Gunde Ninda Gudi Gantalu Weekly: రోహిణి దొంగతనం.. గుణ కిడ్నాప్ ప్లాన్.. మీనా లైఫ్ డేంజర్!

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్6వ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముందుగా మీనా కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పూల వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయిస్తుంది. పెళ్లిళ్లు, వేడుకలకు డెకరేషన్ చేస్తే మంచి ఆదాయం వస్తుందని బాలును ఒప్పిస్తుంది. ఆమె క్రియేటివిటీ చూసి బాలు కూడా వెంటనే సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేయాలని సూచిస్తాడు. శృతి ఎంట్రీతో మీనా బిజినెస్ మరింత ప్రొఫెషనల్‌గా మారుతుంది. మోడ్రన్ లుక్, యాడ్ షూట్, ర్యాంప్ వాక్ ట్రైనింగ్‌తో మీనా కొత్త అవతారంలో కనిపిస్తుంది. ఇక మరోవైపు కథలో ఉత్కంఠ పెంచిన రోహిణి ట్రాక్ కీలకంగా మారింది. ప్రభావతి అకస్మాత్తుగా తన నిర్ణయం మార్చుకోవడం వెనుక డబ్బు కారణమని రోహిణి తెలుసుకుంటుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story April 6th to April 10th Episodes highlights

Photo courtesy: Jio Hotstar

శివ కేసు ఉపసంహరణకు రూ.2 లక్షలు తీసుకున్నట్లు మీనాక్షి చెప్పడంతో షాక్ అవుతుంది. ఇదే సమయంలో గుణ నుంచి వచ్చిన బెదిరింపులతో రోహిణి మరింత ఆందోళన చెందుతుంది. తన సమస్య పరిష్కారం కోసం స్నేహితురాలు విద్యతో కలిసి ప్లాన్ వేసి, ప్రభావతిని డాన్స్‌లో బిజీగా పెట్టి ఆమె దగ్గర దాచిన డబ్బును తెలివిగా దొంగిలిస్తుంది. ఇక బాలు సరదాగా మీనాను "ముంబై నుంచి వచ్చిన నా కొత్త లవర్"గా పరిచయం చేయడం వల్ల ప్రభావతి కోపంతో ఊగిపోతుంది. చివరకు అది మీనానే అని తెలిసి షాక్ అవుతుంది. ఈ సంఘటనతో మీనాపై ప్రభావతికి ఉన్న ప్రేమ బయటపడుతుంది. చివరగా రోహిణి గుణకు డబ్బు ఇచ్చి సమస్య ముగిసిందని అనుకుంటుంది. కానీ గుణ-దినేష్ కలిసి ఆమెను మోసం చేస్తూ మరింత డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేయడం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.

మంగళవారం ఎపిసోడ్ లో ముంబై నుంచి ముఖేష్ ఫోన్ చేసి యాడ్ ఫిల్మ్ చేయాలని చెప్పడం కథలో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. మొదట పెద్ద సెలబ్రిటీని తీసుకురావాలనుకున్న మనోజ్‌కు, కుటుంబ సభ్యులే యాడ్‌లో నటిస్తే బెటర్ అని ముఖేష్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఒక్కో జంటకు రూ.50,000 ఇస్తామని చెప్పడంతో మనోజ్ బయటకు ఓకే అన్నప్పటికీ, లోపల మాత్రం ఖర్చు గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడతాడు.రోహిణి మాత్రం ఈ ప్లాన్‌పై ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. కానీ మనోజ్ ఖర్చు తగ్గించడానికి కుట్ర పన్ని, అసలు మొత్తాన్ని దాచిపెట్టి తక్కువ డబ్బులు ఇవ్వాలని ప్లాన్ చేయడం ఫన్నీగా చూపించారు. ఇదే సమయంలో రోహిణి తనలో తాను అనుకునే డైలాగ్ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇంట్లో అందరినీ యాడ్ కోసం ఒప్పించే సన్నివేశాలు కూడా వినోదాన్ని పంచాయి.

బాలు సెటైర్లు, ప్రభావతి కామెంట్లు, శృతి కాన్ఫిడెన్స్ అన్ని కలిసి మంచి కామెడీని తీసుకొచ్చాయి. అయితే మీనా-ప్రభావతి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎమోషనల్ టచ్ ఇచ్చింది. గత విషయాలను గుర్తుచేసుకుంటూ మీనా ఇచ్చిన కౌంటర్ సీన్‌కు బలం చేకూర్చింది. యాడ్ షూట్ సమయంలో డైరెక్టర్ ముక్కోటి ముకుంద ఎంట్రీతో మరింత హాస్యం పెరిగింది. అతని కోపం, అరిచే స్టైల్, పాత్రల కేటాయింపులో చేసిన తేడాలు అన్ని కలిసి నవ్వులు పూయించాయి. ముఖ్యంగా బాలు-డైరెక్టర్ మధ్య జరిగిన మాటల యుద్ధం ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. "బాలు... చాలు" అనే కోడ్ వర్డ్ సీన్ మొత్తం ఎంటర్టైనింగ్‌గా మార్చింది. క్లైమాక్స్‌లో అసలు ట్విస్ట్ బయటపడింది. యాడ్ కోసం డబ్బులు ఇవ్వడం లేదని చెప్పిన మనోజ్ అబద్ధం బయటపడడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రతి ఒక్కరికీ రూ.25,000 ఇస్తున్నారని తెలిసి కుటుంబం మొత్తం మనోజ్ వైపు తిరిగింది.

బుధవారం ఎపిసోడ్ హై వోల్టేజ్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖేష్ ఇచ్చిన రెండు లక్షల వ్యవహారం బయటపడటం కథలో కీలక మలుపు తీసుకొచ్చింది. ఇప్పటివరకు డబ్బులు తీసుకోలేదని చెప్పిన మనోజ్ అబద్ధం బయటపడటంతో ఇంట్లో ఉద్రిక్తత నెలకొంది. బాలు, రవి కలిసి అతడిని నిలదీయగా, చివరకు మనోజ్ నిజం చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో రవి కోపంతో టేబుల్ విసిరేయడం, బాలు ఆగ్రహంతో రెచ్చిపోవడం ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. సత్యం జోక్యం చేసుకుని సమస్యను సర్దుబాటు చేయాలని ప్రయత్నించినా, పరిస్థితి మరింత క్లిష్టమైంది. చివరకు మనోజ్ అందరికీ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి రూ.25,000 ఇస్తూ పరిస్థితిని నియంత్రించాలనుకున్నా, ప్రభావతికి తక్కువ మొత్తం ఇవ్వడం మరో వివాదానికి దారితీసింది. దీంతో ఆమె ఆగ్రహంతో మనోజ్‌పై విరుచుకుపడింది.

రోహిణి కూడా నిజం చెప్పడంతో మీనా, శృతి తీవ్రంగా స్పందించి అతడిపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేయడం కథను మరింత వేడెక్కించింది. ఇక రవి ట్రాక్‌లో కూడా ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. నీతూ ఒత్తిడితో తన బాయ్‌ఫ్రెండ్‌గా నటించాల్సి వచ్చిన రవి, హోటల్‌లో జరిగిన సన్నివేశంలో ప్రేమలో ఉన్నట్టు నటించడం కథను కొత్త దిశలో నడిపించింది. అయితే అక్కడికి వచ్చిన శృతి ఈ సన్నివేశం చూసి షాక్ అవడంతో కథలో పెద్ద ట్విస్ట్ వచ్చింది. మరోవైపు బాలు-మీనాల ట్రాక్ భావోద్వేగంగా సాగింది. మీనా ముందుగానే అప్పు తీర్చడం, సత్యం వారికి తెలియకుండా సహాయం చేయడం కుటుంబ బంధాలను హైలైట్ చేశాయి.

గురువారం ఎపిసోడ్ హై వోల్టేజ్ డ్రామాతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. ప్రభావతి ఖరీదైన చీరలు కొనాలని నిర్ణయించడం నుంచి ప్రారంభమైన సంఘటన, రెండు లక్షల రూపాయలు మాయమవడంతో పెద్ద వివాదంగా మారింది. డబ్బు కనిపించకపోవడంతో మీనాక్షి షాక్‌కు గురవడం, ప్రభావతి కూడా కుప్పకూలడం ఇంట్లో టెన్షన్ పెంచాయి. చివరకు అనుమానం నేరుగా మీనాపై పడటంతో కథ కీలక మలుపు తీసుకుంది. మరోవైపు రవి-శృతి ట్రాక్‌లో అపార్థాలు తొలగి మళ్లీ ప్రేమ వాతావరణం నెలకొంది. నీతూ చేసిన ప్రాంక్ బయటపడడంతో శృతి కోపం తగ్గింది. అలాగే బాలు-మీనాల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కానీ బాలు వైజాగ్ వెళ్లిపోవడంతో పరిస్థితులు మారిపోయాయి. ఇంటికి వచ్చిన ప్రభావతి మీనాపై దొంగతనం ఆరోపణలు చేస్తూ తీవ్రంగా మాట్లాడడం, ఆమెను అవమానించడం ఎపిసోడ్‌ను మరింత వేడెక్కించింది. సత్యం జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. శృతి, రవి మీనాకు సపోర్ట్‌గా నిలవడం కథకు బలం ఇచ్చింది. అయితే రోహిణి ప్రభావతికి మద్దతు ఇవ్వడం అనుమానాలకు దారి తీసింది. చివరగా, మీనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం మరో ట్విస్ట్‌గా నిలిచింది. ఈ విషయం విన్న రోహిణి గుణకు ఫోన్ చేయడం, అతడు "నేను చూసుకుంటా" అని చెప్పడం సస్పెన్స్‌ను పెంచింది. ఇక నిజం బయటపడుతుందా అన్న ఆసక్తితో ఎపిసోడ్ ముగిసింది.

శుక్రవారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభం నుంచే రోహిణి చేసిన దొంగతనం బయటపడుతుందనే భయంతో టెన్షన్‌లో కనిపిస్తుంది. గుణను సంప్రదించి సహాయం కోరినా, అతడు నిర్లక్ష్యంగా స్పందిస్తూ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాడు. ఇదే సమయంలో మీనా తనపై పడిన నిందను తట్టుకోలేక నిజం బయటపెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అయితే దినేష్ ఆమెను అడ్డగించి కిడ్నాప్ చేయడం కథలో కీలక మలుపుగా మారింది. ఇంట్లో మీనా కనిపించకపోవడంతో ఉద్రిక్తత పెరుగుతుంది. మనోజ్ చేసిన వ్యాఖ్యలతో శృతి, సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రభావతి కూడా మీనాపై ఆరోపణలు చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కుతుంది.

ఇదే సమయంలో వైజాగ్ నుంచి వచ్చిన బాలు ఈ పరిణామాలను చూసి షాక్ అవుతాడు. తన భార్యపై నిందలు వేయడాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మీనాను వెతకడానికి బయలుదేరుతాడు. మరోవైపు గుణ-దినేష్ మీనాను ఒక గదిలో బంధించి బాలు‌ను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఫోన్ కాల్స్ ద్వారా అతడిని తప్పుదారి పట్టిస్తూ చివరకు ప్రాణహాని ఉందని బెదిరిస్తారు. దీంతో బాలు అనుమానం గుణపై పడుతుంది. చివరగా, మీనా బంధించబడిన పరిస్థితిలో దేవుణ్ణి ప్రార్థిస్తుండగా, బాలు కూడా ఆమె కోసం ఆవేదనతో ప్రార్థించడం భావోద్వేగంగా చూపించారు. ఇలా ఎపిసోడ్ క్లైమాక్స్ మరింత ఉత్కంఠ పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X