Gunde Ninda Gudi Gantalu Weekly: రోహిణికి ముప్పుతిప్పలు.. పోలీస్ స్టేషన్ లో మనోజ్.. మీనాకు చిక్కులు
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
ఆగస్టు 4వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మీనాకు బాలు మొబైల్ ఫ్లవర్ షాప్ ఏర్పాటు చేయడంతో మీనా సంతోషిస్తుంది. కానీ మనోజ్ మాత్రం అప్సెట్ అవుతాడు. బాలుకు మీనా, మీనాకు బాలు ఎంతో సపోర్ట్ చేసుకుంటున్నారని, కానీ నాకుమాత్రం ఎవరూ సహకరించడం లేదని బాధపడుతాడు. నాకు నువ్వు కూడా కెనడాకు వెళ్లడానికి డబ్బులు ఇప్పించడం లేదని రోహిణితో అంటాడు. దాంతో రోహిణి తిరిగి ఫైర్ అవుతుంది. మీ అమ్మ లాగే నువ్వు కూడా నన్ను టార్చర్ పెడుతున్నావా?అని అడుగుతుంది. ఇక నీకు కావాల్సింది డబ్బులే కదా అని ఓ సలహానిస్తుంది. నీ దగ్గర 40 లక్షలు తీసుకొని మోసం చేసిన ఆమెను ఇప్పుడు పట్టుకుందామని అంటుంది. ఇక మనోజ్ ఆమె పేరు కల్పనా ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ ఆమెకు ఫ్లైట్ బుక్ చేసింది నేనే అని రోహిణిని కన్సల్జెన్సీ ఆఫీస్ కు తీసుకెళ్తాడు. అక్కడ కల్పనా వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ కన్సల్టెన్సీ వాళ్లు ఇవ్వరు. ఇక మరోవైపు బాలు క్యాబ్ ను మనోజ్ ను మోసం చేసిన మాజీ లవర్ కల్పనా బుక్ చేసుకుంటుంది. బాలు క్యాబ్ లోనే హైదరాబాద్ లో తిరుగుతూ ఉంటుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసమని ఇండియాకు వచ్చానని చెబుతుంది. ఇక మరోవైపు రోహిణిని దీక్ష చేపట్టాలని ప్రభావతి అంటుంది. అందుకు అందరం గుడికి వెళ్లాలని చెబుతుంది. 21 రోజులు దీక్ష చేస్తే మలేషియా జైలులో ఉన్న మీ నాన్న తిరిగి బయటికి వస్తారని అంటుంది. దాంతో అందరితో కలిసి గుడికి బయల్దేరుతుంది.

ఆగస్టు 5వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రోహిణి దీక్ష ప్రారంభం సందర్భంగా ప్రభావతి అందరినీ గుడికి తీసుకొని వెళ్తుంది. బాలును కూడా మీనాతో ఫోన్ చేయించి రప్పిస్తుంది. బాలు తన క్యాబ్ లో ఉన్న కల్పనా దగ్గర పర్మిషన్ తీసుకొని గుడి దగ్గరకు వెళ్తాడు. ఇక గుడిలో రోహిణితో ప్రభావతి చాలా పూజలు చేయిస్తుంది. చల్లనీళ్లతో స్నానం, గుంజీలు, పొరివిదండాలు పెట్టిస్తుంది. ఇక బాలు వచ్చి రోహిణిని చూసి షాక్ అవుతాడు. మంచి లాయర్ ను మాట్లాడితే సరిపోతుంది కాదా.. ఇంతలా రోహిణి కష్టపెట్టి, ఆ దేవుడిని ఇబ్బంది పెట్టాలా అని అంటాడు. ఇలాంటి విషయాల్లో దేవుడి అనుగ్రహం కావాలని తండ్రి సత్యం వివరిస్తాడు. ఇక మరోవైపు మనోజ్ కు ఫోన్ కాల్ వచ్చి గుడి బయటికి వెళ్తాడు. ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతాడు. దాంతో అదే సమయంలో కల్పనా మనోజ్ ను చూస్తుంది. వెంటనే కారులో దాక్కుంటుంది. మనోజ్ కంట పడకుంట జాగ్రత్త పడుతుంది.
ఆగస్టు 6వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మనోజ్ కారు చుట్టూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతాడు గానీ, కారులో ఉన్న కల్పనాను మాత్రం చూడడు. ఇక కల్పనా వెంటనే బాలుకు ఫోన్ చేసి రమ్మని అంటుంది. త్వరగా కారు తీయమని చెబుతుంది. రిజిస్ట్రేషన్ కు లేట్ అవుతుందని కారు తీయమని అంటుంది. దాంతో బాలు కల్పనాను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా మనోజ్ నుంచి తప్పించుకుంటుంది. ఇక రోహిణి వాళ్ల నాన్న పేరున ప్రభావతి అర్చన చేయిస్తుంది. ఇక పూజారి రోహిణి వాళ్ల నాన్న పేరు అడిగితే చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. మీ నాన్న పేరు కూడా మర్చిపోయావా అని ప్రశ్నిస్తారు. తన కన్న తండ్రి రాజమౌళి పేరు చెబుతుంది. ఏదోక నక్షత్రం చెబితే దొరికిపోతుంది. ఆ పేరుకు తులా రాశి, చిత్త నక్షత్రం వస్తుందని మీనా సరి చేస్తుంది. ఆ తర్వాత పూజలు ముగుస్తాయి. ఇలాగే 21 రోజులు చేయాలని పూజారి చెబుతాడు.
ఆగస్టు 7వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ఇక దీక్ష పేరుతో ప్రభావతి రోహిణి ని టార్చర్ చేస్తూ ఉంటుంది. మీ నాన్న కోసం నేను ఇంత తప్పన పడుతున్న కూడా నీకు ఏమాత్రం బాధగా లేదా అని అంటుంది. నువ్వు ఎలాగైనా ఈ దీక్షను పూర్తి చేయాల్సిందే అని అంటుంది. ఇందుకు నీ వంట నువ్వే చేసుకోవాలని, నేల మీద పడుకోవాలని, బోళ్లు, బట్టలు వాష్ చేసుకోవాలని అంటుంది. ఇక తొలిరోజు వంట చేయడం కూడా నేర్పిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు కూడా వేయమని చెబుతుంది. రోహిణికి ఇష్టం లేకున్నా కూడా వేస్తుంది. ఇక మరోవైపు మీనా అందరి కోసమని పూరీ కూర చేస్తుంది. ఇక శృతి, రవి, ప్రభావతి, సత్యం అందరూ తింటూ ఉంటారు. ఇక బాలు కూడా వచ్చి మూడు పూరీలు వేసుకొని తింటూ ఉంటాడు. కానీ ప్రభావతి వాటిని లాగేసుకుంటుంది. ఇక బాలు దీక్ష పేరును వాడుకొని మనోజ్, రోహిణిని కూడా తినకుండా చేస్తాడు. ఆ తర్వాత మనోజ్ మాజీ లవర్ కల్పనా ఫోన్ చేస్తే పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. ఆమె పార్లర్ కు వెళ్లాలని అడగడంతో రోహిణి పని చేసే పార్లర్ దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ కల్పనాను చూసి రోహిణి షాక్ అవుతుంది.
ఆగస్టు 8వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
కల్పనా వచ్చిన వెంటనే చైర్ లో కూర్చొబెట్టి బయటికి వెళ్లి మనోజ్ కు ఫోన్ చేస్తుంది. కల్పనా వచ్చిందని చెబుతుంది. దీంతో వెంటనే మనోజ్ వచ్చి కల్పనాను చూస్తాడు. ఇక కోపం పట్టలేక ఫైర్ అవుతాడు. వస్తూ వస్తూ పోలీసులకు కూడా చెప్పి వస్తాడు. పోలీసులు వచ్చి కల్పనాతో మనోజ్ రోహిణిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తాడు. కల్పనా తనకు ఏం తెలియదని, మనోజే మోసం చేశాడని చెబుతుంది. కానీ మనోజ్ కల్పనానే తనను మోసం డబ్బులు కాజేసిందని ఆధారాలు చూపిస్తాడు. వెంటనే తిరిగి ఇప్పించండి అని పోలీసులను కోరుతాడు. ఇక పోలీసులు కల్పనాను డబ్బులు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేస్తారు. అందుకు ఫైనల్ గా ఆమె కూడా డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కానీ బాలుతో సాక్షి సంతకం పెట్టించి ఇరికిస్తారు. ఇది ఎలా జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications










