Gunde Ninda Gudi Gantalu: బయటపడ్డ మీనా బాగోతం.. మీనాపై చేయి చేసుకున్న బాలు
Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో రూపుదిద్దుకోవడంతో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంత కాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' నెక్స్ వీక్ ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రుతి కనిపించకపోవడంతో సురేంద్ర పోలీసులకు కంప్లీట్ ఇస్తాడు. అనుమానంతో సురేంద్ర .. సత్యం ఇంటికి వెళ్లి నానా హంగామా చేస్తాడు. ఇంతలోనే పోలీసులు ఎంటర్ అయి.. స్టేట్ మెంట్ పేరిట సత్యం నుంచి అదుపులోకి తీసుకుంటారు. కానీ, పోలీసులు ప్లేట్ మార్చుతారు. శృతి దొరికేంతవరకు విడిచి పెట్టేది లేదంటూ తేల్చి చెప్పుతారు. సత్యం ను పోలీసులు అరెస్టు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతుంది ప్రభావతి. తండ్రి అరెస్ట్ అయినా.. తనకు ఏమి పట్టనట్లుగా తనకు సంబంధం లేనట్టుగా మనోజ్ వ్యవహరించడంతో ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

సోమవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో.. మీనా పోలీస్ స్టేషన్ కు చేరుకుంటుంది. తన మామయ్య దగ్గరికి వెళ్లి అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో రవి, శ్రుతిల పెళ్లి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ, తెలిస్తే ఎలా తన అత్తమామలు ఎలా రియాక్ట్ అవుతారో అనే సందేహంతో అసలు విషయం చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది. ఇంతలోనే ఎస్సై వచ్చి నువ్వు ఎవరమ్మా? అంటూ మీనాను ప్రశ్నిస్తాడు. తాను సత్యం గారి కోడలు అంటూ తన మమా గురించి చెప్పుకోస్తుంది.
'నేను కాపురానికి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్కరికి అపకారం చేయలేదు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు' ఆవేదన వ్యక్తం చేస్తుంది మీనా. కానీ, ఆ ఎస్సై మాత్రం తనకు ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదనీ, శ్రుతిని కిడ్నాప్ చేయించింది. మీ మామయ్యనే అంటు నానా నిందలు వేస్తారు. దీంతో ఆయన కిడ్నాప్ చేయించలేదని చెప్పుతుంది మీనా. అంటే.. ఏం చేశాడు మరీ అని ఎస్సై తిరిగి ప్రశ్నిస్తాడు. రవి అలాంటి వాడు కాదని, అందుకే అలా సమాధానం చెప్పానని అంటుంది.
ఇంతలోనే శ్రుతి తల్లి శోభన కూడా పోలీసు స్టేషన్ కు చేరుకుంటారు. తన కూతురు కనిపించకపోతే.. అందర్ని జైల్లో వేస్తా అంటూ ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది. ముగ్గురు రౌడీ కొడులను కని రోడ్డుపై పడేశావ్ గా అంటూ ఇష్టవచ్చినట్టు తిడుతుంది. ఇంతలో సురేంద్ర వచ్చి ఇక్కడ ఏం అల్లరి చేయకు పోలీసులే అంతా చూసుకుంటారని శోభన ఆపుతాడు. పింఛన్ డబ్బులు ఆపారని కోపంలో తన కూతురు కిడ్నాప్ చేయించారని,తన కూతురికి మంచి సంబంధం కుదిరిందని శోభన ఎస్సై తో చెబుతుంది.
మరోవైపు మీనా.. తన చెల్లెలు సుమతిని ఫోన్ చేసి.. శృతి, రవిలకు గురించి ఏమైనా తెలిసిందా అని ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా నిజం చెప్పు..
నీకు తెలిస్తే నువ్వైనా చెప్పు అని ప్రశ్నిస్తుంది. తనకు ఏం తెలియదని సమాధానం చెప్పుతోంది. ఇంతలో బాలు కూడా పోలీసు స్టేషన్ కు వస్తాడు. నాన్న ఎక్కడున్నాడు అని మీనాను ప్రశ్నించగా.. లాక్ అప్ వేశారని చెబుతోంది. ఆగ్రహంతో పోలీసు స్టేషన్ లోకి వెళ్లాడు.'నాన్న.. నేను వచ్చేశాను. నీకు ఏం కాదు' అంటూ లాక్ అప్ డోర్ తీయాలని ప్రయత్నిస్తాడు.
ఇంతలో ఎస్సై వచ్చి.. హాలో హాలో ఏం చేస్తున్నావ్? అంటూ ప్రశ్నిస్తారు. తన నాన్నను ఎందుకు అరెస్టు చేశారని బాలు అడుగుతాడు. మీ నాన్న, మీ తమ్ముడు రవి కలిసి ఓ ఆడపిల్లను కిడ్నాప్ చేయించారనీ, అందుకే లాక్ అప్ లో వేశామని సమాధానం ఇస్తాడు ఎస్ ఐ. రవికి ఫోన్ చేయ్.. అసలు విషయం తెలుసుందని మీనా అనగా.. రవి ఫోన్ లిప్ట్ చేయకపోవడంతోనే నాన్న పోలీసు స్టేషన్ లో పెట్టారని మనోజ్ చెప్పుతాడు.
ఇంతలో శ్రుతి, రవి ల కేసు విచారణలో భాగంగా గుడికి వెళ్లి ఎంక్వయిరీ చేస్తారు కానిస్టేబుల్. ఈ క్రమంలో వారికి షాకింగ్ విషయం తెలుస్తోంది. రవి, శ్రుతిలు గుళ్లో పెళ్లి చేసుకున్నారనే విషయం వారి విచారణలో తెలుస్తోంది. వెంటనే స్టైషన్ కు వచ్చి.. రవి, శ్రుతిల పెళ్లి విషయం ఎస్సైకి చెప్పుతారు కానిస్టేబుల్స్. ఈ విషయం తెలియగానే.. అటు ప్రభావతి కుటుంబం, ఇటు సురేంద్ర కుటుంబం కూడా షాక్ అవుతోంది.
అదే కాదు.. మరో విషయం కూడా తెలిసిందని సాక్షుల వివరాలను కూడా ఎస్పైకి చూపిస్తారు. ఈ విషయాలను పరిశీలించి.. ఇంతకీ మీనా ఎవరని ప్రశ్నిస్తాడు ఎస్సై. వెంటనే బాలు రిప్లే ఇస్తూ..మీనా తన భార్య అని బదులిస్తాడు. ఆమెనే ముందుండి పెళ్లి చేయించి.. సాక్షిగా సంతకం కూడా పెట్టిండంటూ చూపిస్తాడు ఎసై. దీంతో మీనా వ్యవహారం బయటపడుతోంది. మిగితా కుటుంబ సభ్యులు కూడా షాక్ అవుతారు. ఇలా ఎందుకు చేశావ్? నీకు ధైర్యం ఎలా వచ్చింది అంటూ మీనాను నిలదీస్తారు.
నిజంగా నువ్వే దగ్గరుండి పెళ్లి చేయించావా? అని బాలు ప్రశ్నించగా.. అవును అని సమాధానమిస్తుంది. దీంతో ఆగ్రహానికి లోనైనా బాలు .. మీనాపై చెయి చేసుకుంటాడు. తన నమ్మించి మోసం చేశావ్ అని, తన కుటుంబ పరువు తీశావ్ అని తన కండ్ల ముందును వెళ్లిపోయాలని వార్నింగ్ ఇస్తాడు బాలు. మరో వైపు ..ఎస్సై సురేంద్రను పిలిచి.. తనకు అసలు విషయం ఎందుకు చెప్పలేదనీ, వారిద్దరూ పెళ్లి చేసుకుంటే.. తాను ఏమి చేయలేననీ, అనవసరంగా..సత్యంపై కేసు నమోదు చేశామని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.


Click it and Unblock the Notifications











