Gunde Ninda Gudi Gantalu Weekly: మీనాని పుట్టింటికి వెళ్లొద్దన బాలు.. తండ్రి డబ్బులు కొట్టేసిన మనోజ్

Photo Courtesy: JioHotstar

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండి గుడిగంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

ఏప్రిల్ 19వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో.. మీనా తండ్రి సంవత్సరికం చెడగొట్టి, అక్కడ గొడవ చేయడంపై బాలూకి క్లాస్ పీకుతాడు సత్యం. భర్త చేసిన పనికి కిచెన్‌లోకి వెళ్లి ఏడుస్తుంది మీనా. మీ ఇంటి దగ్గర జరిగినదంతా ఇక్కడ చెప్పడం అవసరమా? అని మీనాపై కసురుకుంటాడు బాలూ. తనకంటూ ఉన్నది మామగారేనని ఆయనకి కాక మరెవరికి చెప్పుకుంటానని మీనా చెబుతుంది. మీనా - బాలూ మధ్య గొడవ చూసి సంబరపడిపోయిన ప్రభావతి త్వరలో మీనా పూలకొట్టు కూడా లేకుండా చేయాలని అనుకుంటుంది. రాత్రి బెడ్ రూంలో రవి దగ్గరికి శృతి వచ్చి మా అమ్మ స్టూడియోకి వచ్చి మన హనీమూన్ ట్రిప్‌కి పాస్‌లు ఇచ్చిందని చెప్పడంతో రవి రగిలిపోతాడు. నాకు హోటల్‌లో చాలా పని ఉందని, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నానని ఈ సమయంలో ఎక్కడికి రానని చెబుతాడు రవి. మేడపై పడుకున్న బాలూ దగ్గరికి .. చాప దిండు తీసుకుని మనోజ్, రవిలు కూడా వస్తారు. చిన్నప్పటి సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ గోల గోల చేస్తారు. రోహిణి, మీనా, శృతిలకు కూడా నిద్రపట్టకపోవడంతో టీ తాగుతూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.

Gunde Ninda Gudi Gantalu week roundup story April 19th to April 23rd Episodes highlights

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 20వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో.. ఉదయాన్నే కాఫీ కోసం మీనాని పిలిచిన ప్రభావతికి కోడలు ఇంట్లో లేదని సత్యం చెబుతాడు. ఇంతలో మనోజ్ మేడపై నుంచి చాప దిండుతో రావడంతో మళ్లీ కొడుకు కోడలు మధ్య ఏం గొడవ జరిగిందోనని ప్రభావతి టెన్షన్ పడుతుంది. బెడ్‌రూంలో బాధపడుతూ నీ కోసం మనసు చంపుకుని నేను హోటల్‌లో వెయిటర్ చేరారని రోహిణితో చెబుతాడు మనోజ్. ఓర్పుతో భరించినా, అన్ని తట్టుకుని సర్దుకుపోయినా వాళ్లు నన్ను అవమానించడంతో జాబ్ మానేశానని రోహిణితో మనోజ్ చెబుతాడు. బాలూ ఫోన్‌లో శివ దొంగతనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తూ మీనా రావడంతో పక్కన పెట్టేస్తాడు. భర్త ఫోన్‌లో ఏదో ఉందని దానిని చెక్ చేస్తుంది మీనా. ఇంతలో బాలూ బాత్‌రూమ్ నుంచి వచ్చి ఫోన్ లాక్కోవడంతో మీనా కోపంగా వెళ్లిపోతుంది. మనోజ్ ఒక్కడే కాకుండా రవి కూడా మేడపై నుంచి రావడంతో షాకైన ప్రభావతి.. ఇంట్లో ఏదో జరుగుతోందని సత్యంతో అంటుంది. ఏం జరిగిందో కనుక్కోవాలని శృతిని పిలిచి అడగ్గా ఆమె కోపంగా వెళ్లిపోతుంది. శివ మళ్లీ గుణ దగ్గరికి పనిచేయడానికి వెళ్తున్నాడని మీనాకి తల్లి పార్వతి ఫోన్ చేసి చెబుతుంది.

ఏప్రిల్ 21వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో.. ఉదయాన్నే రెడీ అవుతున్న శివని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు పార్వతి, సుమతి. నువ్వు ఆ గుణ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదని పార్వతి చెబుతుండగా ఇంతలో మీనా వచ్చి తమ్ముడికి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఆ గుణ దగ్గర పనిచేయడం మీ బావకి కూడా ఇష్టం లేదని అందుకే నిన్ను కొట్టాడని చెబుతుంది. నువ్వు పనిమానేసి బాగా చదువుకోమని నచ్చచెబుతుంది మీనా. సుమతి పెళ్లికి డబ్బులు కావాలని, మంచి ఇల్లు కట్టుకోవాలంటే నేను గుణ దగ్గర పనిచేయాల్సిందేనని తేల్చి చెబుతాడు శివ. మనోజ్‌ని తాను టార్చర్ చేస్తున్నానని ఇకపై ప్రెజర్ తీసుకురాకూడదని రోహిణి అనుకుంటూ ఉండగా పార్లర్‌కు ఆమె మాజీ లవర్ వస్తాడు. తనకు 50 వేలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడంతో రోహిణి వణికిపోతుంది. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుండగా బాలూ దగ్గరికి శివ వచ్చి డబ్బు ముఖాన కొడతాడు. ఈ డబ్బు కోసమే నువ్వు నా చేయి విరక్కొట్టావని, కానీ నా చేయి నువ్వు తీసుకురాగలవా అని నిలదీస్తాడు. ఇంటికొచ్చి శివ ఇచ్చిన డబ్బును సత్యానికి ఇస్తాడు బాలు.

ఏప్రిల్ 22వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో... బాలు తీసుకొచ్చి సత్యంకు ఇచ్చిన డబ్బుపై ఇంట్లో వాళ్లకి డౌట్ వస్తుంది. పోలీసులు అంత తేలిగ్గా పట్టించుకోరని, ఒకవేళ పట్టించుకున్నా పూర్తి మొత్తం రిటర్న్ ఇవ్వరని అంటుంది రోహిణి. దొంగతనం జరిగిన సొమ్మును ముందు కోర్టులో సబ్మిట్ చేస్తారని ఆ తర్వాతే బాధితులకు అందజేస్తారని చెబుతుంది. ఇదే విషయాన్ని ఆలోచిస్తుండగా రోహిణికి మనోజ్ చీవాట్లు పెడతాడు. నా తమ్ముడికి కోపం ఉన్న మాట నిజమే కానీ వాడు దొంగతనాలు చేసే రకం కాదని చెబుతాడు. మీ ఇంటికి ఎందుకు వెళ్లావని మీనాని నిలదీస్తాడు బాలు. మా తమ్ముడు మా అమ్మ మాట వినిపించుకోకుండా ఆ గుణ దగ్గర పనికి వెళ్లాలని అనుకుంటూ ఉండటంతో ఆపడానికి నేను వెళ్లాల్సి వచ్చిందని చెబుతుంది. ఇంకెప్పుడూ వెళ్లొద్దని ఒకవేళ మీ అమ్మతో మాట్లాడాలని అనుకుంటే మనింటికి పిలవమని చెబుతాడు. మీ తమ్ముడున్న ఎక్కడికీ వెళ్లొద్దని మీనాకి ఆర్డర్స్ వేస్తాడు బాలు. దాంతో మీనా శివకి ఫోన్ చేసి మీ బావ నీ మీద ఎందుకంత కోపం చూపిస్తున్నాడు? అని నిలదీస్తుంది. మీ ఆయన చెప్పినట్లు నువ్వు మా ఇంటికి రావొద్దని శివ చెప్పడంతో మీనా షాక్ అవుతుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story April 19th to April 23rd Episodes highlights

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 23వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో.. తన పేరెంట్స్ ఇచ్చిన టికెట్స్‌తో హనీమూన్‌కు వెళ్దామని రవిని మరోసారి అడుగుతుంది శృతి. ఇంకెప్పుడూ ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావొద్దని రవి మేడపైకి వెళ్తాడు. మంచి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నానని నాకు కొంచెం డబ్బులు కావాలని ప్రభావతిని అడుగుతాడు మనోజ్. ఆమె నా దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో సత్యం గదిలోకి వెళ్లి డబ్బులు కొట్టేస్తాడు మనోజ్. తన డబ్బులు కనిపించకపోవడంతో సత్యం అందరినీ అడుగుతాడు. చివరికి మీనా డబ్బులు ఇవ్వడంతో వెళ్లిపోతాడు. మీనా తనకు ఇష్టమైన పూరీలు చేయడంతో బాలు సంతోషంగా తింటాడు. మీనాకు రెండు పూరీలే ఉండటంతో వాటిని ఆమెకు వదిలేసి వెళ్లడంతో ఆమె మురిసిపోతుంది. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లని భయపెట్టి పంపేసిన మనోజ్‌ని సెలెక్ట్ చేస్తాడు సీఈవో. అయితే కెనడా పంపించాలంటే 14 లక్షలు కట్టాలని చెబుతాడు. ఇంటికి నీరసంగా వచ్చిన మనోజ్ ఇదే విషయాన్ని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మరి తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X