Gunde Ninda Gudi Gantalu october 17th Episode: రవిని చావబాదిన బాలు.. సత్యం విడుదల.. రోడ్డున పడ్డ మీనా!

Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వాటిలో సీరియల్స్ మెయిన్. ఈ సీరియల్లకు మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్న సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలా టాప్ రేటింగ్ తో సాగుతున్న సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. ఈ సీరియల్‌ గత కొంత కాలంగా ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' నేడు (గురువారం) ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో బాలు తన తండ్రిని జైలు నుంచి విడిపించుకోవాలని నానా విధాలుగా ప్రయత్నిస్తాడు. అలాగే.. తన తమ్ముడు రవి ఆచూకి తెలుసుకోవడానికి తన ఫ్రెండ్స్ సహయం కోరుతారు. మరోవైపు రవి మాత్రం తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు. ఒకసారి ఇంటికి ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని భావిస్తాడు. కానీ,శ్రుతి మాత్రం మన ప్రాణాలే ప్రమాదం వస్తుందనీ, ఫోన్ చేయొద్దని చెబుతుంది. మరోవైపు మీనా పరిస్థితి దారుణంగా మారుతోంది. చనిపోయే దాక ముఖం చూపించకు' అంటూ మీనాకు గెంటేస్తాడు బాలు. ఎలాగైనా రవి ఆచూకీ తెలుసుకోవాలని శృతి ఫ్రెండ్ మృదుల రిక్వెస్ట్ చేస్తోంది మీనా.

Gunde Ninda Gudi Gantalu today serial episode 273 october 17 th 2024 here is full story

ఇక ఈ రోజు (గురువారం)ఎపిసోడ్ లో.. నీలకంఠ తన కొడుకు సంజూను అసలేం జరిగింది. ఎందుకు అలా ఉన్నావ్? ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ ? అంటూ ప్రశ్నిస్తాడు. ఈ పెళ్లి జరగదు నాన్నఅని సంజూ అనడంతో .. ' ఏం మాట్లాడుతున్నావ్ రా.. పెళ్లి ఎందుకు జరగదు రా? అని నీలకంఠం ప్రశ్నిస్తారు. శ్రుతి పారిపోయిందని సమాధానమిస్తాడు. వెంటనే నీలకంఠం సురేంద్రకు ఫోన్ చేస్తాడు. 'నీలకంఠ ఫోన్ చేశాడంటే విషయం తెలిసిపోయిందా ? లేదా? ఇంకా ఏదైనా విషయమా? అని భయంతో సురేంద్ర ఫోన్ చేయడు. 'ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా.. నీలకంఠ కొడుకుని ఒక అమ్మాయి పిచ్చోన్ని చేసింది' అంటూ సంజూ బాధపడుతాడు. తన కొడుకు బాధచూడలేక నీలకంఠం తన గుండాలతో శ్రుతిని వెతికి తీసుకరండి అని పురమాయిస్తాడు.

మరోవైపు.. రవి తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు. ఈ క్రమంలో 'నువ్వైనా.. ప్రయోజకుడవై.. మీ నాన్న మాట వింటావని ఎంతో ఆశపడ్డారు' అన్న తన వదిన మాటలు రవికి గుర్తుకు వస్తాయి. వదిన ఎలా ఉందో.. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో? అంటూ తాను ఇంటికి వెళ్లి పరిస్థితి తెలుసుకుంటానని శ్రుతికి చెబుతాడు. కానీ..వద్దంటూ రిక్వెస్ట్ చేస్తుంది. మనల్నీ ఎందుకు విడదీస్తారు. నాకిలా దాక్కుని ఉండటం నచ్చట్లేదు అంటూ శ్రుతికి తెగేసి చెబుతాడు రవి.

Gunde Ninda Gudi Gantalu today serial episode 273 october 17 th 2024 here is full story

'బయటకు వెళితే .. మన ప్రాణాలకే ప్రమాదం. అందుకే చెప్తున్నాను. అందరూ ఈ విషయాన్ని మర్చిపోయే వరకు మనం ఎక్కడికి వెళ్ళదు ప్లీజ్' అంటూ శ్రుతి ప్రాధేయపడుతుంది. 'నా వల్ల కావట్లేదు. నేను వెళ్లాను. నువ్వు జాగ్రత్త.'అంటూ ఇంటికి వెళ్లడానికి సిద్దమవుతాడు. సరిగ్గా రవి డోర్ దగ్గరికి వెళ్లాగా.. కాలింగ్ బెల్ మోగుతుంది. దీంతో రవి,శ్రుతిలు ఇద్దరూ కంగరూ పడుతారు.' ఈ టైంలో ఎవరై ఉంటారు' అని టెన్షన్ పడుతుంటారు. 'నేను చూసుకుంటాను ' అంటూ రవి డోర్ ఓపెన్ చేయగానే.. మీనా కనిపిస్తుంది. దీంతో రవి,శ్రుతిలు షాక్ అవుతారు.

'ఇక్కడికి ఎలా వచ్చారు వదిన..' అని రవి ప్రశ్నిస్తాడు.దీంతో మీనా..'ఇక్కడికి రాలేను అనుకున్నారా' అని తిరిగి ప్రశ్నిస్తుంది. ఇంట్లో పరిస్థితి బాలేదని చేయని, నువ్ చేసిన తప్పుకు ఇంట్లో వారందరూ బాధపడుతున్నారు. నీకోసం మన ఇంట్లో అందరితో పోరాడను. నీ పెళ్లి నా చేతులతో చేయాలని ఆశపడ్డాను. నాతో అబద్ధం చెప్పి నన్ను గుడికి తీసుకెళ్లి నాతోనే సంతకాలు పెట్టించావ్?' అని మీనా ఏడుస్తుంది.

ఎందుకు ఏడిపిస్తున్నావు వదిన అని ప్రశ్నించగా.. నేననేందుకు ఏడుస్తాను. నువ్వే ఏడుస్తున్నావ్.. మీ నాన్నను సెల్ లో వేశారు. కుటుంబ మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉంది. అని చెప్పగానే రవి, శ్రుతి షాక్ అవుతారు. 'మనం గుడికి వెళ్లే .. ముందు కూడా ఆయన నోటితో నీకు అంతా శుభం జరగాలని కోరుకున్నారు కదా.. ఆ సమయంలోనైనా చెప్పాలని అనిపించలేదా? అని రవిని ప్రశ్నిస్తోంది మీనా. పెళ్లికి ఒప్పుకోలేదని కన్న తండ్రి మీద ఎవరైనా పగ తీర్చుకుంటారా? అని నిలదీస్తుంది.

దీంతో రవి'ఎంత జరుగుతుందని అసలు ఊహించలేదు వదిన'అని మీనా కాళ్లపై పడి ఏడుస్తాడు. తాను వచ్చిన తన తండ్రిని విడిపిస్తాననీ హామీ ఇస్తాడు. శ్రుతి తొలుత వద్దన్న.. తరువాత పరిస్థితి అర్థం చేసుకుని తాను కూడా వస్తాననీ పోలీసు స్టేషన్ కు బయలు దేరుతారు. మరోవైపు.. మీనా కోసం బాలు చెల్లెలు వెతుకుతుంది. వదిన లేదేంటి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ప్రశ్నించగా.. తన తల్లి దగ్గరకు వెళ్లి ఉంటుందని ప్రభావతి ఇష్టవచ్చినట్టు నోరుపారేసుకుంటుంది. బాలు మాత్రం ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తాడు. రవి దొరికితే..చింపేయాలన్న కోపంతో ఉంటాడు బాలు.

Gunde Ninda Gudi Gantalu today serial episode 273 october 17 th 2024 here is full story

ఇంతలో మీనా.. రవి,శ్రుతిలను తీసుకుని పోలీసు స్టేషన్ చేరుకుంటుంది. వారిని చూసి ప్రభావతి కుటుంబం షాక్ అవుతోంది. బాలు మాత్రం .. రవిని చూడగానే పట్టరాని కోపంతో చితకబాదుతాడు. ఇష్టం వచ్చినట్టు కొడుతాడు. అడ్డపడిన శ్రుతిని సైతం బెదిరిస్తాడు. పోలీసులే కలుగచేసుకుని బాలు, రవిలను వీడిపిస్తారు. ఈ క్రమంలో ప్రభావతి.. మీనాను టార్గెట్ చేస్తూ.. 'మీరేం బాగుపడతారా' అంటూ ఇష్టం వచ్చినట్టు తిడుతుంది.

పోలీసులు సమాచారం ఇవ్వడంతో సురేంద్ర,శోభన కూడా పోలీసు స్టేషన్ కు చేరుకుంటారు. రావడం రావడంతోనే శ్రుతి చెంప పగలకొడుతోంది శోభన. సురేంద్ర రవి, సత్యంను టార్గెట్ చేస్తూ.. 'నిన్ను అమాయకురాలు చేసి మోసం చేసి.. వీడు బలవంతంగా తీసుకెళ్లాడు కదా.. వీడు సంగతి పోలీసులు చూసుకుంటారు.ఇలా డబ్బున్న వాళ్ళ పిల్లలకు వల వేసి బలవంతంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. రవి, సత్యంపై కేసు నమోదు చేయండి' అంటూ ఎస్సైకి చెబుతాడు సురేంద్ర.

'నీ కూతుర్ని తీసుకెళ్ళింది వాడు. రవి గాడు. మా నాన్నకు ఎలాంటి సంబంధం లేదు' అని బాలు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.'మీతమ్ముడిని మీ నాన్నని వదిలే ప్రసక్తే లేదు. నా కూతుర్ని కిడ్నాప్ చేసినందుకు.. మీ నాన్న రవి మీద కేసు పెట్టండి' అంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు సురేంద్ర. దీంతో బాలుకు కోపం మరింత ఎక్కువ అవుతుంది.' రవి గాడితో మాకు సంబంధం లేదు. మీ కూతుర్ని కావాలని పెళ్లి చేసుకున్నాడో.. మీ కుతూరే మా వాడితో వచ్చింది మీరే తేల్చుకోండి' అని బాలు తెగేసి చెబుతాడు.

ఈ క్రమంలో శ్రుతి మాట్లాడుతూ.. 'ఎందుకు ఇలా చేస్తారు నాన్న. నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నీకు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతావా? అయినా నన్న కిడ్నాప్ చేశారని ఎవరు చెప్పారు ఎస్సై గారు. నా ఇష్టంతోనే రవిని పెళ్లి చేసుకున్నా.. ఇప్పుడూ..మమల్నీ కావాలని నా తల్లిదండ్రులే వీడదీస్తున్నారు. మాకు రక్షణ కావాలి' అని శ్రుతి ఎస్సైకి ఫిర్యాదు చేస్తోంది. దీంతో సురేంద్ర ఏం చేస్తాడో.. తరువాత ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X