Gunde Ninda Gudi Gantalu September 19th: ప్రభావతిని చెడుగుడు ఆడేసిన ఫ్యామిలీ.. పూలదండలతో ఉరేస్తానని శపథం
చెల్లెలి పెళ్లి సంబంధం చెడగొట్టడానికి ప్రయత్నించిన బాలుపై ప్రభావతి విరుచుకుపడింది. పెళ్లి చెడగొట్టడానికే ఇంట్లో ఉన్నావా? అంటూ నిలదీసింది. అయితే ప్రభావతి ప్లాన్స్ ఫెయిల్ కావడంపై భర్త స్పందిస్తూ.. ఎప్పుడు నీ బాధ ఏంటి? నీవు కట్టిన పేక మేడ కూలిపోయిందని బాధపడుతున్నావా? నీవు కట్టిన అబద్దాల మేడ పగిలిపోయిందా? అని ప్రశ్నించాడు. వాళ్లు కోటీశ్వరులైతే కావొచ్చు. కానీ మన గురించి అబద్దాలు చెప్పడం ఎందుకు అని అడిగాడు. ఇంకా గుండె నిండా గుడి గంటలు సీరియల్ 253 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
భర్త నిలదీయడంపై ప్రభావతి రివర్స్ అయింది. గత 35 ఏళ్లలో నాకు ఏం చేశారు. ఏం రత్నాలు, పట్టు పీతాంబరాలు కొనిచ్చారు. కనీసం పిల్లల్ని ఎదగనివ్వరు అని అంటే.. ఎదగడం అంటే.. అబద్దాలు చెప్పడమా? ఇప్పుడు ఏదో చెప్పి పెళ్లి చేస్తే ఒకే.. కానీ పెళ్లి జరిగిన తర్వాత నిజాలు తెలిస్తే చెల్లెలి జీవితం ఏం అవుతుందో ఆలోచించావా? అని బాలు అన్నాడు. వెంటనే ఇంటి కోడలు పరువు తీస్తావా. వాళ్లు బెదిరించి మనకు అంటగట్టారా? అంటూ భర్త నిలదీశాడు. కూతురు కూడా నేను చేసుకోననే తెగేసి చెప్పింది.

హోటల్ మేనేజ్‌మెంట్ అంటే హోటల్‌లో పనిచేసే వాడని, టిప్పులతో జీవితం గడిచే అభిప్రాయం ఉంది. అలాంటి వాడు నన్ను ఇల్లరికానికి తీసుకెళ్లి.. ఇంట్లో వంటలు చేయించుకొంటాడట అని రవి అన్నాడు. వాడు తినడానికే పుట్టాడనిపిస్తున్నది అని కూతురు కూడా గట్టిగా తలంటింది. ఇంటి సభ్యులంతా రివర్స్ కావడంతో ప్రభావతి షాక్ తిన్నది.

చెల్లెలికి కాబోయే వాడిని రవి కూడా వెధవ అన్నాడంటే.. వాడు ఎంత వెధవ అర్ధం చేసుకో. అంతేకాకుండా నాన్నను అవమానించాడు. నాన్నను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. నేను ఊరుకోను. ఇకనైనా ఇలాంటి ప్రయత్నాలు ఆపండి అంటూ బాలూ అక్కడి నుంచి వెళ్లాడు. కోడలు బయటకు వెళ్లుతుంటే.. నీవు కావాలనే వాడిని ఇంట్లో ఉంచావా? ఈ పెళ్లిని చెడగొట్టడానికి ప్లాన్ చేశావా? అంటే.. మామను తక్కువ చేసి మాట్లాడే వాళ్లతో సంబంధమా? ఇప్పటి వరకు నాకు మీ మీద గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అంటూ మధ్యలోనే మాటలు ఆపేసి అక్కడి నుంచి వెళ్లింది.
ఇక శృతి అక్కడి నుంచి వెళ్లిన తర్వాత.. నీలకంఠ ఇంటిలో భోజనం చేసిన తర్వాత సురేంద్ర, శోభన తర్వాత మాట్లాడుతూ.. ఎవరైనా పెళ్లి కుదిరితే పప్పన్నం పెడుతారు. కానీ నీలకంఠ పంచభక్ష్య పరమాన్నం పెట్టారు అని సురేంద్ర అన్నాడు. అయితే నీలకంఠం కొడుకు పెళ్లి ముహుర్తాలు పెట్టుకొందాం అంటే.. నేను ఆ పని చెప్పుడో చేశాను అని నీలకంఠం అన్నాడు. దాంతో నీ కొడుకు కంటే నీవే ఫాస్ట్‌గా ఉన్నావు అంటూ కామెంట్ చేశాడు. అయితే శృతి కోసం నేను ఓ గిఫ్టు తీసుకొచ్చాను. ఆమె లేకపోయింది. తన కోసం నేను డైమండ్ రింగ్ తెచ్చాను అంటూ చూపించాడు.
రవి పెళ్లి గురించి బాలు, తన భార్య చర్చించుకొన్నారు. తన తల్లి డబ్బు ఆశకు, కక్కుర్తి పడి వాడి జీవితాన్ని నాశనం చేయాలని అనుకొంటున్నది. కానీ నేను రవి కోసం మంచి సంబంధాన్ని చూశాను అని బాలు అన్నాడు. దాంతో ఎవరీ అమ్మాయి అంటే.. టైమ్ వచ్చినప్పుడు చెబుతాను. ప్రస్తుతం ట్రిప్ కు వెళ్లే సమయం వచ్చింది అంటూ బాలు వెళ్లిపోయాడు. ఇక రవిని తన ప్రేయసి శృతి కలిసింది. చీరలో కనిపించడంతో ఏంటి చీర కట్టావు అంటే.. నీకు ఓ సమస్య చెప్పాలని బయటకు గుంజుకెళ్లింది.
రవితో శృతి మాట్లాడుతూ... మనం పెళ్లి చేసుకొందాం అని అంటే.. ఇంత అర్జెంట్‌గా ఎందుకంటే.. నేను ఎక్కడికి వెళ్లి వస్తున్నానంటే.. పెళ్లికి అరెంజ్‌మెంట్లు చేసి వస్తున్నావా? అని అన్నాడు. కాదు.. పెళ్లి చూపులకు వెళ్లి వస్తున్నాను అని శృతి చెప్పింది. అయితే నాకు మా ఇంట్లో పెళ్లి చూపులు పెట్టారు అని రవి అన్నాడు. దాంతో మనిద్దరం వెంటనే పెళ్లి చేసుకొందామని అంటే.. కుదరదు.. నేను పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకొంటానని అంటే.. మా ఇంట్లో పెద్దలు ఒప్పుకోరు అంటూ వాదించింది. ఎట్టి పరిస్థితుల్లోను పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. రా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొందాం. నేను ప్రేమను చంపుకోను. నీవు ఒప్పుకోకపోతే నేను చేయాల్సింది చేస్తాను అంటూ అక్కడికి వెళ్లింది.
రోహిణి పార్లర్‌కు ప్రభావతి వెళ్లింది.. అయితే తన అత్త రావడంతో రోహిణి ఫ్రెండ్ షాక్‌కు గురైంది. ఇప్పుడు ఇది ప్రభావతి పార్లర్ కాదు.. క్వీన్ పార్లర్. బోర్డు మార్చేసిన సంగతి తెలియదు అంటూ కంగారు పడింది.


Click it and Unblock the Notifications











