Gunde Ninda Gudi Gantalu Weekly (July14-July18): రోహిణి కొత్త నాటకం.. శృతికి గుణపాఠం.. బిక్షగాడిగా మనోజ్
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 14వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
జూలై 14వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మీనా వెళ్లి శృతిని కలుస్తుంది. అప్పటికే మీనాకు అసలు ఫంక్షన్ లో గొడవ ఎవరి వల్ల జరిగిందనే విషయం తెలియదు. దీంతో మీనా శృతికి వివరించాలని అనుకుంటుంది. తన డబ్బింగ్ స్టూడియో దగ్గరకు వెళ్లి అసలు గొడవ జరిగింది బాలు వల్ల కాదని చెబుతుంది. కావాలనే మీ అమ్మానాన్నలు నాపై చైన్ దొంగలించానని నింద వేశారని చెబుతుంది. ఆ విషయం తెలుసుకున్న బాలు చాలా సమయం సర్ది చెప్పే ప్రయత్రం చేశారని అంటుంది. అయినా కూడా మీనాన్న నన్ను దొంగ అని, మా కుటుంబాన్ని మొత్తం దోపిడీలు చేసే వారని అనడంతో బాలు తట్టుకోలేకపోయాడు. ఆవేశం పట్టలేక మీ నాన్నపై చేయి చేసుకున్నాడు. బాలు చేసిన దాంట్లో మీ అమ్మానాన్న తప్పు కూడా ఉందని చెబుతుంది. ఈ గొడవల వల్ల నీ జీవితాన్ని నాశనం చేసుకోకని సూచిస్తుంది. మరోవైపు బాలు వెళ్లి రవిని కలుస్తాడు. నువ్వు ఇంటికి రాకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నావని అడుగుతాడు. నీ కోసం అమ్మనాన్న ఎదురు చూస్తున్నారని అంటాడు. శృతి వాళ్ల నాన్న కావాలనే ఫంక్షన్ లో గొడవ చేసి, నిన్ను, శృతిని పర్మినెంట్ గా ఆ ఇంట్లోనే పెట్టుకోవాలని చూస్తున్నారు. నువ్వు త్వరగా శృతిని తీసుకొని ఇంటికి వచ్చేయమని చెబుతాడు.

జూలై 15వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు, మీనా వెళ్లి కలవడంతో అటు శృతిలో, ఇటు రవిలో కాస్తా ఆవేశం, కోపం తగ్గుతుంది. ఇద్దరు కలిసి పోవడానికి ప్రయత్నిస్తారు. ఇదిలా ఉంటే శృతి, రవి ఇంటికి రావడం లేదని ప్రభావతి అన్నం తినడం మానేస్తుంది. దాంతో సత్యం, రోహిణి, మనోజ్ అందరూ తినకుండా ఉంటారు. ఎన్ని గొడవలు జరిగినా తన తల్లి తినలేదని బయటికి వెళ్లి బిర్యాన్నీ తెస్తాడు. రవి రెస్టారెంట్ కు వెళ్లి అమ్మ అన్నం తినడం లేదని చెప్పానని, వెంటనే వాడు స్వయంగా అమ్మతో పాటు ఇంట్లో వాళ్లందరికీ బిర్యానీ వండి పంపించాడంటాడు. దీంతో వెంటనే ప్రభావతి పుష్టిగా భోజనంగా బిర్యానీ తింటుంది. ఇక అందరూ కలిసి భోజనం తినే సమయంలో ప్రభావతికి రోహిణి వాళ్ల నాన్న గుర్తుకు వస్తాడు. మరోసారి రోహిణితో వాళ్ల నాన్న టాపిక్ గురించి మాట్లాడుతుంది. ఇంకా మీ నాన్న ఎక్కిన ఫ్లైట్ గద్దలాగా ఆకాశంలోనే తిరుగుతుందా అని అడుగుతుంది. దాంతో రోహిణి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటుంది.
జూలై 16న తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రోహిణిని ప్రభావతి తన మలేషియా తండ్రి ఎక్కడంటూ ప్రశ్నించడంతో సమాధానం ఇవ్వదు. దాంతో తిట్ల పురాణం మొదలు పెడుతుంది. ఇక ఎలాగైనా తన మలేషియా తండ్రి డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటుంది రోహిణి. వెంటనే తన ఫ్రెండ్ విద్య దగ్గరకు వెళ్తుంది. ఇంట్లో జరిగిన విషయాన్ని పూర్తిగా వివరిస్తుంది. వెంటనే పరిష్కారం చూడాలని అంటుంది. ఇవన్నీ భరించే కంటే ఏదైనా దేశం వెళ్లిపోయి హాయిగా ఉండమని విద్య సలహానిస్తుంది. లేదంటే మాణిక్యం లాగా మరో జూనియర్ ఆర్టిస్ట్ ను దింపి మీ నాన్న పాత్రను పోషించమని అడగాలని అంటుంది. అలా కాకుండా ఇక పెద్దగా ప్లాన్ చేయాలని అంటుంది. ఇక మళ్లీ మటన్ కొట్టు మాణిక్యంనే దింపాలని అనుకుంటుంది. వెంటనే మాణిక్యంను రప్పించి రోహిణి వాళ్ల నాన్నను మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారని, బిజినెస్ లో స్నేహితులు మోసం చేసి ఆ కేసును మీ నాన్నపై తోసేసరని చెప్పిస్తుంది. దాంతో ప్రభావతి, సత్యం, బాలు అందరూ షాక్ అవుతారు.
జూలై 17న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రోహిణి వాళ్ల నాన్న మలేషియాలో అరెస్ట్ అయ్యాడని తెలుసుకున్నాక ప్రభావతి నోట మాట రాదు. బంగారం, నోట్ల కట్టలు తెస్తాడని అనుకుంటే ఇలా మలేషియా జైలు కు వెళ్లడం ఏంటని దిగులు పడుతుంది. ఇక రోహిణిపై సానుభూతి చూపిస్తుంది. ఓవైపు రవి, శృతి ఇంట్లో లేకపోవడం, రోహిణి వాళ్ల నాన్న అరెస్ట్ అవ్వడం వంటి విషయాలతో ప్రభావతి ఆందోళన పడుతుంది. తను అకున్నది ఏదీ జరగకపోవడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ కోపాన్ని మొత్తం మీనాపై చూపిస్తుంది. ఈ సమస్యలు అన్నింటికి నువ్వే కారణమని నిప్పులు చెరుగుతుంది. నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి అస్సలు ప్రశాంతత లేదని నిందిస్తుంది. శృతి, రవి రాలేదనే బాధ ఎవ్వరికీ లేదని, పట్టించుకోవడం లేదని మండిపడుతుంది. వెంటనే మీనా స్పందిస్తూ నేను వెళ్లి శృతిని కలిసి మాట్లాడి వచ్చానని అంటుంది. మీరు చేయలేని పని నేను చేశానని చెబుతుంది. దాంతో ప్రభావతి సైలెంట్ అవుతుంది. ఇక మరోవైపు మనోజ్ రోహిణి 14 లక్షలు ఇప్పించమని మనోజ్ ఇబ్బంది పెడుతాడు. దాంతో రోహిణి చిర్రెత్తిపోతుంది. మీ పత్రాలు తాకట్టు పెట్టి తీసుకోమని చెబుతుంది. నీకు తప్పకుండా ఇచ్చి తీరుతారని రెచ్చగొడుతుంది.
జూలై 18న తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మనోజ్ ఇంటికి వెళ్లి తనకు 14 లక్షలు కావాలని, ఇక కెనడాకు వెళ్లాల్సిన సమయం దగ్గరకు వచ్చిందని అంటాడు. అంత డబ్బు లేదని సత్యం అనడంతో ఇంటి పత్రాలు తాకట్టు పెడుదామంటాడు. వెంటనే ప్రభావతి ఫైర్ అవుతుంది. ఇప్పటికే నిన్ను నమ్మి లక్షలు మోస పోయాం. ఇకపై నమ్మే ప్రసక్తే లేదని అంటుంది. కావాలంటే రోహిణి వాళ్ల మామను అడిగి తీసుకోమని మండిపడుతుంది. అందరూ చేతులెత్తయడంతో మనోజ్ సైలెంట్ గా బయటికి వెళ్లిపోతాడు. మరోవైపు శృతికి డబ్బింగ్ స్టూడియో వద్ద సమస్య ఎదురవుతుంది. అక్కడ పర్సు దొంగలించిందంటూ ఇద్దరు భార్యభర్తలు శృతిపై నింద వేస్తారు. ఆ సమయంలో బాలు అక్కడే ఉండటంతో వెళ్లి సమస్య నుంచి కాపాడుతాడు. వాళ్లు శృతిని దొంగ అన్నందుకు బాధపడుతుంది. ఇక బాలు స్పందిస్తూ ఆ రోజు ఫంక్షన్ లో మీ నాన్న మీనాను దొంగ అన్నందుకే ఆవేశపడాల్సి వచ్చిందని శృతికి అర్థమయ్యేలా చెబుతాడు. ఏదేమైనా రవిని దూరం చేసుకోకని చెబుతుంది. మరోవైపు డబ్బుల కోసం మనోజ్ మరీ దిగజారిపోతాడు. గుడి మెట్ల మీద అడుక్కుంటూ రోహిణి, బాలుకు దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











