Gunde Ninda Gudi Gantalu: రవి ఆచూకి తెలుసుకున్న మీనా.. శ్రుతి కనిపించకపోవడంతో నీలకంఠం ఎంట్రీ..
Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో రూపుదిద్దుకోవడంతో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంత కాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో శ్రుతిని ఎలాగైనా తీసుకురావాలని పోలీసులకు సురేంద్ర చెప్పుతాడు. అవసరమైతే ఎంత డబ్బు అయినా ఇస్తానని చెబుతాడు. పెళ్లికి పెద్దగా మీనా సంతకం పెట్టిందని తెలియడంతో ప్రభావతి, తన కుటుంబ సభ్యులంతా.. మోసం చేసిందని, తమ కుటుంబ పరువును రోడ్డు కిడ్చిందని మీనాను తిట్టడం ప్రారంభిస్తారు. మరోవైపు రవిని శృతి తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్తుంది. తాను ఎన్నో రోజులుగా కలగంటున్నా కల నేడు నిజమైందని సంతోషంగా ఉంటుంది. కానీ, రవి మాత్రం తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాగేనా తన తండ్రిని విడిపించాలని బాలు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.

బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో బాలు తన తండ్రిని విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మొదట రవి ఆచూకి తెలుసుకోవాలనీ, తన ఫ్రెండ్స్ సహయం అడుగుతాడు. అవసరమైతే.. టాక్సీ డైవర్స్ అందర్ని తీసుకెళ్లమని చెప్పుతాడు. మరోవైపు.. అనుకున్న కల నేరవేరడంతో శ్రుతి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. తన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చినట్టు బతకవచ్చని రవితో చెప్పుతుంది. కానీ, రవి మాత్రం తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు. ఒకసారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతానని శ్రుతికి చెబుతాడు. దీంతో శ్రుతి కోపంతో .. నువ్ ఫోన్ చేస్తే.. మనం ఎక్కడ ఉన్నామో తెలిసిపోతుందని, మన ప్రాణాలే ప్రమాదమని చెబుతుంది. దీంతో రవి సైలెంట్ అయిపోతాడు.
మరోవైపు.. బాలు తన తండ్రికి టిపిన్ తీసుకవస్తాడు. అది చూసిన కానిస్టేబుల్ .. 'ఇది ఇల్లు అనుకున్నావా.. ఓ హోటల్ అనుకున్నావా?. నీకు అర్థం అవుతుందా? లేదా?' అంటూ రష్ గా మాట్లాడుతాడు. దీంతో బాలుకు కోపం వస్తుంది. 'ఇది కేసే కాదు.. ఓ కొడుకు చేసిన తప్పుకు తండ్రిని జైలులో వేయడమేంటీ? అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రపంచంలో తన తండ్రి తప్ప మరెవ్వరూ ముఖ్యం కాదనీ, ఆయనకు ఏమైనా జరిగితే తాను చూసుకుంటూ ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు బాలు. ఆయన ఎంతగా కుమిలిపోతారో తెలుసా? నేను ఎస్సై తో మాట్లాడుతాననీ చెబుతాడు బాలు.
తన తండ్రికి అన్నం తినిపించడానికి బాలు ప్రయత్నిస్తాడు. కానీ, నాకు వద్దంటూ సత్యం గట్టిగా అరుస్తాడు. ప్రభావతి కూడా తాను తిననని, తన భర్త పస్తువులంటే ..తాను కూడా పస్తుల ఉంటానని ఏడుస్తుంది. మనోజ్ కూడా తిననని తన తండ్రి పరిస్థితి చూసి బాధపడతాడు. దీంతో తీసుకోవచ్చిన టిఫిన్ ను బయట పడేస్తాడు. అక్కడ మరోసారి మీనా అడుపడుతుంది. ' నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావ్? ఏం మొకం పెట్టుకుని మాట్లాడుతున్నావ్. చనిపోయే దాక ముఖం చూపించకు' అంటూ మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు.
ఈ క్రమంలో.. రవి పెళ్లికి వచ్చిన శృతి ఫ్రెండ్ మృదుల గుర్తుకు వస్తుంది మీనాకు. తన ఇంటికి వెళ్తే ఏదైనా సమాచారం తెలుస్తుందని భావిస్తుంది. అనుకున్నది తడవుగా వెంటనే మృదుల ఇంటికి వెళుతుంది మీనా. రాత్రి వేళ మీనా తన ఇంటికి రావడంతో మృదుల కాస్త కంగారు పడుతుంది. శృతి, రవి ఇక్కడికి వెళ్లారని తన ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉందని, తన ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్లో ఉందనీ, శృతి, రవి లు వచ్చేంత వరకు తన మామయ్య విడిచి పెట్టాలని బాధపడుతుంది.
తనని ఇంట్లో నుంచి గేంటేశారనీ, రవి వచ్చి నిజం చెప్పకపోతే తన కాపురం నిలబడుతుందనీ, లేదంటే సర్వనాశనం అవుతూందని భాదపడుతోంది. దీంతో మృదుల..పరిస్థితిని అర్థం చేసుకుని, రవి శృతి తన ఫ్రెండ్ కీర్తి గెస్ట్ హౌస్ లో ఉన్నారని, ఈ విషయం తాను చెప్పినట్లు ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుంటుంది మృదుల. నిజం చెప్పినందుకు మీనా కూడా తనకు థ్యాంకు చెప్పి వెళ్లిపోతుంది.
మరోవైపు నీలకంఠ తన కొడుకు సంజు పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంటాడు. ఈ క్రమంలో సంజు ఏదో టెన్షన్ లో ఉండడాన్ని గమనించి, ఏమైందని ప్రశ్నిస్తారు నీలకంఠం. తొలుత జరిగే విషయాన్ని చెప్పడానికి సంశయిస్తాడు. కానీ, సంజీవ్ పరిస్థితిని అర్థం చేసుకున్న నీలకంఠం ఏం జరిగిందో చెప్పాలని గట్టిగా ప్రశ్నిస్తారు. పెళ్లికి ముందు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ..'పెళ్లి జరుగుతే కదా.. పెళ్లికూతురు లేనప్పుడు పెళ్లి ఎలా జరుగుతుంది' అని అసలు విషయం బయటపడపెడుతాడు. మరి నీలకంఠ ఏం చేస్తాడో.. రవి,శ్రుతిలు ఇంటికి వస్తాడో లేదా? వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











