Gunde Ninda Gudi Gantalu September 26th: అడ్డంగా దొరికిన మనోజ్.. రోహిణి తల్లి బాలుకు ఏం చెప్పిందంటే!
చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
పార్వతమ్మ తీసుకున్న నిర్ణయంపై బాలు నిరుత్సాహంతో ఉంటాడు. దీంతో మీనా అసలు సంబంధం ఎందుకు వద్దు అని చెప్పింది అనేది వివరిస్తుంది. తర్వాత శృతి తనకు పెళ్లి అప్పుడే వద్దని తన తల్లిదండ్రులతో చెప్తుంది. కానీ, వాళ్లు మాత్రం అస్సలు వినిపించుకోరు. పైగా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అని తేల్చేశారు. దీంతో శృతి.. రవికి కాల్ చేస్తుంది. ఆ సమయంలోనే బాలు అతడికి క్లాస్ పీకుతూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయడు. దీంతో ఆమె నేరుగా రెస్టారెంట్‌కు వచ్చి రవితో గొడవ పెట్టుకుంటుంది. అంతేకాదు, తనను పెళ్లి చేసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తుంది.

గురువారం ఎపిసోడ్‌లో.. రోహిణి తల్లి సుగుణమ్మ కోసం బాలు క్యాబ్‌లో వస్తాడు. అప్పుడు చింటూ పరుగున వచ్చి బాలును చూసి షాక్ అవుతాడు. సుగుణమ్మ కూడా అతడిని చూసి కంగారు పడిపోతుంది. తర్వాత ఆమె రోహిణి తల్లి అనే విషయం తెలియకుండా జాగ్రత్తగా బాలుకు సమాధానాలు చెబుతుంది. అప్పుడు బాలు 'అప్పుడు మీరు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. మీనా మిమ్మల్ని చూడాలని కోరుకుంటుంది. వెళ్లే దారిలోనే మా ఇల్లు ఉంది. చింటుతో కలిసి మా ఇంటికి మీరు రావాల్సిందే' అని పట్టుబడతాడు. కానీ, ఆమె మాత్రం రాలేనని చెబుతుంది.
సుగుణమ్మ రాలేనని చెప్పినా వినకుండా ఇంటికి తీసుకు వస్తాడు. అది చూసిన రోహిణి తమను అక్కడ చూస్తే ఆమె కాపురానికి ప్రమాదమని టెన్షన్ పడుతుంది. ఇంట్లోకి రాకుండా బయటే మీనాతో మాట్లాడి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అప్పుడే పార్లర్ నుంచి విద్యతో కలిసి రోహిణి ఇంటికి వస్తుంది. తమ ఇంటి ముందు తల్లితో పాటు చింటూ ఉండటం చూసి షాకవుతుంది. మీనా, బాలుతో తల్లి మాట్లాడుతుండటంతో రోహిణి భయంతో వణికిపోతుంది. తన నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందోని భయపడుతుంది. అప్పుడు బాలు ఆమె కూతురు గురించి అడుగుతాడు.

బాలు అడగడంతో తన కూతురు ఇంకా సింగపూర్‌లోనే ఉందని సుగుణమ్మ చెప్తుంది. అప్పుడు బాలు గతంలో దుబాయ్ అన్నారు కదా ఇప్పుడు సింగపూర్ అంటున్నారేంటి అని అడుగుతాడు. దీంతో ఆమె మర్చిపోయానని సర్ధి చెప్తుంది. అప్పుడు కారు చాటున దాక్కుని రోహిణి వారి మాటలను వింటుంటుంది. కూతురు అక్కడి రావడం చూసిన సుగుణమ్మ.. బస్‌కు టైమ్ అవుతుందని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హడావిడి చేస్తుంది. ఆమె కంగారు చూసి బాలు బయలుదేరుతాడు. దాంతో ప్రమాదం తప్పిపోయిందని రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది.
రోహిణి భయాన్ని చూసిన విద్య 'ఇలా అబద్దాల మీద అబద్దాలు చెప్పడం కరెక్ట్ కాదు. నీ కొడుకు జీవితం గురించి ఆలోచించి అయినా ప్రభావతి, మనోజ్‌కు నిజం చెప్పు. లేదంటే విడిగా కాపురం పెట్టు. అప్పుడే మనోజ్ నువ్వు ఏం చెప్పనా నమ్ముతాడు' అని రోహిణికి సలహా ఇస్తుంది. అదే టైమ్‌లో రోహిణి దగ్గరకు ప్రభావతి వచ్చి తెగ పొగుడుతుంది. తల్లిలేని బిడ్డ అయిన రోహిణిని తానే తల్లిలా చూసుకుంటున్నానని అంటుంది. మీనాకు డబ్బు ఉండుంటే ఎప్పుడో వేరు కాపురం పెట్టేదని, రోహిణి కోటీశ్వరురాలైన కలిసి ఉండాలని కోరుకుంటుందని ప్రశంసలు కురిపిస్తుంది.

మరోవైపు, మనోజ్ జాజ్‌కు వెళుతున్నానని రోజులానే ఇంట్లో అబద్దం చెప్పి పార్కుకు వస్తాడు. తమతోపాటు రోజు పార్కు వచ్చే స్నేహితుడు భార్యకు దొరికిపోతాడు. జాబ్‌కు వెళుతున్నానని చెప్పి అబద్ధం ఆడిన భర్తను చితక్కొడుతుంది. రేపు మీకు ఇదే గతి పడుతుందని మనోజ్ అండ్ గ్యాంగ్‌కు వార్నింగ్ ఇస్తుంది. ఆ గొడవలో కొన్ని షాపింగ్ కూపన్లు కింద పడిపోతాయి. వాటిని మనోజ్ తీసుకుంటాడు. ఇక, రవి దగ్గరకు వచ్చిన శృతి తనకు పెళ్లి కుదిరినా ఎందుకు సైలెంట్‌గా ఉన్నావని ప్రశ్నిస్తుంది. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటుంది. కానీ, రవి వినడు.
శృతి మాటలకు రవి 'నా కుటుంబాన్ని బాధపెట్టి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందాం' అంటాడు. దీంతో శృతి 'అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు డిసైడ్ అయ్యావా లేదా' అని అడుతుంది. కానీ బాలు వార్నింగ్ గుర్తొచ్చి రవి సమాధానం చెప్పకుండా సైలెంట్ అవుతాడు. దీనికామె 'రేపటి వరకు నీకు టైమ్ ఇస్తున్నాను. అప్పటిలోగా నువ్వు సమాధానం చెప్పకపోతే నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు జీవితాంతం బాధపడతావు' అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

తర్వాత షాపింగ్ కూపన్స్ తీసుకొని ఇంటికొచ్చి రోహిణి ముందు మనోజ్ తెగ బిల్డప్‌లు ఇస్తాడు. కొడుకు మాటలు విని ప్రభావతి సహించలేకపోతుంది. జాబ్ లేకుండా కూపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయని కొడుకును పక్కకు తీసుకెళ్లి నిలదీస్తుంది. ఓ జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లానని వారు కూపన్స్ ఇచ్చారని తల్లి దగ్గర మనోజ్ అబద్దం ఆడతాడు. మనోజ్ మాటలను బాలు వినేస్తాడు. ఈ ఉద్యోగం కూడా పోయిందా అని మనోజ్‌పై సెటైర్స్ వేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి.. మనోజ్ ఉద్యోగం పోయిందనే మాట వినగానే షాకవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











