Gunde Ninda Gudi Gantalu Weekly: చింటూ దత్తత.. ప్రభావతికి హార్ట్ అటాక్.. రోహిణి ప్లాన్‌లు.. మనోజ్ భయాలు..

Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

సోమవారం (ఫిబ్రవరి 2)ఎపిసోడ్‌లో అన్నదమ్ములు-తోడికోడళ్ల మధ్య జరుగుతున్న గొడవలను చూసి ప్రభావతి లోలోపల ఆనంద తాండవం చేస్తుండటం ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది. శృతి-మీనా, బాలు-రవి మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే, "ఇదే నాకు కావాల్సింది" అన్నట్టు ప్రభావతి ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ మార్పును గమనించిన సత్యం, ఇంతవరకు ఐక్యంగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఇలా గొడవ పడటం చూసి అనుమానం పెంచుకుంటాడు. అసలు నిజం తెలుసుకోవాలనుకుని బాలు దగ్గరకు వెళ్లి ప్రశ్నించగా, ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. తాము నిజంగా గొడవ పడటం లేదని, కావాలనే నటిస్తున్నామని బాలు చెప్పడంతో సత్యం షాక్ అవుతాడు. ఇది మీనా వేసిన మాస్టర్ ప్లాన్ అని బాలు వివరించడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story February 2nd to February 6th Episodes highlights

శృతి-మీనా ఐక్యతను చెడగొట్టాలనే ఉద్దేశంతో ప్రభావతి చేసిన కుట్రను ఆమెకే తిరగదీసేందుకు, గొడవపడుతున్నట్టు నటిద్దామని మీనా ప్లాన్ వేసిందని తెలుస్తుంది. ఈ తెలివికి సత్యం మెచ్చుకుని, ప్రభావతికి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచనలో పడతాడు. ఇదిలా ఉండగా, శృతి తన తల్లి శోభనకు ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. తన జీవితంలో జోక్యం చేయవద్దని, లేనిపోని గొడవలు సృష్టించవద్దని కఠినంగా హెచ్చరిస్తుంది. మరోవైపు రోహిణి తల్లి సుగుణమ్మకు హార్ట్ సమస్య రావడంతో హాస్పిటల్ డ్రామా మొదలవుతుంది. తల్లి ఆరోగ్యం, తన గతం బయటపడుతుందన్న భయం మధ్య రోహిణి అయోమయంలో పడుతుంది. ఎపిసోడ్ చివర్లో బాలు-మీనా మధ్య రోడ్డుపై జరిగే ఫన్నీ ఫైట్ ప్రేక్షకులకు మంచి వినోదం ఇచ్చింది.

మంగళవారం (ఫిబ్రవరి 3)ప్రసారమైన ఎపిసోడ్‌లో బాలు-మీనా రచ్చ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. ఇంట్లో మొదలైన చిన్న గొడవ నడిరోడ్డుపైకి చేరడంతో సీన్ మొత్తం కామెడీగా మారిపోయింది. ఒకరినొకరు తిట్టుకుంటూ రోడ్డుపై హడావుడి చేయడం, చుట్టూ ఉన్నవాళ్లు ఆశ్చర్యంగా చూడడం హైలైట్‌గా నిలిచింది. ఈ గొడవ పీక్స్‌కి చేరిన సమయంలో ట్రాఫిక్ పోలీస్ ఎంట్రీ ఇచ్చి రూ.500 ఫైన్ వేయడంతో ఇద్దరికీ బుద్ధి వచ్చింది. అప్పటివరకు గొడవపడిన జంట ఒక్కసారిగా ప్యాచ్ అప్ కావడం నవ్వులు పూయించింది. ఇక మరోవైపు ఎపిసోడ్ సీరియస్ మోడ్‌లోకి వెళ్లింది. రోహిణి తల్లి సుగుణమ్మ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌కు పరుగులు తీస్తుంది. రిపోర్ట్స్ రావాల్సి ఉండటంతో ఆమె గుండెల్లో ఆందోళన పెరుగుతుంది.

ఇదే సమయంలో మనోజ్ నుంచి కాల్ రావడం ట్విస్ట్. ఎక్కడున్నావ్ అన్న ప్రశ్నకు రోహిణి అబద్ధం చెప్పడంతో మనోజ్ అనుమానం మొదలవుతుంది. దివ్య షాప్‌లో కనిపించడంతో రోహిణి బాగోతం బయటపడుతుందేమోనన్న భయం పెరుగుతుంది. రోడ్డుపై గొడవ తర్వాత ఇంట్లో బాలు-మీనా ట్రాక్ మళ్లీ ఫన్నీగా సాగుతుంది. కోపంతో మీనా గ్లాసులు విసిరితే, బాలు స్వీట్ తెచ్చి సారీ చెప్పి ఆమెను కూల్ చేస్తాడు. చింటూని చూసేద్దామన్న మీనా మాటకు బాలు ఒప్పుకోవడంతో ఆ ట్రాక్ ముచ్చటగా ముగుస్తుంది. ఇక మనోజ్ ఆగ్రహాన్ని ఎదుర్కొన్న రోహిణి, స్వామీజీ పేరుతో తన కన్నింగ్ ప్లాన్ అమలు చేసి మరోసారి తప్పించుకుంటుంది. వంటింట్లో రవి చేసిన లడ్డూలు, శృతి బిజినెస్ ఐడియా, ప్రభావతి ఎంట్రీతో వచ్చిన డ్రామా... మొత్తంగా ఈ ఎపిసోడ్ ఫన్, టెన్షన్, ట్విస్టులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

బుధవారం (ఫిబ్రవరి 4)ప్రసారమైన ఎపిసోడ్‌లో భావోద్వేగాలు, అనుమానాలు, కీలక నిర్ణయాలు కథను ఉత్కంఠభరిత మలుపు తిప్పాయి. బాలు-మీనా కలిసి చింటూని కలవాలనే ఉద్దేశంతో సుగుణమ్మ ఇంటికి వెళ్లడం నుంచే కథ ఆసక్తికరంగా సాగింది. సుగుణమ్మ ఆరోగ్య పరిస్థితి చూసి ఇద్దరూ ఆందోళన చెందుతారు. తన ఆరోగ్యం గురించి ఎందుకు చెప్పలేదని బాలు ప్రశ్నించగా, ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే చెప్పలేదని సుగుణమ్మ వివరణ ఇస్తుంది. అయితే కూతురు రోహిణి రాకపోవడంపై బాలు, మీనా ఇద్దరూ అసహనం వ్యక్తం చేస్తారు. సుగుణమ్మ మాత్రం కూతుర్ని సమర్థిస్తూ, నర్స్‌ను ఏర్పాటు చేసిందని చెబుతుంది. చింటూ కనిపించకపోవడంతో బాలు ప్రశ్నించగా, ఆరోగ్యం బాగోలేక బంధువుల ఇంటికి పంపించామని సుగుణమ్మ అబద్ధం చెబుతుంది. ఈ క్రమంలో బాలు కీలక నిర్ణయాన్ని లేవనెత్తుతూ, చింటూని దత్తత తీసుకోవాలనే ఆలోచనను సుగుణమ్మ ముందు ఉంచుతాడు.

ఇది విని ఆమె కళ్లలో ఆనందం మెరుస్తుంది. కానీ తుది నిర్ణయం కూతురి చేతిలో ఉందని స్పష్టం చేస్తుంది. మీనా కూడా అవసరమైతే తమపై ఆధారపడాలని ధైర్యం ఇస్తుంది. అనంతరం సుగుణమ్మ రోహిణికి ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ చెబుతుంది. దీంతో రోహిణి ఆగ్రహంతో రగిలిపోతుంది. చింటూని దత్తత ఇవ్వాలన్న తల్లి ఆలోచనతో ఆమె పూర్తిగా షాక్ అవుతుంది. చింటూ భవిష్యత్తు కోసమే నిర్ణయమని సుగుణమ్మ తేల్చి చెప్పడంతో తల్లి-కూతుళ్ల మధ్య ఘర్షణ తీవ్రంగా మారుతుంది.మరోవైపు బాలు సందేహాల్లో మునిగిపోతే, మీనా శాంతంగా ధైర్యం చెబుతుంది. చివరికి రోహిణి తన స్నేహితురాలు దివ్యతో మాట్లాడి కొత్త ప్లాన్ వేస్తుంది. తల్లిని, చింటూని సిటీకి తీసుకొచ్చి ఇక్కడే ఉంచాలని నిర్ణయించుకుంటుంది. చింటూకు స్కూల్ అడ్మిషన్ తీసుకున్నానని తల్లికి చెప్పడంతో సుగుణమ్మ ఆనందంతో మురిసిపోతుంది. ఈ మలుపుతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగుస్తుంది.

గురువారం (ఫిబ్రవరి5) ఎపిసోడ్ సరదా, అపార్థాలు, చిన్న ట్విస్ట్‌లతో ప్రేక్షకులను చివరి వరకూ కట్టిపడేసింది. ఎపిసోడ్ ఆరంభంలో మీనా ఇంటివారందరికీ బిర్యానీ వండిపెట్టగా... శృతి "నీ చేతిలో ఏదో మహత్యం ఉంది" అంటూ పొగడ్తలు కురిపిస్తుంది. అత్తయ్య విషయం బయటపడితే ఇబ్బందులు వస్తాయేమోనని మీనా భయపడగా, సత్యం "రా ప్రభావతి వస్తోంది" అంటూ ప్రాంక్ వేయడంతో మీనా-శృతి గందరగోళానికి గురవుతారు. చివరికి అది సరదానేనని తెలిసి నవ్వులు పూయిస్తాడు. ప్రభావతికి టిఫిన్ ఇవ్వడానికి బయల్దేరిన మీనా, బాలుతో కలిసి వెళ్తుంది. తొందరలో క్యారీ బ్యాగ్ కారులో పెట్టగా... అనుకోకుండా బాలు ఖర్చుల బిల్ అదే బ్యాగ్‌లో పడిపోతుంది. ఇదే తర్వాత పెద్ద వివాదానికి కారణమవుతుంది. డాన్స్ స్కూల్‌లో ప్రేమజంట సరదాలు మీనాక్షి గమనిస్తే, ప్రభావతి మాత్రం పట్టించుకోని తీరు చూపిస్తుంది.

టిఫిన్‌తో వచ్చిన మీనాపై ప్రభావతి లేట్ అంటూ మండిపడుతుంది. మీనాక్షి సెటైర్లు వేయగా, మీనా మర్యాదగా బిర్యానీ వడ్డిస్తుంది. తింటూనే "ఇది హోటల్‌దా?" అంటూ ప్రభావతి అనుమానం వ్యక్తం చేస్తుంది. మరోవైపు మనోజ్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి భయంకరమైన మాటలతో లెటర్ ఇచ్చి మాయమవడం మరో ఉత్కంఠను పెంచింది. ఇంటికి వచ్చాక ప్రభావతి బిర్యానీ జీర్ణం కాలేదని మీనాపై ఆరోపణలు చేస్తుంది. రోహిణి క్యారీ బ్యాగ్‌లో బిల్ చూసి "హోటల్ బిర్యానీనే" అంటూ చిచ్చు పెడుతుంది. సత్యం మందలించినా ప్రభావతి బిల్ చూపిస్తూ గొడవ చేస్తుంది. అంతలో బాలు ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. బిల్ నిజం బయటపడుతుందా? మీనా అమాయకత్వం రుజువవుతుందా? అన్న ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

శుక్రవారం (ఫిబ్రవరి 6)ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రభావతి అస్వస్థతకు గురవ్వడంతో ఇంట్లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఇదే అవకాశంగా భావించిన రోహిణి, మీనాపై నిందలు మొదలుపెడుతుంది. బయట హోటల్ బిర్యానీ తెప్పించిందని ఆరోపిస్తూ పరిస్థితిని మరింత విషమం చేస్తుంది. ప్రభావతి కూడా అదే మాట అంటడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ సమయంలో బాలు ఎంట్రీ ఇచ్చి అసలు నిజాన్ని బయటపెడతాడు. ప్రభావతి చూపించిన బిల్లు పాతదని, అది గతంలో తానే తెచ్చుకున్న బిర్యానీకి సంబంధించినదని క్లారిటీ ఇవ్వడంతో రోహిణి మాటలు ఆగిపోతాయి. తర్వాత రంగా కాల్ ద్వారా వంటలో పచ్చ కర్పూరం బదులు కర్పూరం పడిందని తెలిసి అసలు కారణం బయటపడుతుంది. దీంతో సత్యం ప్రభావతిని హెచ్చరిస్తాడు.

మీనా కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఆధారాలు లేకుండా నిందలు వేయొద్దని స్పష్టంగా చెబుతుంది. బిల్లు ట్విస్ట్‌తో మీనా నిర్దోషిత్వం రుజువు అవుతుంది. మరోవైపు మనోజ్‌కు భయంకరమైన కల రావడంతో అర్ధరాత్రే తల్లిని పిలిపించి లెటర్ విషయం చెబుతాడు. దొంగ అలికిడి అనుకుని భయపడిన ఇద్దరికీ అక్కడ రోహిణి కనిపిస్తుంది. లెటర్ చదివిన రోహిణి ఇది బ్లాక్‌మెయిల్ అయి ఉండొచ్చని ధైర్యం చెబుతుంది. ఇంకో వైపు బాలు-మీనా మధ్య భావోద్వేగ క్షణాలు చోటుచేసుకుంటాయి. అదే సమయంలో రోహిణి తన ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అద్దె ఇల్లు ఫిక్స్ చేస్తుంది. నెలకు రూ.20 వేల అద్దె, లక్ష అడ్వాన్స్ వినగానే షాక్ అయినా, పరిస్థితుల దృష్ట్యా కొంత డబ్బు ఇచ్చి మిగతాది రెండు రోజుల్లో ఇస్తానని ఒప్పుకుంటుంది. ఎపిసోడ్ మొత్తం డ్రామా, ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X