Gunde Ninda Gudi Gantalu Weekly (July21-July25): మనోజ్ చెంప చెల్లు.. మీనాతో రోహిణి గొడవ.. మౌనికాకు టార్చర్
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 21వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
జూలై 21వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
కెనడా వెళ్లడం కోసం మనోజ్ స్వామిజీని వెళ్లి కలుస్తాడు. దాంతో ఆ స్వామీజీ మనోజ్ గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. అయితే మనోజ్ తొందరపడి స్వామిజీ మాట్లాడానికంటే ముందే ఎక్కువగా మాట్లాడుతాడు. ఆపై స్వామిజీకి కోపం వస్తుంది. వెంటనే ఆ స్వామిజీ మనోజ్ పై మండి పడుతాడు. మనోజ్ గతాన్ని పూర్తిగా చెప్పి దెబ్బకు నోరు మూయిస్తాడు. నువ్వు జాబ్ లేక కష్టాలు పడుతున్నావా? మరోవైపు నీకు విదేశానికి వెళ్లే అవకాశం వచ్చినా కూడా నువ్వు వెళ్లలేక పోతున్నావు? కదా వీటన్నింటికి నీ నోటి దూలనే కారణమని చెబుతాడు. డబ్బులు లేక నానా తంటాలు పడుతున్నావని చెప్పడంతో మనోజ్ దెబ్బకు ఆశ్చర్యపోతాడు.స్వామిజీ కరెక్ట్ గా చెప్పడంతో నోరెళ్లబెడుతాడు. ఇక స్వామిజీ చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకు, వినేందుకు శ్రద్ధ వహిస్తాడు. తన సమస్యకు పరిష్కారం ఏంటని అడుగుతాడు. అందుకు స్వామిజీ మనోజ్ బుర్ర పగిలిపోయేలా పరిష్కార మార్గం చెబుతాడు. నేను చెప్పినట్టుగా చేస్తే నీ కష్టాలు అన్నీ తీరిపోతాయని, దాంతో నవ్వు అమీర్ గా మారిపోతావని చెబుతాడు. కానీ ఒక్క రోజు నువ్వు గుడి మెట్ల మీద అడుక్కు తినాలని చెబుతాడు. అందుకు మనోజ్ సరే అని చెబుతాడు. ఇక స్వామీజీ చెప్పినట్టుగా అడుక్కు తినేందుకు సిద్ధ పడుతాడు. తన స్నేహితుడి సాయంతో గుడి మెట్ల మీద అడుక్కు తినేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు.

జూలై 22వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మనోజ్ మొత్తానికి స్వామిజీ చెప్పినట్టుగా గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కు తినేందుకు సిద్ధపడుతాడు. ఒక్క రోజు బిచ్చగాడిగా అవతారం ఎత్తుతాడు. తన పార్క్ ఫ్రెండ్ మనోజ్ ను బిచ్చగాడి గెటప్ లోకి మార్చేస్తాడు. ఇక మనోజ్ గుడి దగ్గరకు వెళ్లి మెట్లపై కూర్చొని అడుక్కోవడం ప్రారంభిస్తాడు. అతని ఏమాత్రం అలవాటు లేని పనిచేస్తూ ఇబ్బంది పడుతాడు. ఇన్నాళ్లు హై క్వాలిఫికేషన్ అని చెప్పుకు తిరిగిన మనోజ్ చివరికి ఇలా గుడి మొట్ల మీద అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇదే విషయాన్ని తన మనస్సులోనూ అనుకుంటుంటాడు. ఇక ఏదేమైనా కెనడా వెళ్లాలని అనుకున్నాడు కాబట్టి. గుడి మెట్లపై కూర్చొని అడుక్కోవడాన్ని కంప్లీట్ చేయాలని భావిస్తాడు. ఒక్కరోజే కదా అని అనుకుంటాడు. కానీ మనోజ్ వెళ్లిన గుడికే మీనా కూడా వస్తుంది. మీనా గుడికి వెళ్తూ వెళ్తూ బిక్షగాళ్లకు బిచ్చం వేస్తూ వెళ్తుంది. ఇదే సమయంలో మనోజ్ మీనాను చూసి షాక్ అవుతాడు. అయ్యో మీనాకు దొరికి పోతానేమోనని భయపడుతాడు. మనోజ్ అనుకున్నట్టుగానే మీనా మనోజ్ ను చూస్తుంది. ఇక మనోజ్ దాచుకునే ప్రయత్నం చేసినా ముఖం చూపించే వరకు పట్టుబడుతుంది. మనోజ్ అని కన్ఫమ్ చేసుకుంటుంది.
జూలై 23న తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మనోజ్ గుడి మెట్లపై అడుక్కుంటున్నాడనే విషయాన్ని మీనా వెంటనే బాలుకు చెబుతుంది. బాలు మొదట మీనా చెప్పే మాటలను అస్సలు నమ్మబోడు. ఇక మీనా మాత్రం పదే పదే మీ అన్న మనోజ్ గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కుంటున్నాడని గట్టిగా చెప్పడంతో వెంటనే కంగారు పడుతూ గుడి వద్దకు వెళ్తాడు. బాలు గుడి దగ్గరకు వెళ్లే సరికి మనోజ్ అడుక్కుంటూ కనిపిస్తాడు. బిచ్చగాడి వేషంలో మనోజ్ ను బాలు చూస్తాడు. షాక్ అవుతాడు. దొరబాబులా ఉండే నువ్వు ఇలా ఎందుకు మారిపోయావురా? అని ప్రశ్నిస్తాడు. వెంటనే బాలును ఇంటికి తీసుకొని వెళ్తాడు. కానీ మనోజ్ ఇంటికి రానని, గుడి మెట్ల దగ్గరే అడుక్కుంటానని చెబుతాడు. దాంతో బాలు ఫైర్ అవుతాడు. అసలు నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందని, ఎందుకిలా చేస్తున్నావని మండిపడుతాడు. మనోజ్ ఇంటికి రాను అని అంటున్నా కూడా బలవంతంగా బిచ్చగాడి వేషంలోనే ఇంటికి తీసుకెళ్తాడు.
జూలై 24న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు మనోజ్ ను ఇంటికి తీసుకొస్తాడు. మనోజ్ ను బిచ్చగాడిలా చూసిన తర్వాత ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా ప్రభావతి, సత్యం మనోజ్ బిచ్చగాడి అవతారానికి ఆందోళన పడుతారు. ఉద్యోగం వెతుక్కోవడం మానేసి ఇలా అడుక్కుతినడం ఏంట్రా అని చివాట్లు పెడుతారు. ఒక స్వామిజీ చెప్పాడని చేశానని అంటాడు. ఇక రోహిణి కూడా మనోజ్ ను బిచ్చగాడి వేషధారణలో చూసి షాక్ అవుతుంది. తట్టుకోలేకపోతుంది. మనోజ్ ను తన గదిలోకి తీసుకెళ్లి చెంప చెల్లుమనిపిస్తుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకని అంటుంది. మరోవైపు బాలు శృతిని ఇంటికి రమ్మని నచ్చచెబుతాడు. బాలు మంచి మాటలకు శృతి మారిపోయి అత్తవారింటికి వచ్చేందుకు రెడీ అవుతుంది. రవిని తీసుకొని అత్తవారింటికి వస్తుంది. శృతి రవి తిరిగి రావడంతో అందరూ సంతోషిస్తారు. కానీ రోహిణికి మింగుడు పడదు.
జూలై 25న తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
శృతి, రవి తిరిగి రావడంతో సత్యం ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అందరూ కేక్ కట్ చేసి మళ్లీ కొత్తగా లైఫ్ ను స్టార్ చేద్దామని అనుకుంటారు. కేక్ కట్ చేస్తూ సంబరం చేసుకుంటారు. ఇదే సమయంలో మౌనికాను తీసుకొని సంజూ వస్తాడు. ఇంట్లో వాళ్లందరూ ఏడుస్తూ ఉంటారనుకుంటే నవ్వుతూ కనిపించడంతో షాక్ అవుతాడు. ఇక వెంటనే మౌనికాను తిరిగి ఇంటికి తీసుకెళ్లి టార్చర్ పెడుతాడు. మీ ఇంట్లో వాళ్లను కష్టాలు పెడుతానని అంటాడు. అప్పుడు నువ్వు సంతోషంగానే ఉండాలని హెచ్చరిస్తాడు. మరోవైపు రోహిణికి మీనా వార్నింగ్ ఇస్తుంది. అనవసరంగా శృతికి బాలుకు మధ్య గొడవ పుట్టించాలని ప్రయత్నిస్తున్న రోహిణికి బుద్ధి చెబుతుంది. అది మనసులో పెట్టుకొని రోహిణి మీనా పూల కొట్టును తీయించేందుకు కుట్ర పన్నుతుంది.


Click it and Unblock the Notifications











