Gunde Ninda Gudi Gantalu September 5th: అసలు నిజం బట్టబయలు.. రోహిణికి ప్రభావతి షాక్.. కథలో ఊహించని మలుపు
సుమారు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' గురువారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
వడ్డీ వ్యాపారి దగ్గర పంచాయతీ జరిగిన తర్వాత ఆయన ఇంట్లో వాళ్లంతా సంతకాలు చేయాలని డిమాండ్ చేస్తాడు. దీంతో బాలు వెంటనే రవికి కాల్ చేసి వాళ్లను రమ్మంటాడు. అప్పుడు వాళ్లు అక్కడకు చేరుకోగానే విషయం చెప్పి సంతకాలు చేయిస్తాడు. ఆ తర్వాత వీళ్లంతా ఇంటికి వచ్చి మళ్లీ పంచాయతీ పెడతారు. అప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నా ప్రభావతి మాత్రం సైలెంట్‌గానే ఉంటుంది. దీంతో బాలు గట్టిగా నిలదీయడంతో రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టడానికి ఇచ్చానని చెబుతుంది. అప్పుడు బాలు రోహిణిపై నిందలు వేస్తూ పరువు తీసేలా మాట్లాడతాడు.

గురువారం ఎపిసోడ్‌లో... రోహిణి డబ్బు తీసుకుందని తెలిసిన తర్వాత బాలు 'నిజంగానే మీ నాన్న మలేషియాలో ఉన్నాడా? ఒకవేళ అక్కడే ఉండి ఉంటే మా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన దగ్గర ఆ డబ్బు తీసుకుని బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా' అంటాడు. దీంతో మనోజ్ అడ్డు పడతాడు. అప్పుడు బాలు 'ఏరా.. మేము అన్ని సార్లు డబ్బుల గురించి మాట్లాడితే.. రోహిణినే డబ్బు తీసుకుని పార్లర్ పెట్టుకుంది అని చెప్పాలి కదా. ఎక్కువ మాట్లాడితే పళ్లు రాలగొడతా. దానికి కూడా నువ్వు పెళ్లాన్నే డబ్బు అడగాలి' అంటాడు.
బాలు మాట్లాడిన తర్వాత రవి 'అమ్మా.. ఏంటమ్మా ఇది. మేము కూడా నీ కడుపునే పుట్టాము కదా. నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి లోన్ తీసుకోవాలంటే షూరిటీ కోసం కూడా ఇంటి కాగితాలు అడగడానికి ధైర్యం చేయలేదు. నాన్న పరిస్థితి చూసి నేను హోటల్‌లో పని చేస్తుంటే వీళ్లిద్దరూ నన్ను చూసి నవ్వారు. ఎందుకమ్మా మమ్మల్ని ఇంత తేడాగా చూస్తున్నావు' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు సత్యం 'ఆమె డబ్బు మాత్రమే ఇచ్చి తప్పు చేసింది. మీరు దాన్ని దాచేసి ఇంకా పెద్ద తప్పు చేశారు' అంటూ మనోజ్, రోహిణిని నిందిస్తాడు.

ఆ తర్వాత మీనా 'మా తమ్ముడు ఏమీ చేయకపోయినా దొంగతనం చేశాడని నిందిస్తూ వాడిని మొత్తం చెక్ చేసి అవమానించారు కదా. మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? ఇంటి దొంగలు అనేనా? నాకో న్యాయం? నీకో న్యాయమా రోహిణి. గుట్టుచప్పుడు కాకుండా ఇన్ని డబ్బులు తీసుకుంటారా' అని అంటుంది. దీంతో ప్రభావతి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అంటుంది. దీంతో బాలు 'దొంగలతో మాట్లాడుతుంది. చేసిందంతా చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు ఏంటి' అంటాడు. అప్పుడు సత్యం కూడా ఆమెపై సీరియస్ అవుతాడు.
అందరూ తనను నిందిస్తుండడంతో ప్రభావతి 'ఆ పార్లర్‌లో సంపాదించింది మొత్తం రోహిణి మన ఇంటికే ఖర్చు పెడతానని చెప్పింది. వడ్డీ కూడా తనే కడతానని అంది. రోహిణి ఆ పార్లర్ పెట్టకపోతే మంచి అమ్మాయి కోడలిగా రాకుండా పోతుందని డబ్బు ఇచ్చాను' అని చెబుతుంది. దీంతో బాలు 'ఈ వెదవను పెళ్లి చేసుకోడానికి పార్లరమ్మకు డబ్బు ఇచ్చావా? ఏరా నీ ముఖానికి పెళ్లి కావాలా? ఉత్త పుణ్యానికి ఈ పోరంబోకు గాడిని నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు' అని ప్రశ్నిస్తాడు. తర్వాత కూడా ప్రభావతికి అలాగే కోటింగ్ ఇస్తూ క్లాస్ పీకుతూనే ఉంటారు.

రోహిణిని బాలు అవమానిస్తూ మాట్లాడుతుంటే ప్రభావతి 'ఒరేయ్ అసలు రోహిణి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా? నీ బోడి 17 లక్షలు తన టీ, బిస్కెట్‌తో సమానం. నాలుగు రోజులు ఆగు తన గురించి తెలుస్తుంది. మొత్తం డబ్బంతా తీసుకు వస్తుంది. అమ్మా రోహిణి వీళ్లెంత? వీళ్ల బతుకెంత? అసలు వీళ్లతో మాటలు పడాల్సిన ఖర్మ తనకేంటి' అంటుంది. దీంతో రోహిణి భయపడిపోతుంది. అనంతరం ప్రభావతి 'డబ్బు మొత్తం టిప్పులా తీసుకు వచ్చి ఇచ్చేస్తుంది. అప్పుడు మీ కాకుల ముఠా అంతా దెబ్బకు ఠా అంటూ వెళ్లిపోతారు' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అనంతరం ప్రభావతి అన్న మాటలను గుర్తు చేసుకున్న బాలు 'మీనా చూశావా? ఈ ముగ్గురు కలిసి ఎంత ప్లాన్ చేశారో' అంటుంది. దీంతో మీనా 'మీరు ఎందుకు అంత చేశారు? పాపం పులి లాంటి ఆమెను బోనులో కూర్చోబెట్టారు కదా' అంటుంది. అలా ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా ప్రభావతి వస్తుంది. అప్పుడే బాలు 'అసలు మా అమ్మ అంత ధైర్యంగా డబ్బు ఎక్కడి నుంచి తెస్తానని చెప్పింది' అంటాడు. దీంతో మీనా 'రోహిణి వాళ్ల నాన్న మలేషియాలో ఉన్నారు కదా. ఆయనను అడుగుతారేమో' అంటుంది. అది విన్న ప్రభావతి మంచి ఐడియా అనుకుంటుంది.
ఆ వెంటనే ప్రభావతి.. రోహిణి దగ్గరకు వెళ్లి 'అమ్మా రోహిణి ఎలాగైనా ఆ గండం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. మీ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పి డబ్బులు అడుగు. కోట్లు సంపాదించిన వ్యక్తి లక్షలు ఇవ్వలేడా' అని అంటుంది. అప్పుడామె 'ముందు నువ్వు వెనుక గొయ్యిలా ఉంది. ఇప్పుడు నిజం తెలిస్తే నా పని అయిపోతుంది' అనుకుంటుంది. అప్పుడు ప్రభావతి 'నువ్వు మీ మావయ్యకు అయినా ఫోన్ చేసి అడుగు. లేదంటే ఈ మావయ్య నన్ను ఇంట్లో ఉండనివ్వరు' అంటుంది. దీంతో రోహిణి భయపడిపోతుంటుంది. కానీ ప్రభావతి మాటలకు ఓకే అంటుంది.

రోహిణి సాయం చేస్తానని అనగానే ప్రభావతి 'నాకు తెలుసమ్మా నువ్వు దేవతవు. నేను ఇప్పుడు నిశ్చింతగా నిద్రపోతాను' అంటూ వెళ్లిపోతుంది. అప్పుడు రోహిణి ఆలోచనలో పడుతుంది. ఆ వెంటనే తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చి విషయం చెప్తుంది. దీనికామె 'అసలు తప్పంతా నీదే. నువ్వే మలేషియా అంటూ బిల్డప్ ఇచ్చావు. అందుకే ఆమె ఇప్పుడు డబ్బు అడుగుతుంది. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు' అంటూ తిడుతుంది. అంతలోనే రోహిణికి వర్ధన్ ఫోన్ చేసి షాకిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











