Gunde Ninda Gudi Gantalu September 3rd: అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి.. కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్
ఇండియాలో ఉన్న చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
వడ్డీ వ్యాపారికి డబ్బులు కట్టడానికి వెళ్తున్న ప్రభావతి ఆటో ఆగిపోవడంతో రోడ్డుపై ఒంటరిగా ఉంటుంది. అప్పుడు శివ ఆమెను చూసి తన ఫ్రెండ్‌కు చెబుతాడు. అంతలోనే ప్రభావతి లక్ష గురించి మాట్లాడుతుంది. అది విన్న శివ ఫ్రెండ్ అవి కొట్టేద్దాం అంటాడు. అలా ఇద్దరూ కలిసి లక్ష దొంగిలిస్తారు. దీంతో లబోదిబో అనుకుంటూ ఖాళీ చేతులతో ప్రభావతి వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లి జరిగింది చెబుతుంది. కానీ, ఆయన నమ్మకుండా ఆమెను బంధిస్తాడు. అంతలోనే అక్కడకు బాలు డబ్బులు కట్టడానికి మీనా వస్తుంది. అప్పుడే ప్రభావతి మాటలను ఆమె వింటుంది.

మంగళవారం ఎపిసోడ్‌లో.. ప్రభావతిని వడ్డీ వ్యాపారి ఇంట్లో చూసిన మీనా కంగారు పడుతుంది. అంతేకాదు, 'మీరేంటి అత్తయ్యా ఇక్కడ ఉన్నారు? ఆగండి ఆయనకు కాల్ చేసి రమ్మని చెప్తాను' అంటుంది. దీంతో ప్రభావతి కంగారుగా 'వద్దు మీనా వద్దమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఆ బాలు గాడు అస్సలు ఊరుకోడు. నా సంగతి చూస్తాడు ఫోన్ చేయకు' అని బ్రతిమాలుతుంది. అప్పుడు అక్కడున్న లేడీ బౌన్సర్ అడ్డుపడగా.. ఆమెను మీనా కొడుతుంది. అది చూసిన ప్రభావతి 'వామ్మో దాన్నే కొట్టింది. దీనితో జాగ్రత్తగా ఉండాలి' అనుకుంటుంది.
ప్రభావతిని చూసిన తర్వాత మీనా వెంటనే బాలుకు కాల్ చేసి విషయం చెబుతుంది. దీంతో బాలుకు విషయం అర్థం కాదు. అప్పుడు క్లారిటీగా వివరించి చెబుతుంది. దీనికి బాలు 'నేను నా ట్రిప్‌ను క్యాన్సిల్ చేసుకుని అక్కడకు వస్తాను. నువ్వు అంతలోనే నాన్న వాళ్లకు కూడా కాల్ చేసి రమ్మని చెప్పు' అంటాడు. తర్వాత వెళ్లి ప్రభావతితో బాలు వస్తున్నాడని చెబుతుంది. దీనికామె 'దేవుడా కాపాడడానికి ఎవరినైనా పంపించమంటే దీన్ని పంపావేంటి? ఇప్పుడు నా పని అయిపోయింది. నా పరువు పోయినట్లే' అని అనుకుంటూ ఏడుస్తుంది.
మీనా బయటకు వచ్చి సత్యం వాళ్లకు కూడా కాల్ చేస్తుంది. అప్పుడు వాళ్లు వచ్చి వెయిట్ చేస్తుండగా బాలు కూడా అక్కడకు వస్తాడు. అప్పుడు అందరూ కంగారుగా లోపలికి వెళ్తారు. అప్పుడు వడ్డీ వ్యాపారిని బాలు ఆమె తన తల్లి అని అసలు ఏమైందని అడుగుతాడు. దీనికాయన 'ఆమె మా దగ్గర 17 లక్షలు రూపాయలు అప్పు తీసుకుంది. తన కొడుకు పెళ్లి ఉందని ఒకసారి, తర్వాత మరోసారి డబ్బులు తీసుకుంది. వడ్డీ కట్టమని అడిగితే డబ్బు పోయిందని కబుర్లు చెబుతుంది' అని అంటాడు. దీంతో సత్యం తన భార్యను వదిలేయమని అతడిని ప్రాధేయపడతాడు.
సత్యం, బాలు వాళ్లు వచ్చారని తెలుసుకుని ప్రభావతి వాళ్లకు కనిపించకుండా దాక్కుంటుంది. దీంతో బాలు లోపలికి వెళ్లి తనదైన శైలిలో పంచులు వేసి ఆమెకు బయటకు పిలుస్తాడు. అంతేకాదు, 'గురువును మించిన శిష్యుడిలా.. కొడుకును మించిన తల్లి. వాడు నలభై లక్షలు మింగితే.. ఈమె 17 లక్షలు మింగింది' అని అంటాడు. తర్వాత సత్యం 'దొంగలా ఆ ముసుగు వేశావు ఏంటి? ముందు అది తీసెయ్. పదండి లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం' అని అంటాడు. తర్వాత ప్రభావతి తప్పు చేసినట్లు తల దించుకోవడంతో బాలు ఆమెపై సెటైర్లు వేస్తాడు.
ఆ తర్వాత సత్యం 'ఏంటి ప్రభావతి? అసలు ఎందుకు ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఇంత అప్పు చేశావు' అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రభావతి గతంలో రోహిణి పెళ్లి చేసుకుంటేనే మా నాన్న నాకు డబ్బు పంపుతాడు అని చెప్పిన మాటలను, దానికామె డబ్బు తీసుకు వచ్చి ఇచ్చింది గుర్తు చేసుకుంటుంది. అప్పుడు సత్యం ఆమెపై సీరియస్ అవగా.. బాలు ఇంకా రెచ్చగొడుతుంటాడు. దీంతో ప్రభావతి 'ఏవండీ ముందు వీడిని బయటకు వెళ్లమని చెప్పండి' అంటుంది. దీంతో బాలు అక్కడి నుంచి అస్సలు వెళ్లను అని అంటాడు. అప్పుడు సత్యం ఇంకా సీరియస్‌గా అడుగుతాడు.
ప్రభావతి మాటలకు మనోజ్ 'అమ్మా.. లక్ష రూపాయలు ఎవరో కొట్టేశారు అని అంటున్నాడు. నిజమేనా? అయితే పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా' అని అడుగుతాడు. దీంతో బాలు 'కేసు ఎందుకు పెడుతుంది? ఒకవేళ కేసు పెడితే ఈ ప్రభావతమ్మ కుట్రలు, ఇంటి తాకట్టు గురించి బయటపడిపోతుంది కదా' అంటుంది. తర్వాత వడ్డీ వ్యాపారి 'ఈమె మాటలు ఎలా నమ్ముతారు' అని అనడంతో బాలు 'ఏమ్మా ప్రభావతి.. ఇంట్లో నా భార్యను, అత్తగారిని, బామ్మర్ధిని దొంగలు చేశావు. మరి ఇప్పుడు నీ సంగతేంటి? కేసు నీ మీద పెట్టాలా' అని అడుగుతాడు.
అనంతరం వడ్డీ వ్యాపారి డబ్బు అడగడంతో తమకు సంబంధం లేదని బాలు చెప్తాడు. దీనికాయన 'ముందు అసలు, వడ్డీ కట్టాలి. లేకపోతే ఇల్లు జప్తు చేయాల్సి వస్తుంది' అంటాడు. దీంతో ప్రభావతి అది తన ఇల్లు అంటుంది. దీనికి సత్యం 'ఏంటే పాపిస్టిదానా.. అది నీ ఇల్లా? నా పిల్లల ఇల్లు. ఎంత పని చేశావే' అంటూ కొట్టబోతాడు. దీంతో బాలు, మీనా ఆపుతారు. తర్వాత మనోజ్‌కే డబ్బులు ఇచ్చి ఉంటుందని బాలు డౌట్ పడతాడు. మొత్తం 58 లక్షలు వీళ్లు మింగేశారని సెటైర్లు వేస్తాడు. అప్పుడు వడ్డీ వ్యాపారి అందరూ షూరిటీ సంతకాలు చేయాలి అంటాడు. దీంతో మనోజ్ పోలీసులకు ఫోన్ చేస్తానంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











