Gunde Ninda Gudi Gantalu Weekly: ప్రభావతికి సుశీలమ్మ హెచ్చరిక.. అన్నాచెల్లెల్ల అనుబంధం కట్.. భయాందోళనలో మనోజ్
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
గుండె నిండా గుడిగంటలు సోమవారం (డిసెంబర్ 15)ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ ఎపిసోడ్‌లో కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తతలు, బాధ్యతల అంశాలు తీవ్రంగా బయటపడతాయి. ప్రభావతి ఆగడాలను సత్యం సుశీలమ్మకు వివరించడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయినా, ఇప్పుడే క్షమాపణల కోసం పట్టుబట్టడం సరైంది కాదని, చివరికి ఒంటరిగా మిగిలిపోయేది సత్యమేనని సూచిస్తూ ప్రభావతితో మాట్లాడమని చెబుతుంది. సత్యం మొండిపట్టు వీడకపోవడంతో సుశీలమ్మ కుటుంబ సభ్యులందరితో పంచాయతీ పెడుతుంది. ఇంటి ఇల్లాలిగా ప్రభావతి బాధ్యతగా వ్యవహరించాల్సిందని, సమస్యలను దాచకుండా భర్తతో కలిసి పరిష్కరించాలని గట్టిగా హెచ్చరిస్తుంది.

నగల విషయంలో తాను కావాలని చేయలేదని, మనోజ్ భయంతో ఆ తప్పు జరిగిందని ప్రభావతి వివరణ ఇస్తుంది. కానీ మోసాన్ని దాచిన తీరు సుశీలమ్మకు కోపం తెప్పిస్తుంది. చివరకు సత్యం, ప్రభావతి మాట్లాడుకోవాలని సూచిస్తుంది. మీనాపై నింద వేసినందుకు క్షమాపణ కావాలని సత్యం డిమాండ్ చేస్తాడు. ఇక్కడ పంతాలకు చోటులేదని సుశీలమ్మ స్పష్టత ఇస్తుంది. ఆ తర్వాత మనోజ్‌ను గట్టిగా మందలించి, నెలకు 50 వేల చొప్పున డబ్బు తిరిగి చెల్లించే బాధ్యత అతనిపైనే కాకుండా ప్రభావతిపైన కూడా వేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనోజ్ ఒప్పుకుంటాడు. చివరికి ఈ గొడవలు ప్రభావతి మనసును ముక్కలు చేస్తాయి.
ఇక మంగళవారం (డిసెంబర్ 16)ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంట్లో జరుగుతున్న ప్రతి పరిణామాలన్నిటికి మనోజే కారణమంటూ ప్రభావతి అతడిని నిలదీస్తుంది. ఈ క్రమంలో మనోజ్ నోరు జార్చి, "నన్ను లాభం కోసమే కన్నావా?" అంటూ మాట్లాడటం ప్రభావతి మనసును ముక్కలుచేస్తుంది. తన కోసం చేసిన త్యాగాలు, కడుపులో దాచుకున్న బాధలు, ఒక ఆడపిల్లను ఒట్టి చేతులతో పంపించిన సంఘటనలన్నీ గుర్తుచేస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయినా మనోజ్‌లో ఎలాంటి పశ్చాతాపం కనిపించకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది.ఇక హాల్‌లో మీనాను పనిమనిషిలా ఆర్డర్ చేయడాన్ని గమనించిన సుశీలమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఇకపై ప్రతి దంపతులు తమ టిఫిన్ తామే చేసుకోవాలంటూ కఠిన నిర్ణయం తీసుకుంటుంది. దీంతో ఇంటిల్లిపాది వంటగదిలోకి దిగుతుంది. సత్యం-ప్రభావతి మధ్య ఉద్రిక్తత, మనోజ్-రోహిణి తడబాటు, శృతి-రవి సరదా క్షణాలు అన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. చివరికి భర్తభార్యలు ఒకరికి ఒకరు తినిపించుకోవాలన్న సుశీలమ్మ ఐడియాతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇక సమస్యలు కొంత తగ్గడంతో బాలు కొత్త కారు కొనాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఎపిసోడ్ చివర్లో మనోజ్‌కు వచ్చిన సీల్డ్ లెటర్ కొత్త ఉత్కంఠను రేపుతుంది. "నీ చుట్టూ ఉన్నవారితో సమస్యలు వస్తాయి" అనే హెచ్చరిక ఆసక్తికరంగా మారింది.
ఇక బుధవారం (డిసెంబర్ 17)ఎపిసోడ్‌లో బుధవారం ఎపిసోడ్‌లో భావోద్వేగాలు, రొమాన్స్ కలగలపి సాగింది. మనోజ్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి లెటర్ రావడం కథను కొత్త మలుపు తిప్పింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న మనోజ్‌కి ఈ లెటర్ మరింత భయాన్ని కలిగిస్తుంది. రోహిణి కూడా ఆందోళనకు లోనవుతుంది. మొదట తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దినేష్‌పై అనుమానం వచ్చినా, అతడు జైల్లో ఉండడంతో ఈ లెటర్ ఎవరు రాశారు అన్నది మిస్టరీగానే మిగులుతుంది. ఇక మరోవైపు బాలు కొత్త కారు తీసుకొచ్చి మీనాను ఆటపట్టించే ప్రయత్నం చేస్తాడు.
రెండో పెళ్లాంతో వచ్చానని చెప్పి భయపెట్టాలనుకున్నా, మీనా తెలివిగా రివర్స్ ఇస్తుంది. నిజం తెలిసిన తర్వాత ఇంట్లో ఆనందం నెలకొంటుంది. కారు పూజ సమయంలో సుశీలమ్మ మీనాకే తాళాలు ఇవ్వడంతో ప్రభావతి అసూయపడుతుంది. అయితే సుశీలమ్మ ప్లాన్ ప్రకారం బాలు తన తల్లిదండ్రులను కారులో తీసుకెళ్లి రష్ డ్రైవింగ్ చేసి, ప్రభావతి, సత్యంల మధ్య దూరం తగ్గుతూ క్రమంలో వారి మాటలు కలుస్తాయి. చివరికి వారు నవ్వుతూ ఇంటికి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రవి,శృతి మధ్య రొమాంటిక్ సీన్స్ ఎపిసోడ్‌కు క్యూట్ టచ్ ఇచ్చాయి.
ఇక గురువారం (డిసెంబర్ 18)ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒకవైపు సత్యం, ప్రభావతి కలయిక, మరోవైపు అన్నా-చెల్లెల్ల మధ్య తెగిన అనుబంధం, ఇలా ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలతో నిండిపోయింది. తొలుత సత్యం మధ్య అపార్థాలు తొలగి వారు మళ్లీ కలవడం ఎపిసోడ్‌కు హైలెట్ మారింది. సుశీలమ్మ మధ్యవర్తిత్వంతో సంసారం అంటే సర్దుబాటే అన్న సందేశం బలంగా నిలిచింది. బొట్టు బిల్లా సీన్ కాస్త హాస్యంతో పాటు వారి దగ్గరతనాన్ని సూచించింది. ఆ తర్వాత మౌనిక-బాలు ట్రాక్ పూర్తిగా ఎమోషనల్‌గా మారింది.
పార్టీ సీన్‌లో బాలు తన చెల్లితో మాట్లాడేందుకు తపనపడటం, మౌనిక పరిస్థితుల వల్ల అతడిని తిరస్కరించాల్సి రావడం గుండెను పిండేసేలా చూపించారు. "అతడు ఎవరో నాకు తెలియదు" అన్న మౌనిక మాటలు బాలు గుండెను ముక్కలు చేశాయి. సంజు ఈగో, ప్రతీకార భావన ఈ ట్రాక్‌ను మరింత హైలెట్ గా మారింది. అతని సవాలు రాబోయే రోజుల్లో మరింత సంఘర్షణకు సంకేతంగా మారాయి. ఇక శృతి-రవి ట్రాక్‌లో పిల్లల అంశంపై వచ్చిన చర్చ సీరియల్‌కు కొత్త మలుపు ఇచ్చింది. శృతి తీసుకున్న నిర్ణయం రవిని షాక్‌కు గురి చేయగా, వారి మధ్య గ్యాప్ పెరిగినట్లు చూపించారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ భావోద్వేగాలు, సంఘర్షణలు, రాబోయే డ్రామాను బలంగా ముందుకు నడిపించింది.
ఇక శుక్రవారం (డిసెంబర్ 19)ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠతో సాగింది. బాలు తన చెల్లెలు మౌనిక తనను పరాయివాడిలా చూసిన తీరు గుర్తు చేసుకుని లోపల లోపల కుమిలిపోతాడు. ఈ పరిస్థితిని గమనించిన మీనా అతనికి ధైర్యం చెబుతూ, మౌనిక ఉద్దేశపూర్వకంగా అలా ప్రవర్తించలేదని ఓదారుస్తుంది. అయినప్పటికీ మీనా మనసులో మౌనిక ప్రవర్తనపై అనుమానం పెరుగుతూనే ఉంటుంది. ఇదే సమయంలో సంజూ అసలు స్వరూపం బయటపడుతుంది. మౌనికతో హీనంగా మాట్లాడుతూ, బాలు బాధపడటం తనకు ఆనందమని చెప్పడం కలచివేస్తుంది. మీనా ఫోన్ చేసినా, సంజూ భయంతో మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం మీనాలో మరింత ఆందోళన పెంచుతుంది.
మరోవైపు అజ్ఞాత లెటర్ మనోజ్‌ను తీవ్ర భయానికి గురిచేస్తుంది. తల్లిని అనుమానించిన మనోజ్‌పై ప్రభావతి కోపంతో చేయి చేసుకోవడం కుటుంబంలో ఉద్రిక్తతను పెంచుతుంది. మరుసటి రోజు బాలు తన రెండో కారును తండ్రి సత్యం చేత రాజేష్ కి కిరాయికి ఇవ్వగా, మనోజ్ వెటకార వ్యాఖ్యలు చేస్తాడు. దీనికి మీనా ఘాటుగా సమాధానం ఇవ్వడంతో గొడవలు ముదురుతాయి. చివర్లో మనోజ్ జ్యోతిష్యుడిని ఆశ్రయించగా, అతడు చెప్పిన ప్రమాద హెచ్చరిక మనోజ్ భయాన్ని మరింత పెంచుతుంది. ఇలా ఉత్కంఠభరితంగా ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications











