Gunde Ninda Gudi Gantalu october 23th Episode: దేవుడిపై భారం వేసిన మీనా.. శ్రుతి, రవిల మధ్య గొడవ.. మధ్యలో సంజూ
Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో రవి తన కుటుంబం గురించి బాధపడుతుంటే.. శ్రుతి మాత్రం శోభనం గురించి మాట్లాడుతుంది. మరోవైపు.. బాలుకు ఘోర అవమానం ఎదురైంది. ఓ తాగుబోతు తన తండ్రి గురించి నీచంగా మాట్లాడటంతో ఆగ్రహంతో రెచ్చిపోయి.. వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతాడు. మరో వైపు సురేంద్రకు నీలకంఠ వార్నింగ్ ఇస్తాడు. ఇంటికి వచ్చి అవమానిస్తాడు. సంజూకు ఆగ్రహంతో పడిపడుతాడు.ఇదెలా ఉంటే.. మీనా తల్లి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని కోరుతుంది.

బుధవారం ఎపిసోడ్ లో.. సత్యం జైల్లో జరిగిన చేదు అనుభవాలను గుర్తుకు చేసుకుంటూ బాధపడతాడు. ఇంతలో రవి వచ్చి అన్నం తినమని బ్రతిమలాడుతాడు కానీ, తనకు ఆకలిగా లేదని తన కొడుకు చేసిన తప్పుతో తన ఆకలి తీరిపోయింది, తాను తిననని మొండికేస్తాడు . ఎంతో రవి ఈరోజు కాకపోతే రేపైనా తినాలి కదా ఎప్పుడో అప్పుడు తినాల్సిందే కదా ఏమైనా బాధ ఉంటే.. ఇతరులను పెట్టండి. మీద పెద్దరికంలో పేదరికం కనిపిస్తోంది నాన్న అంటూ బాలు బాధపడతాడు.
ఇంతలోనే సత్యం ఫ్రెండ్ రంగా ఇంట్లోకి వచ్చి.. ఏమైందని ప్రశ్నిస్తాడు. 'తినడం లేదు.. మాట్లాడటం లేదు..' అని ప్రభావతి సమాధానమిస్తోంది. 'ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావ్..నీవు ఏం తప్పు చేసావ్? అయినా నువు ఎందుకు తినడం లేదు?' అంటూ ప్రశ్నిస్తాడు. 'నా పెంపకం గురించి సురేంద్ర ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నా మీద తు అంటూ వెళ్లిపోయాడు. ఆ క్షణమే నా గుండె ఆగిపోయి చచ్చిపోతే.. బాగుండనిపించింది' అని సత్యం షాకింగ్ కామెంట్స్ చేస్తాడు.
'నువ్వు తినకపోతే నేను తినను.. ఎవరికి తినాలి లేదు' అనడంతో కాస్త సత్యం తగ్గుతాడు. దీంతో బాలు తన తండ్రికి అన్నం తినిపిస్తాడు. ఆ తరువాత రెస్ట్ తీసుకుంటానని తన బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు. దొరికితే.. అదునుగా ప్రభావతి తన కోడలును ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. దీంతో రంగా రియాక్ట్ అవుతూ.. ఇతరులు చేసిన తప్పలను నీ కోడలు మీద వేయకు. అయినా..నీ కోడలు .. రవిని ప్రేమించుకోమని చెప్పిందా.. శ్రుతిని పెళ్లి చేసుకోమని చెప్పిందా? అంటూ ప్రశ్నించాడు. దీంతో ప్రభావతి సైలెంట్ అవుతుంది.
ఆ తరువాత బాలును బయటకు తీసుకెళ్లి..'పరువుకి ప్రాణం ఇచ్చేవారు మీ నాన్న.. కుటుంబం అంటే వాడికి ప్రాణం.. రవిగాడు ఆ పని చేసినందుకు పోలీసులు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టినందుకు.. చాలా బాధలో ఉన్నాడు. మీ నాన్నను ఓ కంట కనిపెట్టడని రంగ చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు మీనా గుడికి వెళ్లి బాధపడుతోంది. ఈ విషయాన్ని గమనించిన పూజరి ఏమందని ప్రశ్నించగా.. 'భగవంతుడైన ఏదైనా దారి చూపిస్తాడని ఆశపడి ఇక్కడికి వచ్చాను. నాకు తెలియకుండానే అంత జరిగిపోయింది'అని బాధపడుతోంది మీనా.
ఇంతలో మీనా ఫ్రెండ్ వచ్చి.. ' మీ ఆయనకు కోపం అంతకుమించి ప్రేమ కూడా ఉంది. ఆ రోజు నువ్వు అంగప్రదక్షిణ చేస్తుంటే.. చాలా బాధపడ్డాడు ఇప్పుడు మాత్రం నీ బాధ నీ భర్తకే చెప్పుకో తప్పకుండా నమ్ముతాడు' అని సలహా ఇస్తోంది. 'నువ్వు ఎంతో మందికి మంచి చేశావ్.. నీ సంసారంలో కలతలు వస్తే.. దేవుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడా.. భారం దేవుడి మీదే వేసి ఆత్మవిశ్వాసంతో మీ అత్తగారింటికి వెళ్ళు.. అన్ని అవే సర్దుకుంటాయి.. అంతా ఆయనే చూసుకుంటాడు ' అని పంతులు కూడా చెప్పుతాడు.
మరోవైపు ..రవి, శ్రుతిలు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. తొలుత రొమాంటిక్ గా మాట్లాడుకున్నారు. మనిద్దరి మధ్య గొడవ జరగడానికి చోటు ఉందని అనుకుంటారు. ఈ క్రమంలో సరదాగా నాకు బయటకు ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది అని శ్రుతి అన్నడంతో . 'నాకు మూడ్ లేదు.. ఇంట్లో వాళ్ళు గుర్తోస్తున్నారు. నేను హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు కూడా.. రోజు మాట్లాడేవాడిని అంత ఎందుకు.. నీతో పెళ్లి అయ్యేంత రోజు వరకు కూడా మాట్లాడేవాణ్ణి. సడన్ గా మానేస్తే బాధగా ఉంది.' అని రవి ఫీల్ అవుతారు. 'సంతోషంగా ఉండాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు' అంటుంది శ్రుతి.
దీంతో రవి 'మనం ఇంకొంచెం ఓపిక పట్టాల్సిందే.. అసలు మనం ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సింది కాదు' అంటాడు. దీంతో శ్రుతికి కోపం వస్తుంది. 'నీకు మాత్రమే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంది. నేను మాత్రం బరితెగించి వచ్చానా.. నా తల్లిదండ్రులు కూడా నా పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. నా జీవితం గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారు' అంటూ శ్రుతి కూడా సిరీయస్ అవుతుంది.
శ్రుతి అంతటితో ఆగకుండా.. 'ఎక్కడున్నా ఓకే ఆలోచన కాదు. నాకు గురించి పట్టించుకో' అంటూ ఎమోషనల్ అవుతోంది. 'ఇదంతా మీ నాన్న వాళ్ల జరిగింది. మీ నాన్న మా నాన్న మీద కేసు పెట్టకపోయి ఉంటే.. మా నాన్న స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు కదా' అని రవి గట్టిగా అరుస్తాడు. దీంతో శ్రుతి ' కొండ అంత ప్రేమతో నీకోసం వస్తే గుండెల్లో కొట్టావు రవి థాంక్స్ ' అంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.
ఈ క్రమంలో సంజూ కంటపడుతుంది శ్రుతి. ఏమైనా చేయాలని ప్రయత్నిస్తాడు. నడుచుకుంటు వెళ్లున్న శ్రుతిని అడ్డగించే ప్రయత్నం చేస్తాడు సంజూ. కానీ, రవి సడెన్ గా ఎంట్రీ ఇస్తాడు. శ్రుతితో రవిని చూసి సంజూ షాక్ అవుతాడు. ఆగ్రహంతో మండిపడుతాడు. వారిపై ఎలా పగ తీర్చుకుంటాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











