Gunde Ninda Gudi Gantalu Weekly: బాలుకు మోసం.. మౌనికకు టార్చర్.. శోభా, రోహిణి కుట్ర

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 23వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

జూన్ 23వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ప్రభావతి అర్థరాత్రి బిర్యానీ అరగకున్నా కూడా తింటుంది. దాంతో రాత్రంతా అవస్థలు పడుతుంది. తిన్నది అరగకపోవడంతో హాలులోకి వెళ్లి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇక అదే రోజు బాలు మీనా కోసం పూలు, స్వీట్లు తీసుకుని వస్తాడు. కానీ ప్రభావతి, శృతి, రోహిణి, మనోజ్ అందరూ హాలులోకి వచ్చి వెళ్తుండటంతో మీనాతో కనీసం ఏకాంతంగా మాట్లాడలేకపోతాడు. మరోవైపు తెల్లవారే దాకా ప్రభావతి తిన్నది అరగక ఇబ్బంది పడుతుంది. దాంతో తెల్లవారి ప్రభావతిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ బాలు దీనికో చిట్కా ఉందని చెప్పి హఠాత్తుగా రోకలి తీసుకెళ్లి కొట్టడానికి వెళ్తాడు. ఇక ప్రభావతి భయంతో పరుగులు తీస్తుంది. వెంటనే కడుపులోని గ్యాస్ పోయి నొప్పి తగ్గుతుంది. మరోవైపు మౌనికాను సంజూను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. శృతికి తాళి మార్చే ఫంక్షన్ ఉందని చెప్పడానికి వచ్చిన మౌనికా తల్లిదండ్రుల ముందు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతాడు. మళ్లీ ఏదైనా గొడవ అవుతుందని మౌనికా కూడా సంజూకు సపోర్ట్ గా మాట్లాడుతుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story June 23th to June 27th Episodes highlights

జూన్ 24వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
శృతి, రోహిణిలకు తాళి మార్చే ఫంక్షన్ ఉందని చెప్పి సత్యం, ప్రభావతి మౌనికా వాళ్ల ఇంటికి వెళ్తారు. అక్కడ మౌనికా సంజూ, వాళ్ల మామ ప్రవర్తనను ముందుగానే పసిగట్టి తానే తన తల్లిదండ్రులపై కోపంగా మాట్లాడి వెళ్లగొడుతుంది. మేం ఫంక్షన్ కు రామని చెప్పి తిరిగి పంపిస్తుంది. ఇక దాంతో ప్రభావతి చాలా భాధపడుతుంది. అసలు ఇంత ఇష్టారీతినా మౌనికా మాట్లాడుతుంది ఏంటని సత్యంతో అంటుంది. ఇక సత్యం ప్రభావతికి సమాధానం చెప్పి తిరిగి ఇంటికి తీసుకెళ్తాడు. మరోవైపు రోహిణిని ప్రభావతి వణికిస్తుంది. తాళి మార్చే ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి మీ నాన్నను మలేషియా నుంచి రమ్మని చెప్పమని అంటుంది. ఇక బాలును ఫంక్షన్ కు రావద్దని చెప్పిన ప్రభావతిని మాటను రోహిణి, సత్యం, రవి, శృతి తిప్పికొడుతాడు. ఫైనల్ గా అందరం కలిసి ఫంక్షన్ కు వెళ్దామని అనుకుంటారు.

జూన్ 25న తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
శృతి తాళి మార్చే ఫంక్షన్ ఉండటంతో వాళ్ల అమ్మ శోభా, నాన్న సురేంద్ర గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తారు. ఇక రోహిణి వాళ్ల అమ్మానాన్నలను కూడా రమ్మనమని ప్రభావతి చెబుతుంది. ఫంక్షన్ కు ఎలాగైనా మీ నాన్న రావాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. లేదంటే నీ కాపురానికే ఎసరు పడుతుందని హెచ్చరిస్తుంది. దాంతో ముందుగా ఫంక్షన్ కు కావాల్సిన డబ్బులనైనా ఏర్పాటు చేయాలని రోహిణి అనుకుంటుంది. దాంతో వెంటనే తన తల్లి సుగుణమ్మకు ఫోన్ చేసి కాస్తా డబ్బులు కావాలని అడుగుతుంది. లక్ష రూపాయాలు అర్జెంట్ గా అవసరం ఉందని, మళ్లీ తిరిగి ఇస్తానని చెబుతుంది. ఇక సుగుణమ్మ కూడా సరేనని చెప్పి డబ్బులు ఏర్పాటు చేసే పనిలో ఉంటుంది. మరోవైపు మౌనికా సడెన్ గా సంజూకు, తమ కుటుంబానికి సపోర్ట్ చేస్తూ తన తల్లిదండ్రులు ప్రభావతి, సత్యాన్ని తిట్టి ఇంట్లో నుంచి పంపించడంతో షాక్ అవుతాడు. కావాలనే అలా మాట్లాడావా? అని మౌనికాను అడుగుతాడు. ఇక మౌనికా అలా ఏం లేదని, మీకు నచ్చని పనిని నేను చేయబోనని చెబుతుంది. ఇది నా ఇల్లు కూడా కదా ఈ ఇంటిపై నాకూ బాధ్యత ఉంటుందని అంటుంది. ఇది నీఇల్లు కాదని సంజూ మౌనికాపై చేయి చేసుకుంటాడు. దాంతో సంజూ తల్లి వచ్చి అడ్డుకుంటుంది మౌనికాను కాపాడుతుంది.

జూన్ 26న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ఇక శృతి, రోహిణి తాళి మార్చే ఫంక్షన్ కు మౌనికా, వాళ్ల అత్తగారు రామని చెప్పడంతో ఇక వాళ్ల పనుల్లో బిజీగా ఉంటారు. ఫంక్షన్ కు కావాల్సిన వస్తువులు, ఇతర పనులపై ఫోకస్ పెడుతారు. కావాల్సినవన్నీ కొనుక్కునేందుకు షాపింగ్ కు కూడా వెళ్తారు. ఇదే క్రమంలో ప్రభావతి షాపింగ్ అనంతరం రోహిణి పని చేస్తున్న పార్లర్ కు వెళ్తుంది. అప్పటికే పార్లర్ కు రోహిణి వాళ్ల సొంత అమ్మ సుగుణమ్మ డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇక అదే సమయంలో ప్రభావతి కూడా రావడంతో రోహిణి టెన్షన్ పడుతుంది. ఇక తన తల్లికి మేకప్ మాస్క్ వేసి కస్టమర్ లా కూర్చీలో కూర్చోబెడుతుంది. ప్రభావతి లోపలికి రాగానే మాట్లాడుతుంది. తన తండ్రి మలేషియా నుంచి వస్తున్నాడని, ఇప్పుడే లక్ష రూపాయాలు కూడా పంపించాడని చెప్పి డబ్బులు ఇస్తుంది. మరోవైపు షాపింగ్ కు వెళ్లిన తీసుకొచ్చిన సారీలను సెలక్ట్ చేసి అందరూ ఫంక్షన్ కు వెళ్లేందుకు రెడీ అవుతారు. కానీ మీనాకు మాత్రం కొత్త సారీ కొనివ్వరు. దాంతో ఉదయం ఫంక్షన్ కు వెళ్లే సమయంలో బాలు కొత్త చీర కొనుకొచ్చి ఇస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఫంక్షన్ కు వెళ్తారు.

జూన్ 27న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
సత్యం, ప్రభావతి తన కొడుకులు, కోడళ్లతో కలిసి శృతికి తాళి మార్చే ఫంక్షన్ కోసమని ఫంక్షన్ హాలుకు వెళ్తారు. అప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసి బంధువులు, అతిథులను ఆహ్వానిస్తూ ఉంటారు శృతి వాళ్ల తల్లిదండ్రులు. ఇక సత్యంను శృతి వాళ్ల నాన్న సురేంద్ర బావగారు అని మర్యాదగా పిలిచి ఫంక్షన్ కు ఆహ్వానిస్తారు. శృతి వాళ్ల అమ్మ కూడా అందరినీ నటిస్తూ ఆహ్వానిస్తుంది. మరోవైపు బాలుతో ఫంక్షన్ లో ఎలాగైనా గొడవ చేయించాలని మనుషులను కూడా ఏర్పాటు చేస్తుంది. వాళ్లకు బాలును చూపించి ఎలాగైనా అతనితో గొడవ పడాలని శృతి వాళ్ల అమ్మ సూచిస్తుంది. మరోవైపు రోహిణి కూడా బాలుతో మందు తాగించేందుకు ఒక మనిషిని ఏర్పాటు చేయిస్తుంది. ఇక బాలు ఎవ్వరు ఏమన్నా కూడా సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకుంటాడు. మౌనంగా ఫంక్షన్ హాలులో వెనకాల కూర్చొంటాడు. కానీ శోభా, రోహిణి పురమాయించిన రౌడీలు బాలుతో గొడవకు దిగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X