Gunde Gudi Gantalu Weekly: నిమ్మకాయ ప్లాన్ సక్సెస్.. ప్రభావతి, మనోజ్‌ల గుట్టురట్టు.. చితకబాదిన సత్యం..

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

గుండె నిండా గుడిగంటలు సోమవారం (డిసెంబర్ 1) ఎపిసోడ్‌‌‌లో బాలు తెచ్చిన "మంత్రించిన నిమ్మకాయ" పూజా గదిలో ఉంచిన నాటి నుంచే ప్రభావతి-మనోజ్‌ల గుండెల్లో భయం మొదలైంది. రాత్రిళ్లు ఒక్కొక్కరుగా పూజా గదిలోకి వెళ్లి నిమ్మకాయను తొలగించాలని ప్రయత్నించినా, "ముట్టుకుంటే సమస్య వస్తుందేమో" అనే భయంతో ఏమీ చేయలేకపోయారు. గాని ఆందోళనలో ఉన్న ప్రభావతి, మీనాక్షికి ఫోన్ చేసి "ఈ నిమ్మకాయ వల్ల ఏదైనా జరుగుతుందా?" అని ఏడుస్తుంది. మీనాక్షి మాత్రం స్వామిజీ దగ్గరకు వెళ్లాలని సూచిస్తుంది. తరువాత రోజు తెల్లవారుజామునే మనోజ్ స్వామిజీని కలవడానికి సిద్ధమవుతాడు. ఇంట్లో రోహిణి, సత్యం, బాలు ప్రశ్నలు అడగగా ప్రభావతి మనోజ్‌లు పొంతనలేని సమాధానాలు చెబుతారు. అబద్ధాలు చెప్పడాన్ని గుర్తించిన బాలు, వారి ప్రవర్తనను అనుమానంతో గమనిస్తాడు. చివరికి ప్రభావతి మనోజ్‌ను తీసుకొని స్వామిజీ వద్దకు వెళ్తుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story December 1st to December 5th Episodes highlights

స్వామిజీ ముందే బాలు గురించి చాడీలు చెప్పాలనుకున్నా, అతను కోపంతో "ఇంట్లో ఎలా అబద్ధం చెప్తావో ఇక్కడా అలా చెప్తున్నావు" అంటూ వారిని నిలదీస్తాడు. ప్రభావతి చివరికి నిజం చెప్తుంది. మనోజ్ నష్టాలను పూడ్చేందుకు మీనా నగలను అమ్మేసిన విషయం బయట పడుతుందనే భయంతో నిమ్మకాయపై భ్రమ పడుతున్నట్టు ఒప్పుకుంటుంది. స్వామిజీ కూడా భయపెట్టేలా "మంత్రించిన నిమ్మకాయ రసం శరీరాన్ని చచ్చుబడిస్తుంది" అంటాడు. పరిష్కారంగా మరో మంత్రించిన నిమ్మకాయను ఇచ్చి, బాలు నిమ్మకాయ పక్కన పెట్టమంటాడు. ఇంటికి వచ్చాక నిమ్మకాయ పెట్టేలోపే అది కింద పడిపోవడంతో మనోజ్ షాక్ అవుతాడు. ప్రభావతి పట్టుపట్టి స్వామి నిమ్మకాయను పక్కన పెడుతుంది. ఇదంతా గమనించిన బాలు, కొత్త ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమవుతాడు.

ఇక మంగళవారం (డిసెంబర్ 2)ఎపిసోడ్‌లో ఎలాగైనా నగల దొంగలను బయటపెట్టాలనే బాలు కొత్త ప్లాన్ వేస్తాడు. 'బిపిఎల్-బాలు ప్రీమియర్ లీగ్' అంటూ మొదలైన ఈ స్కెచ్‌లో ముందుగా మనోజ్ గది తలుపు తడతాడు. తలుపు తెరిచి ఎవరూ లేరని చూసి మనోజ్ నిర్లక్ష్యంగా తలుపు తెరిచి ఉంచేస్తాడు. ఇదే బాలు అవకాశంగా నిమ్మకాయకు దారం కట్టి మనోజ్ వైపు విసరడంతో, అది తనను వెంటాడుతున్నట్లు భావించిన మనోజ్ భయంతో బాల్కనీకె పరుగులు తీస్తాడు. గుండెల్లో వణుకుపుడుతుంది. ఏదో ఆపద వచ్చిందని తల్లికి కాల్ చేస్తాడు.హాల్‌లోకి పిలిచి, ప్రభావతితో మనోజ్ తన భయాన్ని చెబుతాడు. నిమ్మకాయను బయటకు విసిరేసి సమస్య ముగుస్తుందని వారు నమ్ముతారు.

అదే సమయంలో బాలు లైట్ వేస్తాడు. ఒక్కసారిగా భయపడిన ప్రభావతి కథ అల్లినా, బాలు ' అప్పుడు నగలు మింగారు, ఇప్పుడు నిమ్మకాయలు కూడా మింగేస్తారా? అంటూ నిలదీస్తాడు. చేతిలో ఉన్న నిమ్మకాయ బయటపడగా.. తన ప్లాన్ నిజాన్ని చూపించేందుకే అని బాలు చెబుతాడు. మనోజ్, ప్రభావతి మీదున్న అనుమానాలు బలపడుతాయి. ఈ క్రమంలో మనోజ్ ను సత్యం నిలదీస్తాడు. మనోజ్ చివరికి నిజం చెబుతాడు. బిజినెస్ నష్టం కారణంగా నగలు అమ్మేసినట్టు, తల్లి సహకరించినట్టు ఒప్పుకుంటాడు. బాలు ఆగ్రహంతో తల్లి-కొడుకులు కలిసి చేశారా? అని ప్రశ్నించగా, శ్రుతి కూడా 'ముందే అనుమానం ఉంది, ఇప్పుడు నిజం బయటపడింది' అంటుంది.

ఇక బుధవారం (డిసెంబర్ 3)ఎపిసోడ్‌లో మీనా నగల రహస్యం బయటపడిన క్షణం నుంచి ఇంట్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రభావతి, మనోజ్ తప్పును ఎంతకాలం దాచారో తెలుసుకున్న.. మీనా కోపంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'ఇంతకాలం నటన చాలింది, మీరు మహానటి' అంటూ మండిపడింది. ఇదే సమయంలో రోహిణి తన భర్తను కాపాడేందుకు ముందుకువచ్చి 'మనోజ్ తప్పు చేశాడు... మనమే అర్థం చేసుకోవాలి'అని చెప్పడంతో శృతి చెలరేగి 'ఇలాంటి వాడితో నేను బ్రతకను. నువ్వు అండగా ఉన్నావంటే నీకే ముందే అన్నీ తెలిసినట్టే'అంటూ రోహిణిని నిలదీసింది. మాటల ఒత్తిడిలో రోహిణి 'రెండు రోజుల క్రితమే తెలిసింది'అని ఒప్పుకోవడంతో బాలు తట్టుకోలేక 'అయితే నీకూ తోడు దొంగ'అంటూ సూటిగా దాడి చేశాడు. మీనా కూడా అవమానాన్ని తట్టుకోలేక, ప్రభావతిపై 'తెలియక దొంగతనం చేయడం తప్పు, తెలిసీ చేయడం ఘోరం'అని ప్రశ్నించింది. ఈ సమయంలో సత్యం మొదటిసారి తన ఆగ్రహాన్ని బయటపెట్టాడు.

ప్రభావతిని నేరుగా లక్ష్యంగా చేసుకొని 'మనోజ్ ఇలా మారడానికి కారణం నువ్వే.. నా తల్లి, మీనా తల్లిని దొంగలుగా ఆరోపించావు. కుటుంబాన్ని పాడుచేశావు'అని ఒక్కొక్క ఆరోపణను బయటపెట్టాడు. 'ఇప్పటి నుంచి నాతో 'ఏమండీ' అని పిలవకు... మన బంధం ఇక్కడికే ముగిసింది'అని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అవమానంతో ప్రభావతి గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగా... మిగిలిన కుటుంబ సభ్యులు వేడుకున్నా ఆమె తీయలేదు. మనోజ్, బాలు, రోహిణి ఒక్కొక్కరు సత్యం ముందుకు వచ్చి క్షమాపణ కోరితే కూడా అతను 'నా దగ్గర అంత పెద్ద మనసు లేదు'అంటూ నిరాకరించాడు. 'కొడుకు చిన్న తప్పు చేస్తే తల్లి మందలించాలి. కానీ గజదొంగకు క్షమాపణ అవసరం లేదు'అంటూ ప్రభావతి గత పాపాలన్నీ సత్యం బయటపెట్టాడు. 40 లక్షలు దొంగజేసిన మనోజ్‌కు అండ, మీనా ఆభరణాల అమ్మకం, హనీమూన్ డబ్బులు, తప్పుడు ఆరోపణలు... అన్నింటికీ మూలం ప్రభావతేనని ఆయన స్పష్టం చేశాడు.

ఇక గురువారం (డిసెంబర్ 4)ఎపిసోడ్‌లో గురువారం ఎపిసోడ్‌లో ఇంట్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రభావతి గదిలోకి వెళ్లి అలుగుతుంది. ఎంత పిలిచినా రాలేకపోవడంతో బాలు.. మీనాక్షిని ఇంటికి రమ్మని పిలిచాడు. ఇదే సమయంలో ప్రభావతిని బయటికి తీసుకురావాలని ప్రయత్నించిన మనోజ్ 'అమ్మకి ఏదైనా అయితే నిన్ను విడిచిపెట్టను'అంటూ బాలుపై విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా మరింత రూఢీగా 'మీ ఆవిడవి ఏడు వారాల నగలు మరీ'అంటూ హేళన చేశాడు. దీంతో బాలు, మనోజ్ ల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పడతారు. ఇంతలో రోహిణి బాలు ప్రవర్తనను తప్పుపట్టగా, మీనా గట్టిగా కౌంటర్ ఇస్తూ మనోజ్, ప్రభావతి చేసిన దొంగతనాల్ని బయటపెడుతుంది.

ఇక మీనాక్షి ఎంట్రీ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. మనోజ్ నాలుగు లక్షలు మింగడంతో ప్రభావతి మీనా నగలు ఇచ్చి కాపాడిందని, ప్రభావతి అజ్ఞానంగా కాకుండా జాగ్రత్తగా కవరింగ్ నగలు ఇచ్చిందని చెప్పింది. ఇదే సమయంలో ప్రభావతి మీనా ముఖంపై గాజులు విసరడంతో బాలు కట్టలు తెంచుకున్నాడు. పరిస్థితి అదుపు చేయడానికి ప్రభావతిని మీనాక్షి గదికి తీసుకెళ్తుంది.క్షమాపణ కోరమని చెప్పినా ప్రభావతి మొండి వైఖరి విడిచిపెట్టలేదు. హాల్లో సత్యం తన ఆవేదన వ్యక్తం చేస్తుండగా, రోహిణి ప్రభావతిని సమర్థించడంతో బాలు మరింత కోపంతో 'తప్పు చేసినవాళ్లు మాత్రమే కాదు, సమర్థించే వాళ్లూ శిక్షలకు అర్హులు' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం కుటుంబం కలతచెందిన ఈ ఘర్షణ ఇంటి వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చింది.

ఇక శుక్రవారం (డిసెంబర్ 5)ఎపిసోడ్‌లో ప్రభావతి మీనా ముఖానికి గాజులు విసరడంతో ఇంట్లో ఉద్రిక్తత పీక్స్‌కి చేరుతుంది. మీనా ఏ తప్పూ చేయకపోయినా నిందలు తన మీద పడుతుండటంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాలు, సత్యం వెంటనే మీనాకు సపోర్ట్ ఇస్తూ ప్రభావతి చేసిన దాంట్లో తప్పే ఉందని సూచిస్తారు. మనోజ్‌ గతంలో చేసిన అప్పులు, ఇప్పుడు నగలు అమ్మి తీసుకున్న డబ్బుల గురించి బాలు ప్రశ్నించగా, మనోజ్ నిర్లక్ష్యంగా స్పందిస్తాడు. రోహిణి మాత్రం 4 లక్షలు తానే ఇస్తానని మాట ఇవ్వడంతో పరిస్థితి కొంచెం తగ్గినా, మనోజ్,రోహిణి మధ్య మరో వాదన తలెత్తుతుంది.ఇక మీనా మనస్తాపంతో ఒంటరిగా ఏడుస్తుండగా, బాలు -శృతి ఆమెను ఓదార్చుతారు.

ఇదిలా ఉండగా మీనాక్షి-ప్రభావతి కలిసి గుడికి వెళ్తారు. అక్కడ మీనాక్షి గాజుల విషయం మళ్లీ ప్రస్తావించగానే ప్రభావతి దుష్టంగా స్పందిస్తుంది. మీనాకు క్షమాపణ చెప్పమన్న సూచనను ప్రభావతి పూర్తిగా తిరస్కరిస్తూ "చచ్చినా క్షమాపణ చెప్పను" అని మొండిగా అంటుంది. అక్కడికి శృతి తల్లి శోభ రావడంతో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ప్రభావతి చేతుల్లో గాజులు లేవని గమనించిన శోభ "ఇంట్లో మరో గది కట్టడానికి గాజులు అమ్మేశారా?" అంటూ నేరుగా ప్రశ్నిస్తుంది. శోభ మాటలకు ప్రభావతి ఒక్కసారిగా షాక్‌కి గురవుతుంది. ఇక ప్రభావతి ఏ సమాధానం చెప్పి తప్పించుకుంటుందో-ఈ ఎపిసోడ్ చివరి క్షణాలు ఉత్కంఠగా సాగనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X