Gunde Ninda Gudi Gantalu october 18th Episode: చేయని తప్పుకు శిక్ష.. మీనాను ఇంట్లో నుంచి గెంటేసిన ప్రభావతి..
Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వాటిలో సీరియల్స్ మెయిన్. ఈ సీరియల్లకు మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్న సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలా టాప్ రేటింగ్ తో సాగుతున్న సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. ఈ సీరియల్ గత కొంత కాలంగా ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' నేడు (శుక్రవారం) ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో సురేంద్ర ఫోన్ లిప్ట్ చేయడంతో నీలకంఠ ఆగ్రహానికి లోనవుతాడు. శ్రుతి ఎక్కడ ఉన్న తీసుకురావాలని తన గుండాలను పంపిస్తాడు. మరోవైపు.. రవి,శ్రుతిలను వెతుకుంటూ వారు ఉండే గెస్ట్ హౌస్ వస్తుంది. జరిగిన విషయం అంతా చెప్పి వారిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తుంది. రవి చూడగానే బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇష్ట వచ్చినట్టు కొడుతాడు. ఇంతలో సురేంద్ర కూడా పోలీసు స్టేషన్ కు చేరుకుంటాడు. తన కూతురు కిడ్నాప్ చూసినందుకు రవి, సత్యంపై కేసు పెట్టాలని పోలీసులకు చెప్పగా.. నన్ను కిడ్నాప్ చేశారని ఏవరు చెప్పారు. తనకు రవితో పెళ్లి అయింది. తనకు తన తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలని కోరుతుంది శ్రుతి.

ఇక ఈ రోజు (శుక్రవారం)ఎపిసోడ్ లో.. 'నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతావా' అంటూ తన తండ్రిపై గట్టిగా అరుస్తుంది శృతి. దీంతో శోభన వెంటనే రియాక్ట్ అవుతూ.. 'నీకేం తెలియదు నువ్వు ఊరుకో సైలెంట్ గా ఉండు, ఫస్ట్ నువ్వు ఇకనుండి బయటకు నడువ్'అంటూ వార్నింగ్ ఇస్తుంది శోభన. దీంతో శృతి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'ఎస్ఐ గారు.. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా.. ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను బలవంతం చేస్తున్నారు. మాకు రక్షణ కావాలి'
అంటూ పోలీసులను కోరుతుంది.
దీంతో శ్రుతి తల్లిదండ్రులు షాక్ అవుతారు. సురేంద్ర అయితే దండం పెడతా అంటూ .. 'మా అమ్మాయి బెదిరించి ఇలా మాట్లాడిస్తున్నారు.
అందరూ కలిసి నా కూతురు బెదిరించి ఈ పెళ్లి చేశారు. ఈ పెళ్లి చెల్లదు, ఆ తాళి తీసి రా..' అంటూ శృతిని వేడుకుంటాడు. మరోవైపు సత్యం ఫ్యామిలీపై కేసు పెట్టాలని బెదిరిస్తాడు. దీంతో బాలు రియాక్ట్ అయి..' మీరు మీరు ఏమైనా చేసుకోండి. కానీ, నా తండ్రిని మాత్రం విడిచి పెట్టండి' అంటూ పోలీసులను కోరుతాడు. శృతి కూడా..బాలు తండ్రికి ఏమీ తెలియదు. తనని విడిచిపెట్టాలని కోరుతుంది.
మరోవైపు శోభన శృతిని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీంతో రవి శృతిని తన వైపు లాక్కొని..' శృతి ఇప్పుడు నా భార్య. తనను వదిలేయండి. మా బ్రతుకు ఏదో మేము బ్రతుకుదాం' అంటూ శోభనపై గట్టిగా అరుస్తారు. వెంటనే శోభన రియాక్ట్ అయి..'నీ మాయ టలు నమ్మి నా కూతురు మోసపోయింది. నీతో వస్తే సర్వనాశనం అవుతుంది. తనని వదిలేయండి 'అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సురేంద్ర కూడా ఆగ్రహంతో..'వీళ్ళందర్నీ జైలుకు పంపించండి. వీడు మాయ మాటలు చెప్పి తన కూతుర్ని మోసం చేశాడు' అంటూ రవిని కొట్టబోతాడు.

ఈ క్రమంలో శృతి అడ్డుపడి..'నేను, రవి ఎప్పటినుండో ప్రేమించుకుంటున్నాం .. ఇందులో ఎవరి బలవంతం లేదు. మేమిద్దరం మేజర్స్. అంటూ అసలు విషయాన్ని బయట పెట్టేస్తుంది. దీంతో కంగుతిన్న ఎస్సై.. 'ఏంటి సర్ ఇది.. ఇవన్నీ మాకు ముందే చెప్పాలి కదా. మీ అమ్మాయి మేజర్ కాబట్టి తను ఇష్టప్రకారమే వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. కాబట్టి .. ఈ కేసు కోటికి వెళ్ళిన చెల్లదు'అంటూ తేల్చి చెప్తాడు. వెంటనే సత్యం సెల్ నుండి బయటికి తీసుకు రమ్మని కానిస్టేబుల్స్ కు చెబుతాడు.
శృతి అలా మాట్లాడడంతో సురేంద్ర, శోభన లకు తల కొట్టేసినట్టు అవుతుంది. 'వాడితో ఎన్ని రోజులు ఉంటుందో..నేను కూడా చూస్తా .. ఆ పేదరికం భరించలేక మళ్ళీ తిరిగి వస్తుంది' అంటూ ఇంకా ఇక్కడ ఈ ముఖం పెట్టుకొని ఉన్నారంటూ సురేంద్రను తీసుకొని వెళ్ళిపోతుంది శోభన. లాకప్ నుండి విడుదలైన తన తండ్రికి నిజం చెబుదామని రవి దగ్గరికి వెళ్తాడు. కానీ సత్యం 'దగ్గరికి రావద్దు 'అంటూ వెనక్కి నెట్టి వేస్తాడు.
'అందరూ ఆవేశంలో ఉన్నారు. కూలయ్యాక నేనే ఫోన్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళు..'అంటూ రవి చెల్లి నచ్చ చెప్తుంది. కానీ, ఆ మాట వినని రవి..తన అన్న బాలు దగ్గరికి వెళ్తాడు. 'ఇందులో వదిన తప్పేం లేదు. తానే అబద్ధం చెప్పి గుడికి తీసుకెళ్లాను' అంటూ చెప్పిన వినడు రవి. 'ప్రాణాలతో ఉండాలంటే.. తనకు జీవితంలో కనిపించకూడదు' అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మీనా ను కూడా పిలువమని తన తండ్రి చెప్పిన పట్టించుకోకుండా బాలు తన భార్యను పోలీస్ స్టేషన్ దగ్గరనే విడిచి వచ్చేస్తాడు.

ఇంటికి చేరుకున్న సత్యం పోలీస్ స్టేషన్లో జరిగిన అవమానాలను గుర్తుకు చేసుకుంటూ బాధపడతాడు. 'నా జీవితంలో ఇంతవరకు
పోలీస్ స్టేషన్ గడప తొక్క లేదు. ఇలాంటి అవమానం తాను ఇప్పుడు ఎదుర్కోలేద'ని బాధపడతాడు సత్యం. ఇంతలో ప్రభావతి దిష్టి తీయడానికి.. హారతి పట్టుకొని వస్తుంది.'ఏంటిది నేనేమైనా స్వతంత్ర పోరాటం కోసం ఉద్యమంలో వచ్చానా.. పక్కకు జరుగు అంటూ ఇంటిలోపలికి వెళ్ళిపోతాడు.
ఇంట్లో కూర్చున్న సత్యం పోలీసు స్టేషన్లలో జరిగిన అవమానాలను గుర్తుకు చేసుకుంటూ.. 'పోలీస్ స్టేషన్లో సత్యం గెలిచాడు. తండ్రి ఓడిపోయాడు' అంటూ బాధపడుతాడు. అలాగే.. జీవితంలో ఎప్పుడు ఎవర్నీ నమ్మొద్దు అంటూ తన గదిలోకి వెళ్లిపోతాడు. ప్రభావతి కూడా.. ఇక నుంచి ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా ఆయన తట్టుకోలేరు. జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 'అత్తయ్య గారు ఇప్పుడు బయటపడలేదు కానీ మావయ్య గారి మీద ఎంత ప్రేమ ఉందో ఈ సంఘటనతోనే అర్థం అవుతుంది ' అంటూ మనోజ్ భార్య కూడ చాలా ఫీల్ అవుతోంది.

మరోసటి రోజు.. బాలు బయటకు వెళ్లూ.. సోఫాలో కూర్చోని ఉన్న తన అన్నను చూసి..' కుడిది..తాగినట్టు కాఫీ తాగడం కాదు..నాన్నను గమనిస్తూ ఉండండి ' అంటూ పంచ్ వేసి వెళ్లాడు. బాలు బయటకు వెళ్లగానే.. మీనా ఇంట్లోకి వస్తుంది. దీంతో ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. ' నువ్వు ఎవరు? నా ఇంట్లోకి ఏ ముఖం పెట్టుకుని వచ్చావ్. ఇంట్లో నుంచి ఫస్ట్ బయటకు వెళ్తు..' అంటూ వార్నింగ్ ఇస్తుంది. మనోజ్, తన భార్యకూడా నానా మాటలు అంటారు.
అసలు నా జోక్యం లేకుండానే తప్పు తరువాత తప్పు జరిగిపోయింది. చివరికి నేనే దోషగా మిగిలిపోతానని నాకు కూడా తెలుసు. ఆ పరిస్థితిలో ఏం చేయాలి చేయాలో అర్థం కాగా.. ఆ పెళ్లికి సాక్షి సంతకం తప్పనిసరి చేయాల్సి వచ్చింది ' అంటూ తన బాధను వెల్లబుచ్చుతోంది. అయినా మీనాను ఎవరు పట్టించుకోరు. తన మామయ్యకు అసలు విషయం చెబుతాననీ, పైకి వెళ్లబోతుందంటే.. ప్రభావతి వెన్కకి లాగుతోంది. ఈ విషయం బాలుకు తెలిస్తే.. ఎలా రియాక్ట్ అవుతాడో .. వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











