Gunde Ninda Gudi Gantalu october 24th Episode: పగబట్టిన సంజూ.. రవిని చావబాదిన బాలు.. ఒంటరైనా మీనా..

Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు' గురువారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో సత్యం జైల్లో జరిగిన చేదు అనుభవాలను గుర్తుకు చేసుకుంటూ బాధపడతాడు. ఇంతలో బాలు వచ్చి అన్నం తినమని బ్రతిమిలాడుతాడు. మరోవైపు మీనాకు తల్లి ఆదరణ కరువు అవుతోంది. దీంతో గుడికి వెళ్లి బాధపడుతోంది. దీంతో దేవుడిపై భారం వేయమని పూజారి సలహా ఇస్తాడు. మరోవైపు.. శ్రుతి, రవి మధ్య గొడవ అవుతోంది. దీంతో శ్రుతి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో సంజూ కంట శ్రుతి పడుతోంది. శ్రుతిని ఏమైనా చేయాలని భావించే లోపు రవి అడ్డు వస్తాడు. ఈ క్రమంలో శ్రుతిని ప్రేమించిన పెళ్లి చేసుకున్న వ్యక్తి.. తనని నమ్మించి మోసం చేసిన వ్యక్తి రవినే అని తెలిసి.. షాక్ కు గురవుతాడు సంజూ..

Gunde Ninda Gudi Gantalu today serial episode 278 October 24th 2024 here is full story

గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో .. శృతి , రవి తనను మోసం చేశారని జోకర్లు చేసి ఎన్ని రోజులు ఆడించాలని వారు ఎలా హ్యాపీగా ఉంటారో తాను చూస్తాను వారిపై సంజు. మరోవైపు తన కుటుంబ పరువును రోడ్డుకీడ్చిన రవి పై పగ ఎలా తీర్చుకోవాలని, ఆలోచిస్తూ ఉంటాడు బాలు. ఇంతలోనే బాలు ఫ్రెండ్ రాజేష్ వచ్చి.. ఎప్పుడు అదే ఆలోచన నా.. ఈరోజుల్లో కుర్రాళ్లకు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది రా.. అయినా వాడు ఏం తప్పు చేశాడు అంటూ ప్రశ్నిస్తాడు.

ఆ మాటలు పట్టించుకోకుండా వాడు దొరకాలి వాడికి ఉంటుందనీ,అలాగే.. మీనా గురించి మాట్లాడుతూ.. తన భార్య కు ముందు ఉంటే.. 'గుండెల్లో పొడుస్తుంది. వెనకాల తిరిగితే వెన్నుపోటు పొడుస్తుంది' అంటూ ఇష్టం వచ్చినట్లు బాలు మాట్లాడుతాడు. ఈ మాటలు మీనా వింటుంది. వెంటనే బాలు దగ్గరికి వచ్చి.. నేనేం తప్పు చేశాననీ ప్రశ్నిస్తుంది. 'అసలు నువ్వే ముఖం పెట్టుకొని వచ్చావు?' అని బాలు తిరిగి ప్రశ్నిస్తాడు.

'నీ గుండెల్లో పొడుద్దామని వచ్చాను. నా బాధ చెప్పుకోవడానికి అత్తగారింటికి వెళ్తే పొమ్మని గెంటేస్తున్నారు. అదే అమ్మగారింటికి వెళ్తే పొమ్మని తరిమేస్తున్నారు ఇలా అందరూ అక్కర్లేదంటే ఎటు వెళ్లాలి' అని బాధపడుతుంది మీనా. దీంతో 'కలియుగ కళ్యాణ దేవత అనే బిరుదు ఇచ్చే సన్మానించాలా.. ఇంకో నాలుగు పెళ్లిళ్లు చేసి పెళ్లిళ్ల బ్రోకర్ గా మారు. కమిషన్లు బాగానే వస్తాయి' అంటూ అవమానిస్తాడు బాలు. 'అవును మీ తమ్ముడు బాగానే కమిషన్ ఇచ్చాడు. మా ఇంటి ముందు ఓ వీధి . మీ ఇంటి ముందు ఓ వీధి నాకు రాసిచ్చాడుగా ' అంటూ సెటైరికల్ పంచ్ వేస్తుంది మీనా.

'అయినా మిమ్మల్ని నమ్మి నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేసింది మా అమ్మ. నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా..' అంటూ మీనా ప్రశ్నిస్తుంది. అయినా బాలు ఏమాత్రం తగ్గడు.' తన తండ్రి పరువు తీసిన రోజే.. నీకు నాకు ఉన్న సంబంధం తెగిపోయింది. ఎక్కడికైనా వెళ్లి చావు' అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు. 'నన్ను నానా మాటలు అంటున్నారు. జీవితాంతం ఏడుస్తారు' అంటూ బాధపడుతూ వెళ్ళిపోతుంది మీనా.

మరోవైపు రవి రెస్టారెంట్ కు వచ్చినట్లు బాలుకి ఫోన్ వస్తుంది. హడావిడిగా బాలు తన ఫ్రెండును తీసుకుని రవి రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ రవిని చూసిన బాలుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. రవిని ఇష్టం వచ్చినట్లు కొడతాడు. జరిగిన విషయం చెప్పడానికి ప్రయత్నించినా బాలు ఏమాత్రం పట్టించుకోడు. రవి కూడా తనపై ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నాడనీ, తనని కొట్టనివ్వండి అంటూ బాధపడతాడు. తన తండ్రి అవమానించిన సురేంద్ర కూతురితో మాట్లాడవద్దని,ఈరోజు వాడి కూతుర్నే పెళ్లి చేసుకుని అందరికీ వెన్నుపోటు పొడిచావు కదరా.. ఇవ్వాల్టి నుండి నువ్వు ఎవరో నేనెవరో అంటూ బాలు ఆగ్రహంతో వెళ్లిపోతాడు.

మరోవైపు.. గుడిలో ఒంటరిగా కూర్చొన్న మీనాను చూసి.. తన తల్లి మళ్లి ఇంటికి తీసుకెళ్తోంది. 'అయినా.. నిన్ను మీ అత్తగారింటికి వెళ్లమని పంపిస్తే.. అక్కడ ఎందుకు కూర్చొన్నావే 'అని ప్రశ్నిస్తోంది మీనా తల్లి. 'ఏమీ లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా.. అందుకే కనీసం దేవుడైన నన్ను అర్థం చేసుకుంటాడని గుడికి వెళ్ళాను. నీకు కూడా నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే చెప్పు.. ఇప్పుడే వెళ్లి అక్కడే పడుకుంటాను మీరు ఇక్కడ ప్రశాంతంగా పడుకోండి ' అంటూ మీనా వెళ్లడానికి ప్రయత్నిస్తోంది.

'మరోసారి ఆ మాట అంటే.. కాళ్లు చేతులు విరగొట్టి ఇంట్లో కూర్చోబెడుతా ' అని వార్నింగ్ ఇస్తోంది. దీంతో మీనా..' ఇదేనా ఆడపిల్ల జీవితం. జీవితాంత ఇలానే కంప్రమైజ్ అయి బతకాలా? నేను ఎవర్ని బతిమిలాడను. నేను ఎక్కడికి వెళ్లను. ఇక్కడే ఉంటాను ' అంటుంది మీనా.

మరోవైపు.. బాలు తన ఫ్రెండ్ రాజేశ్ తో కలిసి బార్ కు వెళ్లాడు. పుల్ గా వేసి.. తన తండ్రి ,రవి గురించి, మీనా గురించి చెప్పిందే చెప్పుతూ ఓరిస్తాడు బాలు. ఓ వ్యక్తి పుల్ గా తాగి..పెళ్లాంతో మాత్రం గొడవపడకండి.. వారు బాధలో ఏమైనా చేసుకోవచ్చు' అంటూ ఓ సెట్మెంట్ ఇస్తాడు. దీంతో బాలుకు టెన్షన్ ప్రారంభమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X