Gunde Ninda Gudi Gantalu Weekly: 3 కోట్ల మోసం, చింతామణి vs మీనా పోరు, ఉచ్చులో మనోజ్, ప్రభావతి రాజసం!

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకూ 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరిత మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకవైపు బాలు తన తండ్రి సత్యంను స్కూల్‌కు తీసుకెళ్లగా, మరోవైపు రోహిణి తన కొడుకు చింటూతో అదే స్కూల్‌కు రావడం కథలో టెన్షన్ పెంచింది. చింటూ స్కూల్‌లో కొత్త ఫ్రెండ్స్ అయ్యారని, బెస్ట్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్లాలని కోరగా రోహిణి మాత్రం ఇతరులతో ఎక్కువగా కలవొద్దని కఠినంగా చెప్పింది. స్కూల్ వద్దకు చేరుకున్న చింటూ, బాలు మరియు సత్యంను గుర్తుపట్టబోతుండగా రోహిణి భయంతో అతని నోరు మూసి దాక్కుంది. తర్వాత వాచ్‌మెన్ ద్వారా సత్యం కొత్త అకౌంటెంట్‌గా జాయిన్ అయ్యాడని తెలుసుకుని షాక్‌కు గురైంది. తన గతం బయటపడుతుందనే భయంతో చింటూని స్కూల్‌కు పంపకుండా ఇంటికి తీసుకెళ్లింది. దీంతో చింటూ కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత రోహిణి తన తల్లి సుగుణమ్మతో బాధ పంచుకుంది. కానీ నిజం చెప్పమన్న తల్లి మాటలను తిరస్కరించిన రోహిణి, సత్యంను ఆ ఉద్యోగం నుంచి తీసేయాలని ప్లాన్ చేస్తున్నానని సంచలనంగా చెప్పింది.

Gunde Ninda Gudi Gantalu week roundup story April 27th to May 1st Episodes highlights

Photo courtesy: Jio Hotstar

ఇదే సమయంలో మనోజ్ తన ఫ్రెండ్ మణికంఠతో కలిసి ఓ విల్లా చూడటానికి వెళ్తాడు. రోహిణి వచ్చేంతవరకు ఇల్లు చూడనని చెప్పి భార్యపై ప్రేమను చూపిస్తాడు. రోహిణి వచ్చాక ఇద్దరూ కలిసి ఆ విలాసవంతమైన ఇంటిని చూసి మంత్రముగ్ధులవుతారు. మార్కెట్ విలువ ఐదు కోట్లు అయినా, మూడు కోట్లకే ఇస్తామని చెప్పడంతో మనోజ్ వెంటనే అడ్వాన్స్ ఇస్తానని ఒప్పుకుంటాడు. అయితే వారు వెళ్లిన తర్వాత అసలు నిజం బయటపడుతుంది. ఇంటి యజమానులుగా నటించిన వారు మోసగాళ్లు అని తెలుస్తుంది. దీంతో మనోజ్-రోహిణి భారీ మోసంలో పడినట్టుగా సంకేతాలు ఇచ్చారు. మరోవైపు మీనా చేసిన పూల డెకరేషన్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఫంక్షన్ హాల్ మేనేజర్ ఆమె ప్రతిభను కొనియాడి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయితే ఈ రంగంలో నెంబర్ వన్‌గా ఉన్న చింతామణి అనే మహిళ మీనాకు కొత్త ప్రమాదంగా పరిచయమైంది. మీనా ఎదుగుదలను అడ్డుకోవాలని ఆమె హెచ్చరించడంతో రాబోయే ఎపిసోడ్‌లపై ఆసక్తి పెరిగింది.

మంగళవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ విభేదాలు, దాంపత్యంలో చిన్న మాటలే పెద్ద సమస్యలుగా మారే విధానాన్ని హైలైట్ చేసింది. మీనా తన మొదటి పూల డెకరేషన్ ఆర్డర్ విజయవంతంగా పూర్తి చేసి ఆనందంగా ఇంటికి చేరుతుంది. సత్యం ఆమెను అభినందిస్తాడు కానీ ప్రభావతి మాత్రం స్వీట్లు పెట్టిందని కారణంగా గొడవ మొదలుపెడుతుంది. బాలు కూడా మొదట మీనాను ప్రోత్సహించినా, తర్వాత పరిస్థితులు మారిపోతాయి. కస్టమర్ ముందు తనను చిన్నచూపు చూసిన ఘటన, ప్రభావతి వ్యంగ్యాలు బాలుని మనసుకు గుచ్చుకుంటాయి.

అదే సమయంలో మీనా సరదాగా "మీ కంటే నేను ఎక్కువ సంపాదిస్తా" అన్న మాట అతనిలో అహంకారాన్ని తాకుతుంది.తర్వాత కస్టమర్ మీనాతోనే మాట్లాడి అడ్వాన్స్ డబ్బులు ఇవ్వడం, బాలును పట్టించుకోకపోవడం అతనికి అవమానంగా అనిపిస్తుంది. మీనా ఆనందంలో మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించడంతో బాలు మరింత బాధపడతాడు. చివరకు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోతాడు.బాలు ఫోన్ కూడా ఎత్తకపోవడంతో మీనా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. సత్యం ఆమెకు అండగా నిలుస్తాడు కానీ ప్రభావతి మాత్రం విషపు మాటలతో పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఇక ఎపిసోడ్ చివర్లో బాలు ఎక్కడ ఉన్నాడు? తిరిగి వస్తాడా? అనే ఉత్కంఠతో కథ ముగుస్తుంది.

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠ, కుటుంబ విభేదాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలు ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మీనా తీవ్ర ఆందోళనకు గురవడం హైలైట్‌గా నిలిచింది. ఉదయం నుంచి కాల్స్ చేసినా స్పందన లేకపోవడంతో ఆమె గుండెల్లో భయం పెరిగిపోతుంది. ఈ సమయంలో ఆమెకు తోడుగా నిలవాల్సిన ప్రభావతి మాత్రం వ్యంగ్యంగా మాట్లాడి పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుంది. దీంతో సత్యం కోపంతో ప్రభావతిని మందలిస్తూ, కోడలికి ధైర్యం చెప్పాలని గట్టిగా హెచ్చరిస్తాడు. ఇంతలో బాలు ఇంటికి చేరుకోగా, అతడిని సత్యం ప్రశ్నిస్తాడు. కానీ బాలు సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. తర్వాత మీనా దగ్గరకు వెళ్లిన బాలు, తన అహంకారంతో ఆమెను బాధపెట్టేలా మాట్లాడుతాడు. "నీకంటే నేను ఎక్కువ సంపాదించాను" అంటూ డబ్బు ఇవ్వడం మీనాను షాక్‌కు గురిచేస్తుంది.

తన ఎదుగుదలపై భర్త ఇలా స్పందించడంతో ఆమె మనసు దెబ్బతింటుంది. చివరకు బాలు తన తప్పును గ్రహించి క్షమాపణ చెప్పడం, మీనా అతడిని క్షమించడం భావోద్వేగంగా చూపించారు. ఇద్దరూ కలిసి భోజనం చేసే సన్నివేశం వారి బంధాన్ని మరింత బలంగా చూపించింది. మరోవైపు మనోజ్ ట్రాక్ ఆసక్తికరంగా మారింది. అకస్మాత్తుగా పూజలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అతడు రాజమండ్రి వద్ద విల్లా కొనాలని చెప్పడం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. తక్కువ ధరకు పెద్ద డీల్ అని చెప్పడంతో సత్యం, బాలు అనుమానం వ్యక్తం చేస్తారు. చివర్లో తుమ్ముల సన్నివేశం హాస్యాన్ని తెచ్చినా, అదే సమయంలో రాబోయే ప్రమాదానికి సంకేతంలా అనిపించింది. తదుపరి ఎపిసోడ్‌పై ఉత్కంఠ పెరిగింది.

గురువారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతూ కథను కీలక మలుపులోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా మనోజ్ విల్లా ట్రాక్‌లో సస్పెన్స్ మరింత పెరిగింది. తక్కువ ధరకు విల్లా దొరకడం వెనుక ఏదో మోసం ఉందని అనిపించినప్పటికీ, రోహిణి ఒత్తిడితో మనోజ్ ఐదు లక్షల అడ్వాన్స్ ఇచ్చాడు. మోసగాళ్లు నకిలీ ప్రామిసరీ నోట్ ఇచ్చి, ముందే రెండు రోజులు విల్లాలో ఉండమని ఆఫర్ ఇవ్వడంతో అతను పూర్తిగా నమ్మకంలో పడిపోయాడు. ఇంటికి వచ్చాక ఈ విషయాన్ని చెప్పగా, ప్రభావతి ఆనందంతో మురిసిపోతుంది. అయితే బాలు మాత్రం ఇది స్పష్టమైన మోసం అని హెచ్చరిస్తూ కుటుంబాన్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తాడు. రవి, శృతి కూడా అతనికి మద్దతుగా నిలుస్తారు. చివరికి నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో అందరూ కలిసి విల్లాకు వెళ్లాలని నిర్ణయించుకోవడం కథలో ఆసక్తిని పెంచింది.

ఇక మరోవైపు మీనా ట్రాక్ కూడా ఆసక్తికరంగా మారింది. కొత్త డెకరేషన్ ఆర్డర్ కోసం వెళ్లిన ఆమెకు ఫంక్షన్ హాల్‌లో అడ్డంకులు ఎదురవుతాయి. ఇదే సమయంలో చింతామణి ఎంట్రీ ఇచ్చి మీనాను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తుంది. "ఎవరు తక్కువ కొటేషన్ ఇస్తే వాళ్లకే డీల్" అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంది. మీనా కూడా ధైర్యంగా పోటీకి దిగుతుంది. కానీ చింతామణి చతురతతో తక్కువ ధర కోట్ చేసి కస్టమర్లను కన్ఫ్యూజ్ చేస్తుంది. చివరికి కస్టమర్లు ఆలోచించేందుకు టైమ్ తీసుకోవడంతో మీనా-చింతామణి మధ్య బిజినెస్ రైవల్రీ ప్రారంభమవుతుంది. ఒకవైపు విల్లా మోసం, మరోవైపు బిజినెస్ పోటీ... ఈ రెండు ట్రాక్‌లు కథను మరింత రసవత్తరంగా మార్చాయి.

శుక్రవారం ఎపిసోడ్‌లో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. ఒకవైపు చింతామణి వేసిన వ్యూహాలు, మరోవైపు మనోజ్ కుటుంబం విల్లాలోకి ప్రవేశించడం కథలో కొత్త మలుపులను తీసుకొచ్చాయి. మీనాకు రావాల్సిన పెళ్లి ఆర్డర్‌ను దొంగిలించేందుకు చింతామణి సగం ధరకు కోట్ ఇచ్చి ముందుగా ఆర్డర్‌ను దక్కించుకుంది. అయితే ఆమె అసలు ప్లాన్ పెళ్లికి ముందు రోజు పూలు లేవని చెప్పి అధిక ధరలు వసూలు చేయడమే. ఈ విషయం తెలుసుకున్న మీనా తీవ్రంగా షాక్ అవుతుంది. "ఆమె ఎప్పుడూ ఇలా చేస్తుంది" అన్న మాటలు మీనాలో అనుమానాలను మరింత పెంచాయి. ఇక మరోవైపు ప్రభావతి విల్లాకు వెళ్లేందుకు చీర ఎంపికలో గడిపిన సన్నివేశాలు హాస్యాన్ని పండించాయి. సత్యం వేసిన సరదా కౌంటర్లు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. చివరకు రోహిణి సెలెక్ట్ చేసిన చీరలను చూసి ప్రభావతి సంతోషపడటం ఫ్యామిలీ ఎమోషన్‌ను చూపించింది.

మనోజ్ కుటుంబం విల్లాకు చేరిన తర్వాత కథ మరింత సస్పెన్స్ వైపు మళ్లింది. విల్లా అందాలు అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, ఓనర్స్ ప్రవర్తన రవి, శ్రుతికి అనుమానంగా అనిపిస్తుంది. అయినా మనోజ్ రూ.25 లక్షల అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేయడం కీలకంగా మారింది. డబ్బు తీసుకున్న వెంటనే ఓనర్స్ వెళ్లిపోవడం అనుమానాలను మరింత పెంచింది. బాలు మాత్రం ఈ వ్యవహారంపై అప్రమత్తంగా ఉండి ప్రశ్నలు వేయడం కథలో టెన్షన్ పెంచింది. ఇదే సమయంలో న్యూమరాలజిస్ట్ ఎంట్రీతో మరో ట్విస్ట్ వచ్చింది. మనోజ్ పేరుపై షాకింగ్ కామెంట్స్ చేసి 'రోమతి' అనే వింత పేరు సూచించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ సస్పెన్స్, ఎమోషన్, కామెడీ మిక్స్‌గా సాగుతూ తర్వాతి భాగాలపై ఆసక్తిని పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X