Gunde Ninda Gudi Gantalu Weekly: మీనా కంట నీరు.. బాలుపై నిందారోపణ.. మనోజ్ కు తలనొప్పి

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

జూలై 28వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
శృతి తిరిగి ఇంటికి రావడంతో ఇక రోహిణికి గుబులు పడుతుంది. మళ్లీ ప్రభావతి తన మీద పడుతుందని రోహిణి టెన్షన్ పడుతుంది. ఇక శృతి దగ్గరకు వెళ్లి అసలు నువ్వు తిరిగి వస్తావనుకోలేదు అని అంటుంది. ఇక పక్కనే ఉన్న మీనా రోహిణి మాటలను వింటుంది. రోహిణి ప్రశ్నకు శృతి గట్టిగా సమాధానం ఇస్తుంది. అయినప్పటికీ రోహిణి బాలును చెడ్డవాడిగా చేస్తూ శృతికి చెబుతూ ఉంటుంది. దాంతో మీనాకు కోపం వస్తుంది. ఇక మీనా మనోజ్ గుట్టు విప్పుతుంది. మనోజ్ గుడిమెట్ల మీద అడుక్కు తినే స్థాయి దిగజారిపోయాడని చెబుతుంది. దాంతో రోహిణి అవమానంగా భావిస్తుంది. మీనాపై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. మరో వైపు శృతి వాళ్ల అమ్మ శోభ ఇంటికి వచ్చి వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ ప్రభావతిని పూల వ్యాపారం చేసుకోమని చెప్పి మంట పెట్టి వెళ్తుంది. దాంతో మీనా పూల కొట్టుపై ప్రభావతి గురి పడుతుంది. ఎలాగైనా కొట్టు తీయించేయాలని అనుకుంటుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story

జూలై 29వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
శృతి వాళ్ల అమ్మతో పాటు శృతి కూడా ప్రభావతిని పూల వ్యాపారంలో మీరు బాగా రాణించగలరని అనడంతో ప్రభావతి అప్సెట్ అవుతుంది. ఇక పూల కొట్టును ఎలాగైనా తీసేయాలని నిర్ణయించుకుంటుంది. దాంతో వెంటనే వెళ్లి రోహిణితో జరిగిన విషయాన్ని చెబుతుంది. తనకు తల తీసేసినట్టు అవుతుందని చెబుతుంది. ఎలాగైనా ఇంటి ముందు దిష్టిబొమ్మలా ఉన్న పూల కొట్టును తీసేయాలని అంటుంది. అందుకు ఏదైనా ఉపాయం కావాలని అంటుంది. ఇదే సమయంలో రోహిణి సలహానిస్తుంది. బాలు పూల కొట్టు పెట్టినప్పుడు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. అధికారులకు ఫిర్యాదు చేస్తే వారే పూల కొట్టును తొలగిస్తారని చెబుతుంది. ఇక వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తారు. ఆ కాసేపటికే మున్సిపల్ సిబ్బంది వచ్చి పూల కొట్టును తీసే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో మీనా, సత్యం వచ్చి అడ్డుకుంటారు. ఇక మీనా, రోహిణి మాత్రం సంతోషంగా అలాగే చూస్తూ ఉంటారు. పూల కొట్టును మున్సిపల్ సిబ్బంది తెలిగిస్తుంటే ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయరు.

జూలై 30వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మున్సిపల్ అధికారి తమ సిబ్బందితో వచ్చి పూల కొట్టును తొలగిస్తున్నామని చెబుతాడు. మీ చుట్టుపక్కల వాళ్లు పూల కొట్టు వల్ల చెత్తచెదారం అవుతుందని ఫిర్యాదు చేశారు. వెంటనే తొలగించాలని చెబుతారు. ఇక మీనా, సత్యం ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా సిబ్బంది వినకుండా పూల కొట్టును తీసుకొని వెళ్లిపోతారు. ఇక మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. వెంటనే బాలుకు జరిగిన విషయాన్ని చెబుతుంది. బాలు ఇంటికి తిరిగి వస్తాడు. అసలు పూల కొట్టును ఎందుకు తీసుకెళ్లారని మీనాను అడుగుతాడు. ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెబుతుంది. ఇక ఈ ఘటన మొదటి నుంచి ఉన్న కామాక్షి మాత్రం బయటి వాళ్ల కంటే ఇంట్లో వాళ్లే కంప్లైంట్ ఇచ్చి ఉంటారని అంటుంది. దాంతో ప్రభావతి, రోహిణి భుజం తడుముకుంటారు. కామాక్షి వారిద్దరిపైనే అనుమానం ఉంటుంది. బాలు మాత్రం కోపంతో రగిలిపోతాడు. కంప్లైంట్ ఇచ్చిన వారిని త్వరలోనే కనిపెడుతానని, గట్టిగా బుద్ధి చెబుతానని అంటాడు. ఇక మీనాకు పూల కొట్టుపోవడంతో ఏడుస్తూ ఉంటుంది. దాంతో మీనా కోసం మరో షాప్ పెట్టాలని బాలు నిర్ణయించుకుంటాడు.

జూలై 31వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మీనా కోసం బాలు మొబైల్ పూల షాప్ ఏర్పాటు చేయాలని అనుకుంటాడు. మీనా దిగాలుగా కూర్చొని ఉంటే బాలు చూడలేకపోతాడు. అందుకు స్కూటీ కొని దానికి పూల బాక్స్ ఏర్పాటు చేయాలనుకుంటాడు. అప్పుడు మీనా ఇంటింటికి వెళ్లి ఆర్డర్స్ పై పూలు సప్లై చేస్తుంది. అప్పుడు మున్సిపల్ అధికారులతోనూ ఎలాంటి గొడవ ఉండబోదని నిర్ణయించుకుంటాడు. ఇక మీనాకు పూల బండి కొనిద్దామని వెళ్తాడు. కానీ అందుకు 10 వేల రూపాయలు తక్కువ పడుతుంది. అదే సమయంలో ఒక పెద్దాయన బాలు సాయం కోరుతూ వస్తాడు. తన ఇంట్లో రౌడీలు తిష్ట వేసి ఇబ్బంది పెడుతున్నారని ఎలాగైనా నువ్వు వచ్చి వారిని వెళ్లగొట్టాలని చెబుతాడు. లేదంటే నా కూతురు పెళ్లి ఆగిపోతుందని మొర పెట్టుకుంటాడు. దాంతో బాలు సాయం చేసేందుకు వెళ్తాడు.

బాలు ఆ పెద్దాయనకు సాయం చేస్తాడు. రౌడీలను చితకబాది ఇంట్లో నుంచి ఖాళీ చేయిస్తాడు. ఇందుకు ఆ పెద్దాయన బాలుకు 10 వేల రూపాయలు ఇస్తాడు. అయితే రౌడీలను తరిమికొట్టి బాలు కిరాయి తీసుకున్నాడని ప్రభావతి అనుకుంటుంది. ఆ పెద్దాయన బాలుకు డబ్బులు ఇవ్వడాన్ని చూసి రగిలిపోతుంది. ఇక బాలు మీనా కోసం మొబైల్ షాప్ రెడీ చేస్తాడు. దానికి అందరూ సంతోషిస్తారు. కానీ ప్రభావతి వచ్చి రౌడీయిజం చేశాడని చెప్పడంతో అందరూ మండి పడుతారు. నానా మాటలు అంటూ అవమానిస్తారు. కానీ అదే పెద్దాయన వచ్చి నిజం చెప్పడంతో సైలెంట్ అయిపోతారు. మరోవైపు మీనా బాలుతో ఒట్టు వేయించుకుని స్కూటీని తీసుకుంటుంది. ఇంకోవైపు మనోజ్ ను 40 లక్షలు మోసం చేసిన కల్పనాను పట్టుకునే పనిలో రోహిణి, మనోజ్ బిజీ అవుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X