Gunde Ninda Gudi Gantalu Weekly (July7-July11): బాలును గెంటేసిన ప్రభావతి.. రోహిణి కాపురానికి గండం.. ఏకాకిగా రవ
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 7వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
జూలై 7వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
శృతి ఫంక్షన్ కు వెళ్లిన మీనాపై శృతి వాళ్ల నాన్న సురేంద్ర దొంగ అనే ముద్ర వేస్తాడు. అప్పటికే బాలుతో గొడవ చేయాలని ప్రయత్నించిన ఆయను ఎక్కడా అవకాశం దొరకకపోవడంతో మీనాపై దొంగతనం నింద వేస్తారు. శృతి వాళ్ల నాన్న సురేంద్ర, తల్లి శోభ అందరు కలిసి మీనాను నిందితురాలిని చేస్తారు. ఫంక్షన్ కు వచ్చిన బాలు కుటుంబ సభ్యుల అందరి ముందు నిలదీసి అడుగుతారు. దీంతో మీనాపై బాలు ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన భార్యను దొంగా దొంగా అనడంతో తట్టుకోలేకపోతాడు. ఇంతకీ ఏం జరిగిందని బాలు మీనాను అడుగుతాడు. దాంతో మీనా శృతి చైన్ ను పూలదండ నుంచి తీసే ప్రయత్నం చేశానని, తిరిగి ఇవ్వాలనుకున్నట్టు చెబుతుంది. అయినా కూడా శృతి వాళ్ల నాన్న మీనాను నానా మాటలు అనడంతో బాలు తట్టుకోలేకపోతాడు. సురేంద్ర చెంప చెల్లుమనిపిస్తాడు. అదే సమయానికి శృతి, రవిలు తిరిగి ఫంక్షన్ హాలుకు వస్తారు.

జూలై 8వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ఫంక్షన్ లో పెద్ద గొడవ జరిగిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సత్యం ప్రభావతి మనోజ్ రోహిణి ముందుగా తమ ఇంటికి చేరుకుంటారు. ఇక బాలు మీనా కారులో వెళ్తూ ఉంటారు. ప్రభావతి బాలు పైన ఆగ్రహంగా ఉంటుంది. దాంతో బాలు మీనా ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే గొడవకు దిగుతుంది. అసలు నువ్వు ఫంక్షన్ లో గొడవ ఎందుకు చేశావని బాలును ప్రశ్నిస్తుంది. నీ వల్లే ఫంక్షన్ లో గొడవ జరిగిందని, నా కొడుకు రవి, కోడలు శృతి ఇంటికి రాలేకపోయారని మండిపడుతుంది. దీంతో వెంటనే సత్యం స్పందిస్తూ ఫంక్షన్ లో ఆ సురేంద్ర అన్ని మాటలు అన్నాడు, పైగా మన ఇంటి కోడలుపై దొంగతనం నింద వేశాడు. అప్పటికీ బాలు సహనంగానే ఉన్నాడు. అయినా సురేంద్రనే బాలు రెచ్చగొట్టి చెంప దెబ్బ తిన్నాడని సత్యం కొడుకు బాలుకు మద్దతునిస్తాడు. ఇక బాలు కూడా తన తప్పేమీ లేదని, తన భార్య మీనాను అన్ని మాటలు అంటుంటే ఒక్కరైనా తిరిగి ఆపారా అని ప్రశ్నిస్తాడు. భార్యను దొంగ అంటే ఏ భర్త ఊరుకోడని అంటాడు. అందుకే బుద్ధి చెప్పానని ప్రభావతికి బదులిస్తాడు.
జూలై 9న తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
నా కొడుకు రవి, శృతిలు తిరిగి మళ్లీ ఈ ఇంటికి వస్తారో రారో అర్థం కావడం లేదని ప్రభావతి ఆందోళన చెందుతుంది. గొడవకు మొత్తం బాలునే కారణమని అందుకు బాధ్యత వహించాల్సింది కూడా బాలునే అని అంటుంది. ఇక వాళ్లు లేని ఈ ఇంట్లో బాలు, మీనా కూడా ఉండటానికి వీల్లేదని ప్రభావతి అంటుంది. దాంతో బాలు, మీనా షాక్ అవుతారు. వాళ్లిద్దరు నీకు కొడుకు కోడలైతే మరీ మేం ఇద్దరం ఎవ్వరమని బాలు ప్రశ్నిస్తాడు. దాంతో వెంటనే ప్రభావతి నువ్వు ఎవ్వరైనా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదంటే వీల్లేదని చెబుతుంది. ఇప్పటికిప్పుడు వాళ్లని ఇంట్లో నుంచి వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్తారు ప్రభావతి అని సత్యం అడుగుతాడు. ఎక్కడికైనా వెళ్లనివ్వు అని అంటుంది. ఆ మాటలు విన్నాక బాలుకు రోషం వస్తుంది. మీనాను తన గదిలోకి తీసుకెళ్లి బట్టలు అన్నీ సర్దుకుందామని చెబుతాడు. వెళ్లి బట్టలు సర్దుకొని కింది వస్తారు. వెళ్తున్నామని అందరికీ చెబుతారు.
జూలై 10న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు, మీనా తమ సామన్లు సర్దుకొని వెళ్లిపోవడానికి సిద్దమవుతారు. ఇదే సమయంలో తండ్రి సత్యంను కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోతున్నాని బాలు చెబుతాడు. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. నా భర్తను నానుంచి వేరు చేయాలని చూస్తున్నావారా? అని ప్రభావతి బాలుపై ఫైర్ అవుతుంది. మరి నువ్వు నా తండ్రిని నాకు దూరం చేయడం సరికాదు కదమ్మా అని తిరిగి ప్రశ్నిస్తాడు. ఇక సత్యం కూడా బాలు, మీనాలతోనే వెళ్లిపోతానని అంటాడు. దాంతో ప్రభావతి గుండె జారిపోతుంది. మీరు వెళ్లిపోతే ఎలా అండీ అని అంటుంది. మీరు వెళ్లడానికి వీల్లేదని సత్యంను బతిమిలాడుతుంది. నేను ఉండాలంటే బాలు, మీనా కూడా ఇంట్లోనే ఉంటారని చెబుతాడు. ఇక వేరే దారిలేక ప్రభావతి సరేనని బాలు, మీనాను ఇంట్లోనే ఉండమని చెబుతుంది. మరోవైపు రవి శృతితో గొడవ పడి వాళ్ల ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. నేరుగా తమ రెస్టారెంట్ కు వెళ్లి ఒంటరిగా కొన్నాళ్లపాటు ఉండాలని నిర్ణయించుకుంటాడు.
జూలై 11న తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ప్రభావతి ఫోకస్ మొత్తం రోహిణివైపు మళ్లింది. రోహిణిని మీ తండ్రి మలేషియా నుంచి వచ్చాడా లేదా అని ప్రశ్నిస్తుంది. దీంతో రోహిణి కంగారు పడుతుంది. అత్త ప్రభావతే కాకుండా మిగిలిన వాళ్లందరూ తన తండ్రి మలేషియా నుంచి ఎప్పుడు వస్తారని అడగటం ప్రారంభిస్తారు. దీంతో రోహిణికి ఎలా సమాధానం ఇవ్వాలో అర్థం కాదు. దాంతో వెంటనే తను ఆరోగ్యం బాలేదు అన్నట్టుగా నాటకం ఆడాలని ప్రయత్నిస్తుంది. ఇక తను టిఫిన్ చేస్తున్న సమయంలో అందరూ తన తండ్రి గురించి ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో సడెన్ గా లేచి బయటికి వెళ్లి వాంతీ చేసుకుంటుంది. దీంతో ప్రభావతి సంతోషిస్తుంది. రోహిణి తల్లి కాబోతుందని అభిప్రాయపడుతుంది. ఇక సంతోషంలో మునిగి తేలుతుంది. వెంటనే రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లి చెక్ చేయించాలని అంటుంది. మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి ఆస్పత్రికి వెళ్తారు. అక్కడ రోహిణి తన స్నేహితురాలు విద్యను కలిసి జరిగిన విషయాన్ని తెలుపుతుంది. తనకు ప్రెగ్నెన్సీ లేదని తన అత్త ఓవర్ గా ఊహించుకుంటోందని చెబుతుంది. ఇక తిరిగి ఇంటికి వెళ్లి ఆస్పత్రిలో చెక్ చేయించానని, నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని రోహిణి ప్రభావతికి తెలియజేస్తుంది. దాంతో ప్రభావతి చాలా బాధపడుతుంది.


Click it and Unblock the Notifications











