Gunde Ninda Gudi Gantalu September 6th: 10 లక్షలు తెచ్చి షాకిచ్చిన రోహిణి.. వర్ధన్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్
చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
వడ్డీ వ్యాపారి దగ్గర పంచాయతీ జరిగిన తర్వాత రోహిణికి ఆ డబ్బును ప్రభావతి ఇచ్చిందన్న నిజం తెలుస్తుంది. అప్పుడు బాలు.. రోహిణిపై సెటైర్లు వేస్తూ మాట్లాడతాడు. రవి కూడా తమకు తేడాగా చూస్తుందని తల్లిని నిందిస్తాడు. అదే సమయంలో మీనా కూడా రోహిణి, ప్రభావతిని ఇంటి దొంగలు అంటుంది. అప్పుడు ప్రభావతి డబ్బు మొత్తం నాలుగు రోజుల్లో ఇచ్చేస్తామని అంటుంది. తర్వాత రోహిణి దగ్గరకు వెళ్లిన ప్రభావతి.. ఆ డబ్బును మలేషియాలోని మీ నాన్నను అడిగి తీసుకు రమ్మని అంటుంది. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతుంది.

శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో... వర్ధన్ తనకు ఫోన్ చేయడంతో రోహిణి మొదట షాకై తర్వాత అతడిపై సీరియస్ అవుతుంది. అప్పుడామె 'నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావని మా హస్బెండ్‌కు చెబితే నీ పని ఏమవుతుందో తెలుసా' అంటుంది. అప్పుడతను 'చెప్పు చెప్పు.. నేను కూడా నీ గురించి మొత్తం చెప్పేస్తాను. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నువ్వు నాకు నెల నెల శాలరీ పంపించడంతో పాటు ఆస్పత్రి బిల్ కూడా కట్టాలి. కడతావులే లేకపోతే ఈ రోహిణి కాస్త కల్యాణీ అయిపోతుంది కదా' అంటూ బెదిరించి కాల్ కట్ చేసేస్తాడు.
వర్ధన్‌తో మాట్లాడడం అయిపోయిన తర్వాత రోహిణి ఆమె ఫ్రెండ్ తిడుతుంది. అప్పుడామె 'వీడి గురించి వదిలెయ్. వీడో వేస్ట్ ఫెలో గాడు. ముందు మా అత్తయ్యకు ఇవ్వాల్సిన డబ్బు గురించి చెప్పు' అని అంటుంది. దీంతో ఆమె ఫ్రెండ్ ఇప్పుడు ఎవరూ డబ్బు ఇవ్వరు అని అంటుంది. అప్పుడు రోహిణి 'క్వీన్ పార్లర్ వాళ్లు ఫ్రాంచైజీ కోసం మన పార్లర్‌ను అడిగారు. వాళ్లకు దీన్ని అమ్మేసి డబ్బు తీసుకుందాం. మహా అయితే పార్లర్ పేరు మారుతుంది. అది మనం మేనేజ్ చేయొచ్చు. ఇలా ఇబ్బందులు పడడం కంటే ఇదే మంచి నిర్ణయం పదా వెళ్దాం' అంటుంది.

ప్రభావతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ సత్యం బాధపడుతుంటాడు. అప్పుడే మీనా ఆయన గురించి బాలుకు చెబుతుంది. దీంతో బాలు వెళ్లి 'నాన్న ఏంటిది రాత్రి నుంచి ఏమీ తినలేదని మీనా చెప్పింది. పస్తులుంటే పోయిన ఆస్తులు తిరిగి వస్తాయా? అమ్మ చేసిన పనికి నాకూ కోపం వస్తుంది. కానీ, ఆమె చెప్పింది కదా రోహిణితో డబ్బులు కట్టిస్తానని' అంటాడు. దీనికి సత్యం 'అంత డబ్బు వాళ్లు మాత్రం ఎక్కడి నుంచి తీసుకు వస్తారు' అంటాడు. దీంతో మీనా, బాలు ధైర్యం చెప్తారు. ముఖ్యంగా బాలు కష్టపడైనా డబ్బు కట్టేస్తా అని నమ్మకంగా చెబుతాడు.
బాలు మాటలకు సత్యం 'ఏంటోరా ఆ ఇంటి పత్రాలు వేరే వాళ్ల దగ్గర ఉంటే ఇల్లు నాది కాదు అనిపిస్తుంది' అంటాడు. దీంతో బాలు 'పత్రాలు వేరే వాళ్ల దగ్గర ఉంటే ఈ ఇల్లు మనది కాకుండా పోతుందా' అని ధైర్యం చెప్పి టిఫిన్ పెడతారు. మరోవైపు, రోహిణి పార్లర్ అమ్మడానికి వస్తుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ 'ఒక్కసారి ఆలోచించు. పార్లర్ పోతే మళ్లీ తిరిగి రాదు' అని అంటుంది. దీనికామె 'పరువు పోగొట్టుకోవడం కంటే ఇదే బెస్ట్. నేను ఎప్పుడు దొరుకుతానా అని ఆ బాలు వాళ్లు చూస్తున్నారు' అని చెప్తుంది. దీంతో ఆమె ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేస్తుంది.

రోహిణి వాళ్లు ఫ్రాంచైజీ కోసం వెళ్లినప్పుడు ఆమె 'మీ పార్లర్ డాక్యూమెంట్లు అన్నీ చూశాను. దీనికి నేను 12 లక్షలు మాత్రమే ఇవ్వగలను. అలాగే, మేము ప్రొడక్ట్స్ అన్నీ ఇస్తాము. మీరు శాలరీకి వర్క్ చేస్తారా' అని అడుగుతుంది. దీంతో రోహిణి ఫ్రెండ్ 'పార్లర్ ఓనర్‌ను శాలరీకి పని చేయమంటే ఎలా? పార్ట్‌నర్‌షిప్ ఇవ్వండి' అంటుంది. దీనికామె 'కొద్ది రోజులు చూద్దాం. ప్రాఫిట్స్ వస్తే షేర్ మాట్లాడుకుందాం' అంటుంది. దీంతో రోహిణి వాళ్లు సంతోషంగా వస్తారు. తర్వాత మీనా వల్లే తనకు ఈ గతి పట్టిందని, ఆమెను అస్సలు వదలనని మీనా తన ఫ్రెండ్‌తో అంటుంది.
అనంతరం రోహిణి ఇంటికి రావడంతో ప్రభావతి కంగారుగా మాట్లాడుతూ ఆమె పిలుస్తుంది. అప్పుడామె డబ్బు తీసుకు వచ్చానని ఇవ్వబోతుంది. దీంతో ప్రభావతి గదిలోకి తీసుకు వెళ్లి ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు రోహిణి పది లక్షలు చెక్ మాత్రమే ఇస్తుంది. దీంతో ఇంకో ఏడు లక్షలు అడుగుతుంది. కానీ, పార్లర్‌కు ఇంతే ఇచ్చారుగా అని బదులిస్తుంది. అప్పుడు ప్రభావతి 'మీ నాన్నగారికి చెప్పి ఇంకో ఏడు లక్షలు కూడా అడుగు. నీకు ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ ఇవ్వు నేను అడుగుతా' అంటుంది. దీంతో రోహిణి 'టైం చూసి నేనే అడుగుతా' అని కవర్ చేస్తుంది.

ప్రభావతి బయటకు రాగానే బాలు ఆమెను ఆపి కచ్చితంగా చెప్పిన సమయానికి డబ్బు ఇవ్వాలంటాడు. దీంతో ప్రభావతి టైంకే ఇచ్చేస్తానని అంటుంది. తర్వాత మీనా ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు అని అడగ్గా.. బాలు 'వీళ్లను ఇలా వదిలేస్తే డబ్బులన్నీ మింగేస్తారు. అసలే ఆ వడ్డీ వ్యాపారి మంచోడు కాదు' అని అంటాడు. ఇక, రోహిణి పార్లర్‌కు వచ్చి ఆమె ఫ్రెండ్‌తో మాట్లాడుతుంది. అది విన్న అక్కడ పని చేసే అమ్మాయి.. ఒక ఫైనాన్స్ కంపెనీ ఉందని, అక్కడ ఖాళీ బాండ్ మీద సైన్ చేసి ఇస్తే డబ్బు ఇస్తారని చెబుతుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











