెలియదా? అని అంటే.. వెంటనే బాలూ వచ్చి మా నాన్నను అలా అంటావా? అని గట్టిగా రెండు, దెబ్బలు కొట్టాడు. దాంతో అందరూ షాక్‌లో ఉండిపోయారు. పెద్ద మనిషిని పట్టుకొని అవమానిస్తావా? అంటే.. మీరు పెద్ద మనిషే.. వాడు అలా మాట్లాడుతాడా? అని అన్నాడు. పెళ్లి చూపుల్లో తిన్న పదార్థాలు, స్వీట్లకు డబ్బులు కట్టించి బయటకు పంపించాడు.

బాలు చేసిన పనికి ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను కష్టపడి కోటీశ్వరుల సంబంధం తెస్తే అంతా పాడు చేశాడు. వీడి ముఖానికి ఒక్క సంబంధమైనా తెస్తాడా? అని ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేసింది. నా బతుక్కి ఒక్క సంబంధం తేలేను. కానీ నీలా అబద్దాలు చెబుతావా? నీవు ఒక్క బస్సు డ్రైవర్ భార్యవు అని అంటే.. నీవు ఈ సంబంధం చెడగొట్టడానికే ఇంట్లో ఉన్నావా? అంటూ ఫైర్ అయింది. దాంతో నీవు కట్టిన పేక మేడ కూలిపోయిందా? అబద్దాల గోడ కూలిపోయిందా అంటూ భర్త ఫైర్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X