Gunde Ninda Gudi Gantalu october 22th Episode: బాలుకు ఘోర అవమానం.. మీనాను ఇంట్లో నుంచి వెళ్లాగొట్టిన తల్లి..

Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' మంగళవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ లో బాలు ఇంట్లో లేని సమయంలో మీనా తన అత్తగారింటికి వస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోమని నిందిస్తోంది. తన తప్పు మాత్రమే ఏమీ లేదనీ, అలాగే రవి తప్పు కూడా ఏమీ లేదనీ, శృతి కి తన ఇంట్లో మరో పెళ్లి చేస్తున్నారని, రవిని బలవంతం చేయడంతో శృతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని మీనా చెబుతుంది.బాలు కూడా ఆగ్రహంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని, నీకు నాకు సంబంధం లేదని, మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొంటామంటాడు.అవమాన భారం మీనా నుంచి వెళ్లిపోతుంది. మీనా తల్లికి అసలు విషయం తెలియడంతో సుమతిని కొడుతోంది. మీనాకు తల్లి ఇంటికి చేరుకుంటుంది. మరోవైపు రవి తన వల్ల తన కుటుంబానికి అవమానం జరిగిందని బాధపడతాడు.

Gunde Ninda Gudi Gantalu today serial episode 276 October 22th 2024 here is full story

మంగళవారం ఎపిసోడ్లో రవి తన కుటుంబం గురించి బాధపడుతుంటారు. ఇంతలో శ్రుతి వచ్చి తన శోభనం గురించి మాట్లాడుతుంది. 'పెళ్లి చేసుకొని ఇలా బయటకు వచ్చి మనం తప్పు చేశాం. ఇంట్లో వారికి సంతోషం లేకుండా చేశాం. మన చేసిన పనికి మా వదిన ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. మా అమ్మకు అసూయ.. అన్నయ్య కు సార్ట్ టెంపర్.. వాళ్ళు వదినను ఎంతలా అవమానిస్తున్నారో అని రవి పడుతాడు.

'పెళ్లి జరిగితే.. వాళ్ళకి నాలుగు రోజులు బాధ ఉంటుంది. కానీ జరగకపోతే మనకి జీవితాంతం బాధ. రేపటికి అన్ని బాధలు పోతాయి. ఓకే అవుతోంది. ఈరోజు వద్దంటున్న. రేపు వాళ్లే మనల్నీ అర్థం చేసుకుంటారు' అని రవికి శ్రుతి నచ్చజేప్పుతోంది. కానీ రవి మాత్రం.. తన మూడ్ మారడానికి టైం కావాలంటాడు.

మరో వైపు.. బాలు తన ఫ్రెండ్ దగ్గరి వెళ్లాడు. ఇంతలో ఓ తాగుబోతు గాడు వచ్చి.. 'ఓరేయ్ బాలు.. ఏంటి మీ నాన్న ఏ తప్పో చేయలేదని చాటింపు పెట్టుకున్నావా ..' అంటూ ఎగతాళి చేస్తాడు. దీంతో బాలుకు వస్తుంది. చక్కగా మూసుకొని పో అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఆ తాగుబోతు మరింత రెచ్చిపోతాడు.' జనానికి కబుర్లు చెప్పడం కాదు.. మనం కరెక్టుగా ఉండాలి. అయినా మీ నాన్నకు ఈ వయసులో ఏం పోయేకాలం వచ్చింది. అలాంటి పని చేస్తున్నాడు. దీంతో ఉన్న పరువు అంతాపాయే..సత్యం కాస్త అసత్యమయ్యే. పాపం నిన్ను చూస్తుంటే.. జాలేస్తుంది రా ' అంటూ ఆ తాగుబోతు బాలును రెచ్చగొడుతాడు.

దీంతో ఆగ్రహానికి లోనైన బాలు' మా నాన్న గురించి మాట్లాడేంత అర్హత నీకుందా రా. అయినా.. మా నాన్న తప్పు చేసేటప్పుడు నువ్వు చూసావా? అంటూ ఆ వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు కొడతాడు బాలు. అయినా ఆ తాగుబోతు తగ్గకుండా.. 'నిజాలు మాట్లాడితే నీకు ఎక్కడో కాలుతుంది కదా.. నాకు నీతులు చెప్తే.. నాకు కూడా ఎక్కడో కాలింది. అయినా ఏ తప్పు చేయకుండా పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తారు' అంటూ ప్రశ్నిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu today serial episode 276 October 22th 2024 here is full story

'పోలీసులు అరెస్టు చేసిన వాళ్ళందరూ తప్పు చేసినట్లేనా .. ఆయన తప్పు చేశాడు.మా నాన్న గురించి తప్పుగా మాట్లాడిన నిన్ను చంపేసి జైలుకెళ్తా.. ఇంకోసారి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు ఉండవు' అంటూ వార్నింగ్ ఇస్తాడు బాలు. ఈ గొడవ చూసి సత్యం స్నేహితుడు .. బాలు దగ్గరికి వచ్చి.. 'ఏంట్రా ఇది? ఏమైంది? వీడు ఏమో జైలు అంటున్నాడు నువ్వేమో కోపంగా ఉన్నావ్. అసలు ఏం జరిగింది' అని ప్రశ్నిస్తాడు. దీంతో తన తండ్రి స్నేహితుడికి జరిగింది అంతా చెపుతాడు.

'మీ నాన్న మచ్చలేని చంద్రుడు లాంటివాడు. అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడమేంట్రా' అని అడుగుతాడు. 'ఏం చేయమంటావ్ పోలీసులకు కావాల్సింది. రిజిస్టర్ చేసుకోవడానికి ఓ కేసు. అరెస్టు చేయడానికి ఓ మనిషి ఉంటే చాలు. వారికి నిజానిజాలతో పని లేదు కదా. చీమ కూడా హామీ చెయ్యని మా నాన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి వచ్చాడు. ఈరోజు మాట పలుకు లేకుండా జీవచ్ఛవంలాగా పడి ఉన్నాడు. ఆయనను ఓదార్చే శక్తి లేక ఆయనను అలా చూడలేక ఇలా వచ్చేసాను' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు బాలు.

మరోవైపు.. సురేంద్ర తన కుతూరు శ్రుతి చేసిన పనిని గుర్తు చేసుకుంటూ బాధపడుతాడు. ఇంతలోనే నీలకంఠం వస్తాడు. అది చూసి సురేంద్ర.. ఇంట్లోకి రామ్మని ఆహ్వానిస్తాడు. అప్పటికే కోపంతో ఉన్న నీలకంఠం 'ఆపు రా.. నీ బోడి మర్యాదలు.. ఇంత మోసం చేస్తావా? ఇన్ని అబద్ధాలు ఆడుతావు? ఇంకా ఏం చెప్తావ్ రా? అంటూ సురేంద్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయినా నిజంగా నీకేం తెలియదా అంటూ సురేంద్రను నిలదీస్తాడు.

వెంటనే సంజూ.. 'అన్ని తెలుసు డాడీ.. మొత్తం మ్యాటర్ తెలిసే.. శృతిని బయటకు వెళ్ళనివ్వలేదు. అందుకే ఫోన్ కూడా ఇవ్వలేదు.వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా పెంచుతున్నారు అనుకున్నాను. కానీ, ఇంత లూస్ గా వదిలేస్తారని అనుకోలేదు.బాబు.. బాబు అంటూనే బాంబు పెట్టారు కదా' అని సంజూ ఆగ్రహంతో ఊగిపోతాడు.

'ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు' అని జరిగిన విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాడు సురేంద్ర. 'ఏం జరిగిందో.. అప్పుడే తెలిసి ఉంటే.. వాడిని లేపేసి.. నీ కూతురు లాక్కొచ్చి మెడ మీద కత్తి పెట్టి.. నా కొడుకుతో మెడలో తాళి కట్టించేవాడ్ని. ఏం జరిగిందోనని బాధపడేలోపే ఓ తల్లి అయ్యేంది ' అని రాష్ గా మాట్లాడుతాడు. నీలకంఠం. ఈ క్రమంలో సంజూ కూడా 'నన్ను జోకర్ని చూసి ఊరు మొత్తం తెంపించింది' అంటూ అరుస్తాడు

'మొదటిసారి నేను మోసపోయాను. అందరూ నా మాట వింటారు. ఇప్పుడు నాకు కాబోయే కోడలు లేచిపోయిందంటే.. ఇప్పుడు నా మాట వినడు.ఎవడు నాకు మర్యాద ఇవ్వడు.నా బిజినెస్ కు పెట్టుబడే భయం. ఇప్పుడా ఆ భయం అందరిలోనూ పోతుంది. అయినా.. నీ కూతురు కనబడట్లేదని అప్పుడే చెప్పితే.. గంటలోపు వెతికి మా ఇంట్లో పడేసేవాన్ని.. నువ్వు ఆ పని చేయకుండా.. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు.. నా చేతులు కట్టు పడేసారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు నీలకంఠం. చివరిగా నీలకంఠం వెళ్లిపోతూ.. 'సిగ్గు ఉంటే.. ఈపాటికి నువ్వు ఉరేసుకొని చావాలి. ఏం బతుకురా నిది' అంటూ సురేంద్రను అవమానిస్తాడు.

ఈ క్రమంలో ఇల్లంతా తగలబెట్టి వస్తాను డాడీ అని ఇష్టం వచ్చినట్లు చేస్తాడు సంజూ. దీంతో నీలకంఠ అడ్డుపడి..' వద్దు ఇప్పటికే సగం సచ్చాడు. విడిచిపెట్టండి' అని సంజును తీసుకొని వెళ్తాడు నీలకంఠ.

మరోవైపు.. మీనా తల్లి.. మీనాను తన అత్తగారి ఇంటికి వెళ్లిపోమ్మని చెప్పుతోంది. నీతో మాకు ఎలాంటి సంబంధం లేదని ఇంట్లో నుంచి గెంటేసిన ఇంటికి వెళ్లాలా? నేను ఎక్కడికి వెళ్ళమంటావమ్మా.' అని ప్రశ్నిస్తుంది మీనా. నిజంగానే నువ్వు తప్పు చేయలేదు కాదా.. నువు ఇలా చేస్తే.. నువ్వే అవకాశం ఇచ్చినట్టు అవుతోంది. సక్కగా నీ అత్తగారింటికి వెళ్ళు. నీపై పడ్డ నిందను తొలగించుకో తెలిసి చేసినా.. తెలియక చేసిన సహాయం కూడా అపాయమే. అది మీకు అర్థం కాదు మీ అత్తగారింటికి వెళ్ళు' అంటూ మీనా కు తన తల్లి నచ్చజెప్పి ప్రయత్నం చేస్తుంది.

అన్ని సర్దుకున్నా తరువాత అక్క వెళ్తుందని అంటుంది సుమతి. కానీ, మీకేం తెలియదు అంటూ వాళ్ళ నోరు మూపిస్తుంది మీనా తల్లి.. ఇప్పుడు రెండు.. రెండు నెలలు.. ఆ తర్వాత రెండు సంవత్సరాలవుతుంది. ఇలా ఎల్లకాలం మీ అక్కని ఇక్కడనే ఉంచుకుందామా. పెళ్లయిన కూతురు పుట్టింట్లోనే ఉంటుందంటే.. నలుగురు నా మొహం మీద ఉమ్మేస్తారు. అయినా మీకు బుద్ధి లేదు.అక్కను పంపిన ఇంట్లో వాళ్లకు మీ వల్ల ఎలాంటి సమస్యలు రావద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నాను. అయినా.. అసలు వినిపించుకోలేదు' అంటూ మీనా తల్లి కొట్టుకుంటుంది.

దీంతో మీనా బాధపడుపడుతూ.. 'అమ్మ.. నన్ను పంపించిన అంత ఈజీగా.. వాళ్లు నన్ను ఇంట్లోకి రానివ్వరు. మా అత్తయ్య పంపిస్తే..మా ఆయన నాకు సపోర్టుగా ఉన్నాడు కదా అని ఉండేదాన్నీ.. కానీ, ఈసారి మా ఆయననే నన్ను పంపించేశాడు'అంటూ ఏడుస్తోంది.వెంటనే మీనా తల్లి.. ' ఆరోజు తన తండ్రి చెబితేనే.. నీ మెడలో బాలు తాళి కట్టాడు. అది బాలుకి తన తండ్రి మీద ఉన్న గౌరవం. ఏ కొడుకు అయినా.. తన తండ్రి జైలు పాలు అయితే.. ఇలానే వ్యవహరిస్తాడు. అది నీ మీద కోపం కాదమ్మా బాలుకి తన తండ్రి మీద ఉన్న గౌరవం' అంటూ నచ్చదు మీనా తల్లి.

మీ ఇంట్లో ఎవరు నీ మాట వినకపోతే.. కనీసం మేము మావయ్య కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. ఆయన నిన్ను క్షమిస్తారు' అని చెప్పుతోంది. దీంతో మీనా ఇంట్లో నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది.

More from Filmibeat

Read more about: gunde ninda gudi gantalu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X