Gunde Ninda Gudi Gantalu September 25th: రవికి బిగ్ షాకిచ్చిన శృతి.. మీనాకు మరో నిజం చెప్పిన బాలు
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మీనాతో మాట్లాడిన తర్వాత బాలు.. రవి కోసం ఓ సంబంధం చూశానని అంటాడు. ఆ వెంటనే ఆమెను కారులో ఒక దగ్గరకు తీసుకు వెళ్తాడు. అప్పుడు మీనా అడిగినా ఏమీ చెప్పకుండానే పండ్లు, పువ్వులు కొంటాడు. అలా పార్వతమ్మ ఇంటికి తీసుకు వెళ్లి చాలా హైడ్రామా తర్వాత రవికి సుమతిని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. కానీ, పార్వతమ్మ మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోదు. దీంతో బాలుకు కోపం వచ్చి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. తర్వాత మీనా గతంలో తనకు ఇంట్లో జరిగిన అవమానం గురించి బాలుకు చెప్తుంది. అయినా అతడు మాత్రం పెళ్లి చేయాలంటాడు.

బుధవారం ఎపిసోడ్‌లో... బాలు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడంతో మీనా 'మీ అమ్మగారు నన్ను అనే మాటలు మా చెల్లి విని బాధపడలా? తనను అనే మాటలకు నేను బాధపడాలా? లేదంటే మా అమ్మను అనే మాటలకు మేమిద్దరం బాధపడాలా? అసలు ఎవరి మనసులో ఏముందో మీకు ఏమీ తెలీదు. మీ తమ్ముడు ఏమనుకుంటున్నాడు? మా చెల్లి ఏమనుకుంటుంది? ఆఖరికి మీ పెళ్లాం ఏం ఆలోచిస్తుంది అనేవి మీకు అనవసరం. మీరు మంచి చేయాలన్నా ఇది జరగదు' అని అంటుంది. దీంతో బాలు కోపంగా ఆమెను ఇంటికి తీసుకు వెళ్లిపోతాడు.
తనకు పెళ్లి సెట్ చేయడంతో శృతి తల్లిదండ్రులతో ఈ విషయంపై మాట్లాడుతుంది. కానీ, వాళ్లు మాత్రం అస్సలు ఆమె మాటను వినిపించుకోరు. అప్పుడామె 'పెళ్లి సెట్ చేస్తే చేశారు కానీ కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేయండి. నా కెరీర్ గురించి ఇంకా ప్లాన్ చేసుకోవాలి' అంటుంది. కానీ, వాళ్లిద్దరూ మాత్రం అస్సలు పట్టించుకోరు. పైగా సురేంద్ర 'అల్లుడు గారికి నువ్వు ఆ వర్క్ చేయడం ఇష్టం లేదు' అంటాడు. దీనికి శృతి 'అదేంటి ఇప్పుడే నా గురించి రిస్టిక్షన్స్ పెడుతున్నాడా? అది మీకు తప్పుగా అనిపించడం లేదా' అనగా అతడు లేదు అని చెప్పేస్తాడు.
ఆ తర్వాత సురేంద్ర 'శృతి నువ్వు చెప్పినట్లు వింటే నీకు ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అనుకుంటున్నావేమో. ఈ పెళ్లిని వాయిదా వేయొచ్చు అనుకుంటున్నావేమో. కానీ అస్సలు అలా జరగదు. 15వ తేదీనే నీ పెళ్లి. నువ్వు సంజూతో వెళ్లి నీకు నచ్చింది కొనుక్కో' అని వెళ్లిపోతాడు. అప్పుడు తన గదిలోకి వచ్చిన శృతి 'ఈ పెద్దోళ్లు ఏంటి మన మాట వినరా? వాళ్లకు నచ్చినట్లు చేయాలని ఈ బెదిరింపులు ఏంటి? మన లైఫ్‌ను మనం కాపాడుకోవాలంటే మనకు నచ్చినట్లే ఆలోచించాలి. కాబట్టి మంచిగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలి' అని అనుకుంటుంది.
మీనా, బాలు ఇంటికి రాగానే రవి బయటకు వెళ్తుంటాడు. అప్పుడు అతడిని ఆపిన బాలు 'అరేయ్ రవి ఆ లక్షలు మింగినోడిలా చక్కగా రెడీ అయి వెళ్తున్నావు ఏంటి? నీకు నిన్ననే వార్నింగ్ ఇచ్చాను. మళ్లీ ఆ అమ్మాయితో మాట్లాడినా, లవ్ అంటూ తిరిగినా వేరేలా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్లామా? వచ్చామా? అన్నట్లే ఉండాలి. ఈ వయసులో వాళ్లలా క్రష్ అని తిరిగితే బాగోదు. నా బుర్రలో ఓ అమ్మాయి ఉందిరా' అని అంటాడు. అప్పుడే రవికి శృతి పదే పదే కాల్ వస్తుంది. అది గమనించిన బాలు అసలు విషయాన్ని మీనాకు చెప్పి షాక్ ఇచ్చేస్తాడు.
రవి తన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో శృతి నేరుగా రెస్టారెంట్‌కు వస్తుంది. వచ్చీ రావడమే ఆమె అతడిపై ఫైర్ అవుతుంది. దీంతో రవి ఆమెను బయటకు తీసుకు వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు శృతి 'జాబ్ పోతే మళ్లీ వెతుక్కోవచ్చు. నేను పోతే మళ్లీ రాలేను. ఒరేయ్ వాళ్లు నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. వాడితో షాపింగ్‌కు వెళ్లమంటారు. నన్ను వెళ్లమంటావా? నిజం చెప్పు నన్ను వదిలించుకుంటున్నావా' అని సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో రవి 'శృతి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే టైం లేదు. నేను నీకు కాల్ చేసి మాట్లాడతాను. ఇంటికి వెళ్లు' అని చెబుతాడు.
రవి ఎంత చెప్పినా వినకపోవడంతో శృతి రెస్టారెంట్‌లోకి వెళ్లి కూర్చుని ఆర్డర్ ఇస్తుంది. అంతేకాదు, 'నీ నుంచి సరైన సమాధానం వచ్చే వరకూ ఇక్కడి నుంచి కదలను' అని సూటిగా చెప్పేస్తుంది. మరోవైపు, రోహిణి తన తల్లిని ఆస్పత్రిలో చూపించి వచ్చి వాళ్లను ఇంటికి వెళ్లిపోమంటుంది. అప్పుడు విద్య.. చింటూను ఎగ్జిబిషన్‌కు తీసుకు వెళ్తానని అంటుంది. దీంతో రోహిణి ఫైర్ అవుతూ 'అమ్మా సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపో. కావాలంటే పనిమనిషిని పెట్టుకో. లేదంటే పని చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుని మళ్లీ మళ్లీ ఇక్కడికి రాకు' అని ఫైర్ అవుతుంది.
రోహిణి మాటలకు విద్య కూడా సీరియస్ అవుతుంది. అప్పుడు ఆమెపై అరిచిన రోహిణి 'కావాలంటే చింటూను హాస్టల్‌లో చేర్పిస్తాను' అని అంటుంది. దీంతో రోహిణి తల్లి 'ఇంక ఆపు. ఊరుకుంటున్నా అని ఏది పడితే అది మాట్లాడకు. నేను చచ్చే వరకూ వాడికి ఆ పరిస్థితి రానివ్వను' అంటుంది. దీంతో వాళ్లను పంపించేయమని విద్యకు చెప్పి రోహిణి వెళ్లిపోతుంది. తర్వాత బాలు తన ఫ్రెండ్‌తో మాట్లాడుతుండగా విద్య క్యాబ్ కోసం ఫోన్ చేస్తుంది. అప్పుడే బాలుకు కూడా ట్రిప్ వస్తుంది. దీన్ని ఇద్దరూ మార్చుకుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











