Gunde Ninda Gudi Gantalu Weekly: ప్రభావతికి అనుమానం.. చింటూకి రోహిణి సర్ప్రైజ్.. బాలు-మీనా రాకతో టెన్షన్‌..

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 29వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

గుండె నిండా గుడిగంటలు సోమవారం (డిసెంబర్ 29) ఎపిసోడ్ మొత్తం 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్' ఫైనల్ రౌండ్ చుట్టూనే సాగింది. ఈ ఫైనల్ టాస్క్‌గా జడ్జెస్ అన్ని జంటలకు తమ డ్రీమ్ హౌస్ నిర్మాణం చేయాలని సూచించారు. ఈ టాస్క్ ద్వారా జంటల మధ్య అవగాహన, ఆలోచనల సమన్వయం, దాంపత్య బంధం ఎంత బలంగా ఉందో పరీక్షించారు. ముందుగా మనోజ్- రోహిణి జంట తమ టాస్క్ పూర్తి చేసింది. పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టాలని అనుకున్నానని మనోజ్ చెప్పగా, రోహిణి వెంటనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంపౌండ్ వాల్ కూడా పూర్తిగా కట్టలేకపోయామని మండిపడింది. ఈ దశలోనే వీరిద్దరి మధ్య సమన్వయం లోపించిందని స్పష్టమైంది. ఆ తర్వాత రవి-శృతి జంట "మేము పెద్ద విల్లా కట్టాలని అనుకున్నాం కానీ డిజైన్ విషయంలో ఒకే అభిప్రాయం లేక సైలెంట్‌గా ఉండిపోయాం" అని చెప్పడంతో, వీరిద్దరూ ఇంకా లవర్స్ స్టేజ్‌లోనే ఉన్నారనే విషయం బయటపడింది.

Gunde Ninda Gudi Gantalu week roundup story December 29th to January 2nd Episodes highlights

చివరగా బాలు-మీనా జంట మాటలు అందరినీ కదిలించాయి. 'మాకంటూ ఒక చిన్న రూమ్ కూడా లేదు. అందుకే మా కల ఒక్క రూమ్ కట్టుకోవడమే' అంటూ మీనా భావోద్వేగంగా చెప్పగా, బాలు అదే ఆలోచనకు మద్దతిచ్చాడు. ఈ సమాధానం జడ్జెస్‌ను బాగా ఇంప్రెస్ చేసింది. ఫలితాల సమయంలో మనోజ్-రోహిణి జంట మమ్మల్ని మెప్పించడానికి మాట్లాడారని జడ్జెస్ వ్యాఖ్యానించడంతో, ఇంటర్వెల్‌లో చేసిన వారి ప్లానింగ్ వీడియో బయటపడింది. దీంతో వీరిద్దరి పరువు పోయింది.చివరికి జడ్జెస్ బాలు-మీనా జంటనే బెస్ట్ కపుల్ గా ప్రకటించి లక్ష రూపాయల చెక్ అందజేశారు. ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ప్రభావతి వీరిపై కించపరిచే వ్యాఖ్యలు చేసినా, బాలు తన సెటైర్లతో ధీటుగా సమాధానం ఇచ్చాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో బాలు-మీనా జంట దాంపత్యానికి కొత్త నిర్వచనం ఇచ్చారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక మంగళవారం (డిసెంబర్ 30) ఎపిసోడ్‌లో బాలు- మీనా విజయం జీర్ణించుకోలేని మనోజ్,రోహిణి,ప్రభావతి తమ అక్కసు వెళ్లగక్కారు. ముందు మనోజ్ 'వాళ్లిద్దరూ ప్రాడు పని చేసి గెలిచారు' అంటూ బాలు-మీనాలను అవమానించడంతో గొడవ మొదలైంది. దీనికి మీనా ధీటుగా స్పందిస్తూ.. మనోజ్ గతంలో చేసిన తప్పులను గుర్తుచేసింది. 40 లక్షల వ్యవహారం, నగలు అమ్ముకున్న విషయం ప్రస్తావించడంతో రోహిణి కోపంతో ఊగిపోయి చివరకు సైలెంట్ అయ్యింది. ప్రభావతి కూడా మనోజ్-రోహిణిలకు మద్దతుగా నిలవడంతో మనోజ్ మరింత రెచ్చిపోయాడు. జడ్జెస్‌కు బాలు గురించి సరిగ్గా తెలియదని, అందుకే లక్ష రూపాయలు గెలిచాడని ఎద్దేవా చేశాడు. ఈ సమయంలో సత్యం రంగంలోకి దిగుతూ గొడవలు ఆపేయాలని హెచ్చరించాడు. అయితే ప్రభావతి 'లక్ష గెలవగానే లక్షణమైన కాపురమా?' అంటూ బాలు-మీనాలను మరోసారి కించపరిచింది. మనోజ్ కూడా తామెప్పుడూ గొడవపడలేదని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు.

దీనికి బాలు ఘాటుగా రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. మనోజ్ గతాన్ని ఎత్తిచూపుతూ, 'ఇద్దరికిద్దరు పెద్ద కేడీలు' అని, జడ్జెస్ అన్న మాటలను గుర్తు చేశాడు. మీనా కూడా 'చిన్న చిన్న గొడవలు ఉంటేనే సంసారం' అంటూ మద్దతిచ్చింది. ఇక బాలు 'గొడవలు లేవంటే రహస్యాలుంటాయి" అంటూ రోహిణిని ఇరకాటంలో పడేస్తాడు. ప్రభావతి ఈ మాటలను ఆసరాగా తీసుకొని రోహిణిని నిలదీస్తే.. ఆమె తెలివిగా తప్పించుకుంది. అయినా ప్రభావతికి అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు బాలు తన గెలుపు చెక్‌ను తండ్రి సత్యంకి ఇవ్వాలనగా, ఆయన నిరాకరిస్తూ ఆ డబ్బులతో రూమ్ కట్టుకోవాలని సూచించాడు. ఈ సందర్భంలో సత్యం ప్రభావతిపై ఘాటుగా విరుచుకుపడ్డాడు. మనోజ్ వచ్చి తన తెలివైన సమాధానాల గురించి మాట్లాడినా, ప్రభావతి అతని మోసాల చిట్టాను బయటపెట్టడంతో అతడు సైలెంట్ అయ్యాడు. ఇదిలా ఉండగా రోహిణి ఓటమితో బాధపడుతుంటే, మనోజ్ ఆమెను ఓదార్చి తామే బెస్ట్ కపుల్స్ అని ధైర్యం చెప్పాడు. మరోవైపు రవి-శృతి మధ్య పిల్లల అంశంపై మరో గొడవ జరిగింది.

ఇక బుధవారం (డిసెంబర్ 31)ఎపిసోడ్‌ ప్రారంభం నుంచే సరదా, రొమాన్స్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎపిసోడ్ ఆరంభంలోనే బాలు-మీనా జంట మధ్య రొమాంటిక్ క్షణాలు కనిపిస్తాయి. మీనాను చూసిన బాలు పూర్తిగా ప్రేమ మూడ్‌లోకి వెళ్లి, 'నీ వల్లే నా జీవితం మారిపోయింది... నువ్వే నన్ను మార్చావు'అంటూ ఆమెపై ప్రేమ కురిపిస్తాడు. మీనా కూడా 'మీరు దొరకడం నా అదృష్టం'అంటూ ఫన్నీగా స్పందిస్తుంది. హాల్లోనే డాన్స్ చేద్దామని బాలు పట్టుబడితే, ఎవరు వస్తారేమోనని మీనా భయపడుతుంది. కానీ బాలు 'అమ్మ వస్తే విజిల్ వేస్తూ వస్తుంది'అంటూ సరదాగా స్టెప్పులు వేస్తాడు. ఇంతలోనే ప్రభావతి అకస్మాత్తుగా రావడంతో బాలు షాక్ అవుతాడు. 'లక్ష రూపాయలు వచ్చాయి కదా, ఏమైనా చేస్తావ్' అంటూ ప్రభావతి సెటైర్లు వేయడం సీన్‌కు హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సంఘటన తర్వాత మీనా కీలక నిర్ణయం తీసుకుంటుంది.ఇక సొంతంగా ఒక రూమ్ కట్టుకుందామన్న ఆలోచనను బాలుతో పంచుకుంటుంది.

బాలు కూడా అంగీకరించడంతో మేస్త్రిని తీసుకువచ్చి పై రూమ్ గురించి చర్చిస్తాడు. నాలుగు లక్షల ఖర్చు చెప్పడంతో బాలు కంగారుపడతాడు. మొత్తం డబ్బు ఉంటేనే పని మొదలుపెడతానని మేస్త్రి స్పష్టంగా చెప్పడంతో, బాలు కొంత అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాడు. ఈ వ్యవహారాన్ని ప్రభావతి దొంగచాటుగా వింటుంది. మిగతా డబ్బు కోసం ప్రభావతి బంగారాన్ని తాకట్టు పెడదామన్న బాలుది సరదా మాటగా మారినా, ఆమెకు మాత్రం కోపం తెప్పిస్తుంది. మరోవైపు మీనా ఫ్రెండ్స్‌తో గెలిచిన లక్ష రూపాయల విషయమై మాట్లాడుతుంది. బాలు తనను ఎంత అర్థం చేసుకుంటాడన్న నమ్మకంతో పందెం వేస్తుంది. బీట్రూట్ దోస చేసినా బాలు టేస్ట్ గురించి చెప్పకపోవడంతో మీనా ఓడిపోతుంది. 'మగాళ్లు ఇంతే' అంటూ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు. ఇదే సమయంలో రోహిణికి తన కొడుకు నుంచి పుట్టినరోజు ఫోన్ రావడం ఎమోషనల్ టచ్ ఇస్తుంది. చివర్లో మనోజ్ మరోసారి గోవా ట్రిప్ ప్లాన్‌ను ప్రస్తావించగా, రోహిణి కూడా అంగీకరించడంతో కొత్త ప్రయాణానికి పునాది పడుతుంది.

ఇక గురువారం ( జనవరి 1) ఆరంభంలోనే మీనా తన ఫ్రెండ్స్‌తో కట్టిన సరదా పందెం ఓడిపోవడంతో కథ మొదలవుతుంది. ఓడిపోయినందుకు రూ.500 ఇవ్వడానికి వెళ్లిన మీనాను, ఫ్రెండ్స్ మరో పందెంలోకి లాగుతారు. భర్త బాలు ఉదయం చేసిన బీట్రూట్ దోసను మెచ్చుకుంటేనే డబ్బు తిరిగి వస్తుందన్న షరతు మీనాకు కొత్త టెన్షన్ తెస్తుంది. బాలు మీద నమ్మకంతో మీనా ఫోన్ చేసినా, డ్రైవింగ్‌లో ఉన్న బాలు కోపంగా స్పందించి కాల్ కట్ చేయడంతో పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది. ఈ ఒక్క నిర్లక్ష్యం మీనాను మనసును గాయపరుస్తుంది. పందెం ఓటమితో పాటు ఫ్రెండ్స్ ముందు అవమానం, ఇంట్లో ఒంటరితనం అన్నీ కలిసి ఆమెను బాధపెడతాయి.మరోవైపు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసిన బాలుకు దిమ్మతిరుగుతుంది.

మీనా తన కోసం పెషల్‌గా వంట చేస్తుందని భావించిన బాలుకి.. పచ్చిమిర్చిలు, పల్లీలు, దోస పిండి పెట్టడం చూసి షాక్ అవుతాడు. రాజేష్ ఇచ్చిన సలహా ద్వారా 'ఆడవారిని మెచ్చుకోవాలి' అన్న నిజం బాలు గ్రహిస్తాడు. రాజేష్ మాటలతో బాలు తన తప్పు గ్రహిస్తాడు.దీంతో మీనా మనసు ఎంతగా బాధపడిందో బాలు అర్థం చేసుకుంటాడు. ఇదే సమయంలో ప్రభావతి- మీనాక్షిల కొత్త బిజిసెస్ ఆలోచనలు నడుస్తాయి. డాన్స్ స్కూల్ ఫెయిల్యూర్ నుంచి బయటపడేందుకు ఫ్రీ అడ్మిషన్ ఐడియా, భవిష్యత్తు ఎపిసోడ్లకు ఆసక్తి పెంచింది. అలాగే రోహిణి - చింటూ షాపింగ్ సీన్‌లో దాచిపెట్టిన నిజాలు, ప్రభావతి అనుమానాలు మరో సస్పెన్స్‌ను క్రియేట్ చేశాయి. ఎపిసోడ్ చివర్లో బాలు సారీతో మీనాను ఇంప్రెస్ చేయడం, మీనా తన బాధను చెప్పడం, ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకోవడంతో నేటీ సీరియల్ ముగుస్తుంది.

ఇక శుక్రవారం (జనవరి 2)ఎపిసోడ్‌ ప్రేక్షకులను భావోద్వేగాలు, ఉత్కంఠతో కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలో బాలు-మీనా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ చింటూ కోసం బాలు తెచ్చిన డ్రెస్‌ను చూస్తారు. డ్రెస్ చూసిన మీనా భావోద్వేగానికి లోనై, చింటూ పుట్టినరోజు దగ్గరలో ఉందని గుర్తుచేస్తూ, మనమే వెళ్లి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని సూచిస్తుంది. చింటూ విషయంలో బాలు-మీనా మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఈ సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో రవి పనిచేస్తున్న రెస్టారెంట్‌కు అతని అత్త శోభ అకస్మాత్తుగా రావడం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. పిల్లల విషయంలో ఆలస్యం చేస్తున్నారని, జీవితంలో కొన్ని విషయాలు సమయానికి జరగాలని ఆమె సూటిగా మాట్లాడటం రవిని అయోమయంలో పడేస్తుంది. ఆపై బ్లాంక్ చెక్ ఇవ్వడం అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. ఈ విషయం శృతితో గొడవకు దారి తీసి, చివరికి రవి చెక్‌ను చింపివేసి ఆగ్రహంతో వెళ్లిపోతాడు.

మరోవైపు చింటూ బర్త్‌డే సన్నివేశాలు పూర్తిగా ఎమోషనల్‌గా సాగుతాయి. తల్లి రోహిణి వస్తేనే పుట్టినరోజు చేసుకుంటానని చింటూ మారం చేయడం, ఆమె సడన్ ఎంట్రీతో అతడి ఆనందం రెట్టింపు కావడం హృదయాన్ని తాకుతుంది. అయితే బాలు-మీనా అక్కడికి రావడంతో రోహిణి, శాంతమ్మ ఇద్దరూ ఆందోళనకు గురవుతారు. చింటూ అమ్మ ఎవరు అన్న ప్రశ్నతో పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుంది. చివరికి 'నా కొడుకు కోసం ఉండాలా? లేక నా కాపురం కోసం వెళ్లాలా?' అనే ఆలోచనతో రోహిణి కన్నీళ్లపర్యంతమవడం ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X