Gundeninda Gudigantalu: అయ్యో పాపం.. వీల్‌ చైర్‌లో మనోజ్‌.. షాకింగ్ ట్విస్ట్ ఇదేనా..?

Gunde Ninda Gudi Gantalu: స్టార్ మా (Star Maa)లో ప్రసారం అవుతున్న ప్రముఖ సీరియల్ "గుండె నిండా గుడి గంటలు" ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సీరియల్ లో మధ్యతరగతి కుటుంబ జీవితం, ఫ్యామిలీ ఎమోషన్స్, అత్త-కోడళ్ల గొడవలు, డబ్బు కోసం పడే కష్టాలను కళ్ళకు కట్టినట్లు దగ్గరగా చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఈ సిరీయల్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. టాప్ రేటింగ్ పొందుతున్న ఈ సీరియల్ లో ఇప్పుడు మరో కొత్త మలుపుతో చోటుచేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల మనోజ్ వీల్ చైర్ వీడియో ఇంటర్నెట్ మొత్తం దుమారం రేపుతోంది. దీంతో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు శుభం కార్డు పడబోతుందా? అనేది సందేహాలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ లో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతోన్న ఈ సీరియల్ లో తాజాగా విలన్ మనోజ్ కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది. నటుడు విష్ణుకాంత్ (బాలు) షేర్ చేసిన తాజా వీడియోలో.. మనోజ్ వీల్‌చైర్‌లో పక్షవాతం బారిన పడినట్టు కనిపించడంతో సీరియల్ అభిమానుల్లో ఆసక్తి, ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీడియోలో మనోజ్ పూర్తిగా కదలలేని స్థితిలో ఉంటే, పక్కనే అతని తల్లి ప్రభావతి కన్నీళ్లలో కరిగిపోతూ కనిపిస్తుంది. తన కొడుకు కోట్లు సంపాదిస్తాడని, తనను మహారాణిలా చూసుకుంటాడని ఎన్నో కలలు కన్నట్టు ఆవేదనతో చెప్తుంది ప్రభావతి. ఇంత చిన్న వయసులో పక్షవాతం బారిన పడటం చూస్తూ ఆమె విలపించే తీరు వీడియోలో మరింత భావోద్వేగాన్ని రేకెత్తించింది.

Gunde Ninda Gudi Gantalu Shocker Manoj Appears in Wheelchair Paralysis Twist Sparks Chaos Online

ఇంతలో సీన్‌లోకి బాలు, సత్యం, రవి వస్తారు. పరిస్థితిని గమనించిన బాలు "కోట్లు మింగిన వాడి మీద పక్షపాతం చూపిస్తే.. ఇలాంటి పక్షవాతాలే వస్తాయి" అంటూ షాకింగ్ కామెంట్ చేస్తాడు. దీనితో ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగిసిన ప్రభావతి "నువ్వు నోరు మూసుకో రా అక్కుపక్షి!" అంటూ బాలుపై అరుస్తుంది. ఇది గమనించిన సత్యం కూడా ఇక మౌనం వహించక, ప్రభావతిపై తన కోపాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. "నువ్వు ఎప్పుడూ వాడి తప్పులను సమర్థించుకుంటూ వచ్చావు.. కాబట్టి ఈరోజు వాడి నోరు పడిపోయింది. నీ నోరు కూడా పడిపోతే... ఇద్దరికీ సేవలు చేస్తూ బతకాలిసిందే!" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆ వీడియోలో హైలెట్ గా నిలిచింది.

గత రెండు రోజుల క్రితం కూడా విష్ణు కాంత్ (బాలు పాత్ర) గుడి నిండా గుడి గంటలు షూటింగ్ లొకేషన్ వీడియో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో కూడా మనోజ్‌ వీల్‌చైర్‌లో పక్షవాతం వచ్చిన వ్యక్తిలా కూర్చుని ఉంటాడు. ఈ వీడియోలో బాలు మాట్లాడుతూ "లక్షలు మింగినోడు... పార్క్‌లో పల్లీలు తినేవాడు... గుడి ముందు అడుక్కునేవాడు... ఇప్పుడు ఇలా అయిపోయాడు" అంటూ కామెడీ స్టైల్లో మనోజ్ ను పరిచయం చేస్తాడు. మరో హైలైట్.. పక్కన రవి (బాబీ) కూడా ఫన్నీ కామెంట్లు చేస్తూ ప్రేక్షకుల్ని నవ్వించాడు. దీంతో ఈ వీడియో నిజమైన ఎపిసోడ్‌లో భాగమా? లేక నటీనటుల ఫన్ వీడియోనా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో మరో వీడియో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో భారీ హంగామా ప్రారంభమైంది. నిజంగా మనోజ్‌కు పక్షవాతం వచ్చిందా? లేక ఇది మరో మోసం భాగమా? లేదా షూటింగ్ లొకేషన్‌లో చేసిన జస్ట్ ఫన్ వీడియోనా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల మనోజ్ చేసిన మోసాలు-సత్యం రిటైర్మెంట్ డబ్బులు ఎత్తుకెళ్లడం, తన గర్ల్ ఫ్రెండ్ కల్పన నుండి 45 లక్షలు కాచేయడం, బిజినెస్ పేరుతో రూ.4 లక్షలు పోగొట్టుకోవడం, ఆ లాస్ కవర్ చేయడాని మీనా బంగారాన్ని దొంగతనం చేసి.. అమ్మేయడం ఇలా అన్ని మోసాలు బయటపడినట్టు తెలుస్తోంది. దీంతో రోహిణి మనోజ్ ను విడిచిపెట్టి వెళ్లిపోవడం, ఆ బాధతో మనోజ్ పక్షపాతం బారిన పడినట్టు అర్థమవుతుంది.

ఈ సీరియల్ ఇప్పటికీ స్టార్ మా టాప్ TRP షోగా కొనసాగుతుండగా, ఈ తాజా ట్విస్ట్‌తో మరింత హైప్ ఏర్పడింది. రాబోయే ఎపిసోడ్లలో నిజంగానే మనోజ్‌కు ఈ స్థితి వస్తుందా? లేదా కేవలం షూటింగ్ లొకేషన్ ఫన్ వీడియో మాత్రమేనా? అన్న సమాధానాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. గుండె నిండా గుడి గంటల కథ ఇక్కడి నుంచి మరింత థ్రిల్లింగ్‌గా మారబోతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X