Gunde Ninda Gudi Gantalu Weekly: అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్న రోహిణి.. బాలుకు ముందు ఊహించని సవాల్
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండి గుడిగంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
ఏప్రిల్ 7వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈ వారం చాలా ఆసక్తికరంగా సాగింది. రోహిణి మేనమామ మలేషియా నుంచి వస్తున్నాడని ప్రభావతి ఎంతో హడావుడి చేస్తుంది. అన్ని రకాల వంటలు వండిస్తుంది. గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. రోహిణి వాళ్ల మేనమామ ఎంతో రాయల్ గా వస్తాడని ప్రభావతి ఊహిస్తుంది. అంచనాలు పెంచేసుకుంటుంది. కానీ ఆ జూనియర్ ఆర్టిస్ట్ మాణిక్యం భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటి ముందు ఉన్న కుడిది తొట్టిలో పడిపోతాడు. దీంతో ప్రభావతి, రోహిణి, మనోజ్ అతన్ని చూసి ఎంతో షాక్ అవుతారు. వెంటనే పైకి లేపుతారు. ఇక ఆయనకు రాగానే ఇలా జరగడంతో ప్రభావతి అప్సెట్ అవుతుంది. చేసేదేమీ లేక ఆయన్ని ఇంట్లోకి తీసుకెళ్లి స్నానానికి ఏర్పాట్లు చేస్తారు. అయితే అతను వచ్చీ రాగానే మేకల గురించి మాట్లాడుతాడు. మలేషియా నుంచి వచ్చి మేకల గురించి మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతారు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఏప్రిల్ 8వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రోహిణి మేనమామగా వచ్చిన మాణిక్యం ను ఇంట్లోకి తీసుకెళ్లి రెడీ అవ్వమని చెబుతారు. ఇక ఓవైపు శృతి అతన్ని చూసి మలేషియా వారిలా లేడని రవితో అంటుంది. రవి కూడా నాకు అదే సందేహం కలుగుతుందని అంటాడు. ఇక ఏదేమైనా ప్రభావతి అతని ముగ్గురు కోడళ్లతో హారతీ ఇచ్చి మళ్లీ ఇంట్లోకి స్వాగతం పలుకుతుంది. ఆ తర్వాత రోహిణి ముందుగానే చెప్పినట్టుగా ఆ ఫేక్ మలేషియా మేనమామ కొత్త బట్టలు, బంగారు బ్రాస్ లైట్ ఇస్తాడు. ఇక బాలుకు ప్రభావతి కావాలని ఆ బట్టలు, బంగారం చూపించడంతో ఇంతేగా అని అంటాడు. దానికి మీ తాగుబోతు బాలు ఇతనేనా అని మలేషియా మేనమామగా వచ్చిన మాణిక్యం అంటాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. రోహిణి వాళ్ల మేనమామ రిచ్ కావడంతో సకల మర్యాదలు చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ ముందుగానే సుశీలమ్మ మీనాకు మాత్రం ఎవ్వరూ వంట పని చెప్పొద్దని చెప్పడంతో ప్రభావతికి వంట డ్యూటీ పడుతుంది. సుశీలమ్మ ఆదేశాలతో చేసేదేమీ లేక ఇద్దరు కోడళ్ళు రోహిణి, శృతితో కలిసి వంట చేసేందుకు పూనుకుంటుంది. శృతికి కూరగాయలు కట్ చేయడం రాకపోవడంతో వేలు కోసుకుంటుంది. తనకు పసుపు పెట్టి ఇక రెస్ట్ తీసుకోమని చెబుతారు. అప్పటికే ఊర్లోకి వెళ్లి వచ్చిన సత్యం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ రోజు ఈ కూరగాయలు కట్ చేసే పనిని సంతోషంగా చేస్తానని చెబుతాడు. ఈ క్రమంలోనే రోహిణి వాళ్ళ మేనమామ ఎంట్రీ ఇచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతాడు. సత్యం డ్రైవర్ ఉద్యోగి అనడంతో హేళన చేస్తాడు. దాంతో బాలుకు మండిపోతుంది. అదే కాకుండా కీమా కొట్టినట్టుగా కూరగాయలను తరుముతాడు. దాంతో మాణిక్యంను రోహిణి ఇంట్లోకి తీసుకెళ్లి క్లాస్ పీకుతుంది.
ఏప్రిల్ 9వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో...
ఉగాది పర్వదినం సందర్భంగా సుశీలమ్మ కొత్త కోడళ్ళతో నైవేద్యం వండిస్తుంది. వారి కుటుంబాలు పది కాలాలపాటు చల్లగా ఉండాలని స్వయంగా వారి చేతనే నైవేద్యాలు అందించి నెత్తిన బోనం ఎత్తిస్తుంది. దేవతలకు నైవేద్యం పెట్టిస్తుంది. ఆ తర్వాత తెలుగు పండగల సంప్రదాయాలను అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది. ఇంటి ముందు కూర్చొని అందరూ ప్రసాదం తింటూ ఉంటే.. మళ్లీ మాణిక్యం తన మేక డైలాగ్ లతో విసిగిస్తాడు. అదే సమయంలో అతనిపై డౌట్ క్రియేట్ అయ్యేలా మాట్లాడుతాడు. దీంతో బాలు వెంటనే వచ్చి ప్రతి దానికి మేక మేక అని అంటావు ఏంటీ, నువ్వేదో మంట కొట్టు నడుపుతున్నట్టు అని సందేహం వ్యక్తం చేస్తాడు. రోహిణికి టెన్షన్ మొదలువుతంది. ఆ తర్వాత సుశీలమ్మ ముగ్గురు మనవరాళ్లు, మనవాళ్లను దగ్గరికి పిలిచి వారందరికీ ఉగాది ప్రసాదం తినిపిస్తూ ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉండాలని సూచిస్తుంది. కడుపులో మోసిన పిల్లలతో పాటు, కోడళ్లను కూడా సమానంగా చూసుకోవాలని ప్రభావతికి చెబుతుంది. ఆ తర్వాత మనోజ్ జాబ్ విషయంపై మాణిక్యం మాట్లాడుతాడు. మనోజ్ స్పందిస్తూ తనకు జాబ్ ఇంట్రెస్ట్ లేదని, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని ఉందని బదులిస్తాడు. ఆ తర్వాత రోహిణి వాళ్ల అమ్మగారి గురించి మాణిక్యం మాట్లాడుతాడు. కిడ్నీ, లివర్, లంగ్స్ ఫెయిల్ అయ్యి చనిపోయిందని చెప్పడంతో రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. బతికి ఉన్న తల్లిని పదే పదే చంపుకోవాల్సి వస్తుందని బాధపడుతుంది.
ఏప్రిల్ 10వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
తన తల్లి గురించి పదే పదే అబద్ధం చెపాల్సి వస్తోందని రోహిణి ఏడుస్తూ ఉంటుంది. దీంతో శృతి, మీనా, సుశీలమ్మ, ప్రభావతి వచ్చి ఆమెను ఓదార్చుతారు. ఇలా అయిపోతే ఎలా అని ధైర్యం చెబుతారు. నిన్ను మీ అత్త ప్రభావతి అమ్మలా చూసుకుంటుందని, చూసుకోవాలని కూడా సుశీలమ్మ అంటుంది. దాంతో ప్రభావతి అలాగే చూసుకుంటున్నాను అత్తయ్య అని బదులిస్తుంది. ఇక ఆ తర్వాత బాలు ఎలాగైనా మలేషియా మేనమామ గుట్టు రట్టు చేయాలని నిర్ణయించుకోగా... అతనే వచ్చి ఊర్లోకి వెళ్దామా? అని అడుగుతాడు. ఇదే మంచి సమయం అనుకొని బాలు మాణిక్యంను తీసుకొచి బయటికి వెళ్తాడు. మలేషియా గురించి పలు ప్రశ్నలు అడుగుతాడు. కానీ మాణిక్యం ఇచ్చే సమాధానాలతో ఇంకా డౌట్ క్రియేట్ అవుతుంది. కళ్లు తాగితే ఇంకా పచ్చి నిజాలు చెబుతాడని తీసుకెళ్లి తాటికల్లు తాగిస్తారు. తాగినా కూడా ఏమాత్రం నిజం చెప్పడు. పైగా మనోజ్ కు కూడా వద్దువద్దు అన్నా కూడా కల్లు తాగిస్తాడు.
ఏప్రిల్ 11వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మాణిక్యంతో నిజాలు చెప్పిద్దామనుకున్న బాలు ప్రయత్నం విఫలం అవుతుంది. ఇక పొలం వద్ద తాగి పడిపోయిన మలేషియా మామా, మనోజ్ లను తీసుకొని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే మనోజ్ లేవకపోవడంతో బాలు లేపుతుంటాడు. ఎందుకు లేపుతున్నావ్ అలాగే పడుకోనివ్వు అని మాణిక్యం అంటాడు. దాంతో బాలు వీడు తాగడని తెలిస్తే నన్ను ఇంట్లో వాళ్లు ఉతికారేస్తారని అంటాడు. ఎలాగూ మనోజ్ కు తాగించింది నువ్వే కాబట్టి నిజం ఒప్పుకోవాలని అంటాడు. అందుకు మాణిక్యం సరే అంటాడు. కానీ ఇంట్లోకి వెళ్లాక ప్లేట్ పిరాయిస్తాడు. మనోజ్ వద్దువద్దు అంటున్నా బాలునే తాగించాడని నింద వేస్తాడు. దాంతో ప్రభావతి, రోహిణి బాలుపై మండిపడుతారు. సుశీలమ్మ చెంప చెల్లుమనిస్తుంది. ఇక ఎలాగైనా మలేషియా మేనమామ సంగతి ఏంటో చూడాలని, ఆయన గుట్టు రట్టు చేయాలని నిర్ణయించుకుంటూ మళ్లీ తాగుతాడు. మీనా వచ్చి ఆపుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇలా ఈ వారం మొత్తం రోహిణి తన మేనమామగా మాణిక్యం నటింపజేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అతను మాట్లాడే విధానానికి ఎక్కడా దొరికిపోతానోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగింది. మరోవైపు అతని గుట్టురట్టు చేయాలని నిర్ణయించుకున్న బాలునే నిందలపాలయ్యాడు. ఇప్పుడు మాణిక్యం అసలు రంగు బయట పెట్టడం బాలుకు పెద్ద సవాల్ గా మారింది. ఇక నెక్ట్ 400 ఎపిసోడ్ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











