Gunde Ninda Gudi Gantalu September 4th: ఇల్లు తాకట్టుపెట్టి 15 లక్షల అప్పు.. కోర్టు బోనులో ప్రభావతి
ఇల్లు తాకట్టు పెట్టి 15 లక్షలు అప్పు వ్యవహారం ఇంటిలో భారీ చిచ్చు పెట్టింది. ఫైనాన్సియర్ ఆఫీస్‌లో అందరూ నిలబడ్డారు. ఆ సమయంలో నేను పోలీసులకు ఫోన్ చేస్తానని సోదరుడు అంటే.. అయ్యో అంటూ బాలు నిట్టూర్పు తీశాడు. పోలీసులకు ఏమని చెబుతావు. ఇప్పటికే ఉన్న పరువు తీశారు. ఇంకా ఏం చేయాలని అనుకొంటున్నారు. ఆ కాగితాలు ఇవ్వు బాలు.. సంతకం చేస్తాను అంటే.. బాలు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో తండ్రి మాట్లాడుతూ.. ఆమె నీ తల్లి.. ఆమెను అనాథగా వదిలేసి వెళ్దామా? అని అన్నాడు. దాంతో మిగితా పిల్లల్ని కూడా రమ్మనమని ఫైనాన్సియర్ చెబితే.. బాలు వారిని పిలిచేందుకు సిద్దమయ్యాడు.
బాలు బయటకు వెళ్లి తన తమ్ముడికి ఫోన్ చేసి అర్టెంట్‌గా మన కారుకు ఫైనాన్స్ చేసిన వ్యక్తి ఆఫీస్‌కు రా అంటే.. ఎందుకు అని అంటే.. మన లక్షావతి ఇంటిని తాకట్టు పెట్టి 15 లక్షలు దొబ్బేసింది అంటూ బాలు చెప్పగానే అతడు షాక్ అయ్యాడు. మన అమ్మ అంత పనిచేసిందా? అంటే.. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా మౌనికను తీసుకొని రా అన్నాడు.దాంతో వారు అక్కడికి చేరుకొని.. ఎందుకు అలా చేశావని తల్లిని ప్రశ్నించారు.

బాలు మాట్లాడుతూ.. ఇంటి వద్ద ఇంకో పంచాయితీ ఉంది అంటే.. ఫైనాన్షియర్ మాత్రం సంతకాలు చేయమని చెప్పాడు. దాంతో అందరూ ఒక్కొక్కరుగా కాగితాలపై సంతకాలు చేశారు. ఇళ్లు పోతుందని కాదు.. నీ మీద జాలి పడ్డారు. మీ మీద నమ్మకంతో ఇంటిని మీ పేరు మీద రాస్తే.. ఇళ్లే మింగేస్తుందని అనుకోలేదు అని తల్లిపై బాలు విరుచుకుపడ్డాడు.
నీ ముఖం చూసి వదిలేస్తున్నాను. ఇక నుంచి కారుతో వడ్డీతోపాటు ఇంటిపై తీసుకొన్న రుణం కూడా నీవె కట్టాలి. ఒక్క నెల కట్టకపోయినా ఇంటిని కాలి చేయిస్తాను అంటూ ఫైనాన్షియర్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఆవేశంతో నీవు నాకు తల్లిగా ఎలా పుట్టావు అంటూ కామెంట్ చేశాడు. దాంతో బాలు అంటూ తండ్రి వారించాడు. దాంతో అక్కడి నుంచి అందరూ ఇంటికి వెళ్లిపోయారు.

పిల్లలు, భర్త కోపం చూసిన తర్వాత ఇక్కడ గండం గడిచింది. ఇంట్లో ఇంకా ఎంత రచ్చ ఉంటుందో అని తల్లి రోహిణి భయపడింది. ప్రభావతితో భర్త మాట్లాడుతూ.. భర్త తప్పు చేస్తే.. ఇంటిని ఏ భార్య అయినా తాకట్టు పెడుతుంది. ఇంట్లో నలుగురు పిల్లలు, ఇద్దరు కోడల్లు ఉంటే.. 15 లక్షలు అప్పు చేశావు ప్రభావతి అన్నాడు. ఇంత పని చేశావు అమ్మా.. నీకు ఉద్యోగం లేదు. ఏం చేసి తీరుతావు. అంతా అప్పు ఎందుకు చేశావు.. కనీసం నాన్నకైనా చెప్పాలి కదా. అంత డబ్బు ఏం చేశావు అని పిల్లలు ప్రశ్నించారు.
పిల్లలు ప్రశ్నిస్తుంటే ప్రభావతి మౌనంగా ఉంది. అంత డబ్బు ఏం చేశావో చెప్పు. పిల్లలకు సమాధానం చెప్పు అంటే భర్త నిలదీశాడు. అయితే అమ్మను కోర్టుకు ఇడ్చుదాం. చీటింగ్ కేసు కావడంతో బోనులో నిలబెట్టాల్సిందే అంటూ కొడుకు అన్నాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు. కోర్టులోనా? అంటూ తండ్రి షాక్ అయ్యాడు. అప్పుడే అందరూ బయటకు వస్తారు అంటూ కామెంట్ చేశారు.
బాలు ఇంట్లో బోను క్రియేట్ చేసి తల్లిని నిలబెట్టగా.. ప్రభావతి నీవు సమాధానం చెప్పకపోతే బాలు ఊరుకోడు. ఇప్పుడు చెప్పకపోతే నిజమైన బోనులో నిలబడాల్సి వస్తుంది అని అన్నాడు. ఆ 15 లక్షల డబ్బు అప్పు ఎందుకు చేశావు.. ఏం చేశావు అంటూ నిలదీశాడు. దాంతో ఆ డబ్బు అంతా పెళ్లి కోసం ఖర్చు అయిందని ప్రభావతి చెప్పింది. అయితే పెళ్లికి ఖర్చు కాలేదు.. ఏం చేశావో అని అడిగితే.. ప్రభావతి.. తన కొడుకు మనోజ్ వైపు చూసింది.

మనోజ్ ఇప్పటికే 45 లక్షలు ఎత్తుకెళ్లాడు. మళ్లీ 15 లక్షలు ఇచ్చావా? అంటే.. 15 లక్షలతో మనోజ్‌కు సంబంధం లేదు. మనోజ్ పెళ్లికి ముందు బ్యూటీ పార్లర్ పెట్టాలని రోహిణి కోరిక. అందుకే మనోజ్ పెళ్లి కోసం.. వాడిని ఇంటి వాడిని చేయడం కోసం ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బు రోహిణికి ఇచ్చాను అనగానే.. బాలు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ తర్వాత లేచి రోహిణిని నిందించే ప్రయత్నం చేశాడు. మా ఇల్లే తాకట్టు పెట్టి పార్లర్ నడుపుతున్నావా అంటూ బాలు ఎద్దేవా చేశాడు.
పార్లర్ పెట్టినప్పుడు కనీసం చెప్పాలి గదా?. అని అంటే.. రోహిణి మౌనంగా నిలబడింది. మా ఇల్లే నీకు కావాల్సి వచ్చిందా? నీ తండ్రి మలేషియాలో ఉన్నాడా? కోట్లు సంపాదిస్తున్నాడా? అని బాలు నిందించాడు. అయితే రోహిణి వద్దకు వెళ్లి మీ నాన్నకు ఫోన్ చేసి..15 లక్షలు ఇప్పించు అని ప్రభావతి అంటే..నేను నా జన్మలో మాట్లాడనని ఒట్టు వేయించుకొన్నాను అని రోహిణి షాకిచ్చింది.


Click it and Unblock the Notifications











