Gunde Ninda Gudi Gantalu Weekly: రోహిణికి దెబ్బ మీద దెబ్బ.. బాలుకు సర్ ప్రైజ్.. శోకసంద్రంలో మౌనికా

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 16వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

జూన్ 16వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రోహిణిపై ప్రభావతి మండిపడుతుంది. మనోజ్ పార్లర్ కు వెళ్లి తన తల్లి పేరును మార్చిన సంగతిని తెలుసుకుంటాడు. అదే విషయాన్ని తిరిగి ఇంటికి వెళ్లాక తల్లి ప్రభావతికి చెబుతాడు. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. మనోజ్ వచ్చి ఆ విషయం చెప్పే సరికే బాలు, మీనా, సత్యం హాలులోనే ఉంటారు. దాంతో రోహిణిపై ఎలాంటి మాటలు జారదు. కనీసం కోపంగా కూడా మాట్లాడదు. పైగా అప్పటికే మీనాను ఎందుకు అప్పు చేశావని నానా మాటలు అంటుంది. కానీ రోహిణిని ఏమనకపోయే సరికి మీనా, బాలు, సత్యం ప్రభావతిపై మండిపడుతారు. ఇక ప్రభావతి కోపంతో పైన గదిలోకి వెళ్తుంది. ప్రభావతి కోపాన్ని గమనించిన రోహిణి ఏమంటుందోనని భయపడుతుంది. రోహిణి తన గదిలోకి రాగానే వెంటనే ఫైర్ అవుతుంది. నా దగ్గరి డబ్బులతో నీకు పార్లర్ పెట్టి ఇస్తే నువ్వు నా పేరునే తీస్తేస్తావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అంటూ రెచ్చిపోతుంది. దాంతో రోహిణి హడలిపోతుంది. ఇంకోసారి మీకు తెలియకుండా అలాంటి పని చేయనని చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story June 16th to June 20th Episodes highlights

జూన్ 17వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
పూల దండలు అల్లిన డబ్బులతో మీనా బాలుకు కారు కొనివ్వాలని అనుకుంటుంది. ఆ డబ్బులకు మరింత అప్పు చేసి కారు కన్సల్టెన్సీలో అడ్వాన్స్ కడుతుంది. పైగా కారుకు నచ్చిన కారు కావడంతో త్వరగా డబ్బులు కట్టి తీసుకుంటుంది. ఇక బాలుకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు అమ్మవారి గుడి దగ్గరకు తీసుకెళ్తుంది. కారుకు తన సెకండ్ హ్యాండ్ లో కొన్న కారును గిఫ్ట్ ఇస్తుంది. దాంతో బాలు చాలా సంతోషిస్తాడు. తనకు తెలియకుండానే కారును ఎలా కొని గిఫ్ట్ ఇచ్చావని అడుగుతాడు. పూల దండలు అల్లిన డబ్బులతోనే కొన్నానని చెబుతుంది. దాంతో బాలు చాలా సంతోషిస్తాడు. మీనా తనపై చూపిస్తున్న ప్రేమకు ఫుల్ ఖుషి అవుతాడు. ఇక కారులో మీనాను సిటీ మొత్తం తిప్పుతూ ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంట్లో వాళ్లకు తన కోసం మీనా కారు కొనిచ్చిందని చెబుతాడు.

జూన్ 18న తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మీనా బాలు కోసం కారు కొనిచ్చిందని తెలిసి ప్రభావతి, రోహిణి, మనోజ్ షాక్ అవుతారు. సత్యం, రవి, శృతి మాత్రం సంతోషం వ్యక్తం చేస్తారు. మీనా పూలు అమ్మిన డబ్బులతో బాలు కోసం కారును కొనివ్వడం నిజంగా గ్రేట్ అని శృతి మీనాను మెచ్చుకుంటుంది. ఇక బాలు కారు వెనకాల మీనా పేరు, తన పేరు వచ్చేలా స్టిక్కరింగ్ కూడా వేయించానని చూపిస్తాడు. దాంతో ప్రభావతి ఇంకా కుళ్లుకుంటుంది. సూటిపోటు మాటలు అని ఇంట్లోకి వెళ్తుంది. మరోవైపు మౌనికాను సంజూ టార్చర్ చేస్తూ ఉంటాడు. సంజూను మార్చుకునేందుకు మౌనికా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంది.

జూన్ 19న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు కోసం మీనా కారు కొనివ్వడంతో రోహిణిపై ప్రభావతి ఫైర్ అవుతుంది. కేవలం పూలు అమ్మిన డబ్బులతో తన భర్త కోసం మీనా కారు కొనిచ్చిందని రోహిణితో అంటుంది. కానీ నువ్వు మలేషియా తండ్రిని వెనకాలే ఉంచుకొని ఏమీ చేయలేకపోతున్నావని, అసలు నీకు మనోజ్ పై ప్రేమనే లేదని అంటుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. మీ మలేషియా నాన్నకు ఫోన్ చేసి మనోజ్ కు వెంటనే బిజినెస్ పెట్టించమని అడుగు అని అంటుంది. తన ముందే ఫోన్ చేయమని అడుగుతుంది. కానీ రోహిణి ఆయన ఇప్పుడు బిజీగా ఉంటారని చెప్పి తప్పించుకుంటుంది. దాంతో ప్రభావతి రోహిణిపై ఇంకా మండిపుతుంది. ఇంకెన్నాళ్లు బిజీగా ఉంటారని కసురుకుంటుంది. రోహిణి ఏదో చెప్పి తప్పించుకుంటుంది. మరోవైపు మౌనికా వ్రతంలో ఉన్నదని తెలిసినా సంజూ చికెన్ బిర్యానీ తీసుకొచ్చి తినిపించాలని ప్రయత్నిస్తాడు. బలవంతంగా తినమని మౌనికాను ఇబ్బంది పెడుతాడు. దాంతో సంజూ తల్లి వచ్చి అడ్డుకుంటుంది. ఆ తర్వాత సంజూ లోపలికి వెళ్లిపోతాడు.

జూన్ 20న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మీనా తనపై చూపిస్తున్న ప్రేమకు బాలు సంతోషంలో మునిగి తేలుతాడు. ఇక మీనా కోసం పూలు, స్వీట్స్ తీసుకొచ్చి తినిపించాలని ప్రయత్నిస్తాడు. కానీ వీరికి సెపరేట్ గా గదిలేకపోవడంతో హాలులోనే మీనా తలలో పూలు పెట్టి, స్వీట్ తినిపించాలని అనుకుంటారు. కానీ ప్రభావతి, శృతి, రోహిణి, మనోజ్ ఒకరి తర్వాత ఒకరు హాలులోకి వచ్చి డిస్ట్రబ్ చేస్తూ ఉంటారు. ప్రభావతి పాలు, నీళ్ల కోసం వస్తుంది.శృతి తన బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని హాలులోనే కూర్చొని తినేసి వెళ్తుంది. ఇక మనోజ్, రోహిణి వచ్చి మీనా కోసం తెచ్చిన స్వీట్ తినేసి వెళ్తారు. ఇలా వారికి ఏకాంత సమయం దొరకదు. మరోవైపు శృతి వాళ్ల అమ్మ వచ్చి నల్లపూసలు గుచ్చే కార్యక్రమానికి ప్రభావతిని ఆహ్వానిస్తుంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతుంది. ఇక ప్రభావతి స్పందిస్తూ శృతితోపాటు సంప్రదాయం ప్రకారం ఈ ఇంటి పెద్ద కోడలు రోహిణికి కూడా నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని జరిపిద్దామని అంటుంది. దాంతో శృతి వాళ్ల అమ్మ సరేనని ఒప్పుకుంటుంది. రోహిణి వాళ్ల నాన్నను వెంటనే మలేషియా నుంచి పిలవమని రోహిణిని సూచిస్తుంది. దీంతో రోహిణి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X