Gunde Ninda Gudi Gantalu September 20th: దొరికిపోయిన రోహిణి.. ప్రభావతి ఇంటికి శృతి.. ఆమె హామీ ఇవ్వడంతో!
చాలా లాంగ్వేజ్‌లతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
పెళ్లి సంబంధం చెడగొట్టారని ప్రభావతి విరుచుకుపడుతుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా ఆమెకు ఎదురు తిరుగుతారు. అప్పుడు ప్రభావతి.. బాలును ఇంట్లో ఉంచి సంబంధం చెడగొట్టింది మీనానే అని నిందిస్తుంది. దీనికామె మామగారిని అవమానించిన వాళ్లతో సంబంధమా అంటూ చూసి వెళ్లిపోతుంది. ఇక, రవికి మంచి సంబంధం చూశానని మీనాతో బాలు అంటాడు. కానీ, అది సమయం వచ్చినప్పుడే చెప్తానని చెబుతాడు. ఆ తర్వాత రవిని శృతి కలిసి పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. కానీ, అతడు మాత్రం ఇంట్లో వాళ్లను ఒప్పించిన తర్వాతే అని తేల్చేస్తాడు.

శుక్రవారం ఎపిసోడ్‌లో... ప్రభావతి బ్యూటీ పార్లర్‌కు వస్తుందని రోహిణి జాగ్రత్తలు పడుతుంది. అప్పుడు ఆమె పేరుతో ఉన్న బోర్డును క్లాత్‌తో కవర్ చేస్తుంది. అది చూసిన ప్రభావతి 'నా పేరుతో ఉన్న బోర్డును ఎందుకు ఇలా క్లాత్‌తో మూసేశావు' అని అడుగుతుంది. దీంతో రోహిణి 'మీ నేమ్ ప్లేట్‌ను కొత్తగా డిజైన్ చేయిస్తున్నాను. అందుకే అది వచ్చే వరకూ కవర్ చేస్తున్నాం' అని చెబుతుంది. తర్వాత కవర్ చేసుకుంటూ 'అత్తయ్య మీకు తలనొప్పి వస్తుందని చెప్పారు కదా. మీకు హెడ్ మసాజ్ చేస్తాను పదండి' అంటూ పక్క రూమ్‌లోకి తీసుకు వెళ్తుంది.
రోహిణి మసాజ్ చేస్తుండగా అక్కడకు బ్యూటీ పార్లర్ ఓనర్ వస్తుంది. కానీ, ఆమె లోపలికి రాకుండానే రోహిణి ఫ్రెండ్ విషయం చెబుతుంది. దీంతో ప్రభావతి కళ్లకు కీరా పెట్టి ఆమె దగ్గరకు వెళ్లిపోతుంది. అప్పుడామె 'రోహిణి బిజినెస్ ఎలా జరుగుతుంది? ఒక్కసారి అకౌంట్స్ చూద్దామా' అని అనడంతో ఇద్దరూ కలిసి ల్యాప్‌టాప్‌లో లెక్కలు చూసుకుంటారు. అప్పుడే ప్రభావతి తన దగ్గర ఉన్నది రోహిణి అనుకుని 'అమ్మా నువ్వైనా మన రవి గాడికి ఏదో ఒక సంబంధం చూడు. మలేషియా వాళ్లనో, మీ బంధువులనో చూడు' అని చెబుతుంది.

తన దగ్గర ఉన్నది రోహిణి అనుకుని ప్రభావతి 'అమ్మా రోహిణి.. నువ్వు ఆ విద్యను దూరం పెట్టు. తను మొన్న గుడిలో రవితో చాలా క్లోజ్‌గా మాట్లాడింది. అమ్మాయిలు అన్నప్పుడు కొంచెం పద్దతిగా ఉండాలి' అంటుంది. తర్వాత రోహిణి లెక్కలు చూసుకుని వచ్చే సరికి ప్రభావతి నిద్రపోతుంది. ఆ సమయంలో 'చూశావా? ఎంత కవర్ చేయాల్సి వస్తుందో. రోజూ నాది ఇదే పరిస్థితి' అని ఫ్రెండ్‌కు చెప్పుకుంటుంది. అప్పుడు విద్య 'నేను నిజం చెప్పేయవే అని ఎప్పుడో చెప్పాను. నా మాట ఇప్పటికైనా విని నిజం చెప్పు. మనోజ్‌ను తీసుకుని వచ్చేయ్' అని చెబుతుంది.
పెళ్లి చూపుల తర్వాత కంగారుపడుతూ శృతి.. ప్రభావతి ఇంటికి వస్తుంది. అప్పుడు మీనా అక్కడ ఉండగా చూసి మాట్లాడుతుంది. దీంతో అప్పుడు మాటలో మాట వచ్చి 'రవి, నేను ప్రేమించుకుంటున్నాం. కానీ, వాడి అంత పరికి వాడిని నేను ఎక్కడా చూడలేదు' అని అసలు విషయం చెప్తుంది. దీంతో మీనా 'అయ్యో లవ్ చేసుకుంటున్నారా? నాకు ఈ విషయం తెలియక నీకు చికెన్ తీసుకు వచ్చాను. రవిని కూడా తెచ్చి ఇచ్చాను. ఈ విషయం అత్తగారికి తెలిస్తే అంతే' అంటూ భయపడుతుంది. ఆ వెంటనే శృతిని తన గదిలోకి తీసుకుని వెళ్లిపోతుంది.

రోహిణి వాళ్లు చేసిన మసాజ్ తర్వాత నిద్ర లేచిన ప్రభావతి ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతూ 'నువ్వు నా పేరు మీద ఇంకా ఇంకా పార్లర్లు పెట్టాలి. దేశం మొత్తం బ్రాంచులు రావాలి' అంటుంది. దీనికామె 'సరే అత్తయ్యా.. మీరు ఈసారి ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు చెప్పి రండి. లేదంటే నేను బిజినెస్ పని మీద ఎటైనా వెళ్తే ఇబ్బంది కదా' అంటూ ఇంటికి చేరుకుంటారు. ఆ వెంటనే అక్కడ పడి ఉన్న మల్లెపూలను చూసి మీనా మీనా అని అరుస్తుంది. అంతలోనే మీనా, శృతి టెర్రస్ మీదకు వెళ్లి మాట్లాడుకుంటుంటారు. అప్పుడు శృతి నిజాలన్నీ చెబుతుంది.
అన్నీ విన్న తర్వాత మీరిద్దరూ విడిపోండి అని మీనా అనడంతో శృతి 'నాకు ఈరోజే పెళ్లిచూపులు జరిపారు. కానీ, నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఈ రవిని లేవదీసుకుని వెళ్లిపోతా. ఎందుకంటే మీ మామగారికి, మా నాన్నకు అస్సలు పడదు. వాళ్లిద్దరూ శత్రువులు. ఈరోజు నేను పెళ్లిచూపులకు వెళ్లినోడు నాకు గిఫ్టుగా గన్ ఇచ్చాడు' అని చెబుతుంది. దీంతో మీనా 'అయితే అలాంటి వాడితో పెళ్లి వేస్ట్. నేను ఏం చేయాలి చెప్పు' అని అడుగుతుంది. దీనికి శృతి 'మీరే మాకు పెళ్లి జరిపించాలి. రవితో మీరే మాట్లాడాలి. నాకు ఎంతో టైం లేదు. మీరే చూసుకోవాలి' అంటుంది.

శృతి మాటలకు మీనా 'నువ్వు మా ఆయనను జైలు నుంచి విడిపించావు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మళ్లీ జైలుకు వెళ్తాడు. సరే.. నువ్వు కామ్‌గా ఉండు. నేను మా ఆయనతో మాట్లాడి విషయం చెప్తాను. తర్వాత ఆయన చూసుకుంటారు. ముందు ఇక్కడి నుంచి పదా. మళ్లీ మా అత్తగారు వస్తే ఇబ్బంది' అని తీసుకు వెళ్తుంది. అంతలోనే అక్కడ ప్రభావతి, రోహిణి కూర్చుని ఉంటారు. అది చూసి కంగారు పడిన మీనా.. శృతిని పంపుతుంది. తర్వాత ఆమె తన ఫ్రెండ్ అని వాళ్లకు అబద్దం చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











