Gunde Ninda Gudi Gantalu September 21st: బాలుకు తెలిసిన అసలు నిజం.. ఆమె వల్ల మీనా బలి కాబోతుందా?
చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' రాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ప్రభావతి బ్యూటీ పార్లర్‌కు వస్తుందని తెలుసుకున్న రోహిణి.. అది వేరే వాళ్లకు అమ్మేసిన విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అయినా ప్రభావతికి డౌట్ రావడంతో ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. పెళ్లి చూపుల తర్వాత కంగారుపడుతూ శృతి.. ప్రభావతి ఇంటికి వస్తుంది. అప్పుడు మీనా అక్కడ ఉండగా చూసి మాట్లాడుతుంది. దీంతో అప్పుడు మాటలో మాట వచ్చి 'రవి, నేను ప్రేమించుకుంటున్నాం. కానీ, వాడి అంత పరికి వాడిని నేను ఎక్కడా చూడలేదు' అని అసలు విషయం చెప్తుంది. దీంతో మీనా ఒక్కసారిగా భయపడిపోయి నిజమేనా అని అడుగుతుంది.

అన్నీ విన్న తర్వాత మీరిద్దరూ విడిపోండి అని మీనా అనడంతో శృతి 'నాకు ఈరోజే పెళ్లిచూపులు జరిపారు. కానీ, నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఈ రవిని లేవదీసుకుని వెళ్లిపోతా. ఎందుకంటే మీ మామగారికి, మా నాన్నకు అస్సలు పడదు. వాళ్లిద్దరూ శత్రువులు. ఈరోజు నేను పెళ్లిచూపులకు వెళ్లినోడు నాకు గిఫ్టుగా గన్ ఇచ్చాడు' అని చెబుతుంది. దీనికి శృతి 'మీరే మాకు పెళ్లి జరిపించాలి. రవితో మీరే మాట్లాడాలి. నాకు ఎంతో టైం లేదు. మీరే చూసుకోవాలి' అంటుంది. అప్పుడు మీనా ఈ విషయం తన భర్త బాలుకు చెప్పి చూస్తానని చెప్పి ఆమెను వెళ్లమంటుంది.
మీనా, శృతి కిందకు రాగానే రోహిణి, ప్రభావతి కూర్చుని జ్యూస్ తాగుతూ ఉంటారు. అప్పుడు మరింతగా కంగారుగా శృతిని పంపించేస్తుంది. ఆ వెంటనే ఆమె ఎవరు అని వాళ్లు అడగడంతో తన ఫ్రెండ్ అని వాళ్లకు అబద్దం చెబుతుంది. దీంతో ప్రభావతి, రోహిణి 'ఆ అమ్మాయిని చూస్తుంటే కోటీశ్వరుల అమ్మాయిలా ఉంది. మీనాకు ఇంత రిచ్ ఫ్రెండ్ ఎలా దొరికింది. ఒకవేళ పూలు కొనడానికి వచ్చినప్పుడు ఫ్రెండ్‌షిప్ కుదిరిందా? అయినా ఇంత కంగారుగా పంపించేస్తుంది ఎందుకు' అని అనుకుంటారు.
రాబోయే ఎపిసోడ్‌లో.. శృతి ఇంటికి వచ్చి రవి గురించి చెప్పిన విషయాన్ని మీనా.. బాలుకు చెప్పేస్తుంది. దీంతో భార్యను తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లిన అతడు.. రవిపై సీరియస్ అవుతాడు. అంతేకాదు, తండ్రిని అవమానించిన ఫ్యామిలీతో ఇలాంటివి ఏంట్రా అంటూ నిలదీస్తాడు. అలాగే, ఈ బంధాన్ని ఇక్కడితో వదిలేయమని కూడా వార్నింగ్ ఇస్తాడు. దీంతో రాబోయే ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగిపోయిందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











