Gunde Ninda Gudi Gantalu Weekly: బాలు, మీనాల ఛాలెంజ్.. రోహిణికి ఊహించని సమస్య
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండి గుడిగంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
ఏప్రిల్ 21వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రైడ్ కోసం బయటికి వెళ్లిన బాలు రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరకు వెళ్తాడు. అదే సమయానికి రోహిణితో పాటు మాణిక్యం కూడా బ్యూటీ పార్లర్ లోనే ఉంటాడు. కానీ బాలు మాణిక్యంను చూడడు. ఇక క్యాబ్ డబ్బులు ఇవ్వకుండా వచ్చిన ఆమెను డబ్బులు అడుగుతూ పార్లర్ ఓనర్ రోహిణి కాదు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. రెసెప్షనిస్ట్ మాట్లాడుతూ బోర్డు చూడలేదా? క్వీన్ బ్యూటీ పార్లర్ గా మారిపోయింది. రోహిణి పార్లర్ ను క్వీన్ బ్యూటీ పార్లర్ లో కలిపేశారు. ఇప్పుడు ఈ పార్లర్ కు ఓనర్ ఆమెనే అని చెబుతుంది. దాంతో బాలు పార్లర్ బోర్డు దగ్గర సెల్ఫీలు దిగుతాడు. వెంటనే ఈ విషయాన్ని తండ్రి సత్యంకు చెబుతాడు. సత్యం ఆ విషయాన్ని నమ్మబోడు పైగా ఎవరికీ చెప్పొద్దని అంటాడు. కానీ బాలు తన తల్లి ప్రభావతికి చెప్పాలిందేనని అంటాడు. సత్యం అడ్డుకోవడంతో చెప్పలేకపోతాడు. కనీసం మీనాకు చెబుదామనుకున్న కుదరదు.

ఏప్రిల్ 22వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రోహిణి గుట్టు ఎవ్వరికీ చెప్పనివ్వకపోవడంతో బాలు ఆ విషయాన్ని ఇక తన మనస్సుల్లోనే దాచుకుంటాడు. మరోవైపు మనోజ్ ఇంటర్వ్యూ కోసమని ఉదయాన్నే రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటాడు. తల్లి ప్రభావతిని టిఫిన్ కావాలని అడుతాడు. దాంతో ప్రభావతి మీనాపై అరుస్తుంది. దానికి బాలు మండి పడుతాడు. ఏ టిఫిన్ కోసం మీనానే ఎందుకు పిలుస్తున్నావు? మీనానే టిఫిన్ చేయాలని రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నిస్తాడు. మిగితా వాళ్లు కూడా చేయొచ్చు అని చెబుతాడు. ఆ తర్వాత మేటర్ మనోజ్ వైపు వెళ్తుంది. దాంతో రోహిణి బాలుపై ఫైర్ అవుతుంది. ఎలాగైనా నువ్వు ఇవ్వాళ జాబ్ కొట్టే ఇంట్లోకి రావాలని రోహిణి చెప్పడంతో అదే జోష్ తో బయటికి వెళ్తాడు. తనకు ఇష్టం లేకపోయినా ఒక హోటల్ లో పని చూసుకోని తిరిగి ఇంటి వస్తాడు.
ఏప్రిల్ 23వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో...
మనోజ్ ఓ రెస్టారెంట్ లో జాబ్ చూసుకున్న సంతోషంలో ఇంటికి తిరిగి వస్తాడు. వస్తూ వస్తూ స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు. అవమానించిన తమ్ముడు బాలు ముందే అందరికీ స్వీట్స్ కూడా పంపిణీ చేస్తాడు. ఆ స్వీట్స్ తిన్న బాలు మనోజ్ ఏ రెస్టారెంట్ లో ఈ స్వీట్ తీసుకొచ్చాడో తనకు తెలుసు అని అంటాడు. అదే రెస్టారెంట్ కు తనకు రెగ్యులర్ గా వెళ్లి భోజనం చేస్తానని చెబుతాడు. దాంతో మనోజ్ ఎప్పుడు దొరికిపోతానోనని కంగారు పడుతాడు. మరోవైపు ఎక్కడ జాబ్ చేస్తున్నాడనే సంగతిని మాత్రం మనోజ్ ఎవ్వరికీ చెప్పడు. కనీసం భార్య మీనాకు కూడా చెప్పడు. ఏదేమైనా మనోజ్ కు జాబ్ వచ్చిందనే సంతోషంలో రోహిణి, ప్రభావతి మునిగి తేలుతుంది. మరోవైపు ప్రభావతి మీనాపై చిటికి మాటికీ చిరాకు పడుతుంది. పూలకొట్టుకు వచ్చిన కస్టమర్ల ముందే ఇష్టమొచ్చినట్టు తిడుతూ ఉంటుంది. ఆ మాటలను సత్యం వింటాడు.
ఏప్రిల్ 24వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మీనాను ప్రభావతి నానా మాటలు అనడాన్ని సత్యం వింటాడు. దీంతో ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రభావతిపై సత్యం మండి పడుతాడు. మీనాను ఎందుకు అలా అందరి ముందు అవమానిస్తున్నావు, ఓవైపు నువ్వు మీనాను చిత్ర హింసలు పెడుతున్నా మీనా మాత్రం నీ గురించి గొప్పలు చెబుతోందని వివరిస్తాడు. అలాంటి మంచి మనసున్న మీనాను నువ్వు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావో తెలియడం లేదని ఫైర్ అవుతాడు. పైగా మీనా ఒంటిపై బంగారాన్ని ఎందుకు తీయించావు వెంటనే ఇవ్వమని ప్రభావతిపై అరుస్తాడు. దీంతో ప్రభావతి నేనేమైనా తీసుకున్నాన ఇంట్లో ఉందిగా వేసుకోమనండి అంటూ బదులిస్తుంది. దాంతో మీనా స్పందిస్తూ ఆ బంగారం మాత్రం అస్సలు వేసుకోనని చెబుతుంది. తన భర్త ఎప్పుడైతే కొని తీసుకొచ్చి ఇస్తాడో అప్పుడే వేసుకుంటానని చెబుతుంది. దాంతో బాలు వెంటనే బయటికి వెళ్లి బంగారం కొనేందుకు డబ్బులు ఏర్పాటు చేసుకుంటాడు. బంగారం కొంటాడు కూడానూ. ఇక తిరిగి వచ్చే దారిలో తన చెల్లి మౌనికా తలకు గాయంతో కనిపిస్తుంది. ఆమె భర్త సంజూ కూడా పక్కనే ఉంటాడు. సంజూనే తన చెల్లిని కొట్టి ఉంటాడని బాలు సందేహిస్తాడు.
ఏప్రిల్ 25వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
తన చెల్లి మౌనికా, సంజూను బాలు తన కారులోనే ఇంట్లో డ్రాప్ చేస్తాడు. ఈ సందర్భంగా సంజూ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? నీ తలకు గాయం కావడానికి సంజూనే కారణమా? అని బాలు అడుగుతాడు. కానీ మౌనిక నిజం చెప్పదు. దీంతో బాలు సంజూ మధ్య స్వల్ప ఘర్షణ జరుగుతుంది. తర్వాత ఎవరి దారిలో వారు వెళ్లిపోతారు. ఆ తర్వాత బాలు ఇంటికి తిరిగి వస్తాడు. తను మీనా కోసం తెచ్చిన బంగారు పుస్తెలును అందరికీ చూపిస్తాడు. దాంతో మీనా, సత్యం, రవి, శృతి సంతోషిస్తారు. మీనాను అప్పుడే మెడలో వేసుకోమంటే వేసుకోదు. దానికి ప్రత్యేకమైన సమయం ఉందని చెబుతుంది. ఆ పుస్తెలును దేవుడి దగ్గర పెట్టి మనం రేపు ఒక ప్లేస్ కు వెళ్తున్నామని బాలుతో చెబుతుంది. దానికి బాలు సరే అంటాడు. ఇక మరోవైపు రోహిణికి తన మాజీ భర్త వర్దన్ నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. డబ్బులు ఇవ్వమని హెచ్చరిస్తాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి ఎపిసోడ్ లో బాలు మీనా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చూపించారు. ఆ సన్నివేశం ఎలా జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











