Gunde Ninda Gudi Gantalu September 9th: రోహిణిని చూసిన శివ.. ప్రభావతికి సత్యం షాక్.. కథలో సూపర్ ట్విస్ట్

భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
వర్ధన్ తనకు ఫోన్ చేయడంతో రోహిణి మొదట షాకై తర్వాత అతడిపై సీరియస్ అవుతుంది. దీంతో అతడు ప్రతి నెలా తనకు డబ్బు పంపించాలని డిమాండ్ చేస్తాడు. అనంతరం ఇల్లు పోతుందని బాధలో ఉన్న సత్యానికి బాలు భరోసా కల్పిస్తాడు. ఎవరూ డబ్బు తీసుకు రాకపోతే ఆ అప్పు తాను తీరుస్తానని అంటాడు. తర్వాత రోహిణి తన బ్యూటీ పార్లర్‌ను అమ్మేసి పది లక్షల రూపాయలు తీసుకుంటుంది. వాటిని తీసుకొళ్లి ప్రభావతికి ఇస్తుంది. కానీ, ఆమె మాత్రం మరో ఏడు లక్షలు కూడా కావాలని తేల్చేస్తుంది. అప్పుడు రోహిణి అప్పు తీసుకోవాలని డిసైడ్ అవుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 9th

సోమవారం ఎపిసోడ్‌లో.. ప్రభావతి దగ్గర కొట్టేసిన డబ్బును మళ్లీ ఆమెకు ఇచ్చేస్తానని శివ అంటాడు. అప్పుడు అతడి ఫ్రెండ్ 'నువ్వు ఆ డబ్బు మళ్లీ ఆమెకు తీసుకు వెళ్లి ఇచ్చావంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అందుకే ఈ డబ్బు నా దగ్గరే ఉంచుకుంటా. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను. అప్పటి వరకూ వడ్డీ అయినా వస్తుంది' అంటాడు. దీంతో శివ ఓకే అంటూ వెళ్లబోతుంటాడు. అప్పుడు రోహిణి అక్కడకు వస్తుంటుంది. అది చూసిన శివ తన ఫ్రెండ్‌కు విషయం చెబుతాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న రూమ్ దగ్గర దాక్కుంటాడు.

అక్కడకు వచ్చిన రోహిణి రెండు లక్షల రూపాయలు అడుగుతుంది. దీంతో అతడు రూల్స్ అన్నీ చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటాడు. అంతేకాదు, డబ్బు కచ్చితంగా తిరిగి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత శివ అక్కడకు రావడంతో 'చూశావా? అత్తగారి దగ్గర కొట్టేసిన డబ్బును మళ్లీ ఆ ఇంటికే అప్పులా ఇచ్చాము. అత్తగారి డబ్బులకు కోడలు వడ్డీ కడుతుంది' అంటాడు. దీంతో శివ 'ఆ డబ్బు గురించి పక్కన పెడితే.. అసలు ఆమెకు అంత ఎక్కువ అమౌంట్ ఎందుకు? ఇప్పుడు ఎందుకు అప్పు చేసింది' అని ఆలోచనలో పడతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 9th

డబ్బు తీసుకున్న వెంటనే రోహిణి ఇంటికి వెళ్తుంది. అప్పుడామె బాలు బాలు అని గట్టిగా అరుస్తుంది. దీంతో అందరూ కంగారుగా కిందకు వస్తారు. అప్పుడు రోహిణి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం అక్కడ పెడుతుంది. దీంతో బాలు వాళ్లు ఏమైనా దొంగతనం చేశారా అని పేపర్‌లో చూస్తుంటాడు. దీనికి సీరియస్ అయిన రోహిణి 'ఈ డబ్బు కోసమే కదా మీరు అన్ని మాటలు అన్నారు. ఈ డబ్బు కోసమే కదా అత్తయ్యను అన్నన్ని మాటలు అన్నారు. ఈ డబ్బు కోసమే కదా అత్తయ్యను బోనులో నిలబెట్టారు' అంటుంది. దీంతో ఏం తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చావు అంటాడు.

ఆ తర్వాత ప్రభావతి 'అరేయ్ క్యాబ్ డ్రైవర్. చెప్పాను కదా దటీజ్ రోహిణి. ఈ డబ్బు రోహిణికి టీ, బిస్కెట్‌తో సమానం అని. నా సెలెక్షన్ అంటే ఇది. మీ ముద్దుల కోడలిని అడిగి చూడండి. పువ్వులు తప్ప డబ్బులు రాలవు' అంటుంది. అప్పుడు రవి, సుమతి 'వదిన తెచ్చింది గతంలో తీసుకున్నవే కదా. ఆమె సొంత డబ్బులు కాదు కదా' అంటారు. దీంతో ప్రభావతి 'మీ అందరికీ కుళ్లు. రోహిణి వాళ్ల నాన్న తలుచుకుంటే ఈ డబ్బు ఒక లెక్కా? అదే చేత్తో మనోజ్‌కు ఒక బిజినెస్ పెట్టించమన్నావంటే.. ఇక వాడు ఇంకో ఉద్యోగం వెతుక్కునే అవసరం లేదు' అంటుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 9th

మనోజ్ ఉద్యోగం గురించి ప్రభావతి నోరు జారడంతో అందరూ డౌట్‌గా చూస్తారు. అప్పుడామె కవర్ చేసుకుంటుంది. ఆ తర్వాత రోహిణి 'సారీ మావయ్య గారూ. ఈ డబ్బు అంతా అత్తయ్య గారు నాకోసమే తీసుకొచ్చారు. అందుకే ఈ డబ్బు ఇచ్చేసి మన ఇంటి కాగితాలు తెచ్చుకుందాం' అంటుంది. అప్పుడు ప్రభావతి 'ఇదంతా చేసింది మీనానే. ఆ బాలు గాడిని రెచ్చగొట్టి ఇంత గొడవ చేయించింది' అంటుంది. అప్పుడు రవి, సుమతి 'వదిన లేకపోతే నువ్వు ఆ జైల్లోనే ఉండేదానివి. తనే నిన్ను విడిపించింది' అనడంతో ప్రభావతి వాళ్లపై సీరియస్ అవుతుంది.

అనంతరం అందరూ ఆ డబ్బును తీసుకుని వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్తారు. అప్పుడాయన అసలు, వడ్డీ అంతా సరిపోయింది అంటాడు. దీనికి బాలు 'డబ్బు తీసుకునేటప్పుడు కూడా అందరినీ ఎందుకు రమ్మన్నారు అన్నా' అంటాడు. దీంతో ఆయన 'ఏం చేయమంటావు బాలు? మీ అమ్మను ఎలా నమ్మాలి. నేను ఇచ్చిన ఇంటి పత్రాలను తీసుకుని వేరే ఎక్కడైనా తాకట్టు పెట్టేస్తుందేమో. ఆ తర్వాత నేను వాటిని ఇవ్వలేదు అంటే ఏం చేయాలి' అంటాడు. దీంతో అతడిపై ప్రభావతి సీరియస్ అవుతుంది. అప్పుడాయన ఆమె పరువు తీసేలా మాట్లాడతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode September 9th

తర్వాత వడ్డీ వ్యాపారి 'పాపం మీ భార్య చూడబట్టి ఇదంతా మీకు తెలిసింది. నా డబ్బు నా చేతికి వచ్చింది. ఇకనైనా మీరు ఈమెను నమ్మకండి' అంటాడు. అప్పుడు బాలు 'అరెయ్.. ఆవిడ చేసిన దానికి ఇంకా పొగడనివ్వురా' అంటాడు. దీంతో ప్రభావతి వాళ్లపై కోప్పడగా.. సత్యం ఆమెను తిడతాడు. తర్వాత మనోజ్ పరువును కూడా వడ్డీ వ్యాపారి తీసేస్తాడు. తర్వాత అందరూ సంతకాలు చేయగా.. మీనాను కూడా చేయమని అడుగుతాడు. ప్రభావతి వద్దని అంటుంది. దీంతో ఆమెపై అందరూ సీరియస్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X