Gunde Ninda Gudi Gantalu September 23rd: శృతికి షాకిచ్చిన సురేంద్ర.. నిజం తెలిసి బాలు ఏం చేశాడంటే!
కొత్త కొత్త కంటెంట్‌తో షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ప్రభావతి బ్యూటీ పార్లర్‌కు వస్తుందని తెలుసుకున్న రోహిణి.. అది వేరే వాళ్లకు అమ్మేసిన విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అయినా ప్రభావతికి డౌట్ రావడంతో ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. పెళ్లి చూపుల తర్వాత కంగారుపడుతూ శృతి.. ప్రభావతి ఇంటికి వస్తుంది. అప్పుడు మీనా అక్కడ ఉండగా చూసి తన గురించి నిజాలన్నీ చెబుతుంది. అప్పుడు మీనా ఈ విషయం బాలుతో చెప్తానని మాట ఇస్తుంది. మీనా, శృతి కిందకు రాగానే రోహిణి, ప్రభావతి చూసి ఆమె ఎవరు అని వాళ్లు అడగడంతో తన ఫ్రెండ్ అని వాళ్లకు అబద్దం చెబుతుంది.

సోమవారం ఎపిసోడ్‌లో.. పెళ్లిచూపులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన శృతి తల్లిదండ్రులపై ఫైర్ అవుతుంది. 'అసలు ఎవరిని అడిగి మీరు నా పెళ్లిచూపులు సెట్ చేశారు' అంటూ నిలదీస్తుంది. దీంతో వాళ్లు 'మేము మీ తల్లిదండ్రులం. నీకు పెళ్లి చేయడానికి నీ పర్మీషన్ కావాలా' అని అంటారు. దీనికామె 'అవును.. నా పర్మీషన్ తీసుకునే నా పెళ్లి చేయాలి' అంటూ ఫైర్ అవుతుంది. అలా కాసేపు వాదించుకున్న తర్వాత 'నువ్వు ఆ సత్యం కొడుకుతో ఇంకా తిరుగుతున్నావా? వాడు మీ నాన్నపై కోర్టులో కేసు వేశాడు' అని శృతితో తల్లి సూటిగా చెబుతుంది.
తల్లి చెప్పిన మాటలకు శృతి అది మీ ప్రాబ్లం అంటుంది. దీనికి తల్లి 'డాడీ సమస్య అయితే నీ సమస్య కాదా? నువ్వు అతడితో తిరగడం మాకు తెలియదు అనుకుంటున్నావా? వాడిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ నాన్న మీద పగ తీర్చుకోడానికి వాళ్ల నాన్న వాడిని అడ్డం పెట్టుకున్నాడు' అని అంటుంది. దీంతో శృతి 'మీరు ఏదైనా ఊహించుకోండి. పోనీ మీరు నాకు తెలియకుండా నా పెళ్లి ఫిక్స్ చేస్తే మాత్రం నేను మేజర్‌ను' అని అంటుంది. దీనికి సురేంద్ర 'అమ్మా క్లారిటీగా చెప్తున్నా ఆల్రెడీ నీ పెళ్లి ఫిక్స్ చేసేశాను' అంటాడు. దీంతో శృతి షాక్ అయిపోతుంది.
తండ్రి మాటలకు శృతి 'నాకు వాడు నచ్చలేదు. ఈ పెళ్లి వద్దు' అని చెబుతుంది. అప్పుడు సురేంద్ర 'నువ్వు ఏమీ ఆలోచించొద్దు. ఇన్నాళ్లు నీకు నచ్చినట్లే చేశాం. పెళ్లి మాత్రం మాకు నచ్చినట్లు చేస్తాం. నీ పెళ్లి డేట్ కూడా ఫిక్సైంది. రేపు సంజూ వస్తున్నాడు. తనతో వెళ్లు' అని వెళ్లిపోతారు. దీంతో శృతి మౌనంగా వెళ్లిపోతుంది. మరోవైపు, మీనా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు బాలు ఏమైందని అడుగుతాడు. ఫస్ట్ ఏమీ లేదని చెప్పిన మీనా తర్వాత 'మీకు ఒక విషయం చెప్పాల్సి ఉంది. మీరు కారు తోలుతున్నట్లు కాకుండా కూర్చోండి' అని అంటుంది.
మీనా చెప్పబోతుండగా బాలు 'నువ్వు తల్లివి కాబోతున్నావా ఏంటి' అని కంగారుగా అడుగుతాడు. అప్పుడామె 'ఈరోజు శృతి ఇంటికి వచ్చింది. అదేనండీ రవి ఫ్రెండ్' అని చెప్తుంది. దీంతో బాలు కోపంగా అసలు ఏం జరిగిందో చెప్పు అంటాడు. అప్పుడామె 'మన రవి, ఆ శృతి ప్రేమించుకుంటున్నారు' అని చెప్పేస్తుంది. దీంతో బాలు 'మా అమ్మకు ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తుంది. అసలే ఆస్తిపరుల సంబంధం కదా. అవసరం అయితే ఆమె వెళ్లి నేరుగా సంబంధం అడుగుతుంది' అంటాడు. తర్వాత మీనా అతడికి అన్నీ వివరించి చెబుతుంది.
మీనా మాటలకు బాలు 'ఆమెకు పెళ్లి ఫిక్స్ చేస్తే ఆ పెళ్లే చేసుకోమను. రవిగాడు మనం చూసిన పెళ్లి చేసుకుంటాడు. మా నాన్నకు ఈ విషయం తెలియడానికి వీలు లేదు. ఆయనకు ముగ్గురు కొడుకులు ఉంటే అందులో రవిగాడే మంచోడు. వాడి వల్ల ఆయనకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు ఇది తెలియకూడదు. అయినా మనం ఇష్టం లేని పెళ్లి చేసుకుని సంతోషంగా లేమా? ఆ డీఎం గాడు మా నాన్న మీద కోపంతో పెన్షన్ ఆపేశాడు. శృతితో తిరుగుతున్నాడని తెలిసి రౌడీలతో కొట్టించాడు. సమయానికి నేను చూడబట్టి నేను కాపాడాను' అని నిజాలన్నీ చెబుతాడు.
ఆ తర్వాత బాలు 'నువ్వేమైనా వాడికి మాట ఇచ్చావా? ఇది అయ్యే పని కాదు. వాడితో నేనే తేల్చుకుంటాను' అంటూ రవి దగ్గరకు కోపంగా వెళ్లి గొడవ చేస్తాడు. అప్పుడు మీనా అతడిని కామ్‌గా ఉండమని చెబుతుంది. అయినా బాలు ఆగకుండా అలాగే గొడవ చేస్తుంటాడు. అంతేకాదు, అతడి కాలర్ పట్టుకుని నిలదీస్తాడు. దీనికి రవి 'అరెయ్ నేను ఆమెతో మాట్లాడడం లేదురా' అని చెబుతాడు. అప్పుడు రవి తనకు తెలియదు అని అంటాడు. దీంతో మీనా 'అయ్యో ఈ విషయం రవికి తెలీదు. తను పట్టించుకోవడం లేదనే వచ్చి మనకు చెప్పింది' అని వివరిస్తుంది.
మీనా మాట్లాడిన తర్వాత రవి వాళ్లను బయటకు తీసుకు వచ్చి మాట్లాడతాడు. అప్పుడు బాలు అన్నీ వివరించి చెప్పి మళ్లీ ప్రేమ అంటూ తిరగొద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు, పెళ్లిచూపుల్లో బాలు చేసిన రచ్చను తలుచుకుని ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. అంతలోనే సత్యం అక్కడకు వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు రవి పెళ్లి గురించి ఆలోచిస్తున్నా అంటుంది. అనంతరం మీనా పడుకుని ఉండగా బాలు నిద్ర లేపి రవితో శృతిని మర్చిపోమని చెప్పు అని అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











