Gunde Ninda Gudi Gantalu September 27th: మనోజ్‌ను పట్టించిన బాలు.. సంజూ, శృతి మధ్యలో రవి.. సూపర్ ట్విస్ట్

జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
రోహిణి తల్లి సుగుణమ్మ కోసం బాలు క్యాబ్‌లో వస్తాడు. అప్పుడామె అతడిని చూసి కంగారు పడిపోతుంది. తర్వాత ఆమె రోహిణి తల్లి అనే విషయం తెలియకుండా జాగ్రత్తగా బాలుకు సమాధానాలు చెబుతుంది. దీంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. రవి దగ్గరకు వచ్చిన శృతి రెండు రోజుల్లో తనను పెళ్లి చేసుకోకపోతే చాలా నష్టం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. జాబ్ లేకుండా కవర్ చేసుకుంటోన్న మనోజ్.. తన తల్లి దగ్గర నోరు జారి మాట్లాడతాడు. అది విన్న బాలు ఇంట్లో రచ్చ చేయడంతో అందరికీ అసలు నిజం తెలిసిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 27th

శుక్రవారం ఎపిసోడ్‌లో... ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్ చాలా సంతోషంగా కనిపిస్తాడు. అప్పుడు రోహిణి ఏమైందని అడగ్గా.. షాపింగ్ కూపన్లు తెచ్చానని చెబుతాడు. అప్పుడు ప్రభావతి వచ్చి రోహిణిని లోపలికి పంపుతుంది. ఆ వెంటనే నీకు ఏ కంపెనీ వాళ్లు ఈ కూపన్లు ఇచ్చారు అని ప్రశ్నిస్తుంది. దీంతో మనోజ్ 'నేను ఓ ఇంటర్వ్యూకు వెళ్లాను కదా. నాకు ఎక్కువ డిగ్రీలు ఉన్నాయని, మీరు మాకే బాస్‌లా ఉన్నారు అని వాళ్లు అన్నారు. అందుకే ఇంటర్వ్యూలో కూర్చోబెట్టకుండా ఫీల్ అవ్వొద్దు అని ఈ కూపన్లు ఇచ్చి పంపించారు' అంటాడు. అది బాలు వినేస్తాడు.

బాలు వచ్చి 'ఏంటి కొత్త ఉద్యోగం అంటున్నావు. కొంపదీసి పాత జాబ్ పోయిందా' అని ప్రశ్నిస్తాడు. దీంతో మనోజ్ 'ఒరేయ్ నా జాబ్ ఉందిరా. కొత్త దానికోసం ఇంటర్వ్యూకు వెళ్లాను' అని చెబుతాడు. అప్పుడు బాలు అతడిని అవమానిస్తాడు. దీంతో రోహిణి 'ఇలాంటి వాటి గురించి వాళ్లకు ఏమీ తెలుస్తుంది అత్తయ్యా' అని అంటుంది. దీనికి మీనా 'మాకు ఎందుకు తెలియాలి. మేము ఫ్రీగా వచ్చే వాటి గురించి ఆలోచించము. మా ఆయన కష్టంతోనే తీసుకుంటాం' అంటుంది. అప్పుడు రోహిణి 'అంటే ఏంటి నీ ఉద్దేశం? మేము ఫ్రీగా తీసుకుంటామా' అని అంటుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 27th

ఆ తర్వాత రోహిణి 'మనోజ్ వాటిని సంపాదించకుండా ఎక్కడో ఏరుకుని వచ్చాడు అనుకుంటున్నావా' అంటుంది. అప్పుడు సత్యం వచ్చి ఆ కూపన్లు తీసుకుని అందరూ షాపింగ్‌కు వెళ్లండి అని అంటాడు. దీంతో ఇంట్లో వాళ్లంతా ఓకే అంటారు. కానీ, రవి మాత్రం తనకు కుదరదు అని చెప్తాడు. ఆ తర్వాత అతడు బాలు అన్న మాటలను గుర్తు చేసుకుని బాధపడతాడు. శృతి కూడా తన తండ్రి గురించి ఆలోచిస్తుంది. ఆ వెంటనే రవికి కాల్ చేస్తుంది. కానీ, అతడు మాత్రం లిఫ్ట్ చేయడు. అప్పుడామె బాధతో వాట్సాప్‌లో ఆడియో క్లిప్‌లను అతడికి పంపుతుంది.

ఆడియో క్లిప్‌లలో శృతి 'ఎందుకురా నన్ను దూరం పెడుతున్నావు? నువ్వు అందరిలాంటి వాడివే. రేపటిలోగా నువ్వు నా కాల్ లిఫ్ట్ చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది జాగ్రత్త' అని చెప్తుంది. అది విని రవి కంగారు పడిపోతాడు. మరోవైపు, కామాక్షికి ప్రభావతి కాల్ చేసి షాపింగ్‌కు రమ్మని అడుగుతుంది. కానీ, ఆమె మాత్రం తనకు ఖాళీ లేదని, రావడం కుదరదు అని చెబుతుంది. దీంతో ప్రభావతి 'మా మనోజ్‌కు షాపింగ్ కూపన్లు వచ్చాయి. ఫ్రీగా చేసుకోవచ్చని రమ్మన్నాను' అంటుంది. అప్పుడు కామాక్షి ఏదో చెప్పబోతుండగా కాల్ కట్ చేస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 27th

శృతి కోసం సంజూ.. సురేంద్ర ఇంటికి వస్తాడు. అప్పుడు అతడు సురేంద్ర వాళ్లకు గిఫ్టులు ఇస్తాడు. అలా వాళ్లు మాట్లాడుతుండగా శృతి కిందకు వస్తుంది. ఆమెను చూసి ఫ్లాటైన సంజూ ఏదో మాట్లాడగా.. ఆమె మాత్రం కోపంగా బదులిస్తుంది. అప్పుడు సంజూ.. శృతిని బయటకు తీసుకు వెళ్తాడు. అది ఆమెకు ఇష్టం లేకపోయినా చెప్పినట్లు వింటుంది. అనంతరం ప్రభావతి ఫ్యామిలీ మొత్తం షాపింగ్ కోసం వస్తుంది. అప్పుడు బాలు కారు గురించి అందరూ కామెంట్ చేస్తారు. దీంతో మనోజ్ కారు గురించి నోరు జారుతారు. అప్పుడు రోహిణి దాని గురించి చెప్పమని అంటుంది.

రోహిణి అడగడంతో బాలు 'మనోజ్‌కు రైలు పెట్టె లాంటి కారు ఇప్పుడు ఎందుకు లేదో నువ్వు చెప్తావా? లేక నన్నే చెప్పమంటావా' అని ప్రభావతిని అడుగుతాడు. అప్పుడామె 'కొంత మందికి కొన్ని కలర్లు సెంటిమెంట్ ఉంటుంది కదా. అందుకే అమ్మేశాడు' అని అంటుంది. తర్వాత మనోజ్ కూడా 'నాకు అది వర్కౌట్ కాలేదు. అందుకే అమ్మేశాను' అని చెబుతాడు. అంతలోనే అక్కడకు కామాక్షి వస్తుంది. ఆమెపై బాలు పంచులు వేస్తాడు. ఆ తర్వాత సంజూ, శృతి షాపింగ్‌కు వెళ్తారు. అప్పుడు వాళ్లతో పాటే రవి కూడా లిఫ్టులోకి రావడంతో చూసి శృతి సంతోషిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 27th

లిఫ్టులో ఉన్న సమయంలో రవి 'ఈరోజే నేను నా గర్ల్‌ఫ్రెండ్‌తో కలవబోతున్నా. ఇకపై తనను వదిలిపెట్టను అని చెప్పబోతున్నా. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి' అంటాడు. దీంతో సంజూ చిరాకు పడగా.. శృతి మాత్రం విష్ చేస్తుంది. తర్వాత కాసేపు మాట్లాడుకున్న తర్వాత శృతి వాళ్లు దిగిపోతారు. అప్పుడు వాళ్లతో పాటే రవి కూడా వెళ్తాడు. ఆ సమయంలో శృతికి సంజూ చీరలు కొంటుంటే రవి వస్తాడు. అప్పుడు కర్చీఫ్ చించి సంజూ ప్యాంట్ చిరిగిందని అంటాడు. దీంతో అతడు ట్రయల్ రూమ్‌లోకి వెళ్లిపోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X