Gunde Ninda Gudi Gantalu Weekly: బాలు-మీనాకు ప్రమాదం, రోహిణి ప్లాన్, మౌనికపై కుట్ర, రవి,శృతి గొడవలు
photo courtesy: jio hotstar:
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, కుటుంబ కలహాలు, బ్లాక్ మెయిల్ డ్రామాతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథ ప్రారంభంలో మీనా తల్లి పార్వతి ఫోన్ చేయడంతో మీనా పుట్టింటికి వెళ్తుంది. అక్కడ శివ ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని, గుణ స్నేహం వల్ల చెడు అలవాట్లు అలవర్చుకున్నాడని పార్వతి వాపోతుంది. ఇది విన్న మీనా తీవ్ర ఆగ్రహంతో గుణకే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఇదే సమయంలో రోహిణి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దినేష్‌ను కలవగా, అతడు 30 లక్షల డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. డబ్బు ఇవ్వకపోతే గతాన్ని బయటపెడతానని బెదిరించడంతో రోహిణి షాక్‌కు గురవుతుంది. దివ్య సూచనతో గుణను కలవాలని రోహిణి నిర్ణయించుకుంటుంది.

photo courtesy: jio hotstar:
మరోవైపు మీనా గుణ ఆఫీసుకు వెళ్లి గొడవ పడుతుంది. మాటలు ముదిరి మీనా గుణను కొట్టగా, గుణ ఆమెను తోసేయడంతో మీనా తలకు గాయం అవుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన బాలు గుణపై దాడి చేసి మీనాను హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. స్కానింగ్‌లో పెద్ద ప్రమాదం లేదని డాక్టర్ చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న పార్వతి కుంగిపోతుంది. శివకు నిజం తెలిసి గుణను నిలదీస్తాడు, అక్కకు క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తాడు. హాస్పిటల్‌లో మీనా పరిస్థితి చూసి శివ కంటతడి పెట్టుకుంటూ గుణతో స్నేహం వదిలేస్తానని మాట ఇస్తాడు. చివరికి మీనాను అత్తగారింటికి తీసుకెళ్లగా అక్కడ మరో మాటల యుద్ధం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుమానాలు, భావోద్వేగాలతో ఎపిసోడ్ ముగిసింది.
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠ, వినోదం, భావోద్వేగాలతో నిండిపోయింది. ఆరంభంలోనే మీనా తలకు గాయం అయినా తొలుత హేళనగా మాట్లాడిన ప్రభావతి, సత్యం హెచ్చరికతో కాస్త తగ్గుతుంది. "మీనా రెస్ట్ తీసుకోనీ... నేనే వంట చేస్తా" అంటూ కిచెన్‌లోకి అడుగుపెట్టినా, ఏది ఎక్కడుందో తెలియక తికమకపడుతుంది. కారం-ఉప్పు కోసం పదే పదే మీనాను పిలవడంతో బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయినా ప్రభావతి తన వంట నైపుణ్యాన్ని చూపించేందుకు ప్రయత్నించడం నవ్వులు పూయించింది. ఇదే సమయంలో రోహిణి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దినేష్ నుంచి తప్పించుకోవడానికి గుణను ఆశ్రయిస్తుంది. డబ్బు డిమాండ్ చేస్తున్నాడని వాపోతే, గుణ మాత్రం సహాయానికి బదులుగా ఓ షరతు పెడతాడు.
శివ ప్రభావతి గొలుసు దొంగతనం చేశాడన్న వీడియో కావాలని. తప్పని పరిస్థితుల్లో రోహిణి ఒప్పుకోవడం కథలో కీలక మలుపుగా మారింది. దివ్య చెప్పిన హెచ్చరికను పట్టించుకోకుండా, "అత్తకు తెలిస్తే నా సంసారం రోడ్డు పాలవుతుంది" అంటూ రోహిణి ఆవేదన చెందుతుంది. మరోవైపు నీలకంఠం సంజుకు మరో పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. పిల్లలు లేరన్న కారణంతో మౌనికను ఇంటి నుంచి పంపేయాలనే నిర్ణయం, సంజీవ్ మద్దతుతో మరింత షాకింగ్‌గా మారింది. ఇక మీనా బెడ్‌రెస్ట్‌లో ఉండగా బాలు మందు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. మీనా మెమరీ లాస్ నటనతో బాలును భయపెడుతుంది. నిజం తెలిసి రిలీఫ్ అయిన బాలు, రవి-శృతి అపార్థాలను క్లియర్ చేస్తాడు. రోహిణి వ్యంగ్య వ్యాఖ్యలకు బాలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. ఎపిసోడ్ చివర్లో ప్రభావతి వంట డ్రామా నవ్వులు పూయించగా, భర్త సత్యంతో ఆమె రొమాంటిక్ సీన్ హైలైట్‌గా నిలిచింది.
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠ, కామెడీ మేళవింపుతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అర్ధరాత్రి మీనా నిద్రలేచి రోహిణి మాటలు గుర్తుచేసుకుని కలత చెందుతుంది. అది గమనించిన బాలు ప్రేమగా ఆమెను ఓదార్చుతూ, భయపడకుండా ధైర్యంగా ఉండాలని చెబుతాడు. ఈ హార్ట్ టచ్చింగ్ సీన్ ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చింది. ఇక రవి-శృతి మధ్య అర్ధరాత్రి ఫోన్ కాల్ ఎపిసోడ్‌లో నవ్వులు పూయించింది. లేడీ బాస్ నీతూ ఫోన్ చేయడంతో శృతి అసహనం వ్యక్తం చేస్తుంది. రవి ఫోన్ కట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ చెలరేగుతుంది.మరుసటి రోజు కూడా రెస్టారెంట్‌లో నీతూతో రవి సరదాగా మాట్లాడటం చూసి శృతి మరింత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రవి క్షమాపణ చెప్పినా, పొరపాటున శృతిని 'నీతూ' అని పిలవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. ఇదిలా ఉండగా తలకు గాయం ఉన్నా మీనా వంట చేయడం చూసి బాలు ఆగ్రహిస్తాడు. అదే సమయంలో వచ్చిన భారీ పూల ఆర్డర్ కథకు ట్విస్ట్ తీసుకొస్తుంది. బాలు బైక్‌పై మీనాను తీసుకెళ్తుండగా గుణ కావాలనే కారుతో ఢీకొట్టమని ఆదేశిస్తాడు. ప్రమాదం తృటిలో తప్పినా ఇద్దరూ కిందపడిపోతారు. వృద్ధ దంపతులకు సహాయం చేసిన బాలు మనసు గెలుచుకుంటాడు. చివర్లో సంజు-మౌనిక హాస్పిటల్ విషయం ఇంట్లో కలకలం రేపుతుంది. నీలకంఠం మాట్లాడిన అవమానకరమైన మాటలు మౌనికను తీవ్రంగా బాధపరుస్తాయి. ఆమె కళ్లలో కనిపించిన ఆవేదనే ఎపిసోడ్‌కు అసలైన హైలైట్‌గా నిలిచింది.
గురువారం ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కథ ఆరంభంలోనే నీలకంఠ తన పక్కా ప్లాన్‌లో భాగంగా మౌనిక, సంజును హాస్పిటల్‌కు టెస్టుల కోసం పంపిస్తాడు. మౌనిక అన్నల కుటుంబాల్లో పిల్లలు లేకపోవడంతో అనుమానం వచ్చిందని చెప్పడం ఆమెను షాక్‌కు గురి చేస్తుంది. దీనిపై మౌనిక ప్రశ్నించగానే సంజు ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుంది. ఇదే సమయంలో నీలకంఠ ల్యాబ్‌కు ఫోన్ చేసి రిపోర్టులు తనకు అనుకూలంగా ఇవ్వాలని డబ్బు ఆఫర్ చేయడం అతడి దురుద్దేశాన్ని స్పష్టంగా చూపించింది.
మరోవైపు బాలు-మీనా హాల్లో కూర్చొని భవిష్యత్తు కలలు కంటారు. వృద్ధాప్యం, పిల్లల పెళ్లిళ్లు అంటూ సరదాగా ఊహించుకుంటూ భావోద్వేగ క్షణాలు పంచుకుంటారు. ఆ వెంటనే రోహిణి బాలు ఫోన్‌లోని వీడియోలు దొంగిలించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ బాలు తరచూ మీనాను పిలవడం, ప్రభావతి గదిలోకి రావడంతో రోహిణి మంచం కిందే చిక్కుకుంటుంది. చివరకు ఫోన్ బ్యాటరీ అయిపోవడంతో ఆమె ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇదిలా ఉండగా రవి తన బాస్ నీతూతో సూపర్‌మార్కెట్‌కు వెళ్లడం పెద్ద ట్విస్టుగా మారుతుంది. అక్కడ శోభ వారిద్దరి క్లోజ్‌నెస్ చూసి అనుమానంతో శృతికి ఫోన్ చేస్తుంది. మరోవైపు మీనా పూల కొట్టు వద్ద తమ్ముడు శివ మారిన ప్రవర్తన చూసి సంతోషపడుతుంది. పంతులు చెప్పిన బొమ్మల కొలువు మాటలు మీనా మనసులో ఆశను నింపుతాయి.
శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే శృతి తల్లి శోభన డబ్బింగ్ స్టూడియోకి వచ్చి రవి-నీతు వ్యవహారంపై కూతురికి జాగ్రత్తలు చెబుతుంది. నీతు ప్రవర్తన భిన్నంగా ఉందని హెచ్చరిస్తే... శృతి మాత్రం రవిపై పూర్తి నమ్మకం ఉందంటూ తల్లిని కూల్ చేస్తుంది. గతాన్ని ప్రస్తావిస్తూ కౌంటర్ ఇవ్వడంతో శోభన ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ తల్లి-కూతురు సంభాషణ ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ఇక ఇంట్లో మీనా బొమ్మల కొలువు పెట్టాలనే ఆలోచనతో ఉత్సాహంగా కనిపిస్తుంది. సరదాగా బాలు వెనుక నుంచి పట్టుకోవడంతో మీనా కత్తితో దాడి చేయబోతుంది. తర్వాత శాంతించి, వారసుడు రావాలనే కోరికతో బొమ్మల కొలువు పెట్టాలనుకుంటున్నట్టు చెబుతుంది. సత్యం చాకచక్యంగా ప్రభావతిని పొగడ్తలతో ఒప్పించి పర్మిషన్ తెచ్చిపెడతాడు.
డాన్స్ స్కూల్‌లో ప్రభావతి తన స్నేహితురాలు మీనాక్షికి బొమ్మల కొలువు విషయం చెబుతుండగా, అక్కడే ప్రేమ జంట రొమాన్స్‌లో ఉండటం మీనాకు కనిపిస్తుంది. ఆమె క్లాస్ పీకినా, ఆ జంట అబద్ధాలు చెప్పడంతో ప్రభావతి మీనాపై మండిపడుతుంది. బాధపడిన మీనా హెచ్చరిక ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంట్లో బొమ్మల కొలువుతో పాటు ఖర్చుల గొడవలు మొదలవుతాయి. మొత్తం రూ.15,000 ఖర్చు అని బాలు చెప్పడంతో అన్నదమ్ముల మధ్య టెన్షన్ పెరుగుతుంది. అయినా చివరకు అందరూ తమ వంతు చెల్లిస్తారు. తోడికోడళ్ల చిన్న మాటల యుద్ధాన్ని చూసిన ప్రభావతి మాత్రం లోలోపల ఆనందపడుతుంది. బొమ్మల కొలువు పేరుతో ఇంట్లో కొత్త ఉత్సాహం మొదలైనప్పటికీ, అపార్థాలు-అసూయలు కూడా తలెత్తాయి. ఇక ముందు హోమం ఎలా సాగుతుంది? ప్రేమ జంట అబద్ధం బయటపడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











