Gunde Ninda Gudi Gantalu Weekly: మీనాకు దక్కిన గౌరవం.. మనోజ్ కు తిప్పలు.. బాలుకు ముందు కొత్త సవాల్

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండి గుడిగంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

ఏప్రిల్ 28వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు మీనా కోసం చేయించుకొని వచ్చిన బంగారు పుస్తెలను తీసుకొని అమ్మవారి గుడికి వెళ్తుంది. అక్కడికి వెళ్లగానే బాలును తన బావమర్ది, మరదలు, అత్తమ్మ అందరూ ఆహ్వానిస్తారు. అర్థం కానీ బాలు ఎందుకు ఇంతలా మర్యాద ఇస్తున్నారని అడుగుతాడు. దానికి మీనా కొత్త బట్టలు ఇచ్చి ప్రస్తుతం ఇవ్వి మార్చుకొని రండి అని చెబుతుంది. ఆ తర్వాత మనం మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నామని అంటుంది. తమ పెళ్లి సమయంలో బాలుకు మీనా, మీనాకు బాలు అంటే ఏమాత్రం ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటారు. అదే విషయాన్ని మీనా బాలుతో చెబుతుంది. కానీ ఇప్పుడు ఇద్దరం ఒకటిగా బతుకుతున్నాం గునుక ఇప్పుడు నీతో మనస్పూర్తిగా తల వంచుకొని తాళి కట్టించుకుంటానని చెబుతుంది. అందుకు బాలు కూడా సంతోషిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు.

Gunde Ninda Gudi Gantalu week roundup story April 28th to May 2th Episodes highlights

ఏప్రిల్ 29వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ప్రభావతి రోహిణికి ఊహించని షాక్ ఇస్తుంది. మీనా గురించి మాట్లాడుతూ బాలు తెచ్చిన మూడు గ్రాముల బంగారానికే మీనా ఎంతగానో మురిసిపోతోంది. నువ్వు కూడా బంగారు నగలన్నీ వేసుకో అని రోహిణికి సూచిస్తుంది. నీ నగల్నీ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తుంది. అన్ని నగలు ఉన్నా ఎందుకు పసుపు తాడే వేసకుంటున్నావని అడుగుతుంది. దాంతో రోహిణి గుండె గుబేలు అంటుంది. మీనా నాన్నతో చెప్పి కిలో బంగారం పంపించమని ప్రభావతి అంటుంది. కనీసం మీ మామయ్యతోనైనా చెప్పి 20 తులాల బంగారం వెంటనే పంపించమని అడుగు అని అంటుంది. లేదంటే నేనే అడుగుతానని అంటుంది. దాంతో రోహిణి నేనే అడుగుతాను అత్తయ్య అని చెప్పి అప్పటి వరకు సమస్య నుంచి తప్పించుకుంటుంది. ఇక కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన బాలు మీనా విషయంలో అందరూ సంతోషిస్తారు. కానీ ప్రభావతి మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. మళ్లీ పెళ్లి ఏంటీని మండిపడుతుంది. బాలుపై మీనాకు చెడుగా చెబుతూ వారిని విడదీయాలని చూస్తుంది. ఇదిలా ఉంటే బాలు మీనా మొదటి రోజు రాత్రి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఏప్రిల్ 30వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో...
మనోజ్ నిద్రలోనే తను రెస్టారెంట్ లో పని చేస్తున్నట్టుగా కలవరపడుతాడు. అన్నీ టిఫిన్ పేర్లను చెబుతూ కలవరిస్తాడు. ఆ మాటలు విన్న రోహిణి మనోజ్ ను నిద్రలేపి ఏం జరిగిందని, అలా వెయిటర్ లాగా టిఫిన్ పేర్లు ఎందుకు చెబుతున్నావంటూ మండిపడుతుంది. దాంతో నాకు మసలా దోశ తిన్నట్టుగా కల వచ్చిందన్నారు. తిందామనుకొని తినకపోవడంతో అలా వచ్చి ఉంటుందని చెప్పారు. ఇక దాంతో మనోజ్ కోసం అని హోటల్ నుంచి రెండు మసాలా దోశలు ఆర్డర్ చేసి తీసుకొస్తుంది. టిఫిన్ను హాల్లోని టేబుల్ పై పెడుతుంది. ఆ టిఫిన్ మీనా తనకోసం తెచ్చింది అనుకొని బాలు తింటూ ఉంటాడు. దీంతో రచ్చ మొదలవుతుంది. మనోజ్, ప్రభావతి, రోహిణి బాలుపై మండిపడుతారు. దాంతో బాలు రోహిణి పార్లర్ గుట్టు చెబుతానని అనడంతో భయపడుతుంది. వెంటనే సారీ చెబుతుంది. ఇక ప్రభావతి బాలు మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కామాక్షిని తీసుకొని బయటికి వెళ్తుంది. తిరిగి తిరిగి మనోజ్ పనిచేస్తున్న రెస్టారెంట్ కు వెళ్తుంది. అక్కడ మనోజ్ వారిని చూసి చాలా ఇబ్బంది పడుతాడు. నానా తిప్పలు పడి వారి కంట పడకుండా తప్పించుకుంటాడు.

మే 1వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ప్రభావతి కామాక్షి అదే హోటల్ కు వెళ్లి టిఫిన్ ఆర్డర్ చేస్తారు. మనోజ్ వాళ్ళని ముందుగానే చూసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోమని మరొక వెయిటర్ ని బతిలాడుతాడు. అతను సరే అని ఒప్పుకొని వెళ్లి ప్రభావతి కామాక్షి దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. ఈ క్రమంలో హోటల్ యజమాని మనోజ్ మనోజ్ అంటూ మాటిమాటికి అరుస్తూ ఉంటాడు. నానా మాటలు తిడతాడు. అలా తన కొడుకు మనోజ్ పేరుతో ఆ ఓనర్ తిడుతూ ఉంటే ప్రభావతి తట్టుకోలేక పోతుంది. వెంటనే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావ్ అంటూ అడుగుతుంది. మనోజ్ ఇక సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ బిజీగా ఉన్నానని అబద్ధం చెబుతాడు. ఇక మరోవైపు ఇంట్లో దోమల స్ప్రే కొట్టడంతో సత్యం శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతాడు. వెంటనే మీనా ఆస్పత్రికి తీసుకెళ్తుంది. విషయం తెలుసుకొని అందరూ ఆస్పత్రికి వస్తారు. సత్యం ఆరోగ్యంపై ఆరా తీస్తారు.

మే 2వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
సత్యంను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత శృతి ఇంటికి తిరిగి వస్తుంది. రాగానే బాలుకు కోపం తెప్పించేలా మాట్లాడుతుంది. 'అప్పుడే ఇంటికి వచ్చారనే అంటే సమస్య చిన్నదేనా' అని అంటుంది. దాంతో బాలుకు మండిపడుతాడు. నువ్వు చేసిన పనివల్లే మామ సత్యంకు ప్రాణాపాయం కలిగిందని మీనా చెబుతుంది. దోమల స్ప్రే ఎక్కువ కొట్టడం వల్ల ఇలా జరిగిందని వివరిస్తుంది. అందులో నా తప్పేమీ లేదని, సత్యం హెల్త్ హిస్టరీ తనకు తెలియదని శృతి వాదిస్తుంది. కానీ బాలు, మీనా, రోహిణి, రవి, ప్రభావతి కూడా తనదే తప్పనడంతో చివరికి వెళ్లి సత్యంకు సారీ చెబుతుంది. అంతటితో సమస్య సర్దుమణుగుతుంది. ఇక ఆ తర్వాత బాలు తమ ఫ్యామిలీ ఫొటోను ఫ్రేమ్ కట్టించేందుకు ఫొటో స్టూడియోకు వెళ్తాడు. అక్కడ మీనా తమ్ముడు దొంగతనం చేసిన వీడియోను చూస్తాడు. ఆ వీడియోలో తన తల్లి ప్రభావతి బ్యాగ్ నే దొంగతనం చేయడం చూసి షాక్ అవుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X