Gunde Ninda Gudi Gantalu Weekly: బెస్ట్ కపుల్ కాంపిటీషన్ హీట్.. లక్ష రూపాయల కోసం పోరాటం.. విజేతలు ఎవరంటే?
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే డిసెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
గుండె నిండా గుడిగంటలు సోమవారం (డిసెంబర్ 22)ఎపిసోడ్‌లో వరుసగా ఆసక్తికర మలుపులు చోటుచేసుకున్నాయి. అజ్ఞాత వ్యక్తి రాసిన లెటర్‌తో ఇప్పటికే ఆందోళనలో ఉన్న మనోజ్, తన ఫ్రెండ్‌తో కలిసి ఓ జ్యోతిష్యుడిని కలవడం కథను కొత్త మలుపు తిప్పింది. లెటర్ విషయం విన్న జ్యోతిష్యుడు, మనోజ్ క్యారెక్టర్‌ను గమనించి మరింత భయపెట్టాడు.'నీ చుట్టూ ఉన్నవారిని ఎవరినీ నమ్మొద్దు... నీకు ప్రమాదం పొంచి ఉంది" అంటూ హెచ్చరించాడు. తన మాటలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో అడుక్కోవాల్సి వస్తుందని చెప్పడంతో మనోజ్ భయం రెట్టింపైంది. ఆ ముప్పు నుంచి బయటపడేందుకు పరిహారం కోరగా, రోజుకో రంగు దుస్తులు ధరించాలని సూచించాడు. జ్యోతిష్యుడి మాటలను గుడ్డిగా నమ్మిన మనోజ్, చొక్కా తీసేసి కండువా కప్పుకుని ఇంటికి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రభావతి ప్రశ్నించగా 'స్వామీజీ చెప్పాడు' అంటూ ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరించాడు. ఈ వింత ప్రవర్తనను చూసి బాలు మనోజ్‌ను ఎగతాళి చేస్తాడు.

ఇదిలా ఉండగా.. బాలు కొత్త గది నిర్మాణం కోసం కిడ్డీ బాక్స్ తీసుకురావడం మరో గొడవకు కారణమైంది. ప్రభావతి అతడిని తక్కువ చేసి మాట్లాడటంతో మీనా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన రోహిణి, బెడ్‌రూమ్‌లో మనోజ్ శాలువాతో దీక్షలా కూర్చుని ఉండటం చూసి షాక్ అయ్యింది. జ్యోతిష్యుడి మాటలన్నీ చెప్పిన మనోజ్, ఇన్‌డైరెక్ట్‌గా రోహిణినీ నమ్మనని చెప్పడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. మరోవైపు సత్యం-ప్రభావతి కలయికపై మీనాక్షి, బాలు మధ్య జరిగిన సంభాషణలు ప్రభావతిని ఇబ్బంది పెట్టాయి. చివరగా శృతి-రవి ప్రకటించిన 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' ఇంట్లో మరో చిచ్చు రేపింది. మొదట నిరాకరించిన మనోజ్, ప్రైజ్ మనీ లక్ష రూపాయలు అని తెలిసిన వెంటనే షాక్ అయ్యాడు. మీనా ఇచ్చిన ఘాటు రిప్లైతో నోరు మూసుకున్నా, చివరకు అదే లక్ష రూపాయల కోసమే రోహిణిని కన్విన్స్ చేసి పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకోవడం ఈ ఎపిసోడ్‌కు అసలైన హైలైట్‌గా నిలిచింది.
ఇక మంగళవారం (డిసెంబర్ 23)ఎపిసోడ్ లో మొత్తం 'బెస్ట్ కపుల్స్ కాంపిటీషన్' చుట్టూనే తిరుగుతూ ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచింది. లక్ష రూపాయల ప్రైజ్ మనీ అన్న మాట వినగానే ఇంట్లోని ప్రతి జంటలో ఆశలు చిగురించాయి. ముందుగా మనోజ్-రోహిణి మధ్య ఈ పోటీపై చర్చ మొదలైంది. లక్ష రూపాయలు వినగానే మనోజ్‌కు దుర్బుద్ధి పుట్టి, ఎలాగైనా ఆ డబ్బు గెలవాలని ఫిక్స్ అయ్యాడు. అయితే రోహిణి తనకు వర్క్ ఉందని పోటీలో పాల్గొనలేనని తేల్చి చెప్పడంతో మనోజ్ బ్రతిమలాడాడు. చివరకు అతడి మాటలకు కరిగిన రోహిణి ఓకే చెప్పడంతో, లక్ష రూపాయలు తనవే అన్నట్లుగా మనోజ్ ఊహల్లో తేలిపోయాడు. ఇక మరోవైపు శృతి, రవిని ఒప్పించే పనిలో పడింది. "బెస్ట్ కపుల్స్ అంటే మనమే" అంటూ ఉత్సాహంగా మాట్లాడితే, రవి మాత్రం "మనమిద్దరం టామ్ అండ్ జెర్రీలాగే ఉంటాం" అంటూ సెటైర్ వేశాడు.
ఇదే సమయంలో ప్రభావతి కూడా లక్ష రూపాయలు వదులుకోలేక సత్యంను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. సత్యం మొదట నిరుత్సాహపడ్డా, ప్రభావతి పట్టుదల ముందు చివరకు ఒప్పుకుంటాడు. బాలు-మీనా కూడా పోటీపై చర్చించుకుంటారు. బాలు మొదట సందేహపడినా, 'మన బంధమే మన బలం' అన్న మీనా మాటలతో ఉత్సాహం పొందుతాడు. ఆ డబ్బులతో రూమ్ కట్టుకుందామని ఇద్దరూ కలలు కంటారు. అసలు ట్విస్ట్ ఏమిటంటే... అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు పోటీకి రెడీ అవుతారు. వేర్వేరు అబద్ధాలతో ఇంటి నుంచి బయలుదేరిన జంటలు, హోటల్‌లో రవి-శ్రుతి రిజిస్ట్రేషన్లు తీసుకుంటుండగా ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తారు. రహస్యాలు, అనుమానాలు, ఉత్కంఠతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.
ఇక బుధవారం (డిసెంబర్ 24)ఎపిసోడ్ కూడా మొత్తం 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' చుట్టూనే తిరిగింది. ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చిన సత్యం-ప్రభావతి ముందుగానే అక్కడికి చేరుకొని ఇతర జంటలను గమనిస్తుంటారు. అదే సమయంలో మీనాక్షి-రంగా కూడా పోటీలో పాల్గొనడం చూసి వారు షాక్ అవుతారు. మొదట మీనాక్షి అక్కడినుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించినా, ప్రభావతి గుర్తుపట్టి మాట్లాడటంతో చివరకు కలిసి కాంపిటీషన్‌కు వెళ్తారు. వీరిని చూసిన రవి-శృతి ఆశ్చర్యపోతారు. ఇదే సమయంలో మనోజ్-రోహిణి కూడా అక్కడ కనిపించడంతో కుటుంబ సభ్యుల మధ్య సెటైర్లు మొదలవుతాయి. ముఖ్యంగా బాలు ఎంట్రీతో పరిస్థితి మరింత వేడెక్కుతుంది. గుడికి వెళ్లానని చెప్పి వచ్చిన తల్లి ప్రభావతిని వెటకారంగా అడగడం, మనోజ్ ఫర్నిచర్ షాప్, రోహిణి బ్యూటీ పార్లర్‌పై పంచులు వేయడంతో వాతావరణం టెన్షన్‌గా మారుతుంది.
తర్వాత కాంపిటీషన్ మొదటి రౌండ్‌లో జంటల పరిచయాలు జరుగుతాయి. మనోజ్ తనను తాను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్‌గా పరిచయం చేసుకుంటే, రోహిణి మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పుకుంటుంది. సత్యం-ప్రభావతి జంటలో ప్రభావతి తన డాన్స్ స్కూల్ గురించి గొప్పలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బాలు-మీనాల పరిచయానికి మాత్రం ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో బాలు ఫీల్ అవుతాడు, అయితే మీనా నిజాయితీగా బతుకుతున్నామన్న మాటలతో అతడిని ఓదారుస్తుంది. రెండో రౌండ్‌లో టాలెంట్స్ ప్రదర్శన జరుగుతుంది. రోహిణి ఐదు నిమిషాల్లో మేకప్ చేసి అందరినీ మెప్పిస్తే, శృతి డబ్బింగ్ మిమిక్రీతో నవ్వులు పూయిస్తుంది. చివరగా మీనా తన పూల అల్లే నైపుణ్యాన్ని చూపించేందుకు సిద్ధమవుతుంది. ఇలా ఆసక్తికర మలుపులతో ఎపిసోడ్ ముగిసింది.
ఇక గురువారం (డిసెంబర్ 25)ఎపిసోడ్ లో కూడా 'బెస్ట్ కపుల్ కాంబినేషన్' చుట్టూనే తిరిగింది. మొదటి రౌండ్‌లో శృతి తన డబ్బింగ్ టాలెంట్‌తో ఆకట్టుకోగా, రోహిణి మేకప్ స్కిల్స్ చూపించింది. ఇక మీనా వంతు రాగానే 'కళ్ళు మూసుకుని మూడు నిమిషాల్లో మూడు మూరల మల్లెపూలు అల్లుతాను' అంటూ ప్రకటించింది. దీనిపై ప్రభావతి ఎగతాళి చేసినా, మీనా స్టేజ్‌పైకి వచ్చి కళ్ళకు గంతలు కట్టి మూడు నిమిషాల్లో ఏకంగా నాలుగు మూరల మల్లెపూలు అల్లేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. యాంకర్ 'మీనా తన రికార్డులను తానే బ్రేక్ చేసింది' అంటూ ప్రకటించడంతో చప్పట్ల వర్షం కురిసింది.
దీనికి తగ్గట్టుగానే ప్రభావతి కూడా 'నేను డాన్స్ టీచర్‌ని' అంటూ భరతనాట్యం చేసి, వయసు ఒక సంఖ్య మాత్రమే అన్నట్టు తన ఎనర్జీ, గ్రేస్‌తో జ్యూరీతో పాటు ప్రేక్షకులను ఫిదా చేసింది. కోడలితో పోటీ పడుతూ ప్రశంసలు అందుకోవడంతో ప్రభావతి ఇమేజ్ మరింత హైలైట్ అయింది. రెండో రౌండ్ 'మనసులో మాట' కాంపిటీషన్ ఫన్నీ గా సాగింది. ఈ రౌండ్ లో మనోజ్-రోహిణి, శృతి-రవి, ప్రభావతి-సత్యం, బాలు-మీనా జంటలు చాకచక్యంగా ఆడి రౌండ్ క్లియర్ చేశారు. కానీ, మీనాక్షి-రంగా జంట ఎలిమినేట్ అయ్యింది. రంగా చేసిన సరదా కామెంట్ ఎపిసోడ్‌కు నవ్వులు పంచింది. ఇక మూడో రౌండ్‌లో భార్యను భర్త ఎత్తుకుని పువ్వు అందించే టాస్క్ ఉత్కంఠను పెంచింది. శృతి-రవి జంట విఫలమవ్వగా, మనోజ్-రోహిణి, బాలు-మీనా జంటలు విజయం సాధిస్తాయి. చివర్లో ప్రభావతి ప్రమాదవశాత్తూ కింద పడుతుంది.
ఇక శుక్రవారం (డిసెంబర్ 26)ఎపిసోడ్ పూర్తిగా 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' చుట్టూనే తిరిగింది. పోటీ ప్రారంభంలోనే ప్రభావతి కుర్చీపై నుంచి పడిపోవడంతో నడుము పట్టుకుని బాధపడింది. ఆమె పరిస్థితి చూసి అందరూ కంగారు పడుతుండగా, మీనా తన తోడికోడళ్ల సహాయంతో నాటు వైద్యం చేసి ప్రభావతి నడుమును సెట్ చేసింది. చికిత్స కాస్త మొరటుగా ఉన్నప్పటికీ నడుము సెట్ కావడంతో ప్రభావతి ఊపిరి పీల్చుకుంది. అయితే స్టేజ్ దిగే సమయంలో ఆమె ముఖంలో నొప్పి స్పష్టంగా కనిపించింది. స్టేజ్ దిగిన వెంటనే బాలు తన తల్లి ప్రభావతిపై సెటైర్లు వేయడం హైలైట్‌గా నిలిచింది. ఇదే సమయంలో మీనాక్షి'మనం గెలవకపోయినా పక్కవాళ్లు ఓడిపోతే వచ్చే ఆనందమే వేరు' అంటూ చేసిన కామెంట్స్‌తో వాతావరణం మరింత హీట్ ఎక్కింది.
తర్వాత జడ్జెస్ లీడింగ్‌లో ఉన్న జంటలను ప్రకటించగా, మనోజ్-రోహిణి తొలి స్థానంలో, శృతి- రవి రెండో స్థానంలో, బాలు-మీనా మూడో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. భార్యాభర్తలు ఒకరి జీతం గురించి మరొకరు చెప్పాల్సిన రౌండ్‌లో మనోజ్ జడ్జెస్‌తో మాటల యుద్ధం చేయడం హైలైట్‌గా నిలిచింది. అయితే బాలు-మీనా వంతు రాగానే సీన్ పూర్తిగా మారిపోయింది. ఒకరిపై ఒకరు నమ్మకంతో సమాధానాలు చెప్పడం జడ్జెస్‌ను ఆకట్టుకుంది. చివరి 'డ్రీమ్ హౌస్' టాస్క్‌లో చూపులు, సంకేతాలతోనే ఇల్లు నిర్మించి తమ అన్యోన్యతను చాటారు. "మా మనసు ఒక్కటే" అన్న బాలు మాటలు ఈ ఎపిసోడ్‌కు అసలైన హైలైట్‌గా నిలిచాయి.


Click it and Unblock the Notifications











