Gunde Ninda Gudi Gantalu october 25th Episode: మీనా గురించి బాలు టెన్షన్.. మూళ్లగంపను ఆట పట్టించిన పూలగంప..
Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వాటిలో సీరియల్స్ ప్రధానమైనవి. ఈ సీరియల్స్ కు మహిళల నుంచి రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తోంది. మనసుకు అంతుకుపోయే కథనంతో సాగుతున్నతూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి టాప్ సీరియల్స్ లో 'స్టార్ మా' ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న'గుండె నిండా గుడి గంటలు'(Gunde Ninda Gudi Gantalu serial) ఒకటి. గత కొంతకాలంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 'గుండె నిండా గుడి గంటలు'శుక్రవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో శృతి, రవి కలసి తనను మోసం చేశారని, జోకర్లు చేసి ఎన్ని రోజులు ఆడించాలని,ఎలాగైనా వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని సంజు ఆలోచిస్తాడు. మరోవైపు మీనాను నానా మాటలు అని అవమానిస్తాడు బాలు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన మీనా మరోసారి కనిపించనని బాధతో వెళ్లిపోతుంది. మరోవైపు.. రవి రెస్టారెంట్ కు వచ్చాడనే విషయం తెలుసుకున్న బాలు.. అంతుపట్టని ఆగ్రహంతో రవి దగ్గరకు వెళ్లాడు. కుటుంబ పరువును రోడ్డుకీడ్చాడనే కారణంతో కోపంతో ఇష్టవచ్చినట్టు కొడుతాడు. కుటుంబంతో తనకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. మరో ఇంట్లో అడుగుపెట్టితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు బాలు.

శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో .. బాలు తన ఫ్రెండ్ రాజేష్ తో కలిసి బార్ కు వెళ్తాడు. ఈ సమయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంటుంది.అక్కడ ఆ వ్యక్తి ఫుల్ గా తాగి.. 'అందరికీ నమస్కారం.. జీవితంలో ఎప్పుడు కూడా పెళ్ళాంతో గొడవ పడకండి. ఆవేశంలో మనం ఏదైనా అంటే వాళ్లు ఆత్మహత్య చేసుకుంటారు. ముందే ప్రతి ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నాయి. వాటికి ఉగులాడుతారు' అని హెచ్చరిస్తారు. ఆ మాటలు విన్న బాలుకు భయమేస్తుంది. తన భార్య మీనా ఏమైనా అఘాయిత్యానికి పాల్పడుతుందా? అని సందేహం వస్తుంది. కానీ, మీనా అంతా పిరికిది కాదని బాలు ఫ్రెండ్ రాజేష్ అంటాడు. కానీ మీనా మాటలు ఏదో తేడా కనిపించిందని తాను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలని కాస్త రియలైజ్ అవుతాడు.
మరోవైపు రవి ఇంటికి వెళ్లి బార్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో శృతి షూటింగ్ కంప్లీట్ చేసుకుని, ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇంటికి వస్తుంది. ఇంతసేపైనా తనకి కనీసం కాల్ కూడా చేయలేదని, కనీసం ఉన్నానా? లేదా? అని తెలుసుకోవాలని బాధ్యత లేదా? పెళ్లి కాగానే ప్రేమ పోయిందా? అని రవినీ ప్రశ్నిస్తుంది. ఇంతలో రవి ముఖంపై ఉన్న గాయాలను చూసి షాక్ అవుతుంది శ్రుతి. అసలు ఏమైందని ప్రశ్నిస్తోంది. రవి మాత్రం తాను బాత్రూంలో జారిపడ్డానని, తనకి ఏం కాలేదని అబద్ధం చెప్పి.. భోజనానికి ఏర్పాట్లు చేస్తాడు.
ఇంతలో రెస్టారెంట్ నుండి రవికి ఫోన్ వస్తుంది. ఆ కాల్ ను శృతి లిఫ్ట్ చేసి మాట్లాడుతోంది. అసలు రవికి గాయాలు ఎలా అయ్యానని ప్రశ్నిస్తోంది. ఆ వ్యక్తి రెస్టారెంట్లో జరిగిన గొడవను వివరిస్తాడు. బాలు వచ్చి రవిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడని తెలియజేస్తాడు.ఆ మాటలు విన్న వెంటనే శృతి రవి దగ్గరికి వెళ్లి బాధపడుతుంది. ఇంకా మీ అన్నయ్య మన మీద ఎందుకు కోపంగా ఉన్నాడని ప్రశ్నిస్తుంది. ఇకనుండి మనకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని వాళ్ల గురించి ఆలోచించడం మానేయని చెప్తుంది శ్రుతి.
మరోవైపు బాలు,రాజేష్ లు పుల్ గా తాగడంతో కార్తీక్ వారిని ఇంటికి తీసుకెళ్తాడు. మార్గమధ్యంలో బార్ లో ఓ వ్యక్తి చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని భయపడుతూ ఉంటాడు. మీనా ఏమైనా చేసుకుంటున్న ఎలా ఉంది? అని విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఎలాగైనా మీనా గురించి తెలుసుకోవాలని తన ఫ్రెండు రాజేష్ ను మీనాకు ఫోన్ చేయమని కోరుతాడు. దీంతో తాగిన మత్తులో రాజేష్ .. మీనాకు ఫోన్ చేసి.. బాలు అడుగుమన్న విషయాలు కాకుండా.. ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. బాలునే ఫోన్ చేపిస్తున్నాడని ఫోన్ కట్ చేస్తుంది మీనా.
దీంతో బాలు మరింత టెన్షన్ పడుతాడు. దీంతో మీనా ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్తాడు బాలు తన ఫ్రెండు కార్తీక్ కు చెబుతాడు. తీరా మీనా ఇంటికి వెళ్లాక.. బాలుకు తన అత్తగారింటికి వెళ్లడానికి కాస్త నామోషీగా ఫీలవుతాడు. పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ని వెళ్లి మీనా ఉందా? లేదా? తెలుసుకొని చెప్తాడు. తాను వెళ్లలేదని నువ్వే వెళ్ళమని చెప్తాడు. ఇలా నువ్వు వెళ్లు అంటే.. నువ్వు వెళ్లు అంటూ.. గొడవపడుతుంటారు. మరి మీనా దగ్గరికి ఎవరు వెళ్తారో వేచి చూడాల్సిందే. బాలు మీనా ఇంటికి తీసుకెళ్లాడా? లేదా? అనేది నెక్ట్స్ ఎపిసోడ్ లో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











