Gunde Ninda Gudi Gantalu Weekly: ప్రభావతి ఆగ్రహం.. రోహిణి మరో నాటకం.. మీనాపై నిందలు..

Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జనవరి 19వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

గుండె నిండా గుడిగంటలు సోమవారం (జనవరి 19) ఎపిసోడ్‌లో సోమవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనా తన స్నేహితులను కలిసి ఇంట్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. భర్త బాలు మాటలు, అతని కోపం తన మనసును ఎంతగా గాయపరిచాయో చెబుతూ కంటతడి పెడుతుంది. ఈ సమయంలో స్నేహితులు ఆమెకు ధైర్యం చెబుతారు. బాలు లాంటి భర్త దొరకడం అదృష్టమని, గొడవలు పెంచుకోకుండా మాట్లాడి సర్దుకుపోవాలని సలహా ఇస్తారు. మరో స్నేహితురాలు భర్తను మన దారిలోకి తెచ్చుకోవాలంటే అతనికి ఇష్టమైన వంటకం చేయాలని చెప్పడంతో, బాలుకి చికెన్ ఇష్టమని మీనా గుర్తు చేస్తుంది. దీంతో భర్తతో సర్దుకుపోవాలనే ఆలోచన మీనా మనసులో బలపడుతుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story January 19th to January 23th Episodes highlights

Courtesy: jiohotstar

అదే సమయంలో పార్వతి నుంచి వచ్చిన ఫోన్ కాల్ మీనాను మరింత కలచివేస్తుంది. బాలు ఇంకా శివపై కోపంగా ఉన్నాడని తెలిసి, తన వల్లే అతడు ఇలా ఉన్నాడేమోనని బాధపడుతుంది. మరోవైపు ట్రిప్‌లో ఉన్న బాలు, ఓ మహిళ మాటల ద్వారా లోతైన ఆలోచనల్లో పడతాడు. పెళ్లయిన మహిళ పుట్టింటిని మర్చిపోవాలా అన్న ప్రశ్న అతని మనసును తాకుతుంది. రాజేష్ మాటలతో తన తప్పు గ్రహించిన బాలు, మీనా విషయంలో పశ్చాత్తాపపడతాడు. ఇక మనోజ్ షోరూంలో రోహిణి 'నా కొడుకు' అంటూ అనుకోకుండా మాట జారవిడవడంతో ఉత్కంఠ ఏర్పడుతుంది. వెంటనే తెలివిగా మాట మార్చి మనోజ్‌ను మాయ చేస్తుంది. చివరగా మీనా చేసిన చికెన్ ఇంట్లో అందరి ప్రశంసలు అందుకుంటే, ప్రభావతి వంకలు పెట్టడం, శృతి చురుకులు, సత్యం మాటలు ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.

మంగళవారం (జనవరి 20) ఎపిసోడ్‌లో మీనా చేసిన చికెన్ వాసనకే కుటుంబ సభ్యులంతా టేబుల్ చుట్టూ చేరి లొట్టలు వేసుకుంటూ తింటారు. మీనా వంటను అందరూ తెగ మెచ్చుకుంటే, ప్రభావతి మాత్రం ఎప్పటిలాగే వంకలు పెడుతుంది. ఉప్పు ఎక్కువైందని విమర్శలు చేస్తూనే కడుపునిండా తినేస్తుంది. శృతి, సత్యం చురకలతో ఆ సీన్‌ను మరింత సరదాగా మార్చగా, రవి కూడా మీనా వంటను ఆకాశానికెత్తుతూ రెస్టారెంట్ స్పెషల్‌గా పెట్టాలంటాడు. ఈ మాటలు ప్రభావతికి మరింత మంట పుట్టిస్తాయి. ఇక బాలు మీనా కోసం స్వీట్ తీసుకుని రావడం, ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు పిలుచుకోవడం కథలో కీలక మలుపుగా మారుతుంది. నిన్నటి గొడవకు బాలు క్షమాపణ చెప్పడంతో మీనా-బాలు మధ్య దూరం తగ్గుతుంది.

బాలు కోసం మీనా ముందే దాచిపెట్టిన చికెన్ చూసి బాలు ఇంప్రెస్ అవుతాడు. ఈ మధుర క్షణాలతో ఇద్దరి గొడవకు ఫుల్‌స్టాప్ పడగా, ప్రభావతి మాత్రం తన ప్లాన్ ఫెయిల్ కావడంతో కుళ్లుకుంటుంది. మరుసటి రోజు మీనా స్నేహితులు బాలు-మీనాల జంటను పొగడ్తలతో ముంచెత్తుతారు. అయితే అదే సమయంలో సుమతి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో కథ ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. హాస్పిటల్‌లో రోహిణి రెండో ప్రెగ్నెన్సీ కోసం కన్సల్టేషన్‌కు వస్తోందని తెలిసి మీనా షాక్‌కు గురవుతుంది. ఈ నిజం ఆమెను తీవ్ర ఆలోచనల్లో ముంచెత్తి, చివరికి బాలు కూడా ఆమె ప్రవర్తనలో మార్పును గమనించే స్థితికి తీసుకొస్తుంది. ఇలా ఎపిసోడ్ చివర్లో సస్పెన్స్ మరింత పెరిగింది.

బుధవారం (జనవరి 21) ఎపిసోడ్‌ ఉత్కంఠభరితమైన పరిణామాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.రోహిణి విషయంలో తెలిసిన షాకింగ్ నిజం తర్వాత మీనా ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఆ విషయాన్ని ఎవరికీ ఎలా చెప్పాలో తెలియక ఆమె అయోమయంలో పడుతూ నాన్‌సింక్‌గా ప్రవర్తించడం బాలును ఆందోళనకు గురిచేస్తుంది. అదే సమయంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిన అర్జెంట్ కాల్ రావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది.ఇంట్లో మీనా వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ప్రభావతి ఆమెపై మండిపడుతుంది. టీ అడిగితే కాఫీ తీసుకురావడం చిన్న విషయమే అయినా, దాన్ని పెద్ద గొడవగా మార్చి మీనాను అవమానిస్తుంది.

ఇదే సమయంలో రోహిణి, మనోజ్ స్వీట్స్‌తో ఇంటికి వచ్చి 'శుభవార్త' అంటారు. కానీ అది బిజినెస్ సేల్స్ గురించి అని తెలిసి ప్రభావతి తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పిల్లల విషయం కాకుండా వ్యాపారం గురించే మాట్లాడుతున్నారంటూ వ్యంగ్యంగా స్పందిస్తుంది. ఈ అపార్థాల మధ్య బాలు పూలదండ, స్వీట్ బాక్స్‌తో ఇంట్లోకి రావడం ఎపిసోడ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ట్రాఫిక్ జామ్ కారణంగా మార్కెట్‌లోనే జరిగిన డెలివరీకి సహాయం చేసి తల్లి-బిడ్డలను కాపాడిన కథను బాలు వివరించడంతో అందరూ భావోద్వేగానికి గురవుతారు. బాలు చూపిన మానవత్వాన్ని కుటుంబసభ్యులు మెచ్చుకుంటారు. అయితే ఈ ఆనందం మధ్యలోనూ ప్రభావతి ఆస్తి, వారసత్వం గురించే మాట్లాడడం సత్యాన్ని ఆగ్రహానికి గురిచేస్తుంది. ఈ ఎపిసోడ్‌తో కుటుంబంలో కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యే సంకేతాలు కనిపించాయి.

గురువారం (జనవరి 22) ఎపిసోడ్ లో ఆసక్తికర ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఎపిసోడ్ ప్రారంభంలోనే ఊర్లో పిల్లలు పుడుతుంటే తమ ఇంట్లో మాత్రం పిల్లల మాటే లేదంటూ ప్రభావతి వ్యక్తం చేసిన నిరాశ ఇంటి వాతావరణాన్ని ఉద్విగ్నంగా మార్చింది. దీనికి సత్యం, రవి స్పందిస్తూ ప్రతి ఒక్కరి జీవితం ఒకే టైమ్‌లైన్‌లో జరగదని, బాలు చేసిన పుణ్యం వృథా కాదని ధైర్యం చెప్పినా, ప్రభావతి మాత్రం ఇంట్లో పెద్దవాడు మనోజ్ కాబట్టి ముందుగా అతడికే పిల్లలు పుట్టాలని, ఆస్తి వారసత్వం కూడా అతని పిల్లలకే చెందాలని పట్టుబడింది. ఆమె మాటలతో బాలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు.మరోవైపు రోహిణి గతం బయటపడితే ఏమవుతుందోనన్న భయంతో మీనా ఆందోళన చెందుతుంది.

శృతి ఫోన్‌లో మాట్లాడుతున్న సీరియల్ కథలో పెళ్లికాకముందే తల్లి అయ్యే క్యారెక్టర్ ప్రస్తావన మీనాకు షాక్ ఇచ్చి, ఆమె చేతిలోని గిన్నె జారిపడేలా చేస్తుంది. చివరకు మీనా తన అనుమానాన్ని శృతికి చెప్పడంతో విషయం రవికి, అక్కడి నుంచి బాలుకు చేరుతుంది. రోహిణికి పెళ్లికి ముందే పిల్లాడు ఉన్నాడన్న అనుమానం బాలు మనసును కుదిపేస్తుంది. ఈ రహస్యాన్ని దాచుకోలేక బాలు నేరుగా తండ్రి సత్యం వద్దకు వెళ్లి నిజం చెబుతాడు. మొదట సత్యం ఆగ్రహించినా, బాలు మాటల్లోని నిజాయితీని గ్రహించి లోతైన ఆలోచనలో పడతాడు. ఇది నిజమా? లేక అపార్థమా? ప్రభావతికి ఇప్పటికే ఈ విషయం తెలిసి ఉందా? అన్న ప్రశ్నలతో కథ మరింత ఉత్కంఠను పెంచింది. రాబోయే ఎపిసోడ్స్‌లో ఈ రహస్యమే కీలక మలుపుగా మారనుంది.

శుక్రవారం (జనవరి 23)శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కథ మొత్తం రోహిణి చుట్టూనే తిరుగుతూ, ఆమె అల్లుకున్న అబద్ధాల వల మరింత బిగుసుకుంది. రోహిణి విషయం సత్యానికి తెలిసిన క్షణం నుంచే కథ కీలక మలుపు తిరిగింది. సత్యం నేరుగా ప్రభావతిని ప్రశ్నించడంతో ఇంట్లో దాగి ఉన్న ఉద్రిక్తత ఒక్కసారిగా బయటపడింది. 'రెండోసారి గర్భం అంటే ఆలోచించాల్సిందే'అన్న సత్యం మాటలు ప్రభావతిని షాక్‌కు గురిచేశాయి. మొదట తప్పించుకునే ప్రయత్నం చేసినా, సత్యం అనుమానం మరింత పెరిగింది. రోహిణిపై ప్రభావతికి ఉన్న ప్రత్యేక అభిమానం గురించీ ప్రశ్నించడంతో ఆమెపై కూడా సందేహాలు మొదలయ్యాయి. తన క్యారెక్టర్‌పై అనుమానం రావడంతో ప్రభావతి తీవ్ర ఆవేశంతో మనోజ్ గదికి వెళ్లి రోహిణిని నిలదీసింది. కుటుంబ సభ్యులంతా హాల్లో ఉండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

'నీ గతం ఏంటి? ఎవరు నువ్వు?'అంటూ ప్రభావతి వేసిన ప్రశ్నలు రోహిణిని మాటలేకుండా చేశాయి. హాస్పిటల్‌కు వెళ్లిన విషయం బయటపడడంతో కథ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో రోహిణి ఏడుపుని ఆయుధంగా మార్చుకుంది. చివరకు "మొదటిసారి గర్భవతి అయ్యాను, ఆ బిడ్డ కడుపులోనే చనిపోయింది" అంటూ కొత్త కథ అల్లింది. ఇది నిజమా లేక మరో అబద్ధమా అన్న సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. చివరికి విషయం మీనా మీదికి మళ్లి, ఆమె దోషిలా మారడం రోహిణికి మరోసారి తప్పించుకునే అవకాశం ఇచ్చింది. నేటి ఎపిసోడ్‌లో నిజం కన్నా రోహిణి నాటకమే పైచేయి సాధించినట్టు కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X