Gunde Gudi Gantalu Weekly: అత్త-కోడళ్ల యుద్ధం.. బాలూ ప్లాన్‌లో కొత్త మలుపు.. సుశీలమ్మ ఎంట్రీ.. సత్యం షాక్..
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే డిసెంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
గుండె నిండా గుడిగంటలు సోమవారం (డిసెంబర్ 8)ఎపిసోడ్‌లో కుటుంబ కలహాలు మళ్లీ తీవ్రమయ్యాయి. శృతి తల్లి శోభ గుడిలోకి రావడంతో, ప్రభావతిని బంగారు గాజుల విషయంలో ఇబ్బంది పెడుతారు. 'గాజులు అమ్మేశారా? తాకట్టు పెట్టారా?' అంటూ ప్రభావతిని శోభ నిలదీస్తారు. మీనాక్షి విషయం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, శోభ సైటెర్స్ కు ప్రభావతి అవమానంతో బాధపడుతుంది. ఇదిలా ఉంటే సత్యం పార్క్‌లో తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకునే తీరు గమనించి, మనోజ్ విషయంలో తానే తప్పు చేశానన్న విచారం వ్యక్తం చేస్తాడు. బాలు, మనోజ్ తప్పులకు ప్రభావతే ప్రోత్సాహమిచ్చిందని చెబుతాడు.

ప్రభావతి చేసిన తప్పులకు సత్యం ఎమోషనల్ అవుతారు. బాలు,మీనాలకు క్షమాపణ చెప్పడం చూసి మీనా ఆశ్చర్యపడుతుంది. ప్రభావతి చేసిన తప్పుకు మీనానే బాధపడుతోందని చెప్పి, ఇకపై ఆమెను క్షమించనని సత్యం స్పష్టంగా చెబుతాడు. ఈ మాటలు గోడ చాటున విన్న ప్రభావతి విషయంలో అసలు తన తప్పు లేదన్నట్లు.. తిరిగి మీనాపై నిందలు వేస్తుంది. ఇక రాత్రి బాలు, మీనా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చూపిస్తారు. మరుసటి రోజు మీనా అందరికీ టిఫిన్ సిద్ధం చేస్తుంటే, ప్రభావతి మళ్లీ అవహేళన చేస్తుంది. రోహిణి, మనోజ్‌ను బయట తినమని లాకెళ్లిపోవడానికి ప్రయత్నించగా, మీనా గట్టిగా నిలబడి, గతంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వకపోయినా ఇలాంటి పంతాలు పెట్టుకోవడం సరికాదని వార్నింగ్ ఇస్తుంది.
ఇక మంగళవారం (డిసెంబర్ 9)ఎపిసోడ్‌లో బాలు-ప్రభావతి నగల సమస్య ఇంట్లో కలహాలకు కారణమవుతూనే ఉంది. మీనా పూరీలు చేసి అందర్నీ టిఫిన్‌కి పిలిస్తే రోహిణి 'బయట తింటాం'అంటూ బిల్డ్ అప్ ఇచ్చింది. దీనికి మీనా 'డబ్బులు ఎక్కువ అయ్యాయా?'అంటూ నిలదీస్తుంది. దీనిపై రోహిణి 'మమ్మల్ని అవమానించడానికి ఇలా చేస్తున్నావా'అనగా మీనా గట్టిగా 'నాకు ఎవరిపై కోపం లేదు... లెక్కలు తీయమంటే అందరి చిట్టా బయటపెడతా'అని తేలికగా చెప్పేసింది. మనోజ్ కౌంటర్ కొట్టడంతో మీనా ఆగ్రహించింది. ఇది చూసి రోహిణి, ప్రభావతి వంటకు వెళ్లగా సత్యం మాత్రం డైనింగ్ వద్ద వాళ్లతో కూర్చోకుండా బయటికి వెళ్ళిపోతాడు.
ఈ విషయంలో రవి, శృతి కూడా తమదైన సూటి మాటలు చెప్పడంతో ప్రభావతి మనస్తాపానికి గురై టిఫిన్ మానేసి వెళ్లిపోతుంది. మీనా ఈ వ్యవహారంపై శృతిని హెచ్చరిస్తూ 'ఇంటి వ్యవహారాలు బయట చెప్పొద్దు'అని చెప్పింది. ఈ విషయాన్ని ప్రభావతి గమనించి మరింత మనస్తాపం చెందుతుంది. ఇక మనోజ్ తన షాప్‌లో బాధపడుతుండగా రోహిణి 'కల్పన ఇచ్చిన డబ్బు తీసుకురావాలి'అని చెబుతుంది. అయితే మనోజ్ మాత్రం 'సిగ్గు శరం లేకుండా డబ్బు అడగలేను'అంటాడు. మరోవైపు.. మీనా ఈ పరిస్థితిని సరిచేయాలని ప్రయత్నిస్తుంటే.. బాలు 'తూర్పు పడమర కలవవు... టైమ్ వచ్చినప్పుడు వాళ్లే కలుస్తారు'అంటూ సర్దిచెప్పాడు
ఇక బుధవారం (డిసెంబర్ 10)ఎపిసోడ్‌లో బుధవారం ఎపిసోడ్‌లో బాలు కోసం డబ్బు సమకూర్చాలని రోహిణి, మనోజ్ ఇద్దరూ కళ్యాణి ఇచ్చిన డబ్బుల నుంచి రెండు లక్షలు తీసుకొని ఇంటికి వస్తారు. ఇంట్లో వారందరినీ పిలిచి బాలు చేతిలో ఇవ్వడానికి ప్రయత్నించగా, మనోజ్ మాత్రం తానే కష్టపడి సంపాదించానంటూ బిల్డప్ ఇస్తాడు. రోహిణి చేతిలో అంత డబ్బు చూసి అందరూ షాక్ అవుతారు. సత్యం 'మీ నాన్న జైలులో ఉన్నాడు కదా?'అని అడుగుతాడు. వెంటనే మనోజ్ 'మలేషియా మామయ్య పంపించాడు'అంటూ కొత్త కథ చెబుతాడు. బాలు మొదట డబ్బు తీసుకోకుండా నాలుగు లక్షలు కావాలని అంటాడు. చివరకు రోహిణి మిగిలిన డబ్బులు ఇస్తానని మాట ఇవ్వడంతో రెండు లక్షలు తీసుకుంటాడు. కానీ, వెళ్లే ముందు డబ్బు మీనాకే ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకోమని చెబుతాడు.
తరువాత ప్రభావతి రోహిణిపై డబ్బులు సగం మాత్రమే ఇచ్చిందని కోపపడుతుంది. మనోజ్ కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు. ఇక బాలు, మీనా కలిసి ఈ డబ్బుతో నగలు కొనకుండా కారు కొనుక్కుందామనుకుంటారు. మీనా ఐడియా బాలుకి నచ్చడంతో, ఇద్దరూ ఆనందపడతారు. మరోవైపు సత్యం మాత్రం ప్రభావతి గత తప్పులను గుర్తుచేసుకుంటూ, క్షమించడానికి కూడా ఓ హద్దు ఉంటుందని అంటాడు. బాలు ఏ విధంగైనా తల్లిదండ్రులను కలపాలని ప్రయత్నిస్తాడు. కానీ, ప్రభావతి, మీనా మధ్య మాటల దాడి జరగడంతో పరిస్థితి మళ్లీ చెడిపోతుంది. మరుసటి రోజు ఉదయం నగలపై మరోసారి పెద్ద చర్చ మొదలవుతుంది. శృతి నేరుగా మనోజ్, ప్రభావతి తప్పే అని చెబుతుంటే రోహిణి భయపడుతూ మాట తప్పించుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇక గురువారం (డిసెంబర్ 11)ఎపిసోడ్‌లో తన అత్తను మామయ్యతో మాట్లాడించడానికి మీనా చాలాసార్లు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ప్రభావతిని ఒప్పించే ప్రయత్నం చేసినా, ప్రభావతి మాత్రం మీనానే తమ కాపురాల మధ్య విభేదాలకు కారణమంటూ ఆమెపై మండిపడుతుంది. పక్కనే ఉన్న శృతి తన అత్త ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తూ 'మీనా క్షమించమని అడిగితే సమస్య ఇక్కడే ముగుస్తుంది'అని తెగేసి చెబుతుంది. ప్రభావతి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తిప్పికొట్టింది. శృతి స్పష్టంగా 'మీ తప్పే ఎక్కువ.. అయినా మీనా కోప్పడాల్సిన పరిస్థితి'అని చెప్పడంతో ఘర్షణ మరింత ముదిరింది. నగల విషయం పై కూడా శృతి నిలదీయగా, రోహిణి మాత్రం ప్రభావతిని సమర్థించుకునే ప్రయత్నం మాత్రమే చేస్తుంది.
మరోవైపు మీనా భావోద్వేగంగా 'ఏం చేసినా నా మీదే నింద వేస్తున్నారు'అంటూ బాధపడింది. ఇలా అత్త-కోడళ్ల సంఘర్షణ కొనసాగుతుండగా, రోహిణి ప్రభావతిని సమర్థించింది. ఇదిలా ఉంటే.. బాలు తన ఫ్రెండ్‌తో కలిసి కారు షోరూమ్‌కి వెళ్లి రెండు కార్లను సెలెక్ట్ చేశాడు. మీనా రాగానే కారు కొనాలని బాలు ఒత్తిడి చేసినా, ఇంట్లో ఉద్రిక్తతల నడుమ కారు కొనకూడదని మీనా చెప్పి వెనుదిరిగింది. ఇక ప్రభావతి మరోవైపు మీనాక్షి దగ్గర కోపంతో వెళ్లి మీనా,శృతి గురించి ఫిర్యాదులు చేస్తుంది. ముందుగా శృతిని కంట్రోల్‌లో పెట్టాలని కుట్ర పన్నడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా మారింది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ కుటుంబ కలహాలతో రసవత్తరంగా సాగింది.
ఇక శుక్రవారం (డిసెంబర్ 12)ఎపిసోడ్‌లో డ్రామా పూర్తిగా పీక్‌కు చేరింది. కొత్త కారు కొనాలన్న బాలూ ఆలోచనకు మీనా అడ్డుపడుతుంది. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న గొడవలు సర్దుమణిగిన తర్వాతే కారు తీసుకోవాలని స్పష్టంగా చెబుతుంది. దీంతో నిరాశకు గురైన బాలు వెనుదిరుగుతాడు. అయితే సమస్యలను అలాగే వదిలేయకుండా, తల్లిదండ్రుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఓ కొత్త ప్లాన్ వేస్తాడు. ఇదే సమయంలో డబ్బింగ్ స్టూడియోలో శృతి ప్రెగ్నెన్సీ సీన్‌కు వాయిస్ ఇస్తూ తీవ్రంగా ఎమోషనల్ అవుతుంది. ప్రతి తల్లి పడే బాధను అర్థం చేసుకుని వెంటనే తన తల్లికి ఫోన్ చేసి క్షమాపణ చెబుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అనుభవాన్ని చెబుతుండగా, రోహిణి మాత్రం ప్రెగ్నెన్సీ కష్టాలను డీటెయిల్‌గా వివరిస్తుంది.
ఆమె మాటలు విని మీనా, శృతి షాక్ అవుతారు. శృతి ప్రశ్నించడంతో రోహిణి తడబడుతూ 'క్లయిట్స్ చెప్పారని' కవర్ చేస్తుంది. ఇక బాలు తన ప్లాన్ ప్రకారం సుశీలమ్మను ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో జరుగుతున్న విషయాలు తెలుసుకున్న సుశీలమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభావతి, మనోజ్‌ల వల్ల వచ్చిన సమస్యలపై గట్టిగా క్లాస్ తీసుకుంటుంది. తర్వాత సత్యాన్ని కలిసిన సుశీలమ్మ, నిజాలు విని షాక్ అవుతుంది. సత్యం ఇక సహించలేనని చెప్పడంతో, సుశీలమ్మ అందరూ కలిసి ఉండాలని సూచిస్తుంది. అయితే సత్యం మాత్రం ముందు ప్రభావతి మీనాకు చేసిన అవమానాలకు క్షమాపణ చెప్పాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తాడు.


Click it and Unblock the Notifications











