Gunde Ninda Gudi Gantalu Weekly: ప్రభావతికి బిగ్ షాక్, సత్యం కీలక నిర్ణయం, మనోజ్‌పై చేతబడి, రోహిణిపై అనుమానం

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 13 తేదీ నుంచి ఏప్రిల్17వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేసింది. మీనా కిడ్నాప్ ట్రాక్ కథకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. దుండగుల చేతిలో చిక్కుకున్న మీనా భయంతో దేవుణ్ని ప్రార్థిస్తూ కనిపించగా, మరోవైపు బాలు ఆమె కోసం ఆత్రంగా వెతుకుతుంటాడు. వృద్ధ దంపతులు చెప్పిన క్లూ నాగుపాము గుర్తు ఉన్న కారు కథను కీలక మలుపు తిప్పుతుంది. ఈ ఆధారంతో బాలు తన డ్రైవర్ గ్రూప్ సహాయాన్ని కోరడం, వందలాది మంది డ్రైవర్లు అండగా నిలవడం ఎమోషనల్‌గా హైలైట్‌గా నిలిచింది. రామాలయం ప్రాంతంలో అనుమానాస్పద కారు కనిపించడంతో బాలు, రాజేష్ అక్కడికి చేరుకుంటారు. మీనా చీర ఆనవాళ్లు కనిపించడం టెన్షన్‌ను మరింత పెంచుతుంది. ఇదే సమయంలో రాజేష్ కారును ఫాలో అవుతూ లైవ్ లొకేషన్ షేర్ చేయడం కథలో మాస్ ట్విస్ట్. వందల మంది కలిసి మీనాను కాపాడేందుకు రావడం గూస్‌బంప్స్ సీన్‌గా నిలిచింది.

Gunde Ninda Gudi Gantalu week roundup story April 13th to April 17th Episodes highlights

దినేష్ మీనాను బెదిరిస్తూ వేళ్లు కట్ చేయాలని ప్రయత్నించే సమయంలో బాలు చేరుకుని ఆమెను రక్షించడం ఎపిసోడ్ క్లైమాక్స్ హైలైట్. అయితే కిడ్నాప్ డ్రామా ముగిసిన వెంటనే కథ కుటుంబ రహస్యాల వైపు మళ్లింది. మీనాపై దొంగతనం ఆరోపణల విషయం బయటకు రావడంతో బాలు, మీనా కలిసి నిజం తెలుసుకునేందుకు ముందుకు వస్తారు. మీనాక్షిని ప్రశ్నించగా, అసలు డబ్బు ప్రభావతి దాచిందని షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. శివ కేసు విత్‌డ్రా కోసం తీసుకున్న డబ్బు అని తెలిసి పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత మీనా ధైర్యంగా ప్రభావతిని ఎదిరించడం, వరుస ప్రశ్నలతో మూలకు నెట్టడం ఎపిసోడ్‌కు మరో హై పాయింట్. సత్యం కూడా మీనాకు సపోర్ట్ ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారుతుంది. చివరికి "మీరు చెప్తారా? లేక నేను చెప్పనా?" అంటూ మీనా సవాల్ చేయడం ఎపిసోడ్‌ను క్లైమాక్స్ మూడ్‌లో నిలిపింది

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ కథను పూర్తిగా మలుపు తిప్పింది. మీనా కిడ్నాప్ ఘటన తర్వాత కుటుంబంలో దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాలు, మీనా ఇంటికి వచ్చి రెండు లక్షల దొంగతనం విషయంపై ప్రభావతిని నిలదీయడంతో కథ హై వోల్టేజ్ డ్రామాగా మారింది. "ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?" అని బాలు ప్రశ్నించగా, మీనా కూడా తనపై వేసిన నిందపై గట్టిగా నిలబడింది. చివరకు ప్రభావతి నోరు జారడంతో అసలు నిజం బయటపడింది.శివపై పెట్టిన కేసు విత్‌డ్రా చేయడానికి ప్రభావతి లాయర్ నుంచి డబ్బులు తీసుకుందనే విషయం బయటపడటంతో కుటుంబం మొత్తం షాక్ అయింది. సత్యం తీవ్ర ఆగ్రహంతో ఆమెను ఇంటి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించిస్తాడు.

మరోవైపు బాలు తనకు డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదా కేసు వేస్తానని డిమాండ్ చేశాడు. దీంతో ప్రభావతి తీవ్ర ఒత్తిడిలో పడిపోయి తన కొడుకు మనోజ్ వద్ద సహాయం కోరినా, అతను తప్పించుకోవడం ఆమెకు మరో షాక్‌గా మారింది.ఇక రోహిణి ట్రాక్‌లో ట్విస్ట్ మరింత ఆసక్తికరంగా నిలిచింది. పరిస్థితిని తన తెలివితో హ్యాండిల్ చేస్తూ, తాళిబొట్టు తాకట్టు పెట్టి రెండు లక్షలు తెచ్చి మీనాక్షి చేతుల మీదుగా డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. తన సహాయం బయటపడకుండా, మీనాక్షి ద్వారా డబ్బులు ఇచ్చేలా ప్లాన్ చేయడం ఆమె క్యారెక్టర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మరోవైపు బాలు-మీనా మధ్య ఎమోషనల్ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బుధవారం ఎపిసోడ్ హై వోల్టేజ్ డ్రామాతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మీనాక్షి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సన్నివేశం ఒక్కసారిగా టెన్షన్‌తో నిండిపోయింది. బాలు, మీనా ఇద్దరూ ఆమెపై సెటైర్లు వేస్తూ ప్రశ్నలు కురిపించగా, చివరకు మీనాక్షి అసలు నిజం బయటపెట్టింది. కందిపప్పు-పెసరపప్పు డబ్బాల కన్ఫ్యూజన్ వల్లే రెండు లక్షలు పోయాయని అనుకున్నామని, అవే దొరికాయని చెప్పి డబ్బులు ఇచ్చేసింది. దీంతో ఇంట్లో అందరూ షాక్ అయ్యారు.అయితే అసలు డ్రామా ఇక్కడితో ఆగలేదు. "నా భార్యను ఎందుకు దొంగని నింద వేశావ్?" అంటూ బాలు ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సత్యం కూడా ఆమెను నిలదీస్తూ కఠిన వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇదే సమయంలో రోహిణి ముందే మీనాక్షి ఇంటికి వెళ్లిన విషయం బయటపడటం మరో ట్విస్ట్‌గా నిలిచింది. దీంతో ఆమెపై అనుమానాలు పెరుగుతున్నాయి.

డబ్బులు తిరిగి వచ్చినా, బాలు ఐదు లక్షల అప్పు విషయాన్ని ప్రస్తావించి ప్రభావతిని ఇరుకున పెట్టాడు. చివరకు ప్రామిసరీ నోట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మనోజ్ సంతకం చేయడానికి నిరాకరించడం, తల్లి చెంప చెళ్లుమనిపించడం ఎపిసోడ్‌కు హైలైట్‌గా మారింది. కుటుంబంలో విభేదాలు మరింత పెరిగాయి.మరోవైపు బాలు తనకు సహాయం చేసిన వారికి డబ్బులు తిరిగి ఇస్తూ బాధ్యత చూపించాడు. మీనా మాటలు విన్న సత్యం తన కొడుకు కోసం ఉద్యోగం చేయాలని నిర్ణయించుకోవడం ఎమోషనల్ టచ్ ఇచ్చింది. కానీ మనోజ్ మాటలు మరోసారి కుటుంబాన్ని షాక్‌కు గురి చేశాయి. ఇక రోహిణి ట్రాక్‌లో టెన్షన్ పెరుగుతూ, ఆమె దాచిన రహస్యాలు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఎపిసోడ్ ట్విస్టులు, ఎమోషన్, డ్రామాతో నిండిపోయి, రాబోయే ఎపిసోడ్లపై ఆసక్తిని పెంచింది.

గురువారం ఎపిసోడ్ భావోద్వేగాలు, సస్పెన్స్, కుటుంబ ఘర్షణలతో రసవత్తరంగా సాగింది. ఉద్యోగం కోసం బయటికి వెళ్లిన సత్యం ఆలస్యంగా ఇంటికి రాకపోవడంతో ప్రభావతి ఆందోళన చెందుతుంది. మనోజ్ మాత్రం నిర్లక్ష్యంగా స్పందించగా, బాలు తల్లిని సమాధానపరుస్తాడు. కాసేపటికే సత్యం ఉద్యోగం దొరికిందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపడతారు. అయితే అతను పార్కులో పిల్లలకు నీతి కథలు చెప్పే పని చేస్తున్నానని చెప్పడం ఇంట్లో మిశ్రమ స్పందనకు దారి తీస్తుంది. ఈ క్రమంలో బాలు, మనోజ్ మధ్య సెటైర్లు, మాటల యుద్ధం హీట్ పెంచుతుంది. సత్యం తన పని గౌరవాన్ని వివరించగా, ప్రభావతి మాత్రం బాలును తప్పుపడుతుంది. కానీ అసలు ట్విస్ట్ పార్క్‌లో వెలుగులోకి వస్తుంది.

సత్యం చెప్పే కథలకు ప్రజలు ప్రశంసలు కురిపించడంతో పాటు, ఇది ఫ్రీ సర్వీస్ అని చెప్పడం అతనిలో అనుమానాలు కలిగిస్తుంది. చివరకు రంగారావు ద్వారా నిజం బయటపడుతుంది. సత్యం గౌరవం దెబ్బతినకూడదని బాలు నకిలీ ఉద్యోగాన్ని సృష్టించి, తనే డబ్బులు ఇస్తున్నాడని తెలిసి సత్యం ఎమోషనల్ అవుతాడు. మరోవైపు చింటూ విషయంపై బాలు అనుమానాలు పెంచుకుంటాడు. అతని ఊరికి వెళ్లి ఇల్లు ఖాళీగా ఉండటం చూసి షాక్ అవుతాడు. సుగుణమ్మతో మాట్లాడినప్పుడు ఆమె ప్రవర్తనలో తేడా గమనించి, వెనుక ఏదో రహస్యం ఉందని భావిస్తాడు. ఈ విషయాన్ని మీనాతో పంచుకున్నప్పటికీ, ఆమె పెద్దగా పట్టించుకోదు. అయితే రోహిణి మాత్రం ఈ సంభాషణ విని భయపడుతుంది. ఇక క్లైమాక్స్‌లో సత్యం బాలును కౌగిలించుకుని తన ప్రేమను వ్యక్తం చేయడం హృదయాన్ని తాకుతుంది. దీనికి విరుద్ధంగా మనోజ్ చేసిన వ్యాఖ్యలకు ప్రభావతి చెంపదెబ్బ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. చివరగా బాలు తన చిన్ననాటి బాధలను చెప్పుకోవడంతో ఎపిసోడ్ ఎమోషనల్‌గా ముగిసింది.

శుక్రవారం ఎపిసోడ్‌లో కథ అనేక ఆసక్తికర మలుపులతో ముందుకు సాగింది. మొదటగా సత్యం కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకుని ఉద్యోగం కోసం స్కూల్ ఇంటర్వ్యూకి వెళ్లాడు. తన స్నేహితుడు రంగారావు రిఫరెన్స్‌తో వెళ్లిన సత్యం నిజాయితీగా మాట్లాడటంతో యాజమాన్యం ఆకట్టుకుని అకౌంటెంట్ ఉద్యోగం ఇచ్చింది. వారానికి ఒకరోజు పని, త్వరలో కొత్త బ్రాంచ్‌లో రెగ్యులర్ జాబ్ అవకాశం ఇవ్వడం సత్యం జీవితంలో కొత్త ఆశలు నింపింది. ఇదే సమయంలో రోహిణి తన కొడుకు చింటూని అదే స్కూల్‌లో చేర్పించేందుకు తీసుకురావడం కథలో సస్పెన్స్ పెంచింది. ఇద్దరూ ఒకే చోట ఉన్నా ఎదురుపడకపోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మీనా ట్రాక్ టెన్షన్ పెంచింది. పూల డెలివరీకి వెళ్లిన మీనాను ఓ అనుమానాస్పద వ్యక్తి ఫాలో అవుతుండటంతో భయపడిపోయింది. చివరకు సేఫ్ ప్లేస్‌గా విద్య ఇంటికి వెళ్లింది.

అక్కడ ఇప్పటికే రోహిణి ఉండటంతో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలు ఫోన్ విషయాన్ని దాచిపెట్టేందుకు రోహిణి ప్రయత్నించగా, విద్యకు ఫోన్ తీసుకెళ్లి పడేయమని ఆదేశించింది. అయితే మార్గమధ్యలో చెప్పు తెగిపోవడం, బైక్ సమస్య రావడంతో విద్య ఇబ్బందుల్లో పడింది. చివరకు కంగారులో బాలు ఫోన్ అక్కడే మరిచిపోవడంతో అది ముసలి దంపతుల చేతికి చేరింది. ఈ ఫోన్ భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బాలు ట్రాక్‌లో సరదా సన్నివేశాలు కనిపించాయి. ఒక ఫ్రెండ్ ప్రేమ విషయంపై బాలు సలహాలు ఇవ్వగా, అతను ప్రేమిస్తున్న అమ్మాయి మీనానే కావడం పెద్ద ట్విస్ట్. మరోవైపు మనోజ్ ట్రాక్ భయానకంగా మారింది. షాప్ ముందు చేతబడి చేసిన గుడ్లు కనిపించడంతో భయపడిపోయిన మనోజ్ స్వామీజీని ఆశ్రయించాడు. అక్కడ "పేరు, డబ్బు అన్నీ పోతాయి.. అప్పుల పాలవుతారు" అన్న మాటలు అతన్ని మరింత ఆందోళనలోకి నెట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X