Gunde Ninda Gudi Gantalu September 28th: షాపింగ్ మాల్‌లో షాకింగ్ సీన్.. వాళ్లను చూసిన బాలు ఏం చేశాడంటే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' రాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్ చాలా సంతోషంగా కనిపిస్తాడు. అప్పుడు రోహిణి ఏమైందని అడగ్గా.. షాపింగ్ కూపన్లు తెచ్చానని చెబుతాడు. అప్పుడు ప్రభావతి వచ్చి రోహిణిని లోపలికి పంపుతుంది. ఆ వెంటనే నీకు ఏ కంపెనీ వాళ్లు ఈ కూపన్లు ఇచ్చారు అని ప్రశ్నిస్తుంది. దీంతో మనోజ్ వాళ్లకు అబద్దాలు చెప్తాడు. అప్పుడు బాలు అతడికి జాబ్ పోయిందా అని గట్టిగా అరుస్తాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ అయిపోతారు. ఆ వెంటనే అందరూ ప్రశ్నించగా.. మనోజ్ మళ్లీ అబద్దం చెప్పి కవర్ చేసుకుంటాడు. ఆ సమయంలో రోహిణికి మీనా ఘాటైన సమాధానం చెప్తుంది.

మనోజ్ గొడవ అలా పూర్తవగా.. రవికి శృతి కాల్ చేస్తుంటుంది. కానీ, అతడు మాత్రం లిఫ్ట్ చేయడు. ఆ సమయంలోనే శృతి కోసం సంజూ వాళ్ల ఇంటికి వస్తాడు. అతడు వాళ్లకు కొన్ని గిఫ్టులు కూడా ఇస్తాడు. తర్వాత శృతిని బయటకు తీసుకు వెళ్తాడు. అలా ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్తారు. అప్పుడు రవి కూడా వాళ్లతో పాటు వస్తాడు. తన గర్ల్‌ఫ్రెండ్ గురించి సంజూకు చెప్పి అతడి వెనకాలే తిరుగుతూ ఉంటాడు. తర్వాత అబద్దం చెప్పి సంజూను రవి ట్రయల్ రూమ్‌కు పంపిస్తాడు. ఆ తర్వాత షాపింగ్ మాల్‌లో శృతి, రవి మాట్లాడుకుంటారు. వాళ్లను సంజూ వెతుకుతూ ఉంటాడు.
మనోజ్ తెచ్చిన కూపన్లను వాడుకునేందుకు ప్రభావతి ఫ్యామిలీ మొత్తం షాపింగ్ మాల్‌కు వస్తారు. అందులోనే రవి వాళ్లు కూడా ఉంటారు. బాలు వాళ్లు లోపల షాపింగ్ చేస్తుండగా రోహిణి, ప్రభావతి వాళ్లను అవమానించేలా మాట్లాడతారు. ఆ సమయంలోనే రవిని శృతి సీక్రెట్‌గా పిలుస్తుంది. అది గమనించిన బాలు.. రవి అక్కడే ఉన్నాడని గ్రహించి అతడిని పిలుస్తాడు. ఇదంతా రాబోయే ఎపిసోడ్‌లో చూపించబోతున్నారు. దీంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది.


Click it and Unblock the Notifications











