Gunde Ninda Gudi Gantalu october 21th Episode: బాలు సంచలన నిర్ణయం.. ఆగమైన మీనా సంసారం..

Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో రూపుదిద్దుకోవడంతో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంత కాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' సోమవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో తమ కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని, రవి ఫ్యామిలీనీ పోలీస్ స్టేషన్ కు తీసుకవచ్చి ఇబ్బంది పెట్టడాన్ని శృతి వ్యతిరేకిస్తుంది. తాను ప్రేమించిన రవిని పెళ్లి చేసుకున్నానని, ఇందులో ఎవరి బలవంతం లేదని తేల్చి చెబుతోంది. కానీ, తన తల్లిదండ్రులే తమని వీడకొట్టాలని ప్రయత్నిస్తున్నారని, తమకు రక్షణ కావాలని పోలీసులను కోరుతుంది శృతి దీంతో షాక్ అయినా శృతి తల్లిదండ్రులు అవమానంతో పోలీస్ స్టేషన్ నుండి వెళ్లిపోతారు. శృతి వాంగ్మూలంతో సత్యంను పోలీసులు విడిచిపెడతారు. ఈ క్రమంలో మీనా వదిన తప్పులేదని రవి చెప్పిన బాలు మాత్రం పట్టించుకోకుండా మీనాను అక్కడ విడిచి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన సత్యం తనకు పోలీస్ స్టేషన్ లో జరిగిన అవమానం గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు.

Gunde Ninda Gudi Gantalu today serial episode 275 October 21 th 2024 here is full story

సోమవారం ఎపిసోడ్లో బాలు ఇంట్లో లేని సమయంలో మీనా తన అత్తగారింటికి వస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. 'అసలు నువ్వు ఎవరు? ఇంటికి ఎందుకు వచ్చావు? అంటూ నానా మాటలు అంటుంది.. మామయ్యతో తాను ఒక్కసారి మాట్లాడతానని, తన మాట వింటే తనని క్షమిస్తాడని మీనా ప్రాధేయపడుతుంది. కానీ ప్రభావతి కి ఆ విషయం అసలు నచ్చదు. ఇంట్లో నుండి బయటకు వెళ్లిపో అంటూ నిందిస్తోంది. ఈ క్రమంలో మనోజ్ కూడా చేసిన తప్పులను చూసి.. ఇప్పుడు ఏం తెలియనట్లు వ్యవహరిస్తున్నావా? అంటూ మీనాను అవమానిస్తాడు.

ఈ క్రమంలో మనోజ్ భార్య కూడా మీనాను ఎగతాళి చేస్తూ.. 'తప్పు చేసావ్ మీనా.. నువ్ తప్పు చేసావ్..' అని మీనాను నిందిస్తుంది. దీంతో రియాక్ట్ అయిన మీనా 'నేను ఏం తప్పు చేయలేదు. బాలు చెప్పొద్దంటేనే.. నేను చెప్పలేదు' అని సమాధానమిస్తుంది. 'నోరు మూసుకోవే..నా కుటుంబం పరువు ఇలా తీస్తావా.. నీకు నువ్వే నిర్ణయాలు తీసుకుంటావా?' అంటూ మీనాపై ప్రభావతి మండిపడుతోంది. 'లేదు అత్తయ్య.. అది మామయ్యకు తెలిస్తే.. తట్టుకోలేడని బాలు చెప్తేనే.. నేను చెప్పలేదు' అంటుంది.

'మరి మాకు అయినా చెప్పొచ్చుకదా.. మేమైనా రవి గాడితో మాట్లాడే వాళ్ళం కదా.. నీకు నువ్వే నిర్ణయాలు తీసుకునే గొప్పదానివి అయిపోయావా? నా కుటుంబం పరుగు ఇలా తీస్తావా..? అయినా మంచి మర్యాద తెలిసిన కుటుంబంలో పెరుగుతే కదా.. మీ అమ్మ పెంపకం అలాంటిది' అంటూ ఇష్టం వచ్చినట్లు ప్రభావతి నానా మాటలు అంటుంది. దీంతో మీనా దండం పెడుతూ.. 'అత్తయ్య అలాంటి మాటలు అనకండి . నన్నేమైనా అనండి. మా కుటుంబాన్ని ఎందుకు ఎందుకు లాగుతున్నారు. అయినా మీరు అనుకున్నట్లు.. నా తప్పు మాత్రమే ఏమీ లేదు. అలాగే రవి తప్పు కూడా ఏమీ లేదు. శృతి కి తన ఇంట్లో మరో పెళ్లి చేస్తున్నారని, రవిని బలవంతం చేయడంతో శృతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది' అని మీనా చెబుతుంది.

అయినా ఆ మాటకు కన్విన్స్ గాని ప్రభావతి..'అంటే .. నీకు వాళ్ళ కథంతా తెలుసు.. నువ్వే దగ్గరుండి ఈ నాటకమంతా జరిపించావు కదా..' అంటూ మరోసారి అవమానిస్తుంది. ప్రభావతి మాటలకు రోహిణి వంత పాడుతూ. 'ఎందుకు తెలియదు అత్తయ్య.. ఆరోజు మన ఇంటికి వచ్చి.. మీ నాతో మాట్లాడి వెళ్ళింది కదా.. అంటే ప్లానింగ్ అంతా అప్పటినుంచి జరిగిందన్న మాట' అంటూ లేనిపోని నిందలు మీనాపై వేస్తుంది రోహిణి.

'నువ్వు అప్పుడే ఏదో అనుమానంగా ఉంది అన్నావ్.. నేనే పట్టించుకోలేదు.. నా ఇంట్లో ఉండి నాకే వెన్నుపోటు పొడుస్తావా.. ముందు నడవవే ఇంట్లో నుండి ' అంటూ మీనా ను ప్రభావతి గంటెస్తోంది. దీంతో.. ఆగండి అత్తయ్య అంటూ దండం పెడుతుంది మీనా. తాను చెప్పేది దయుంచి వినండి అంటూ ప్రాధేయపడుతుంది. శృతి రవి పెళ్లి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ తన మాట వినాలంటూ కోరుతుంది.

'నువ్వు ఎప్పుడైతే.. వారి పెళ్లికి సంతకం పెట్టావని తెలిసినప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను. నిన్ను ఇంట్లో అడుగుపెట్టనివ్వకూడదని ఫిక్స్ అయ్యాను. ముందు ఇంట్లో నుండి వెళ్లిపో' అంటూ మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. దీంతో మీనా.. 'నా భర్త ఇంట్లో లేని సమయంలో.. నన్ను వెళ్ళమని చెప్పే అధికారం మీకు లేదు' అంటూ మీనా గట్టిగా అరుస్తుంది. 'నా మెడలో తాళి కట్టిన భర్త చెప్పనివ్వండి. అప్పుడు వెళ్ళిపోతాను' అంటుంది మీనా. వెంటనే మనోజ్ ను బాలు కు ఫోన్ చేయమని చెబుతుంది ప్రభావతి.

ప్రభావతి ఫోన్ మాట్లాడుతూ..'నీ పెళ్లాంను వెళ్ళిపోమనే అధికారం నీకు తప్ప ఇంకెవరికి లేదంట.. నువ్వు పొమ్మంటేనే పోతుంది అంట'అంటూ బాలుకు ఎక్కించి చెప్పుతుంది. దీంతో బాలు ఆగ్రహంతో ..' నీ మొహమే చూపించొద్దు అన్నాను. ఎందుకు వచ్చావు. నేను ముందే చెప్పాను. నా తండ్రికి గౌరవం ఇవ్వని వాడి కూతుర్ని పెళ్లి చేసుకోవద్దని. అయినా వినకుండా వెళ్లి.. నువ్వు పెళ్లి జరిపించావు. నిన్ను జీవితంలో క్షమించను. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అందరు కలిసి దాన్ని బయటకి తోసేయండి' అంటూ బాలు వార్నింగ్ ఇస్తాడు.

ఆ మాటలు విన్న ప్రభావతి.. 'విన్నావు కదా.. నిన్ను చేసుకున్న వాడే నిన్ను ఇంట్లో నుండి గెంటెయ్యమని అంటున్నాడు. నీ మెడలో తాళి కట్టిన వాడితోనే చెప్పించాను కదా.. నీకు రోష ఉంటే మళ్ళీ ఇంటికి రాకు..'అంటూ అవమానిస్తుంది. 'సరే అత్తయ్య.. నా కడుపు నిండిపోయింది. మళ్లీ ఆయనే వచ్చి.. పిలిచే అంతవరకు నేను రాను.. నేను రాను..' అని మీనా అంటుంది. దీంతో ప్రభావతి ఎగతాళి చేస్తూ.. 'వాడి మనసు విరిగిపోతే వాడు మాట వినడు. ఇక వెళ్లి పువ్వులు అమ్ముకుంటూ బతుకుపో..'అంటూ అవమానిస్తుంది. అవమాన బారం భరించలేక మీనా అక్కనుండి వెళ్ళిపోతుంది.

మరోవైపు.. రవి పనిచేసి రెస్టారెంట్ కి బాలు వెళ్తాడు. రవి ఎక్కడ.. ఉన్నాడంటూ నానా రచ్చ చేస్తాడు. దీంతో అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ..ఇక్కడ అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. రవి లోపల లేడు. పెళ్లి అని చెప్పి.. పది రోజులు లీవ్ కావాలని వెళ్లిపోయాడు' అంటూ సమాధానం ఇస్తాడు. దీంతో ఆగ్రహాన్నికి లోనైనా బాలు.. అక్కడ ఉన్న పూల కుండీని పగలగొడతాడు.
'వాడి తలపగల కొడదాం అని వచ్చా.. వాడు దొరకలేదు అందుకే కుండి పగలగొట్టా.. వాడు నాకు దొరికిన రోజు ఇదే జరుగుతుంది' అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

మరోవైపు.. మీనా తల్లికి అసలు విషయం తెలియడంతో.. సుమతిని ఇష్టం వచ్చినట్లు కొడుతుంది. పెళ్లి చేసే ముందు మీ అక్క జీవితం గురించి ఆలోచించావా.. ఇలాంటి తప్పు చేస్తే ఎంత చీదరించుకుంటున్నారో.. అంటూ బాధపడుతుంది. ఇంతలోనే మీనా తన తల్లి గారింటికి వస్తుంది. ఏం జరిగిందని మీనా తల్లి ప్రశ్నించగా.. 'ఏం జరగకూడదని ఎన్ని రోజులు బాధపడ్డానో.. ఆ విషయమే జరిగింది. తనను ఇంట్లో నుండి గెంటి వేశారు. జీవితంలో మరోసారి ఆ ఇంట్లో అడుగుపెట్టకూడదని కట్టుకున్న వాడు కూడా వార్నింగ్ ఇచ్చాడు' అని తన తల్లి మీద పడి ఏడుస్తుంది మీనా.

'నా జీవితం సర్వనాశనమైంది. ఎక్కడికి పోవాలో.. తెలియక ఇటు వచ్చా..' అంటూ మీనా బాధపడుతుంది. దీంతో తన తల్లి ఏ తప్పు చేయకుండా మీ మెడకు ఇలా చుట్టుకుంటున్నాయి ఏంటి అని ఏడుస్తుంది. 'పెళ్లి చేసే ముందు. ఒక్క మాటైనా.. మీ అక్కకు చెప్పి ఉంటే.. అక్క ఆ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పి ఉండేది. వాళ్లు ఏ గంగలోనైనా పడి చచ్చేవారు.. నువ్వు చేసిన తప్పుకు అక్క జీవితం నాశనమైంది' అంటూ సుమతిని తన తల్లి కొడుతుంది.

'క్షమించండి అక్క నేను ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. రవి పెళ్లి చేసుకుని మీ ఇంటికి వస్తాడు. అన్ని విషయాలు సద్దుమణుగుతాయి అని భావించానే తప్ప.. నీకు ఇలాంటి అవమానం జరుగుతుందని ఎన్నడూ ఊహించలేదు' అంటూ మీనా కాళ్ళ మీద పడుతుంది సుమతి. 'నా బతుకుని ఆ దేవుడైన రాశాడు. మావయ్య గారికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు నా భార్త ' అంటూ ఆవేదన చెందుతుంది మీనా.

మరోవైపు రవిలో జరిగిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ బాధపడతాడు. తన వల్లనే తన కుటుంబానికి అవమానం జరిగిందని బాధపడతాడు. ఇంతలో శ్రుతి .. రవి దగ్గరికి వచ్చి.. నిన్ను ఎలా హ్యాపీ చేయాలో నాకు తెలుసు.. వెళ్లి పూలు,పండ్లు తీసుకరా ' అంటూ చెప్పుతోంది. శ్రుతి తన శోభనం ఏర్పాట్లు చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X