Gunde Ninda Gudi Gantalu: కొడుకు చేసిన తప్పుకు తండ్రికి శిక్ష.. మీనాను గెంటేసిన బాలు..

Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో రూపుదిద్దుకోవడంతో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంత కాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' మంగళవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ లో తన కూతురు ఆచూకీ ఎలాగైనా కనిపెట్టాలనీ, కావాలనే సత్యం,రవి డ్రామా చేస్తున్నారు పోలీసులకు చెబుతాడు. పోలీసుల ఎంక్వైరీలో రవి,శ్రుతిల పెళ్లి విషయం తెలిసిపోతుంది. పైగా.. ఆ పెళ్లికి పెద్దగా మీనా సంతకం పెట్టిందని తెలియడంతో బాలు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఈ క్రమంలో ప్రభావతి, తన కుటుంబ సభ్యులంతా.. మోసం చేసిందని, తమ కుటుంబ పరువును రోడ్డు కిడ్చిందని మీనాను తిట్టడం ప్రారంభిస్తారు.

Gunde Ninda Gudi Gantalu today serial episode 271 october 15th 2024 here is full story

మంగళవారం ఎపిసోడ్ లో సురేంద్ర తన కూతురు శృతి పెళ్లి విషయం తెలిసి కంగారు పడుతాడు. ఎలాగైనా తన కూతుర్నీ తీసుకురావాలని, తన కోసం ఏమైనా చేస్తానని పోలీసులకు చెప్పాడు. మీరు చెప్పారని ఇలాంటి తప్పు చేయని సత్యంను అరెస్టు చేసి లాకప్ లో వేసామని, అయినా.. వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటే.. తాను ఏమి చేయలేదని ఎస్సై చెప్తాడు. దీంతో సురేంద్ర వెంటనే రియాక్ట్ అయి నీవల్ల కాకపోతే తాను కమిషనర్ దగ్గరికి వెళ్తానని ఎస్ఐకి వార్నింగ్ ఇస్తాడు. ఎలాగైనా తన కూతుర్ని వెతికి తీసుకురమ్మని తనకు ఎంత డబ్బైనా ఇస్తానని చెప్తాడు.

మరోవైపు.. రవిని తీసుకుని శృతి తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్తుంది. తాను ఎన్నో రోజులుగా కలగంటున్నా కల నేడు నిజమైందని, తాను నేడు ఎంతో సంతోషంగా ఉన్నానని, ఈరోజు ప్రపంచాన్ని తనకు జయించినట్టు అనిపిస్తుందని శృతి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. కానీ, రవి మాత్రం తన కుటుంబ సభ్యుల గురించి.. ముఖ్యంగా తన వదిన మీనా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో రవిని శృతి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తుంది.

తనకంటే.. తన కుటుంబం కావాలంటే.. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని, తాను కూడా తాళి పడేస్తానని, ఓ ఫేమ్ లో భద్రపరుచుకుంటానని వార్నింగ్ ఇస్తుంది. తాను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంటే.. నీ ముఖంలో కాస్త సంతోషం కూడా లేదేంటీ? పెళ్లి ఇష్టం లేదా? అంటూ రవిని ప్రశ్నిస్తుంది శృతి. సమస్యలు పక్కన పెట్టని, వాళ్ల గురించి ఆలోచించకుండా ఈ రోజు ఎంజాయ్ చేద్దామంటూ..రవి మీద పడుతోంది శ్రుతి. కానీ, రవి మాత్రం ఇంట్లో వారికి ఫోన్ చేయాలా? వద్దా? అంటూ ఆలోచనలో పడుతాడు.

మరోవైపు.. మీరు ఏం చేస్తారని తన తండ్రిని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు? అంటూ బాలు ప్రశ్నిస్తారు. అమాయకులపై, వయస్సు మీద పడిన వారిపై కేసు పెట్టడం కాదనీ, రవి వెతకండి. కావాలంటే.. నేను జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నాననీ, తన తండ్రిని విడిచిపెట్టమని బాలు రిక్వెస్ట్ చేస్తాడు. అయినా.. కొడుకు చేసిన తప్పుకు తండ్రికి శిక్ష వేయడమేంటని ప్రశ్నించాడు రవి. దీంతో ఎస్సై రవిని తీసుకువచ్చి తన తండ్రిని తీసుకు వెళ్ళమని అంటాడు. మరి మీరేం చేస్తారు సార్ అంటూ ఎస్సై నీ ఎదురు ప్రశ్నిస్తాడు. ఎక్కువ మాట్లాడితే.. తనని కూడా జైల్లో వేస్తానంటే వార్నింగ్ ఇస్తాడు.

నువ్వు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావ్ కాబట్టి తనకు కావాలంటే.. అన్నం మెడిసిన్ ఉంటే తీసుకొచ్చి పెట్టమని, కానీ శృతి రవి దొరికేంత వరకు విడిచి పెట్టే లేదంటే తేల్చి చెప్తాడు ఎస్సై. ఈ క్రమంలో మీనా తాను మామయ్యకు అన్నం తెస్తానంటూ వెళ్తుంది. దీంతో వెంటనే బాలు రియాక్ట్ అయ్యి.. తన ముందు మరోసారి కనిపిస్తే.. చంపేస్తానంటూ మీనాకు వార్నింగ్ ఇస్తారు బాలు. తన కుటుంబానికి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వేంటో మీనా పై మండిపడతాడు. తన కళ్ల ముందు కపించవద్దంటూ మీనాను గెంటేవేస్తాడు బాలు.

ఇలాగేనా తన మామను వినిపించారని ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి.. తన మామను విడిచి పెట్టడానికి తాను ఎంత డబ్బైనా ఇస్తానని, దయచేసి తన మామయ్యను విడిచి పెట్టాలని వేడుకుంటుంది. ఈ కేసులో పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అయ్యారని పెళ్లి చేసుకున్న వాళ్ళు వచ్చి తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని చెబితే .. తప్ప మీ మామయ్య బయటకు రాలేదని కానిస్టేబుల్ పేరు చెప్తారు. దీంతో ఎలాగైనా శృతి రవిల ఆచూకీ తెలుసుకోవాలని మీనా ప్రయత్నిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X