Gunde Ninda Gudi Gantalu Weekly: బాలుపై తల్లి ప్రేమ.. ప్రభావతి కుట్ర.. రోహిణి గుట్టురట్టు
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండి గుడిగంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
ఏప్రిల్ 14వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
సత్యం కుటుంబ సమేతంగా పసర్లపుడి గ్రామంలో ఉండటంతో ఉదయం లేవగానే ప్రభావతి కిచెన్ లో నుంచి కాఫీ తీసుకొని వస్తుంది. కోడలు మీనాకు ఎలాంటి పనిచెప్పదు. అత్త సుశీలమ్మ ఆదేశాల మేరకు ఇక వంట పనుల బాధ్యతలను తనే చూసుకుంటుంది. ఈ క్రమంలో మీనాతో ప్రభావతి గొడవ పడుతుంది. ఇక ప్రభావతి చేతిలో ఉన్న కాఫీ ని చూసి ఇది నాకేనా అని సత్యం తీసుకోబోతుంటాడు. దాంతో ప్రభావతి ఇది మీ కోసం కాదు మలేషియా మరిది గారి కోసం నేనే ప్రత్యేకంగా చేశానని గొప్పగా చెబుతుంది. కాఫీని అటు బాలుకు కూడా ఇవ్వదు. మాణిక్యం వచ్చాక అతనికి ఇస్తుంది. మాణిక్యం తాగాక ఈరోజు భోజనాలకు మేకను కొట్టించానని సుశీలమ్మ చెబుతుంది. ఈ క్రమంలో తన మటన్ షాప్ రొడ్డు పక్కనే ఉంటుందని మాణిక్యం మాట జారుతాడు. దాంతో మాణిక్యం వల్ల సమస్య వచ్చేలా ఉందని రోహిణి అతన్ని ఇంటి నుంచి పంపించేస్తుంది. మాణిక్యం వెళ్లిపోయాక అందరూ తిరిగి వెళ్లిపోతామని అంటారు. దాంతో వద్దని సుశీలమ్మ అందనీ ఆపుతుంది. అందరి కోసం ప్రత్యేకమైన ఆటల పోటీలను ఏర్పాటు చేయించానని చెబుతుంది.

ఏప్రిల్ 15వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మాణిక్యం వెళ్లిన తర్వాత సుశీలమ్మ అందరినీ ఇంటిదగ్గరే ఉండాలని అంటుంది. దాంతో కొడుకు కోడలు మనవళ్లు మనవరాలు అందరూ తన మాట విని ఇంట్లోనే ఉండేందుకు ఒప్పుకుంటారు. దాంతో సుశీలమ్మ ఆటల పోటీలకు ఏర్పాటు చేయిస్తుంది. ఇక సత్యం, ప్రభావతిలను కెప్టెన్లుగా పెట్టి మనవాళ్లు మనవరాలను జట్టు సభ్యులుగా కేటాయిస్తుంది. ప్రభావతి జట్టులో కొడుకులు బాలు మనోజ్ రవి ఉంటారు. ఇక సత్యం జట్టులో కోడళ్ళు మీనా రోహిణి శృతి ఉంటారు. ఈ సందర్భంగా మొదటగా థగ్ ఫైట్ పోటీని నిర్వహిస్తారు. తర్వాత టైర్ తో ఆటలాడిస్తుంది సుశీలమ్మ. అందులోనూ బాలు గెలిచి ప్రభావతిని నెగ్గిస్తాడు. ఈ రెండు పోటీల్లో బాలు తన తల్లి ప్రభావతిని గెలిపిస్తాడు. దాంతో వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత శృతి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కూడా ఆడిస్తుంది. ఈ సందర్భంగా ప్రభావతి, బాలు ఒకరిపై ఒకరు తల్లి కొడుకుల ప్రేమను పంచుకుంటారు. దాంతో బాలు తల్లి ప్రేమ దక్కలేదని బాగా ఎమోషనల్ అవుతాడు.
ఏప్రిల్ 16వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో...
రాత్రి బాలు ఒక్కడే బయట పట్టె మంచంపై బాధపడుతూ కూర్చొని ఉంటాడు. మీనా బాలు దగ్గరికి వచ్చి ఓదార్చుతుంది. దాంతో తనకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ దక్కలేదని, అమ్మ ప్రేమ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని భార్య మీనాతో చెబుతాడు. అందుకు మీనా ఏమాత్రం అధైర్య పడద్దని చెబుతుంది. భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. సుశీలమ్మకు పీడకల వచ్చిన వెంటనే నిద్రలో నుంచి లేచి ఆందోళన పడుతుంది. తన మనవడు బాలును మీనా విడిచిపెట్టి పోతుందని కంగారు పడుతుంది. కలే అయినప్పటికీ చాలా ఆందోళన పడుతుంది. వెంటనే బాలు మీనా అని పిలుస్తూ వాళ్ల దగ్గరికి వెళ్తుంది. వెంటనే వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లి దేవుని దగ్గర నిల్చోబెట్టి దిష్టి తీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలుని విడిచి వెళ్ళొద్దని మీనాకు సుశీలమ్మ చెబుతుంది. అందుకు మీనా స్పందిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఇద్దరం కలిసే ఉంటామని చెబుతుంది. ఆ తర్వాత అందరూ తిరిగి హైదరాబాద్ కు వస్తారు.

ఏప్రిల్ 17వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ఊరు నుంచి తిరిగి రాగానే బాలు, ప్రభావతి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. దాంతో సత్యం వారిపై మండిపడుతాడు. రోడ్డుపైనే ఇలా దెబ్బలాడుతూ పరువు తీస్తూన్నారంటూ కోపం చేస్తాడు. ఇక అందరూ ఇంట్లోకి వెళ్తారు. వెళ్లగానే రెస్ట్ తీసుకోవాలని రోహిణి మనోజ్, శృతి అంటారు. మరోవైపు ప్రభావతి కూడా కాస్తా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుంది. ఎవరి గదుల్లోకి వారు వెళ్లాలని అనుకుంటారు. ఇక చివరికి ప్రభావతికే రెస్ట్ తీసుకోవడానికి గదిలేకపోవడంతో ఆ కోపాన్ని బాలు, అతని భార్య మీనాపై చూపిస్తుంది. ఇక సత్యం ఇంటి మీద ఒక రెండు రూమ్ లు కట్టిస్తానని చెబుతాడు. కానీ అలా ఇల్లు కట్టిస్తే మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం కష్టమని భావిస్తుంది.
ఏప్రిల్ 18వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని రూమ్ నాటకం ఆడుతుంటుంది ప్రభావతి. ఇక తన వదిన కామాక్షిని ఇంటికి పిలిపి మాట్లాడుకోవడాని ఒక గది కూడా లేకుండా పోయిందని నుసుగుతుంది. ఎట్టకేళలకు బిల్డింగ్ మీదకు వెళ్లి మాట్లాడుకుంటారు. అక్కడ మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ఆ తర్వాత 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటామని కామక్షి వివరిస్తుంది. ఆ మాటలను మీనా వింటుంది. మరోవైపు బాలు కార్ రైడ్ కోసమని బయటికి వెళ్తాడు. ఈ క్రమంలో ఒక రైడ్ రోహిణి పార్లర్ కు పడుతుంది. నేరుగా అక్కడికి వెళ్లిన బాలు కారు ఎక్కిన ఆవిడా డబ్బులు ఇవ్వకపోవడంతో పార్లర్ లోకి వెళ్తాడు. డబ్బులు ఇవ్వమని అడిగి తీసుకుంటాడు. అయితే అప్పటికే ఆ పార్లర్ లో మాణిక్యం, రోహిణి, రోహిణి స్నేహితురాలు దివ్య ఉంటుంది. వారి బాలు చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందని రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











